నేటి రైతులోని సజీవాత్మ

ఇట్లు ఒక రైతు పుస్తక రచయిత గొర్రెపాటి నరేంద్రనాథ్ మరణ వార్త కలవర పరిచింది.
నిన్ననే నవోదయ నించి మొదటి పుస్తకాల బంగీ అందింది. వచ్చిన పది పుస్తకాల్లోంచీ ఎందుకో ఈ పుస్తకమే నా దృష్టి నాకర్షించింది. ఒక్క బిగిని చదివేశాను. కథలంటే చెవికోసుకునే నేను, తెలుగులో గనీ ఇంగ్లీషులో గానీ ఒక నాన్-ఫిక్షను పుస్తకాన్ని ఇంత ఇదిగా చదవలేదు.

ఇవ్వాళ్ళ పొద్దున లేచి బ్లాగులు చూస్తుంటే ముందుగా కొణతం దిలీప్ బ్లాగులోనూ, అటుపై నారాయణీయంలోనూ ఈ నమ్మలేని వార్త.

ఆంధ్రజ్యోతిలో బాలగోపాల్ కదిలించే అక్షర నివాళి ఇచ్చారు.

నరేంద్రనాథ్ గారి జీవితం ఆదర్శప్రాయం అని చెప్పటం వైశాఖ సూర్యుణ్ణి చూపించి, దీపమమ్మా అని చెప్పటం లాగుంటుంది. పార్టీలకీ సిద్ధాంతాలకీ ఇజాలకీ అతీతంగా నేల మీద, మనుషుల మధ్య నిలబడి, కళ్ళెదురుగా అను నిత్యం తన తోటి వారిని పట్టి పీడిస్తున్న సమస్యలకి నిర్మాణాత్మకమైన పరిష్కారాలని వెదికేందుకు నడుంకట్టి అవిశ్రాంతంగా శ్రమించిన సాహసి ఆయన. దేశంలో ఏం జరుగుతోంది, మన పల్లెల్లో ఏం జరుగుతోంది అని మనసుకి పట్టించుకునే ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన పుస్తకమిది.

ఆయన చెయ్య బూనిన పని సామాన్యం కాదు, నాకు ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా తెలుసు. ఆయన నడిచినంత తీవ్రంగానూ, పూర్తిగా ఆయన పద్ధతిలోనూ కాకపోయినా, నేనూ ఆ దారిలో నాలుగడుగులు వేసినవాణ్ణే!

నరేంద్రనాథ్ గారూ, మీ జ్ఞాపకం మా మనసుల్లో ఆరని జ్వాలగా రగులుతుండాలి!

Comments

ఇక్కడ నుంచి నవోదయా పుస్తకాలు ఎలా ఆర్డర్ చేశారో -వెబ్ సైటా? ఫోనా - ఆ వివరాలు చెప్పగలరా? థాంక్స్.
This is for Vijaywada Navodaya.
You may contact propriter Ramamohana Rao garu through any of the following means:
Navodaya Publishers
Karl Marx Road,
Vijayawada.
520 002
Phone : (0866) 2573500
e-mail : vjw_booklink@yahoo.co.in

If you know which books you want, just place the order. If you are not sure, you can discuss your taste and other requirements with him and he will suggest suitable books.
Make sure you tell him you got this information from me :)
సామాజిక నిబద్ధత కలిగిన నరేంద్రనాథ్ గారు లేని లోటు హక్కుల ఉద్యమానికే కాదు సామాన్యప్రజలకు ఆశరాగా వున్న మరో చేయిని కోల్పోవడం తీరని లోటు.