అధికారపు పగ్గాలు చేపట్టిన ఆర్నెల్లకి ఒబామా మొత్తానికి పప్పులో కాలేశాడు, అదీ జాతివివక్షత విషయంలో.
హార్వర్డు వివిలో ఆఫ్రికనమెరికను అధ్యయన విభాగంలో ఘనతవహించిన ఆచార్యుడు హెన్రీ గేట్స్ గారిని గురువారం రాత్రి ఒక తెల్ల పోలీసు అరెస్టు చేశాడు. ఆ అరెస్టు కూడా గేట్స్ గారి స్వగృహంలో జరగడం గమనించాల్సిన విషయం. ఇదంతా కేవలం తాత్కాలిక ఉద్రేకం వల్ల జరిగిందనీ, పరిస్థితుల ప్రభావంలో జరిగిన అపార్ధం తప్ప వేరు కాదని చెప్పి గేట్స్ గారిని మరునాడే విడుదల చేసేశారనుకోండి, కానీ ఇంతలోనే తగలాల్సిన దెబ్బ తగల్నే తగిలింది. గేట్స్ గారు సాక్షాత్తూ అధ్యక్షులు ఒబామాకి ఆప్త మిత్రుడు మరి.
అసలక్కడ ఏం జరిగింది, పక్కింటోళ్ళు పోలీసుల్ని పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒబామా అసలేమన్నాడు, ఆ అన్న మాటలు నిజ్జంగా పోలీసు వ్యవస్థనే నిర్వీర్యం చేసేలా ఉన్నయ్యా, ఆ అరెస్టు చేసిన తెల్ల పోలీసు ఎలాంటివాడు, అతని వ్యక్తిత్వం ఎలాంటిదీ .. ఇవన్నీ కూడా గమనించాల్సిన విషయాలే, చర్చించాల్సిన ప్రశ్నలే.
ఐతే ఒక్క విషయం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది .. ఒక దేశాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి కొంచెం కూడా మాట తూలేందుకు అవకాశం లేదు. ఏం మాట్లాడినా, ఆ మాటలు మనుషుల్నీ, పరిస్థితుల్నీ అధిగమించేసి, ఇంతింతై అన్నట్టు విశ్వరూపం ధరించి కూర్చుంటై. అసలు విషయాల్ని మరుగున పడేస్తై.
రెండో విషయం .. ఈ నాటి అమెరికాలో కూడా ఒక నల్ల జాతి మగవాడు, ఎంత చదువుకున్న వాడైనా, ఎంత డబ్బూ ఖ్యాతీ గడించిన వాడైనా, పోలీసు దృష్టిలో అతి సులభంగా దోషిగా గుర్తించబడతున్నాడు. ఒబామా ఇప్పుడెంత యెత్తుకి యెదిగినా, ఒకప్పుడు తనూ యువకుడే. ఇటువంటి వివక్షతకీ పోలీసు జులుంకీ ఆలవాలమైన షికాగో పేటల్లో తిరిగినవాడే. పని చేసినవాడే. ఈ సంఘటన అతని జ్ఞాపకాల్లో ఏ తెరల్ని కదిలించిందో. తన హార్వర్డు మిత్రుడి పక్షాన స్పందించినందుకు అమెరికా అధ్యక్షుణ్ణి తప్పు పట్టలేం, అందుకే.
ముచ్చటగా మూడో విషయం .. గేట్స్ గారి స్థానంలో ఒక తెల్లాయన గనక ఉండి ఉంటే (మిగతా అన్ని పరిస్థితులూ అలాగే ఉండగా), పోలీసు ఏ జాతివాడైనా, ఈ సంఘటన ఇలాగే జరిగి ఉండేదా? జరిగి ఉండేదని కచ్చితంగా చెప్పలేం. వివక్షత సజీవంగా ఉందని రూఢి చేసుకునేందుకు ఆ సమాధానం చాలు. జాతి విషయంలో అమెరికా ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సి ఉంది.
ఇంకా వేసవికాలమే, ఆకురాలం రాలేదింకా. కానీ పండుటాకులు తొందరి పడి ఒకటొకటే రాలిపోతున్నై .. మొన్న పట్టమ్మాళ్, నిన్న గంగూబాయ్ హంగల్, ఇవ్వాళ్ళ వాల్టర్ క్రాంకైట్. రెండు దశాబ్దాల పాటు .. క్రాంకైట్ ముఖతహ వినబడితే చాలు, అది నమ్మదగిన వార్తే .. అన్నంతగా అమెరికా ప్రజలు నమ్మిన వార్తాహరుడు. అంతటి నమ్మకాన్ని సాధించడం నిజంగా గొప్ప ప్రతిభే. ఇవ్వాళ్టి రోజుల్లో ఏ వార్తా మాధ్యమాన్ని అంతలా నమ్మగలుగుతున్నాం?
గతవారం ఉమామహేశ్వర్రావుగారి భాషణని గురించి నా పాఠకుల్ని ఊరించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ రెండు చిరునైవేద్యాలు.

Comments
ThankQ
వార్తాఛానళ్లు-నమ్మకం:
పూటుగా తాగి బండి నడపటమే జూ.ఎన్టీయార్‌కు ప్రమాదం జరగడానికి కారణమా? అని ఒక వార్త వచ్చింది ఒక ఛానల్లో. బీరు కోకాకోలా బాటిళ్లూ ముందేసుకుని కొంతమంది దగ్గరి మిత్రులతో కలిసి ఎన్టీయార్ 'రాలిపోయే పువ్వా నీకు రాగా లెందుకే...' అంటూ వేటురికి జాతీయఅవార్డు తెచ్చిన సినిమాగీతాన్ని భావయుక్తంగా పాడుతున్న యూట్యూబు వీడియోను చూపించి - అదే కారణమనే అనుమానాలు ముసురుకొంటున్నాయని వార్తను ప్రసారం చేశారు. ఆ వీడియోను మూడుసార్లు చూపించాక, ఆ వీడియోలో వున్న రాజీవ్ కనకాలతో ఫోన్ సంభాషణ వినిపించారు. అతను - 'అయ్యా, ఆ వీడియోలో నా జుట్టు పొట్టిగా వుంది. ప్రమాదం జరిగినప్పుడు చాలా పొడవుగా వుంది. గంటల వ్యవధిలో జుట్టుపెంచే విద్య నాకు చేతకాదు' అని చెప్పుకొన్నాడు. 'అదిగో పులి అంటే ఇదిగో తోక' అంటున్నాయి నేటి ప్రైవేటు వార్తా ఛానళ్లు! :)
ఉదాహరణకు,
మన బ్లాగుల్లో కొందరు మీడియాలో స్త్రీలని సమర్ధించి, పురుషులను హీనంగా చిత్రీకరిస్తున్నారు, కాబట్టి ఈ సమాజంలో పురుషులను తక్కువగా చూస్తారు అని వాదిస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. వాస్తవానికి స్త్రీల పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంటుంది. స్త్రీలు గర్భం ధరించినట్లే ఇంటిపనీ, వంటపనీ కూడా చెయ్యాలి అన్నట్లుగా సమాజం ప్రవర్తిస్తుంది. ఎంతలా అంటే పనిచెయ్యకూడదనే ఆలోచన స్త్రీలకే రానంతగా. వివక్షత ఇలా unpronouncedగా జరిగిపోతూ ఉంటుంది. ఇది చూసేవాళ్ళకి చాలా సిల్లీగా అనిపిస్తుంది. కానీ ఆ బాధేంటో మాకే తెలుస్తుంది.