బ్రహ్మశ్రీ గొర్తి సాయిబ్రహ్మానందం మహాశయులకి ...

... బహిరంగ ఆహ్వానం.

వాదన మొదలెట్టాక ఒక కొలిక్కి రాకుండా తెరమూసేసే అలవాటు నాకూ లేదు.

అక్కడ పెద్దల ఇంటి ముందు రచ్చ చెయ్యడం భావ్యం కాదని మిమ్మల్ని మా ఇంటికే ఆహ్వానిస్తున్నాను .. రచ్చకి కాదు, చర్చకే.

ఇప్పుడు చెప్పండి .. ఏవిటి తెలుగు బ్లాగుల పట్ల మీ అభియోగాలు? తెలుగు బ్లాగుల్లో సాహిత్య కృషి జరగడం లేదా? సాహిత్య కృషి అంటే ఏవిటి? ఏమి చేస్తే అది జరిగినట్టు తీర్మాన మవుతుంది? తెలుగు బ్లాగుల్లో అది జరగడం లేదని మీరెందుకు అనుకుంటున్నారు? పోనీ తెలుగు బ్లాగుల్లో కాక పోతే ఇంకెక్కడ జరుగుతోందో సెలవియ్యండి.

చెప్పండి!

Comments

cbrao said…
సాహిత్య గోష్టులు, వెబ్ పత్రికల ద్వారా మాత్రమే సాహిత్య సేవ జరుగుతుందని బ్రహ్మానందం గారి ప్రగాఢ విశ్వాసం.
Anonymous said…
చర్చకు ఆసక్తిగల వారందరికీ ఆహ్వానముంటే బాగుండేది :-)
Eagerly waiting to see for an interesting discussion.
అసలు అభియోగాలెందుకు ? వాటి ఉపయోగాలు ఏమిటి ?

వాటికి సమాధానం వచ్చాక - అభియోగాలు ఏమిటి ? వాటికి దారితీసిన పరిస్థితులేమిటి ? ఆ పరిస్థితులు మానవనిర్మితమా? దైవం ప్రేరేపింపగా బయటకు వచ్చినవా? లేక భూత ప్రేత పిశాచగణ సావాసం వల్ల మోపబడుతున్నవా?

ఒక వేళ మానవమాత్రమే అయితే ఎవరికి నష్టం ? ఎవరికి లాభం? అభియోగాలు మోపిన వారికే కాక ఇంకెవరికన్నా లాభం ఉన్నదా ? లేక నష్టం ఉన్నదా ? లాభ నష్టాల శాతం ఎంత ?

ఒక వేళ దైవ ప్రేరణ అయితే, మనం అత్యంత భక్తితో బ్లాగ్సాహితీ సహస్రనామం చేయటమా ? లేక హేతువాదుల్లాగా ప్రశ్నించడమా ? సహస్రనామ జప వినియోగం వల్ల వచ్చే లాభం ఎంత? పోనీ హేతువాదిలాగా ప్రశ్నిస్తే ఎవరికి నష్టం ? ఏవరికి లాభం?

అసలు ఒకవేళ ప్రశ్నిస్తే సమాధానం దొరుకుతుందా ? దొరికితే అది సంతృప్తికరంగా ఉంటుందా ? ఎవరికి ? మరి ఆ సమాధానంతో సమాధానపడనివాళ్ళ పరిస్థితి ఏమిటి ? అందువల్ల లాభం ఏమిటి ? నష్టం ఏమిటి ?

పోనీ దైవం కాదు, మానవమాత్రం కాదు, భూత ప్రేత పిశాచగణ సావాసం వల్ల మోపబడితే వాటికి విరుగుడు ఏది ? వేపమండలా? భూతవైద్యుడా ? నిమ్మకాయాలా? విక్రమార్క చక్రవర్తా ? పోనీ ఇవన్నీ చేసాక కూడా ఆ గణాలు వెళ్ళిపోకపోతే? అప్పుడు లాభం ఎవరికి ? ఉంటే నష్టం ఎవరికి ?

అసలు బ్లాగుల్లో సాహితీ కృషి జరగటమేమిటి ? ఒక వేళ జరిగితే మనకు వచ్చే లాభం ఏమిటి ? వచ్చే నష్టం ఏమిటి ? మనకే కాక ఇంకెవరికన్నా లాభం ఉన్నదా ? ఒక వేళ ఉంటే ఎంత శాతం ?

బ్లాగుల్లో సాహితీకృషి జరగకపోతే మనకు వచ్చే లాభం ఏమిటి ? వచ్చే నష్టం ఏమిటి ? మనకే కాక ఇంకెవరికన్నా లాభం ఉన్నదా ? ఒక వేళ ఉంటే ఎంత శాతం ?

ఒక వేళ కృషి జరిగిందనే అనుకుంటే అలా జరగడానికి తీర్మానం ఎందుకు చెయ్యాలి ? అలా తీర్మానిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి ? వచ్చే నష్టం ఏమిటి ? మనకే కాక ఇంకెవరికన్నా లాభం ఉన్నదా ? ఒక వేళ ఉంటే ఎంత శాతం ?

సరే ప్రతిపాదించారు బాగానే ఉన్నది. తీర్మానం ఎలా చెయ్యాలి ? లాభం ఎవరికి ? నష్టం ఎవరికి ? ఒక వేళ తీర్మానమే జరిగిందనుకోండి. ఆ తీర్మానాన్ని ప్రతిపాదించింది ఎవరు ? ప్రతిపాదించినవారికి వచ్చిన లాభం ఏమిటి ? నష్టం ఏమిటి ?

ఒక వేళ ప్రతిపాదించినది ఖర్మకాలి అమలు చెయ్యాల్సి వస్తే ఎవరు అమలు చేస్తారు ? అమలు చేసినందువల్ల వారికి వచ్చే లాభం ఏమిటి ? నష్టం ఏమిటి ?

ఆన్ తీర్మానం లేదూ కప్ప తోకా లేదు అనుకుని తీర్మానించకపోతే మనకు వచ్చే లాభం ఏమిటి ? వచ్చే నష్టం ఏమిటి ? మనకే కాక ఇంకెవరికన్నా లాభం ఉన్నదా ? ఒక వేళ ఉంటే ఎంత శాతం ?

తెలుగుబ్లాగుల్లో కాక ఇంకెక్కడయినా సాహితీ కృషి జరుగుతోందా ? ఒక వేళ జరిగితే మనకు వచ్చే లాభం ఏమిటి ? వచ్చే నష్టం ఏమిటి ? మనకే కాక ఇంకెవరికన్నా లాభం ఉన్నదా ? ఒక వేళ ఉంటే ఎంత శాతం ?

తెలుగుబ్లాగుల్లో కాక ఇంకెక్కడా సాహితీ కృషి జరగటల్లేదా ? అలా జరగకపోతే మనకు వచ్చే లాభం ఏమిటి ? వచ్చే నష్టం ఏమిటి ? మనకే కాక ఇంకెవరికన్నా లాభం ఉన్నదా ? ఒక వేళ ఉంటే ఎంత శాతం ?

వీటిలో ఒక్కదానికి అయినా సమాధానం తెలిసీ చెప్పకపోతే మీ మీ బ్లాగులు, వెబ్సైట్లు, అభియోగాలు, చర్చలు, రచ్చలు అన్నీ కోటి ముక్కలుగా పగిలిపోయి త్రిలోక సంచారం చేయుగాక
సాహిత్యకృషి అనే మాటకి గత దశాబ్దాల్లో ఉన్న అర్థం వేరు. ఇప్పుడున్న అర్థం వేరు. ఊహాజనిత కల్పనాత్మక రచనలు, లేదా వాటిమీద విమర్శలూ, సమీక్షలూ, భాషాచర్చలూ గట్రా చేస్తేనే సాహిత్యకృషి అని భూతపూర్వ అభిప్రాయం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని ఈ క్రింది లక్షణాలతో రాస్తే చాలు, అది కూడా సాహిత్యకృషేనని ప్రస్తుతాభిప్రాయం.

౧. రాసేది సకల సబ్బండు అక్షరాస్యులకీ, కనీస విద్యావంతులకీ అర్థమయ్యే శైలిలో ఉంటే బావుంటుంది.

౨. అక్షరదోషాలూ, శిష్టవ్యావహారిక వ్యాకరణానికి వ్యతిరేకమైన పదప్రయోగాలూ, అనపేక్షితమైన విదేశీ పదాడంబరమూ లేకుండా తెలుగువారికి సహజసిద్ధమైన నుడికారంతో రాస్తే బావుంటుంది.

౩. రాసేది పూర్వాపర సమన్వయం గల క్రమబద్ధమైన గద్యల (paragraphs) తో, సందర్భసహితమై, సభ్యత గల శీర్షికలతో, చక్కటి ఉపోద్ఘాత ఉపసంహారాలతో రాస్తే బావుంటుంది.

౪. రచయిత తనలోను, ఇతరుల్లోను అనవసరంగా అడ్రినాలిన్ ద్రవాల్ని పోటేత్తించకుండా ఒప్పిదమైన యుక్తియుక్తతతో రాస్తే బావుంటుంది.

ఈనాడు సాహిత్యం అనిపించుకోని రచనలు కూడా రెండుమూడొందలేళ్ళ తరువాత దొరికితే అప్పటివారు వీటిని సాహిత్యం కిందికే జమకడతారు. ఇప్పుడు తెలుగుసాహిత్యం పేరుతో మనకి లభ్యమవుతున్న అనేక ప్రాచీన పుస్తకాల రచయితల్లో చాలామంది ప్రొఫెషనల్ సాహిత్యకారులు కారు. కనుక ఏది సాహిత్యం ? ఏది కాదు ? అనే విచికిత్స చిరభవిష్యత్తులో అప్రస్తుతం. కనుక బ్లాగుల్లో రాస్తున్నదంతా సాహిత్యమే. ప్రస్తుతానికి ఇవి అంత ప్రౌఢంగా కనిపించకపోయినా, బ్లాగరుల వ్యక్తిగత కొసవెర్రులతో నిండి ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికిన్ని వీటికీ ఒక చారిత్రిక పాత్ర ఉంది. తప్పనిసరిగా ఉంది.
వంశీ గారి వ్యాఖ్య భలే ఉంది! చర్చ మొదలెట్టిన తరువాత వస్తాను.
@బుజ్జి .. దయచేసి మీ వ్యాఖ్యల్ని పూర్తిగా తెలుగులో కానీ పూర్తిగా ఆంగ్లంలో కానీ రాయండి. తెంగ్లీషు వ్యాఖ్యల్ని ఈ బ్లాఘులో ప్రచురించను.
ఇంకేం చేస్తాం, తెలుగులో రాస్తాం.. :(
Anonymous said…
"వీటిలో ఒక్కదానికి అయినా సమాధానం తెలిసీ చెప్పకపోతే మీ మీ బ్లాగులు, వెబ్సైట్లు, అభియోగాలు, చర్చలు, రచ్చలు అన్నీ కోటి ముక్కలుగా పగిలిపోయి త్రిలోక సంచారం చేయుగాక" అని నుడివిన, వంశీ గారికి,ఈ చర్చ ద్వారా "వచ్చే లాభం ఏమిటి ? వచ్చే నష్టం ఏమిటి ? వారికే కాక ఇంకెవరికన్నా లాభం ఉన్నదా ? ఒక వేళ ఉంటే ఎంత శాతం ? లాభం ఉంటే నష్టం ఎవరికి ? నష్టం ఉంటే లాభం ఎవరికి?" :)
భావన said…
మీరు వాదన పూర్వాపరాలు చెప్పనే లేదు... ఆయన అభియోగం బ్లాగ్ ల లో సాహిత్య కృషి జరగటం లేదు అనా? సాహిత్యానికీ అర్ధం ఆయన మాటలలోనే తెలిస్తే అర్ధం అవుతుంది కదా అసలు ఆయన ఏమనుకుంటున్నారు అనేది.. ఇంతకూ మా అందరికి ప్రవేశం వుందా చర్చ లో
ఒకవైపు వాదంతో తాడేపల్లి గారు చర్చ మొదలుపెట్టారు. అవతలివైపు వాదం కోసం ఆసక్తిగా చూస్తున్నాను.
అందరికీ .. ఆసక్తి కలవారందరూ చర్చలో పాల్గొనవచ్చు అనే ఇక్కడ మొదలు పెట్టాను.

నేపథ్యాన్ని గురించి కుతూహల పడేవారికి .. ఈ చర్చ నేను బాగా గౌరవించే ఒక పెద్దవారి బ్లాగు ప్రాంగణంలో మొదలైంది. అక్కడ మొదటి ప్రతివ్యాఖ్యనే ఘాటుగా రాశాను. అదలా చిలికి చిలికి గాలి వాన అయ్యే సూచనలు కనిపించి, ఆ పెద్దల యెడల గౌరవంతో అక్కడ కొనసాగడం బాగుండ దనిపించింది. అందుకని ఇక్కడ కొత్త తెర తీశాను.
బ్రహ్మానందం గారికి ఇలా ఆహ్వానం పలకడంలో రెండు ఉద్దేశాలు -
1. ఇంతకు ముందు చేసిన దుడుకు వ్యాఖ్యకి పశ్చాత్తాపం ప్రకటిస్తూ ఇక్కడ చర్చ మర్యాదగా ఉంటుందని వారికి తెలియ జెప్పడం.
2. తెలుగు బ్లాగుల పట్ల వారి వ్యాఖ్యని వారి మాటల్లోనే చెప్పే వీలు కలిగించడం. మళ్ళీ వారి మాటల్ని నేను శుకానువాదం చెయ్యబోతే అందులో ఏమి తప్పులు దొర్లుతాయో.

అఫ్కోర్సు, ఇదంతా ఫలించేది వారికి ఈ చర్చలో ఆసక్తి ఉంటే. అది లేకపోతే .. మనం మళ్ళీ మన పాత అంతర్గత బ్లాగ్యుద్ధాలకి :)