నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంట. ప్రపంచ వ్యాప్తంగా సగటున మగవాడు సంపాయించే ఒక రూపాయికీ అదే పని చేస్తున్న స్త్రీ సంపాదన అక్షరాలా అరవైమూడు పైసలుట .. ఫెమినిస్టులూ, ఫెమినిస్టులు కానివాళ్ళూ, అసలు ఫెమినిజం ఎందుకూ అనేవాళ్ళూ, ఫెమినిస్టులు లోకాన్ని పాడుచేస్తున్నారనే వాళ్ళూ ఈ సందర్భంగా అసలు మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఆలోచించాల్సిందే. ఈ లేండాఫ్ మిల్కండ్ హనీ లో ఈ మధ్యన, ఇటువంటి జీతం తేడాల గురించి స్త్రీలు తమ కంపెనీమీద కేసు పెట్టొచ్చు అని హక్కు ఇస్తూ కాంగ్రెస్ వారు బిల్లు ప్రవేశ పెడితే, ఇది వ్యాపార సంస్థలకి గొడ్డలిపెట్టు అన్నకారణంగా ఆ బిల్లుని సమాధిచేశారు.
మొన్నీ మధ్యన ఎవరో చలం నవల మైదానంలో నాయిక రాజేశ్వరి గురించి రాశారు. ఆ రచనాకాలంలో పరిస్థితులు అని ఏదో రాశారు. మన సాంఘిక పరిస్థితులు, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఆ నవలారచనాకాలం కంటే ఏం పెద్ద గొప్పగా పురోగమించలేదని, అభివృద్ధిచెందలేదనీ సవినయంగా మనవి చేసుకుంటున్నా. పనిలో పనిగా ఈ విషయం కూడా మనవి చేసుకుంటున్నా .. చలాన్ని గురించీ, చలం రచనల్ని గురించీ గొంతెత్తి మాట్లాడే, చలం నా ఆదర్శం అని చెప్పుకునే వారిలో తొంభైతొమ్మిది శాతం మందికి అసలు చలం ఏంటో అణువంతకూడా ఐడియా లేదు.
కొడవటిగంటి కుటుంబరావు రచనా సర్వస్వాన్ని విరసం పది సంపుటాలుగా విడుదల చేస్తోంది. మొదటి సంపుటం విడుదలైంది. ఇందులో అన్నీ కథలు ఉన్నాయి. 463 పేజీలు. 200 రూపాయలు. ప్రతులకు సి.ఎస్.ఆర్. ప్రసాద్ గారిని సంప్రదించ వచ్చు. ఎడ్రసు, సి-132, శ్రీనివాసనగర్ కాలనీ, గుంటూరు - 522 006, ఫోను 98854 46750
మొన్నీ మధ్యన ఎవరో చలం నవల మైదానంలో నాయిక రాజేశ్వరి గురించి రాశారు. ఆ రచనాకాలంలో పరిస్థితులు అని ఏదో రాశారు. మన సాంఘిక పరిస్థితులు, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఆ నవలారచనాకాలం కంటే ఏం పెద్ద గొప్పగా పురోగమించలేదని, అభివృద్ధిచెందలేదనీ సవినయంగా మనవి చేసుకుంటున్నా. పనిలో పనిగా ఈ విషయం కూడా మనవి చేసుకుంటున్నా .. చలాన్ని గురించీ, చలం రచనల్ని గురించీ గొంతెత్తి మాట్లాడే, చలం నా ఆదర్శం అని చెప్పుకునే వారిలో తొంభైతొమ్మిది శాతం మందికి అసలు చలం ఏంటో అణువంతకూడా ఐడియా లేదు.
కొడవటిగంటి కుటుంబరావు రచనా సర్వస్వాన్ని విరసం పది సంపుటాలుగా విడుదల చేస్తోంది. మొదటి సంపుటం విడుదలైంది. ఇందులో అన్నీ కథలు ఉన్నాయి. 463 పేజీలు. 200 రూపాయలు. ప్రతులకు సి.ఎస్.ఆర్. ప్రసాద్ గారిని సంప్రదించ వచ్చు. ఎడ్రసు, సి-132, శ్రీనివాసనగర్ కాలనీ, గుంటూరు - 522 006, ఫోను 98854 46750
Comments
కొన్ని ఉదాహరణలు - కొందరు ఉదయం 7 నుంచీ 4 దాకా పని చేస్తామని చెబుతారు. వాళ్ళెన్నింటికొస్తారో తెలీదు కానీ, నాలుక్కల్లా పార్కింగ్ లాట్లలోంచి బయటకెళతారు. ఆఫీసు టైముకెప్పుడూ రారు. ఆలస్యానికి ప్రతి రోజూ ఏదో ఎక్స్క్యూజ్ ఉంటూనే ఉంటుంది!
ఇక ఇంటి దగ్గరనుంచీ పని చేసే సదుపాయం - చాలా బాగా, ఇంక ఎవ్వరూ ఇలా చేయలేరన్నంతగా, దుర్వినియోగం చేస్తుంటారు. పిల్లలెప్పుడూ సోమ శుక్రవారాల్లోనే సిక్ అవుతుంటారు. వాళ్ళ ప్రొడక్టివిటీకి ఆ అరవై మూడు పైసలివ్వడం కూడా దండగ అనిపిస్తుంది.
ఇవన్నీ అమెరికాలో పని చేసే దేశీ మహిళలకు సంబంధించిన ఉదాహరణలు.
మగ వాళ్ళు కూడా ఇలాంటి వేషాలు వేస్తారు కానీ, ఆడవాళ్ళకంటే తక్కువ.
అలాగని అందరు ఆడవాళ్ళు ఇలాగే పని చేస్తారని కాదు...చాలా మంది ఇలా చేస్తున్నారనే!
మీ కంక్లూషన్ కి బేసిస్ ఏమిటో చెప్పగలరా? మీరూ ఆ 99 శాతం లో ఉన్నారా? లేక మిగిలిన 1 శాతం లో ఉన్నారా? తెలుసుకోవచ్చా?
@సిరి .. That is a gross generalization. విపులాచ పృథ్వీ. The strength of US work force is approximately 180 million and I'd guess some 40% of it are women. That's some 72 million women we're talking about.
@ భావన .. I hear you.
@ Telugu Fantasy .. చెప్పగలను. నేను 1 శాతంలో ఉన్నాను గనుకనే 99 శాతం సంగతి నాకు తెలుసు.
సిరి గారు చాలా దారుణమైన జనరలైజేషన్. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న ఓ కొలీగ్ ప్రభావం ఉందనిపిస్తుంది మీ వ్యాఖ్య పై :)
@కొత్త పాళిగారు ఎవరికి అవతలి వ్యక్తి పూర్తిగా అర్ధం కారండి ,నాకు ఎంతో తెలుసు ,కలిసి తిన్నాం ,తిరిగాం అన్న స్నేహితుల అంతరంగం కూడా ప్రశ్నార్ధకమే .ఒకే అంశాన్ని వివిధ వ్యక్తులు విభిన్న కోణాల్లో చూస్తారు ,వారి పర్సెప్షన్ బట్టి వ్యాఖ్యానిస్తారు అంత మాత్రాన తొంబైతొమ్మిది కి ఏమి తెలిదు అనడం దారుణం.
@ చైతన్య .. నేనెందుకూ చెప్పటం? చలం రచనలు, అరుణా పబ్లిషింగ్ పుణ్యమాని, విరివిగా దొరుకుతున్నాయి. ఆయనేమీ అర్ధంకాని భాషలో రాయలేదు. హాయిగా చక్కని తేట తెలుగులో రాశారు. మీరే చదవండి. చదివి మీ అభిప్రాయాలు మీరేర్పరుచుకోండి. ఇంకోళ్ళ మాటలు వినొద్దనే నేను చెప్పేది.
@ చిన్ని .. నా మాటలు అతిశయంగానూ దారుణంగానూ అనిపిస్తే అనిపించొచ్చు. కానీ అవి నిజం కూడా. నేనేదో ఫ్రాయిడ్ లాగా చలం మస్తిష్కంలోకి దూరేసి ఆయన అంతశ్చేతన రహస్యాలన్నీ అర్ధం చేసేసుకున్నానని చెప్పడం లేదు. నాకైనా, చలాన్ని గురించి మాట్లాడే ఇతరులకైనా చలం రచనలే ఆధారం. ఆ రచనలేవో మీకూ అందుబాటులో ఉన్నాయి. చదవండి. ఆ ఆలోచనల్ని అనుభవించండి. మీ నిర్ణయాలకి మీరే రండి. మీ అనుభవం, మీ ఆలోచన, మీ నిర్ణయం .. ఇవే మీకు నిజం.
తమ అనుభవంతో,జ్ఞానంతో,ధ్యానంతో గడించిన అనుభూతుల్ని,ఆలోచనల్ని సారం నశించకుండా అక్షరాల్లో నింపడమే చలం సాహితీ తపస్సు. ఆ అనుభూతుల్ని ఏమాత్రం స్వీయానుభవం లేకుండా అర్థం చేసుకోవాలనుకోవడం దురాశ.
అయినా చలాన్ని అర్థం చేసుకోగలిగే మగాడెవరూ!!! అనుభవించే దమ్ము లేదుగానీ అర్థం చేసుకోవడానికి బయల్దేరారా?
స్త్రీలు మాకొచ్చే జీతం అంతే అని కాస్త తక్కువ జీతాన్నే అడుగుతున్నారా?
తేడా ఉంది ఉంది అని ఘోషించటం విన్నా కానీ ఎందుకు తేడా వస్తుందో అర్ధం కాలేదు. (ఇక్కడ భారతదేశం సంగతి మినహాయించుకుందాం)
జనవరిలో ప్రెసిడెంట్ ఒబామా సంతకం చెయ్యడంతో "The Lilly Ledbetter Fair Pay Act" చట్టమయిందని చదివాను. మరి మీరు సమాధి అయిందంటున్న బిల్లు ఏమిటి?
"స్త్రీ కి కూడా శరీరం ఉంది; దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి మెదడు ఉంది; దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది; దానికి అను భవం ఇవ్వాలి," అనిగుర్తించని దేశాన్ని దుమ్మెత్తిపోసిన చలాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పేరిట స్మరించుకోవచ్చు కాని, జీతాల అసమానతల సందర్భంలో కాదు.
సంపాదనలో అసమానతలని చలం సమర్థించాడని నేననను. కాని చలం స్త్రీ సహజస్థానం ఇల్లని నమ్మాడు. ఆమెకి స్వేచ్ఛ, గౌరవం కలిగితే ఇంటి బయటకి వచ్చి మగాళ్ళతో సమానంగా దిక్కుమాలిన ఉద్యోగాలు చేసి సంపాదన రొట్టుడు లో పడాల్సిన గతి మహిళలకి తప్పుతుందన్నది చలం విశ్వాసం. ఇంటా బయటా, పనిలో, అవకాశాల్లో, జీతాలలో, స్త్రీలకి సమానత్వం ఉండాలన్నది ఫెమినిస్టుల గొడవ. ఏ గొడవా లేకుండా మార్పులు రావు.
స్త్రీవాదులు చలంలో తమకు అవసరమైనది తీసుకుని శతజయంతులు జరపడం మీ ఉద్దేశం ఏమిటి? అన్న ప్రశ్నకి ఇస్మాయిల్ ఇచ్చిన చక్కటి సమాధానం: "చలం ఒక మహా కాసారం.అందులో స్వచ్చ్ఛమైన జలముంది. అందమైన తామరలున్నాయి. రుచికరమైన చేపలున్నాయి. పచ్చటి నాచుంది. ఎవరికి అవసరమైంది వారు తీసుకుంటారు." [2]
ఇంతకీ నేనిది చట్టాలనీ చలాన్నీ పరామార్శించడానికి రాయడం లేదు. 2008 టూరింగ్ బహుమతిని (కంప్యూటర్ సైన్సులో నోబెల్ లాంటిది) MIT ప్రొఫెసరు Barbara Liskov కి ఇస్తున్నట్లు గత వారమే ప్రకటించారు. కారణం ఏదైనా కానీ, కంప్యూటర్ రంగంలో ఆడవాళ్ళ సంఖ్య తక్కువ. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా Liskov లాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] చలం "స్త్రీ" లో "బడి చదువులు," 1925.
[2] "సత్యాన్వేషి చలం," వాడ్రేవు వీరలక్ష్మీదేవి, 2006. ఇది ఆవిడ 2002 లో చేసిన PhD సిద్ధాంత వ్యాసం.
@కొడవళ్ళ .. మీరు పొరబడ్డారు. మొదటి పేరాలో స్త్రీల జీతానికీ, రెండో పేరాలో చలం స్మరణకీ ఏం సంబంధం లేదు. రెండూ వేర్వేరు విషయాలు. నేను విన్న వార్తలో ఆ బిల్లు ఇహ పాసవడం కష్టం అన్నట్టుగా రిపోర్టు, చర్చ విన్నాను. తదుపరి అది పాసైందన్నమాట, సంతోషం.
అందుకే మీకు తెలిసినది... లేదా మీ అభిప్రాయం చెప్పొచ్చు కదా అన్నాను.
@చైతన్య .. మీ భావం నాకు అర్ధమయ్యింది. నాకు తెలిసిందే రైటు అని కాదు ఇక్కడ నేననేది. ఎవరికి వాళ్ళు చలాన్ని చదివి సొంత అభిప్రాయాలు ఏర్పరచుకోవటం పట్ల కూడా నాకెట్టి అభ్యంతరమూ లేకపోగా, ఆ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తాను. ఎటొచ్చీ .. చలం నాకు తెలుసు, చలమంటే ఇదే అని ప్రవచనాలు పలికే వాళ్ళతోనే నా గొడవంతా. రేపు చలాన్ని గురించి నాకు తెలిసింది నేను చెప్పినా ఆ కోవలోకే వస్తుంది.
ఇదిలా ఉండగా, ఈ గణాంకాలకి ఎక్కువ సంఖ్యా బలం చేకూర్చే ఉద్యోగాలు దిగువ మధ్య తరగతికి చెందినవి, వ్యవసాయం, పేకేజింగ్, చిన్న చిన్న వస్తువుల ఉత్పత్తి, షాపుల్లో పని చెయ్యడం .. ఇత్యాది. వీటిల్లో ఎంప్లాయరు నిర్ణయించిందే జీతం అయ్యే అవకాశం ఎక్కువ.
Recently I heard this from a women who is a senor executive in sales.. She says this report is more or less correct and mostly the problem is with negotiation.
She says usually it is attitude problem that many ladies think, 'asking' is not correct. Another reason is we take salary matter easy as it is a 'second income'. Another important reason that I can think of is, many female professionals feel guilty of putting less hours in office than their male colleagues. They don't know that spending in office doesn't mean being productive.