చిగిర్చే చెట్టు

కొంతకాలంగా తెలుగు బ్లాగ్లోకంలో జరిగుతున్న రెండు పరిణామాల గురించి నా మాటగా చెప్పే ప్రయత్నం ఇది.

మొదటి విషయం .. నా మీద జరుగుతున్న దాడి.
రకరకాల రూపాల్లో జరుగుతున్న ఈ దాడి వల్ల నాకు చీమకుట్టినట్టైనా లేదనే చెప్పాలని ఉంది, కానీ అది నిజం కాదు. నాకు చాలానే బాధ కలిగింది. ఎందుకంటే, నేనూ చీమూ నెత్తురూ, సిగ్గూ శరమూ ఉన్న మనిషినే. పోనీ సమాధానం చెబుదామంటే, రాసినవారు నా బ్లాగులో రాయలేదు. ఎక్కడో రాసినవైనా, నేనేదో నాకు అర్హతలేని గౌరవం పొందేస్తున్నాను అన్న ఒక గుడ్డి కడుపు మంట ఆక్రోశం తప్ప ఆ రాతల్లో చర్చించేందుకూ, సమాధానం ఇచ్చేందుకూ సరుకేమీ లేదు. ఎందుకొచ్చిన వెధవ పీడ, నేను కూడా బ్లాగు మూసేస్తాను, నేను మూసేసినంత మాత్రాన బ్లాగ్లోకానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని కూడా ఆలోచించాను.

నేను కొన్ని నిర్దిష్టమైన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బ్లాగు మొదలు పెట్టాను. అవి నెరవేరుతున్నాయి. నాకెంతో తృప్తినీ ఇస్తున్నాయి. ఎవరో కడుపుమండిన వాళ్ళ కోసం నేను బ్లాగు మూసేసే ప్రసక్తే లేదు. నా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది.

చిగిర్చే చెట్టుకి ఎగిరే పిట్ట ఆదర్శం. పత్రాల్ని విదిల్చి పైకెగరాలని ప్రయత్నం.
కదలక మెదలక కప్పులు మూసుకుని నిద్రపోయే క్షుద్రగృహాలకు అతీతంగా ఎదుగుతుంది.
అందుకనే శీతాకాలం ఎత్తివచ్చినా భీతి చెందదు చెట్టు.
వీపులపై మ్యాపులతో పత్రాలన్నీ నిశ్శబ్దంగా ధాత్రికి దిగివచ్చి సామాన్యమైన మట్టితో సారూప్యం పొంది మ్యాపుల్లోని రహస్య మార్గాల గుండా చేరుకుని వృక్షశిఖరాన్ని;
చలిమూకని చావుదెబ్బ తీస్తాయి.
.. అని రాశారు కవి ఇస్మాయిల్ చిగిర్చే చెట్టు అనే కవితలో.

ఆ చిగిర్చే చెట్టు నా బ్లాగు!
*** *** ***

ఇహ రెండొ విషయం .. స్త్రీ బ్లాగర్లని దారుణమైన అతి జుగుప్సాకరమైన మాటలతో దూషిస్తూ రాసిన, రాస్తున్న రాతలు .. అవి ఇప్పటిదాకా మీ కంట పడకుండా ఉంటే మీరు అదృష్టవంతులే.

ఆ రాతలు రాస్తున్న వారికీ, ఆ రాసేవారిని ఎగదోస్తున్న వారికీ రెండు మాటలు.

1. నలుగురు బ్లాగర్లని భయపెట్టి వాళ్ళ బ్లాగులు మూయించేశామని మీరు సంబరపడిపోనక్కర్లేదు. కొత్త బ్లాగర్లు వస్తూనే ఉంటారు, సరికొత్తగా రాస్తూనే ఉంటారు. మీరిక్కడ కాస్త ఆశుద్ధం చల్లినంత మాత్రాన బ్లాగ్లోకం మూతబడిందీ లేదు, మీరు సాధించింది అంతకంటే ఏమీ లేదు.

2. ఇంటర్నెట్ లో మారు పేరు పెట్టుకునో, అజ్ఞాతంగానో రాసినంత మాత్రాన మీ ఉనికి అంత అదృశ్యంగా ఏమీ లేదు. మీరెవరో తెలుసుకోవడం అంత కష్టమూ కాదు.
*** *** ***
మిగతా బ్లాగర్లకీ, బ్లాగులు చదివే వారికీ ...

I would like to remind you of Rev. Martin Niemöller's poem .. "First they came .."

First they came for the communists, and I did not speak out--
because I was not a communist;
Then they came for the socialists, and I did not speak out--
because I was not a socialist;
Then they came for the trade unionists, and I did not speak out--
because I was not a trade unionist;
Then they came for the Jews, and I did not speak out--
because I was not a Jew;
Then they came for me--
and there was no one left to speak out for me.

ఆలోచించండి!

Comments

@కొత్తపాళీ గారు: ఇవన్నీ ఎక్కడజరుగుతున్నాయో గానీ, గర్హించదగ్గవిషయాలు. కాసే చెట్టుకే రాళ్ళు అనేసామెతని వాళ్ళు ఋజువుచేస్తున్నట్టుంది.

అంతో, ఇంతో, అంతర్జాలంలో వాదనలలో పాల్గొన్నవాళ్ళకి అనుభవమయ్యే పరిస్థితే ఇది.
అంతర్జాలంలో ఎవరో ఎవరెవరినో ఏదేదో చేసెయ్యగలమనుక్కోవడం, వాళ్ళఅమాయకత్వం. వీటిని తట్టుకోలేని వారు, మానసికంగా బలహీనులు మాత్రమే.

మీరెంతోమందికి ఆదర్సం. బ్లాగుని కొనసాగిస్తూ, మీ జ్ఞ్జ్నానాన్ని పదిమందికీ పంచే ప్రయత్నం కొనసాగిస్తానని మీరు తీసుకున్న నిర్ణయానికి ఆనందిస్తున్నాము (అభినందించేంత పెద్దవాళ్ళంకాదుకనక).
Sujata M said…
well written. I got your point. I lost touch with blogging for quite a while. But I got a picture through a friend. I think we shd be ready to face all this in the internet. Too much of anything is also not good. I hope they will stop doing this once they realise this.
కొత్తపాళీ గారు,
పనివత్తిడి వల్ల నేను ఈ మధ్యకాలంలో బ్లాగులు చదవడం మానేసాను.మీరు ఉదహరించిన పరిణామాలు నాకు తెలియనివి కానీ బాధాకరమైనవి.

అనవరసపు ప్రేలాపనలు చదివినప్పుడల్లా మిమ్మల్ని గౌరవించే నాబోటి వాళ్ళున్నారని గుర్తు పెట్టుకోండి.

గిరి
కొత్త పాళి గారు మీరంటే నాకెంతో గౌరవం,మీ వయసు ఎంతనో తెలియదు కానీ మీరు నా బ్లాగులో మెచ్చుకుంటు ఇచ్చిన అభినందనలు సూచనలు మిగిలిన వారి వాక్యలకంటె ఎంతో జాగర్తగా ఫాలో అవుతాను.. ఎందుకనో తెలియదు మీ వాక్యలు చదివితే నాకు మా నాన్న గారు గుర్తువస్తారు..ఇంతకు మించి ఏమి చెప్పలేను ..దయ చేసి బ్లాగు మూయవద్దు
Bolloju Baba said…
కొత్తపాళీగారికి
కొద్దిమంది అసహనంతో చేస్తున్న దుష్ప్రచారం అమానవీయం.
అది వారి కుత్సిత బుద్దిని బయటపెట్టుకొంటుందే తప్ప మరోప్రయోజనం కలిగించదు.

దీప్తిధార బ్లాగులో ఒక అజ్ఞాతగారి కామెంటుకు స్పందిస్తూ నా ఆవేదనను ఇలా తెలియచేసాను. ఆ కామెంటును ఇక్కడ ఇస్తున్నాను.

అయ్యా/అమ్మా అజ్ఞాతగారు

మీరు మంచి పాయింటు లేవదిసారు. ఈ మధ్య కాలంలో మహిళా బ్లాగర్లపట్ల ఒక రకమైన దాడి కొనసాగుతున్నది. జ్యోతిగారు, రమణిగారు, సుజాతగారుల ను వ్యక్తిగతంగా వారి గౌరవాలకు భంగం కలిగేలా కించపరుస్తూ వాఖ్యలు, టపాలు వెలువడుతున్నాయి. ఇది హేయం. దారుణం.

వీరెకాక కొత్తగా కొత్తపాళీగారిని మరింత జుగుప్సాకరంగా కించపరచటం జరుగుతున్నది. పెద్దవారు కనుక సంయమనంతో వ్యవహరిస్తున్నారని అనుకొంటున్నాను.

నా బ్లాగులోకూడా నాపై అవమానకర ధోరణిలో కామెంటు పెట్టారు.

ఇవన్నీ ఎందుకు జరుగుతున్నట్లు? బహుసా కొత్తగా బ్లాగులోకంలో ప్రవేసించిన వారు లేనిపోని అపోహలతో ఏవేవో ఊహించేసుకొంటూ, రాళ్లురువ్వటమే వ్యాపకంగా పెట్టుకొన్నట్లున్నారు.

దీనిపై మరింతమంది స్పందించి ఇట్టిపోకడలను నిరసించి, బాధితులకు మద్దతు పలకకపోయినట్లయితే ఇలాంటి ధోరణులు మరించ పెచ్చరిల్లి, మర్యాదస్తులు బ్లాగులకు దూరంఅయ్యే ప్రమాదం ఉన్నది.

భవదీయుడు
బొల్లోజు బాబా
Malakpet Rowdy said…
I know I sound redundant but the number of males they have abused is same as, if not more than the number of women.

It is one group of people pitted against the other. While nothing is known about the first, the second group has both males and females and abusive language has been used against all.

I have not seen many (if at all any) people talking about the males being abused. Does that mean it's okay if males are abused? I have seen women supporting women and men supporting women on this issue but why is it that I cant find women supporting men?

Ironically, these were the same men who stood firmly by the women!

PS: Please feel free to correct me if I got something wrong here
కొత్తపాళీ గారు,
"నా బ్లాగు మూత పడే ప్రసక్తే లేదు"....ఇదే నా మాట కూడా! భయపెట్టి బ్లాగులను మూయించాలనుకుంటే వారికి మిగిలేది నిరాశే! ఆశ్చర్యంగా, నేనొక టపా రాసి ప్రచురించి ఇటు కూడలికి వచ్చే సరికి మీరు, రావు గారు టపాలతో సిద్ధంగా ఉన్నారు. ధన్యవాదాలు.
Anonymous said…
మీ బ్లాగు చిగిర్చే చెట్టు మాత్రమే కాదు- అందమైన పూలు విరబూసే, తియ్యటి ఫలాలు అందించే చెట్టు కూడా. మీరు బ్లాగు మూసేస్తే తెలుగు బ్లాగ్లోకానికి ఖచ్చితంగా నష్టమే. మీమీద జరిగిన వ్యక్తిగత దాడి అకారణమైన ద్వేషంతో కూడినది కాబట్టి మీరు పట్టించుకోనవసరం లేదు.
ఈ గొడవలు తొందరగా సద్దుమణుగుతాయనీ, మీ నుంచి ఇంకా మంచిటపాలు వస్తూనే ఉంటాయనీ ఆశిస్తున్నాను.
తమ ఆక్రోశాన్ని అసహ్యంగా వెళ్ళగక్కుతున్న మూర్ఖుల్ని ఖండించాల్సిందే! కనీసం మర్యాదపూర్వకంగా మనుషుల గురించి మాట్లాడలేని దుండగుల్ని వెలివెయ్యాల్సిందే!!
నాకూ చాలా గజిబిజిగా ఉంది. కొత్తపాళీ గారిని ఎటాక్ చేస్తూ ఒకరు రాస్తున్నది మాత్రం తెలుసు. ఈ మిగతా విషయాల మొదలు ఎక్కడో కూడా తెలియదు.

కానీ తెలుగు బ్లాగుల్లో ఆర్కుట్ తదితర సంస్కృతి రాకూడదని అనుకున్నా. అదే గనక వస్తే ఎవరికీ లాభం ఉండదు.

ఎవరో కొద్దిమంది మినహా చాలా వరకు పెద్దవారు, బరువు, బాధ్యతలు తెలిసిన వారే అనుకుంటాను. స్త్రీలు, పెద్దలు మన సంస్కృతిలో భాగంగా ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటారు. తప్పొప్పులతో సంబంధం లేకుండా వారిని బహిరంగంగా దూషించటం మంచి పద్ధతి కాదు.

కలిసి చర్చించుకుని అనుమానాలు నివృత్తి చేసుకుంటే అందరికీ మంచిది లేకపోతే చించేసిన విస్తరే తెలుగు బ్లాగుల గతి.
దేవన said…
ప్రజలలో, సాధారణంగా బయట కనిపించే ఆకతాయి చేష్టలు మొదట్లో అంతర్జాల ప్రపంచం లో కనిపించలేదు. ఈమెయిలు, usenet, online forums కొత్తగా వచ్చిన రోజుల్లో ప్రజలు ఈ కొత్త ఆవిష్కారాలను ఎంతగానో అభినందించారు. ఎక్కడ నుంచైనా ఎవ్వరితోనైన కొత్త రీతి లో సంభాషణలు కొనసాగించడానికి ఉపయోగపడే ఇటువంటి విశిష్ట సమాచార సాంకేతికతను స్వాగతించారు. ఈ కొత్త టెక్నాలజి ని అంతా సమానంగా గౌరవించారు. offcourse, porn, advertising scams వంటివన్నీ నేపథ్యం లో వుండి మన సమయాన్ని అంతగా వృధా పరిచేవి కావు. మనం మాత్రం గొప్ప నైతిక విలువలతో, దృఢమైన నమ్మకం తో ఈ కొత్త సంభాషణలు, ఆలోచనలు పంచుకోవడం వంటివి చేసేవారం.

ఎక్కడో తెలియదు కాని, రాను రాను మనం ఈ విశిష్టతను కోల్పోయాం. ఎవరంటే వారు రావడం, ఏంటేంటో తలా తోక తెలియకుండా వ్రాయడం జరుగుతోంది. ఈటువంటి వారి పోకడలతో, పాతవారు బాధపడడం, ఆశ్చర్యం పొందడం, కొత్త వారికి కోపం రావడం, అవమానింపబడడం లాంటివి జరుగుతున్నాయి.

Well, guess what, folks. Bullies have always been around. They are not a new phenomenon on the web. We had bullies in the playground and now the playground is virtual, bullies will be found.

I’m not talking about opinionated folks who love to shoot off their mouths on our blogs. I’m talking about downright mean - purposefully mean - folks who just get a thrill out of saying something nasty when silence or “thank you” could be their better part of valor.

A lot of bloggers who blog about blogging and speaking out about the “meanies” on the web, acting surprised and shocked that people would be so vicious. Where have you been? Have you forgotten that the web was created by and used by humans? Humans bring their nasties with them no matter where they go. The more gather, the more nasties.

Since being mean is part of human nature, don’t be surprised when it appears on your blog. Be prepared.
శ్రీ said…
మీ మీద కూడా దాడులా? ఇపుడే సుజాతా గారి టపా చదివితే తెలుస్తున్నాయి ఇటువంటి దాడుల గురించి.

మీకు,మహిళా బ్లాగర్లకి మా నైతిక మద్దతు ఉంది.
Uyyaala said…
నా బ్లాగు లో మీరు కామెంట్ రాసిన వెంటనే మిమ్మల్ని అగౌరవపరుస్తూ ఎవరో అనామకుడు వ్యాఖ్యానించడం గమనించి నిన్ననే నిర్ఘాంత పోయాను.
(ఆ వ్యాఖ్యను వెంటనే తొలగించాను).
ఇవాళ మీ టపా చూసాక మరింత విస్మయం కలిగింది. ఇదేమి పైశాచిక ఆనందమో అర్ధం కావడం లేదు. తెలుగు బ్లాగుల పాలిట ఇదో కొత్త రకం వైరస్ కాబోలు.
మొక్కలున్న చోట సహజంగానే కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. అలా అని వాటిని ఉపేక్షిస్తే మొత్తం తోట నే కబలిస్తాయవి. దీని గురించి తప్పక ప్రతి బ్లాగరు ఆలోచించాల్సిందే. ఇది ఒక్కరి సమస్య కాదు. అందరిదీ.
కవిత చాలా గొప్పగా వుంది. ఈ కవితను ఈమధ్యనే తస్లీమా నస్రీన్ బ్లాగు ముఖ చిత్రం పై చూసాను.
మరీ ఇలా మీమీదకానీ, ఇతరులమీద కానీ దాడిచేయకుండా నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే బావుంటుందని వారికి చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ నాకు కూడా తిట్లు పడతాయనని పక్కకు వున్నాను.

విమర్శలో తప్పేమీలేదు. దానివల్ల మనలో/ఇతరులలో వున్న బ్లీండ్ స్పాట్స్ తెలుస్తాయి. విమర్శలు అన్నవి ఇతరులని సరి అయిన మార్గంలో పెట్టడానికి ఉపకరించాలి కానీ మొదటికే మోసం వచ్చేట్లుగా (అంటే బ్లాగులే మూతపడే స్థితికి రావడం) వుండటం విచారకరం.

అందరూ హుందాగా సద్విమర్శలు చేసుకుంటారని ఆశిస్తాను.
asha said…
మీపై కూడా దాడి జరగటం చాలా బాధ కలిగించింది.
మహిళా బ్లాగర్లపైన కూడా చాలా ఘోరంగా దాడి చేశారు.
ఎన్నడూ ఊహించని విధంగా ఇలాంటివి చదవటం వల్ల ఒకలాంటి
విరక్తి కలిగింది. ఒకానొక సమయంలో నాక్కూడా బ్లాగు మూసేయాలనిపించింది.
కానీ, అలా చేయకూడదని ధృడంగా నిశ్చయించుకున్నాను. ఇలాంటి వాళ్ళు
మనమేం చేయాలో, ఎలా ఉండాలో నిర్ణయించకూడదని అనుకున్నాను. ఇంత
బాధలో కూడా ఇలాంటి స్పూర్తిధాయకమైన వెలువరించినందుకు మీకు ధన్యవాదములు
తెలుపుకుంటున్నాను.
మూసివేయబడ్డ బ్లాగులన్నింటినీ మళ్ళీ ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను.
రవి said…
చాలా అద్భుతంగా చెప్పారు. నా ఖర్మకు, ౩ రోజుల క్రితం మీ మీద రాసిన రాతలు, ఈ రోజే మహిళా బ్లాగర్ల మీద రాతలు చూడవలసి వచ్చింది. నాకూ అనిపిస్తుంది, ఏమి ఈ పీడ అని?


ఇక్కడ ఎవరికీ కొమ్ములు లేవు, ఎవరూ గొప్ప అనే ఫీలింగుతో రాయట్లేదు. ఎవరికీ ఏమీ ఒరగటం కూడా లేదు. కేవలం కొంచెం మానసిక తృప్తి, కాస్త recognition, తెలిసినవి పంచుకుందామన్న ఓ ఉబలాటం, కొన్ని మంచి వ్యక్తుల పరిచయాలు. ఇవే దక్కుతున్నది.

దీనికి కూడా కొంత మంది ఓర్వలేకపోవడం శొచనీయం.
తోటి బ్లాగర్ల పై జరిగే దాడి చాలా కాలందాకా నా దృష్టి కి రాలేదు.తరువాత ఎదో సంబంధము లేని బ్లాగులో ఎవరో దీని గురించి చర్చించి ఒక అనాగరికుని పేరుని ప్రస్తాపించడంతో కుతూహలము మొదలై ఆ బ్లాగు కి వెల్లడం జరిగింది. నేననుకుంటాను ఇలాంటివి సాధ్యమైనంత వరకు మొదట్లోనే చర్చలకు పేట్టకుండా వుంటే నా లాగే చాలా మంది కంటపడకుండా ప్రశాంతంగా వుండే వాళ్ళు.

విమర్శించుకో వచ్చు హద్దులు మీరనంత వరకు
పొగడవచ్చు అవతలి వ్యక్తి లో అహం పెరగనంతతవరకు
శృంగార కావ్యాలు రాయవచ్చు మనసు పులకించేలా

ఇంతకంటే ఎక్కువ రాస్తే అది టపాగా మారుతుందేమో...
karthik said…
sir,
dogs bark when elephant walk but it cannot come in front of elephant. so please dont pay a damn for all those stupid comments.

all i can say is we are all here to support you.

-Karthik
I share your feelings. I too saw one comment on you somewhere and felt it outrageous. I immediately wanted to react but restrained to give them a chance to continue mudslinging on that pretext. I request veeven to remove such blogs from koodali so that most of us can avoid seeing them. thanks for ur resolve to continue ur blogging and this resolve is the need of the hour. ఏనుగు వెళ్తోనే ఉండాలి...
మీకు నా పూర్తీ నైతిక మద్దతు ఇస్తున్నాను. కొజ్జా మాటలను, కొజ్జా విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే తెలుగు బ్లాగుల గురించి ఈనాడు, ఆంద్ర జ్యోతి, సాక్షి తదితర దినపత్రికల్లో చక్కటి ప్రచారం లభించి చక్కటి వృద్దిలోకి వస్తున్న తరుణంలో ... కొంత మంది కుల్లుబోతులు, కుక్కతోక వొంకర గాళ్ళు, అసూయ పరులు వోర్వలేక పోతున్నట్టుంది.
Naga said…
మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను, మీ నిర్ణయాలను హర్షిస్తున్నాను.

వెధవ వాగుడు గాళ్ళ కంటే, నిరసనగా బ్లాగును మూసే వాళ్ళంటేనే నాకు భయం. పిరికితనం కూడా అంటువ్యాధి లాంటిది.
మాలతి said…
అసభ్యకరమైన రాతలకి అభ్యంతరం చెప్పడం ఇంతకంటె సృజనాత్మకంగా ఎవరూ చెప్పలేరనుకుంటా. మీ పాయింటుతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. తెలుగు బ్లాగరులు అందరూ తెలుగుభాషా, సాహిత్యం ప్రాచుర్యానికి కృషి చేస్తుంటే, కొందరు తమతెలివితేటల్ని ఇతరులని దూషించడంలో వ్యర్థం చేయ్యడం విచారకరం. మీరన్నట్టు మనపని మనం చేసుకుంటూ పోదాం.
ఇదే విషయాన్ని నేను చాలా మంది టపాల్లో వ్యాఖ్యానించాను.దాన్నే మళ్ళీ ఇక్కడ చెబుతున్నా.
ఈ ఇరవై రోజుల్లో ఏమి జరిగిందో తెలియదు ఎందుకంటే పంటల నూర్పిడిలో మునిగిపోవడంవల్ల విషయం తెలియలేదు జూన్లో బ్లాగుప్రపంచంలోకి ప్రవేశించాను.వచ్చినప్పుడున్న వాతావరణం ఇప్పుడులేదు.అయినా ఇదేంటండి బ్లాగులోకంలో అందరూ మంచి విద్యావంతులు,సంస్కారవంతులున్నారనుకున్నా,మా పల్లెటూరి ప్రజలే మేలు కదండి.అపార్థాలు పొడచూపినా త్వరగా మరచిపోయి మళ్ళీ కలిసిపోతూవుంటాము.అయినా ఎవరో ఏదో అన్నారని మనం బ్లాగులు మూసుకోవడమేంటండి.పొగడ్తల్నే కాదు విమర్శల్ను కూడా స్వీకరించే స్తితప్రజ్ఞత,మనస్తత్వం అలవరచుకోవాలి.ఇలా జరగడవల్ల మంచి బ్లాగర్లను కోల్పోయినవారమవుతాము.ఇప్పుడిప్పుడే తెలుగు బ్లాగులోకానికి పత్రికారంగంలో గుర్తింపు వస్తోంది,ఇలాంటి సమయంలో మంచి బ్లాగర్లు తమ బ్లాగులను మూసివేయడం తెలుగును ప్రపంచవ్యాప్తిచేయాలన్నమన ఆశయం నెరవేరదు.గత నెలలో దీనికోసం పుస్తక ప్రదర్శనలో మన బ్లాగు మిత్రులు కష్టపడినదంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా తయారవుతుంది.బ్లాగులను మూసివేయలన్న నిర్ణయాన్ని మరోసారి ఆలోచించమని నా విజ్ఞప్తి.
కొత్త పాళీ గారూ మీరాతల్ని అభిమానించేవారిలో నేనొకణ్ణి.మీపై విమర్శలకు బాధపడుతున్నా.రాతల్ని ఆపకూడదన్న మీనిర్ణయాన్ని అభినందిస్తున్నా.
Dr.Pen said…
I strongly condemn these attacks and we all stand by you kottapali garu.
మీ మీద దాడికి దిగడం చాలా భాదకరమైన విషయం. నేను ఒక సంవత్సరంగా తెలుగుబ్లాగులను గమనిస్తున్నాను. మీరు ఎప్పుడూ ఒకరిమీద ఆధిపత్యం చెలాయించాలి అన్నట్టుగా వ్యవహరించలేదు. కొత్తగా వచ్చేవారు ఏవేవో అపోహలతో ఉన్నారు. వారిని పట్టించుకోకపోవడమే మంచింది.
@అన్నగారూ!!! అస్సలేంజరిగిందీ? నాకేమీ అర్ధంకాలా!!!
ఏమైనా మీరు వీటికి చలించరూ అని మా అందరికీ తెలుసు. కానీ ఇలాంటి సంఘటనలు పిరికివాళ్ల చేష్టలు.
ఇలాంటివి జరగకుండా అందరం కల్సి కూర్చుని మాట్లాడాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నా. నా సహకారం ఎప్పుడూ ఉంటుంది.
ధన్యవాదాలు.
అయ్యా కొత్తపాళీ గారూ, మీరు మొదటిసారి నా బ్లాగ్ లో రాసిన కామెంట్ నకిప్పటికీ గుర్తే. నాలాంటి ఎంతో మంది కొత్త బ్లాగరులకి మీ కామెంట్లు, మీ సలహాలూ ఎంతో నైతిక మద్దత్తునిస్తాయి అన్నది నిజం. మీరే కాదు, మరెందరో మంచి మంచి బ్లాగరులు ఇక్కడ ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. ఎవరూ ఎవరిని అణిచేయాలి అన్న తాపత్రయం నాకెప్పుడూ కనిపించలేదు.

కాని జరిగినవి చూస్తుంటే ఖచితం గా ఇవి కొత్త వాళ్ళ పని కాదు, ఎప్పటి నుండో ఈ బ్లాగ్లోకంలో ఉన్నవాళ్ళు చేస్తున్న పని అని అర్థం అవుతోంది. ఏదైనా చేసి హిట్స్ పెంచుకోవాలి అన్న వెర్రి కోరిక కనిపిస్తోంది. బ్లాగు రాయాలీ అంటే భయపడే రోజు వస్తోంది.

చదువు మనిషికి సంస్కారం నేర్పుతుంది అంటారు, కాని మన చదువులు దురదృష్ట వశాత్తూ డబ్బు సంపాదించటం, అతి తెలివి ని ప్రసాదిస్తున్నాయి. ఏమీ చెయ్యలేని పరిస్థితి.

మీకే కాదు, ఈ దాడుల్లో మానసికంగా గాయ పడిన ప్రతి బ్లాగరికి ఒకటే చెప్తున్నా

"ఏనుగు వెనకాల కుక్కలు అరిచినంత మాత్రాన ఏనుగుకి నష్టం లేదు, దాని విలువ తగ్గిపోదు"

మీ టపాకంటే పెద్ద కామెంట్ రాసినందుకు మన్నించాలి
Unknown said…
కొత్తపాళీ గారు, ఒక స్ఫూర్తిని దెబ్బతీయాలనుకునే వ్యక్తి లక్ష్యం వ్యక్తులను టార్గెట్ చేసుకుని బురదజల్లుతూ అందరినీ మనోవేదనకు గురిచేసి పైశాచిక ఆనందాన్ని పొందడం! ఇక్కడ జరుగుతున్నది అదే. అక్కడ మహిళా బ్లాగర్లు, పురుష బ్లాగర్లు అని తేడా లేదు.. అందరి పేర్లూ ప్రస్తావించబడుతున్నాయి అటూ ఇటూ మోతాదుల్లో తేడా తప్ప. కాకపోతే మహిళల పట్ల మరీ దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఏ విధంగానైనా అటెక్షన్ కోరుకునే వ్యక్తికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకూడదన్న ఉద్దేశమే నాది. ఎవడో దారిన పోయే వాడు నోటికొచ్చినట్లు వాగినంత మాత్రాన మన వ్యక్తిత్వం ఏమీ పలుచనబడిపోయినట్లు కాదు కదా! అన్నింటికి మించి బ్లాగు ప్రపంచం అతి చిన్నది. ఇక్కడ నలుగురు ఆత్మీయులు దొరికినా, నలుగురు ధూషించేవారు దొరికినా అది వారి వారి సంస్కారం మాత్రమే తప్ప మన లోపం ఏమాత్రం కాదు. ఐడెంటిటీ చెప్పుకోలేక విషాన్ని కక్కే వాళ్లకు మౌనంగా మన పని మనం చేసుకుంటూ మన ప్రొడక్టివిటీని, స్థిరచిత్తాన్ని కోల్పోకుండా మెలగడం తప్ప ఇవ్వగలిగే పెద్ద శిక్ష ఏదీ లేదనుకుంటాను. ఇది సరిగా అర్థం చేసుకున్నా లేక పలాయనవాదమనుకున్నా ఒక నవ్వు నవ్వడం తప్ప నేను చెయ్యగలిగిందేమీ లేదు. ఖండించి అవతలి వ్యక్తికి మరింత విలువని ఇవ్వడాన్ని తప్పించి ఇంకే విధంగా సంఘీభావం తెలియజేయవలసి వచ్చినా ఎల్లప్పుడూ నేను ముందుంటాను.
ఏమిటో ఈ కలకలాలు. మొన్నటి దాకా పచ్చగా ఉన్న చెట్టు ఇప్పుడు మోడైపోయినట్టుంది. మళ్ళి వసంతం వస్తే మళ్ళి పచ్చగా చిగురిస్తుంది.
కొత్తపాళీ గారు, ఇన్నాళ్ళు వెబ్ ప్రపంచంలో ఉన్న మీరు కూడా ఇలా ఫీల్ అయితే ఎలా.. మీరు బ్లాగు మూసేస్తే బాగుండుననుకునే వాళ్లే జయిస్తారు.
కొంత మంది మనిషులకి ఓర్వలేనితనం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎలాగైనా పక్కవాళ్ళని ముంచాలనే చూస్తుంటారు. అలాంటి వాళ్ళని ఆ దేవుడు కూడా బాగు చెయ్యలేడు. మన తెలుగు సినిమాల్లో చూపించినట్టూ, నాలుగు మంచి మాటలు చెప్తే మారిపోయే వాళ్ళయితే ఎంత బాగుండును. ప్చ్ ఏం చేస్తాము అలా జరగదే.
మిమ్మల్ని ఎంతో గౌరవించే మాలాంటి వాళ్ళు ఉంటారని మాత్రం గుర్తుంచుకోండి.
కొద్ది క్షణాల క్రితమే మరో బ్లాగ్లో బ్లాగులోకం లో జరుగుతున్నా గొడవల గురించి చదివాను... అది నాకు అంతగా అర్థం కాలేదు... ఎందుకంటే ఆ గొడవలేంటో నాకు తెలిదు. నాలుగు సంవత్సరాలుగా బ్లాగులోకంలో ఉన్నా.. కొద్ది కాలంగానే ఎక్కువగా ఇతరుల బ్లాగులు చదవటం మొదలు పెట్టాను. మీ బ్లాగు నాకు నచ్చుతుంది. ఇలాంటి మరికొన్ని బ్లాగులు కూడా నచ్చాయి. ఇవన్ని చదవటం వల్లనే... ఇంక మరికొన్ని స్త్రీ బ్లాగులని చూసి... నాకు ఇంకో బ్లాగు మొదలుపెట్టాలనే ఆలోచన కలిగింది.
ఒక బ్లాగు లో మీ రిప్లై కి ఒక anonymous (నిజానికి anonymous కాదు, మరొక పేరు ఉంది) చాలా వెటకారంగా స్పందించటం నేను చదివాను. ఎందుకు అల చేసారో అంతగా అర్థం కాకపోయినా... కాస్త పళ్ళు ఉన్న చెట్టు పైకి రాళ్ళు విసరెవరు సిద్ధంగా ఉంటారని తెలుసు కనుక... ఇదీ అటువంటిదే అనుకున్నాను.
ఇటువంటి వారు కామెంట్స్ కి భయపడో, బాధపడో, చిరాకు చెందో మీరు మీ బ్లాగ్ ఆపివేయల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను (ఇలా బ్లాగు ఆపేసిన వాళ్ళందరిపై ఇదే నా అభిప్రాయం). మీలాంటి వాళ్ల ని చూసే నాలాంటి వాళ్ళు కొత్త బ్లాగ్లు మొదలుపెడుతున్నాం.
ఇలాంటి గొడవలు జరగటం చాలా బాధాకరం.
మురళి said…
చదువు వేరు, సంస్కారం వేరు అని నా నమ్మకం.. బ్లాగు లోకం కూడా అది నిజమని నిరూపించింది. మనిషిని చంద్ర మండలానికి చేర్చిందీ, అణు బాంబును తయారు చేయించినదీ కూడా మానవ మేధస్సే. బ్లాగు లోకం నుంచి మీ నిష్క్రమణ ఇప్పటి సమస్యకి పరిష్కారం ఎంతమాత్రం కాదు.
రాఘవ said…
నేను కూడలికి వెళ్లి చాలాకాలమే అయ్యింది. ఏదో బ్లాగ్‌ఫీడ్‌ల పుణ్యమా అని కొన్ని బ్లాగులు చూస్తున్నాను కానీ ఇపుడు మీరు చెప్పేవరకూ నాకు ఇలాంటి మాటల దాడులు మీ పైనా, స్త్రీబ్లాగర్ల పైనా జరిగాయని తెలియదు. ఇది చదివాక బాధగా అనిపించింది. అదే సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్నిచ్చింది.

దురితముల్ భంజింపు నారాయణా!
"నేను కొన్ని నిర్దిష్టమైన ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని బ్లాగు మొదలు పెట్టాను. అవి నెరవేరుతున్నాయి. నాకెంతో తృప్తినీ ఇస్తున్నాయి. ఎవరో కడుపుమండిన వాళ్ళ కోసం నేను బ్లాగు మూసేసే ప్రసక్తే లేదు. నా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుంది."
కావల్సింది అదే! చెయ్యవలసింది అదే! మహిళలైనా, పురుషులైనా!మీ మాటే, నా మాట కూడా!
కొత్తపాళీగారు,

నిజమే.మీరు చెప్పింది. ఇంతకంటే ఏమీ చెప్పలేకపోతున్నాను. పైసా ఆదాయం లేదు. ఎవరిని ముంచింది లేదు. ఐనా ఎందుకో ఈ గొడవలు? అర్ధం కావట్లేదు...
గురువు గారూ ఇంత మంది శిష్యులం ఉన్నాము ఇక్కడ మీ వెనకాల...మర్చిపోకండి..
"బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమయిన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ"...

మీకు చెప్పాలా స్వామీ...
నల్లమోతు శ్రీధరిగారి మాటలే నా మాటలు.
1. ఇతరులు గేలిచేసినందువల్ల నిర్హేతుకంగా నోరుపారేసుకున్నందువల్లా మీకు, మీలాటి ఇతర బ్లాగర్లకు ఏమాత్రం గౌరవం తగ్గదు. మీ బ్లాగుపై అభిమానం ఉన్నవాళ్ళు బ్లాగుని చూడడమూ మానరు.
2. ఇలా తూలనాడేవాళ్ళ ముఖ్యోద్దాశం అవతల వాళ్ళని బాధపెట్టడమే. కాబట్టి మీరు బాధపడి మీ మీ బ్లాగులని మూసెయ్యడం వాళ్ళకి ఉపకరించేది, మీ బ్లాగుని అభిమానించేవాళ్ళకి నష్టం కలిగించేది. కాబట్టి అలాటి ప్రయత్నం అనవసరం.
3. బ్లాగులోకం నిజ సమాజంలాంటిది కాదు. పూర్తి స్థాయిలో నియంత్రణ సాధ్యం కాదు. ముసుగు వీరులకి బాగా అనువైనది. కాబట్టి ఉపేక్షించకుండా చెయ్య గలిగింది ఏమీ లేదు. కూడలిలాంటి వాటినుండి బహిష్కరించాలని కోరవచ్చు కాని అది పూర్తిగా ఉపయోగపడదు.
4. కాబట్టి అన్ని విధాలుగా లెక్కచెయ్యకుండా మన దారిని మనం పోవడమే ఉత్తమం అని నాకనిపిస్తుంది. మెట్ట వేదాంతంలా అనిపించ వచ్చు కాని, నా అనుభవంలో ఇది ప్రాక్టికలే - అవతలవాళ్ళు మనల్ని గేలిచేసి ఆనందిస్తున్నారు కదా. వాళ్ళ ఆనందానికి కారణమైనామని సంతృప్తి పడటం కన్నా ఉత్తమం లేదు. ఇలా ఎప్పుడైతే మనం అనుకున్నామో, అప్పుడు హీనంగా మాట్లాడుతున్న వాళ్ళ ప్రయోజనం నెరవేరదు. వాళ్ళ నోళ్ళు ఆటోమేటిగ్గా మూతపడతాయి.

ఒకరు మీ గురించి హీనంగా వ్యాఖ్య చేస్తే దానికి ఎలా స్పందించాలి అన్నది మీ వ్యక్తిగత విషయం. అంచేత మీరిలాగే చెయ్యాలి అని నే చెప్పడం నిజానికి భావ్యం కాదు. కానీ మీరు, మీలాటి మంచి బ్లాగులున్న ఇతరులు బ్లాగులు మూసేస్తే నాకు నష్టం కాబట్టి అలా ముయ్యకుండా ఉండొద్దని విజ్ఞప్తి చెయ్యడమే నా పై సోది సారాంశం.
చెడుని మరిచి, మంచిపై దృష్టి మరల్చడానికి బ్లాగులోకంలో కొత్తగా ఉదయించిన, నాకు నచ్చిన ఒక బ్లాగిది. మీరూ చదివి ఆనందించండి: http://www.raata-geeta.blogspot.com/
దీప్తిధార బ్లాగులో బొల్లోజు బాబా గారితో ఏకీభవించాను మళ్ళీ ఇక్కడ కూడా నాది అదే మాట. మీకు,మహిళా బ్లాగర్లకి మా నైతిక మద్దతు ఉంది.

మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
కొన్ని వ్యక్తిగత కారణాల వలన చాలారోజులుగా బ్లాగ్లోకానికి దూరంగా ఉన్నాను (అదృష్టం!). మీరు చెప్పిన పిచ్చిరాతలేవీ నేను చూడలేదు. ఐనా అలాంటి వ్రాతలకు (ఏం వ్రాశారో గానీ) మీ అంతవారు చలించకూడదు. వ్రాతలకు మనం ఎలాస్పందిస్తామన్నది వ్రాసేవాడి చేతిలో లేదు కదా! వారు కోరుకున్న విధాన మీరు స్పందించకండి. మీమీద పిచ్చి వ్రాతలు వ్రాసేవాడొక్కడుంటే మిమ్మల్ని అభిమానించి గౌరవించేవాళ్ళం వంద మందిమి ఉన్నాము. మీ బ్లాగులు మా వంద మందికే గానీ ఆ ఒక్క అనామకుడి కోసం కాదు.

" పండితులైన వారు దిగువందగనుండగ నల్పుడొక్కడు
ద్ధండత పీఠమెక్కిన బుధవర్గముకేమి యెగ్గగున్?"

అని భాస్కర శతకకారుని ఉవాచ. మీకు చెప్పదగినంత వాడిని కాను గానీ, ఇలాంటివి మనసుకు పట్టించుకోవద్దని మనవి.
durgeswara said…
kotta paali gaaroo

emi jariginadi? neni madhya itugaa raavtamu kudara ledu.komchem vivarimchamdi mail lo
సర్ !మీరంటే బ్లాగరులందరికీ గౌరవం ఉంది .ఎవరో ఒకరిద్దరు చేసిన కామెంట్స్ గురించి బ్లాగ్ మూసేయడం చేయకండి .వందల మందిలో ఒకరిద్దరు ,అదీ మానసిక రోగులు (మామూలుగా ఎవరూ అటువంటి భాష ఉపయోగించ లేరు )గురించి పట్టించుకోకుండా మావంటి అభిమానుల గురించి కొనసాగించండి .
"దారిన వెళ్తున్న ఏనుగును చూసి కుక్కల గుంపులు మొరుగుతాయి". కాని ఏనుగు వాటిని లక్ష్యపెట్టక తన దారిన తను పోతుంటుంది. మీరు కూడా అలాగే వారిని లక్ష్యపెట్టక ముందుకు సాగండి. అందరి మద్దతు మీకే కొత్తపాళీగారూ.
Padmarpita said…
కొత్తపాళీగారు.... ఈ గొడవలు ఏమిటో నాకు తెలియవుకాని.
నా కవితల్ని మీరు చదివి వ్యాఖ్య చేసినప్పుడు గురువు శిష్యురాలిని మెచ్చుకున్న ఫీలింగ్ ఆ ఆనందానికి మమ్మల్ని దూరం చేయకండి సార్!!
మీ బ్లాగు చదివే వాళ్ళల్లో నేనూ ఒకడిని. టైము లేకపోవటం వల్ల ఎప్పుడూ ఇక్కడ కామెంట్స్ వ్రాయటం కుదరలేదు. ఆసలు జరిగిన విషయమేమిటో కూడా నాకు పూర్తిగా తెలియదు. మీ బ్లాగు ఆపి వేస్తే బాధపడే వారిలో నేను కూడా ఒకడిని. దయచేసి మీరు మాత్రం వ్రాయటం ఆపవద్దు.
కలగంగ దగునె మీరును
విలువింతయులేని పిచ్చి ప్రేలాపనకున్
పలుకాకులైన లోకులు
పలికిన నేమాయె కొన్ని వంకర కూతల్

సభ్య సాహిత్య సంస్కృతుల్ సంగమించు
బ్లాగులోకపు వెలుగులకాగలేక
అంధకారమ్ము వెదకు దివాంధములకు
తత్తరిల్లునె బ్లాగ్హేళి కొత్తపాళి!

ఇక దీన్ని మనమందరం మరచిపోతే బాగుంటుంది.
కొత్తపాళీ గారు,

ఇప్పుడు మన బ్లాగ్లోకం మానవ లోకానికి నిజమైన అద్దంలా తయారయిందనమాట. ఎవరో "ఇప్పుడు బ్లాగ్లోకం పాడయింది" అని అంటే అర్థం కాలేదు మొన్నా మధ్య, ఇప్పుడే తెలిసింది ఈ కాగడా వగైరాల గురించి.

మన నిజ జీవితంలో అలాటి వారిని ఏం చేస్తాం? అదే చెయ్యాలి అంతా.....

వ్యక్తిగత దూషణలకు గురయిన వారందరికీ మా సపోర్టు సదా ఉంటుంది. కొనసాగించండి.
బ్లాగు మూసెయ్యకూడదని తీసుకున్న తీర్ణయానికి కృతజ్ఞతలు. నేనా చెత్త చదవలేదు. కానీ ఎలాంటి చెత్తైనా ఖండించాల్సిందే!! కొంపదీసి నాస్తిక సంఘం వాళ్ళుగానీ బ్లాగ్లోకంలో పడలేదు కదా! ఒక నెల క్రితం వికీలో బాగా రచ్చచేశారు.
తన చివరి వ్యాఖ్యలో చంద్రమోహన్ గారు చక్కగా సెలవిచ్చారు:
"కలగంగ దగునె మీరును
విలువింతయులేని పిచ్చి ప్రేలాపనకున్
పలుకాకులైన లోకులు
పలికిన నేమాయె కొన్ని వంకర కూతల్

సభ్య సాహిత్య సంస్కృతుల్ సంగమించు
బ్లాగులోకపు వెలుగులకాగలేక
అంధకారమ్ము వెదకు దివాంధములకు
తత్తరిల్లునె బ్లాగ్హేళి కొత్తపాళి!

ఇక దీన్ని మనమందరం మరచిపోతే బాగుంటుంది." సభ్యతా సంస్కారాలు లేని రాతలకు అనవసర ప్రాధాన్యతనివ్వక మీ దారిలో సాగిపొండి.
ఆర్యా! కొత్త పాళీగారూ! నమస్తే.
సుమారు ఏభై కామెంట్సున్నాయేమిటా అని మీ చిగిర్చే చెట్టు చూచాను.

శ్రేయాంసి బహు విఘ్నాని. అన్న నానుడి మీకు తెలియనిది కాదు. మనం ఎవరికోసమో బ్లాగటంలేదు. మంచిది అనిపించినదానినిభద్రపరుస్తున్నాము.
ఆశ్వాదించేవారికోసం ద్వారం తెరిచే వుంచుతాం.

ప్రతిస్పందించేవారి మాటలు వ్రాతలు వారి మనోవృత్తికద్దం పడతాయే తప్ప మనకంటూ కలిగించే నష్టమంటూ ఏమీ వుండదు.
మనం వారి మాటలకు స్పందించ వలసినవి స్ఫందింపనక్కరలేనివీ గ్రహించి అవసరమైనదానికి తప్పక స్ఫందించాలి. అక్కరలేని దానికి స్ఫందించ కూడదు.
అనవసరంగా వాచాలురైనవారిని గురించి ఆలోచించడమే వ్యర్థం.
దయచేసి మీ వంటి వారు స్పందించకుండా వుండ గలిగితే వాచాలత్వం కట్టుబాటవుతుంది. ఇంకెప్పుడూ కలత చెందకండి. మమ్ములను కలవర పెట్టకండి.

మిమ్మల్నే ఆదర్శంగాచేసుకొనిన మీ అనుచరుల ధైర్య స్థైర్యాల్ని కొల్లగొట్టకండి. మీరింత తక్కువ వ్యవధిలోనే సద్దుకొన్నందుకు అభినందిస్తున్నాను.
క:-
కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి మగుడ మీదికిన్నెగయు జుమీ.
మందుడు మృత్పిండము వలె
క్రిందంబడి యణగి యుండు కృపణత్వమునన్.

ఈ మాటలను మీరు నిజం చేసి చూపించారు.
ధన్యవాదాలు.
"చిగిర్చే చెట్టుకి ఎగిరే పిట్ట ఆదర్శం. పత్రాల్ని విదిల్చి పైకెగరాలని ప్రయత్నం."

ఇది మాట కాదు వజ్రాల మూట. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ ప్రతి మాటా మావంటి ఔత్సాహికులకు రాబోయే రోజుల్లో పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పే గొప్ప పాఠమే.
$h@nK@R ! said…
కొత్తపాళీ గారు..!
నేను ఈ మద్యనే బ్లాగ్ లొకం లొకి వచ్చా! మీ బ్లాగ్ క్రమం తప్పకుండా చూస్తాను..! ఎవరో ఎదో నాగరికతకు మించి కామెంట్ లు చెస్తున్నరాని... చాలా చాలా బ్లాగ్ లొ చదవడం జరిగింది.! ఆరోగ్యకరమైన విమర్శలుండాలి కాని చిల్లర కామెంట్ లతొ .. విసుగు తెప్పించి బ్లాగ్ ముసేసే స్థితి తేకూడదు..! నా ముందు వచ్చిన కామెంట్స్ రాబొయె కామెంట్స్ అభిప్రాయాలతొ నేను మీతొ ఏకీభవిస్తున్న ..! చాల చక్కగా వ్యక్తపరిచారు..!