చారిత్రాత్మకమైన ప్రసంగం

వట్టి మాటలు కట్టి పెట్టోయ్ అన్నాడు మహాకవి. కానీ మాటల బలాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. ఆ మాటల్ని పలికే గొంతులోని ఆర్ద్రత బలాన్ని తక్కువ అంచనా వెయ్యలేం.

త్రికరణ శుద్ధి అంటే మనసా వాచా కర్మణా అన్నారు మన పెద్దలు. మనసులో ఉన్న సంకల్పం ముందు వాక్కుగా వెలువడుతుంది. ఆ వాక్ఛక్తి తెలియని అమాయకులు - ఆ మాటల్లో ఏముంది, మాటలు గాలికి పోతాయి - అనుకుంటారు. మాటల బలం తెలిసిన మహానుభావులు వాటితో కోటలూ నిర్మించగలరూ, కోటలు కూల్చే ఫిరంగుల్నీ పేల్చగలరు.

అటువంటి మాటల కోట - రక్తాలు ఏరులు కట్టిన యెడారిలో, సోదరులు ఒకరినొకరు అపనమ్మకంతో నరుక్కుంటున్న భూతల నరకంలో - సర్వ మానవులకీ రక్షణగా నిలిచే కోట - నిర్మించడానికి తన మాటలతో పునాది వేశాడు, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఈజిప్టు కైరో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తన చారిత్రాత్మకమైన ప్రసంగంతో.

ఒబామా అధ్యక్షుడైతే కనీసం నాలుగేళ్ళ పాటు మంచి స్పీచిలు వినొచ్చు అని ఆశించిన నా ఆశ వమ్ము కాలేదు. అద్భుతమైన ప్రసంగమిది.

నిజమే, కోందరు ఆశించిన వివరాలూ వివరణలూ ఇందులో లేవు. కానీ కొన్ని ప్రాథమిక విలువలున్నాయి. ఆ విలువల వెనక చెదరక నిలిచే నిజాయితీ ఉంది.

నిజమే, కొందరు ఆశించిన పథకాలూ ప్రణాళికలూ లేవు. కానీ వాటికి పునాది వెయ్యాల్సిన మూలమైన నమ్మకాలున్నాయి.

నిజమే, కొందరు ఆశించిన హామీలూ, బుజ్జగింపులూ లేవు. కానీ తేట కళ్ళతో చూస్తున్న నిజం ఉంది. ఆ నిజం పలికే హెచ్చరికలున్నాయి.

ఈ మాటలు చేతలయ్యి, ఆ కోట ప్రపంచానికి రక్షణవలయంగా పరిణమిస్తుందని ఆశిద్దాం.

Comments

శరత్ said…
అవును. చక్కని ప్రసంగం.
Anil Dasari said…
ఆయన ప్రసంగాలు రాసేదెవరో?
అవునండీ ఇంకో నాలుగేళ్ళు స్పీచులు *మాత్రం* వినవచ్చు.

మీ అభిప్రాయాల్ని కించపరచటం కొరకు కాదు కానీ, On one hand "Americans! Don't go to India, they have serious threat from muslim terrorists" on the other hand: billions and trillions to 'fight terrorism' to pak and here prophecies of a dreamworld in Egypt. Good Job Obama!

From 'Change' to 'change cannot happen overnight' - Great job Obama!! change the world with Oratory and eloquence (even if the outsourcing company in Bangalore writes them)
Unknown said…
ఒబామా చాలా చాలా తెలివైనవాడు. సందేహం లేదు, చాలా గొప్ప వక్త కూడా! ఇలాటి ప్రసంగం ఒక అమెరికా అధ్యక్షుణ్ణించి ఇంతవరకూ ఎవ్వరూ ఊహించి ఉండరు.
@ అబ్రకదబ్ర .. ఇతను తన ప్రసంగాల మీద గట్టి నిఘా ఉంచుతాడని నా నమ్మకం. దీనికి సంబంధం లేని సమాచారాం: లింకను తన గెట్టిస్బర్గు స్పీచిని సుమారు డజను సార్లు తిరగరాసుకున్నాడుట.

@ యోగి .. whatever.

@ కామేశ్వర్రావుగారు .. నిజం.
యోగిగారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా..
శరత్ said…
తనకు వున్న పరిమితుల్లో, పరిధుల్లొ ఇప్పటివరకయితే బాగానే చేస్తున్నాడు (ఒకటి రెండు U టర్నులున్నా). ఇంతకంటే ఎక్కువ స్థాయిలో మార్పులు తేవాలని తనకు వున్నా అంత స్పీడ్ అమెరికన్స్ తట్టుకోలేరు, ఆమోదించలేరు.
SAMEEHA said…
ప్రసంగాలు బాగుంటే సరిపోతుందా? ఇండియా వెళ్ళే అమెరికన్స్ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించారు, టెర్రరిస్టు ఎటాక్స్ జరుగుతాయని. దానికి కారణం ఆయనకి తెలియదా? అలా అని పాకిస్తాన్‌కి సైనిక సహాయ చేయడం ఆపుచేస్తారా అంటే అదీ ఉండదు. వందలమంది భారతీయులు ఏమైపోయినా పర్వాలేదు, కానీ అమెరికావాడు ఒక్కడు కూడా ఇబ్బంది పడకూడదు. ఆయనకి కూడా ముస్లిం వెర్రి తలకెక్కుతొ0దేమో? పాకిస్తాన్ భారత్‌కి పక్కలో బల్లెంలాగ ఉండాలని కోరుకోవడం అమెరికా విధానమేగా.
ఒబామా ప్రసంగం అమెరికా విధనంలో "మార్పు" అనుకుంటే ఇది చారిత్రాత్మక ప్రసంగమే. If they can walk the talk that will be good to them and to the world.
భగవద్గీత లొ కృష్ణుడు ఎంతో గొప్పగా speech ఇచ్చారు.అలాగే obaama కూడా....వీరిద్దరినీ ఎందుకు పోల్చానంటే ఇద్దరు పుట్టినది august లోనే కాబట్టి.అయినా మన పిచ్చి కానీ మాటలతో మారతారా మనుష్యులు!
యోగిగారితో ఏకీభవిస్తున్నాను
ఇంత మంచి ప్రసంగాన్ని డిస్కవర్ చేసినందుకు అభినందనలు
rākeśvara said…
ఇవాళ వార్తల నిండా ఇదే. కోడి గ్రుడ్డుమీద నీకలు ప్రీకడంలా.. ఏఁవో ఏమొబానో ఏం చేస్తాడో ఈయన.

పెట్రోలు కోసం యుద్ధం మానేస్తుందా అమెరికా అన్నది పెద్ద ప్రశ్న. ఇక ఇస్లాముని శక్తి పోగుచేసుకోవడానికి యంత్రంగా వాడుకోవడం ముల్లాలు కూడా మానుకోలేరు. ఇట్సే కాంప్లికేటెడ్ వాల్డ్.
rākeśvara said…
Btw. I sometimes get this doubt if Obama is constantly on drugs. How else would you explain that unwavering optimism ? :D
Unknown said…
ఇక్కడ ఆశావాద అనుమాన దృక్పథాలని వ్యక్తపరచిన అందరికీ యీ ఉపన్యాసంలో ఒబామా కొత్త విషయాలని చెప్పినట్టుగా అనిపించడం నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకైతే ఇందులో ఏ విషయమూ (కొంతలో కొంత పాలస్తీనా విషయం మినహాయిస్తే) కొత్తదిగా అనిపించలేదు. అయితే అతను చెప్పిన విధానం కొత్తది. కొత్త సీసాలో కొత్తదిగా భ్రమింపజేసే పాత సారా! ఇలా ఇంతకుముందు ప్రెసిడెంట్లెవ్వరూ మాట్లాడలేదు. మాట్లాడొచ్చని ఊహించనూ లేదు.
అందుకే ఒబామా చాలా తెలివైనవాడని, గొప్ప వక్తని నేనన్నాను.
And one more thing. I think it is a neccessity for America rather than a choice to talk like this now.
భైరవభట్ల గారు

"And one more thing. I think it is a necessity for America rather than a choice to talk like this now."

అవునండి, ఇది నిజం!

ఒక గమనించదగ్గ విషయం ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, ఇరాక్ వంటి విషయాల గురించి మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించకపోవటం.

దీనర్థం కాశ్మీర్ మన అంతర్గత వ్యవహారం అని గుర్తిస్తున్నట్లా? ఇదే అమెరికా వైఖరా? అంటే... హ్మ్, ఆయనకే తెలియాలి.
భావన said…
ఒబామా మాట్లాడక పోతే విచిత్రం.. మాట్లాడితే ఏమి వుంది.. అమెరికన్స్ కి ఏమో నాకు తెలియదు కాని పాకిస్తాన్ కు అంత ఎయిడ్ ఇవ్వటం మాత్రం ముల్లు గుచ్చినట్లే వుంది నాకైతే.... ఇక్కడ వున్న పరిస్తితి కి అది అవసరమా అని ఒక పక్క, ఎన్నికల ముందు అంత కత్తులు దూసినది ఈయనేనా అనిపించింది...
pi said…
That was a good speech! I don't know how effective Obama will be. He has inherited a lot of crap. He is way too conscious.

I like his foreign policy though. He is honest in approach. Doesn't mind talking about misdeeds of US.
pi said…
@Kameswara Rao, He does have speech writers but some speeches he writes himself. His speech on race(which is probably his greatest so far) was self-written.