మనం నిజంగా అత్యుత్తమ స్థాయిని ప్రోత్సహిస్తున్నామా?

ఐఐటీలు గొప్పవా?

ఈ ప్రశ్న లెక్కల సబ్జక్టుతో ఇంటరు చదువుతున్న ఏ విద్యార్ధినైనా అడగండి .. మనల్ని ఎర్రగడ్డ నించి ఇప్పూడే విడుదలై వచ్చినట్టు చూస్తారు. ఐఐటీ ప్రవేశ పరీక్షకి అత్యుత్తమ శిక్షణ నిస్తామంటూ వేలాది విద్యార్ధులు ఒక్కొక్కరి నించీ లక్షల ఫీజులు వసూలు చేస్తున్న విద్యా కర్మాగారాల్లో చూడండి. అంతదాకా ఎందుకు. ఒక కొత్త బేచి విద్యార్ధులు ఐఐటీలో ప్రవేశించినప్పుడు అక్కడి విద్యాధికారులే వాళ్ళకి చెబుతారు, వాళ్ళు సాధించినది ఎంత గొప్ప విజయమో, వాళ్ళంతా ఈ ఆకాశ హర్మ్యాల్లోకి అడుగు పెట్టేందుకు పూర్వజన్మల్లో ఎంతలేసి పుణ్యాలు చేసుకున్నారో.

ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయం సాధించడం నిజంగా గొప్ప విజయమే, కనీసం విద్యా విషయకమైన స్పర్ధలో. ఆ పరిక్ష ఎంత క్లిష్టమో నాకు తెలుసు. విజయం సాధించడానికి ఎంత క్రమశిక్షణా, ఎంత శ్రమా అవసరమో నాకు తెలుసు.

కానీ ఇంత అవసరమా? ఐఐటీ విద్య అంత గొప్పదా? ఇంత కష్టపడి ప్రవేశం సాధించిన తరువాత, ఆ విద్య పొందిన వారు తరువాతి జీవితంలో ఎటువంటి ఘన విజయాలు సాధించారు, సాధిస్తున్నారు?

మీరు గనక ఐఐటీ స్నాతకులైతే (గ్రాడ్యువేట్లు) నన్ను మన్నించెయ్యండి. ఒకేళ మీ పిల్లలు గానీ ఐఐటీ లో చదువుతున్నా సరే. నేనేదో ఐఐటీ ద్వేషిని కాను. మా అన్నగారు ఒక ఐఐటీలో చదివి, ఇప్పుడు ఇంకో ఐఐటీలో పాఠం చెబుతున్నారు. నా అతి దగ్గరి స్నేహితులు కొందరు ఐఐటీ స్నాతకులే. నేనైనా అందని ద్రాక్ష పుల్లన బాపతు కూడా కాదు. ఎందుకంటే నేనూ కొంత ఐఐటీ గాలి పీల్చుకున్న వాణ్ణే. అంచేత, కేవలం ఒక ఆలోచనని పంచుకోవడమూ, ఇంకొంత ఆలోచనని రేకెత్తించడమూ తప్ప ఈ టపాలో వేరుద్దేశం లేదని గమనించగలరు.

ఐఐటీ స్నాతకులు తమ సమకాలికులకంటే ఎక్కువ స్థాయి వారా? నాకు తెలిసి వారెవరూ ప్రపంచాన్ని మార్చి వేసే, లేదా ప్రపంచానికి గొప్ప మేలు చేసే సాంకేతిక, శాస్త్రీయ విషయమేదీ కని పెట్టిన దాఖలాలు లేవు. విదేశాలకి వలస అది వేరే సమస్య అనుకోండి. పోనీ విదేశాల్లో కెళ్ళి అయినా వీరెవరూ తమ తమ పరిధుల్లో గొప్ప శిఖరాలు అధిరోహించిన దాఖలాలు నాకైతే ఏమీ కనబడటంలేదు. పోనీ ఎవరన్నా గొప్ప పారిశ్రామిక వేత్తలయ్యారా అనుకుంటే .. కొద్ది మంది కనిపిస్తున్నారు కానీ, జనాభాలో శాతంగా చూస్తే ఇతర జనాభా శాతం కంటే ఐఐటీ స్నాతకుల శాతం ఎక్కువ కాదనిపిస్తోంది. ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారులే అనుకున్నా, ఆ ఉద్యోగాల్లో అయినా వారు అత్యున్నత స్థాయి నధిరోహించిన విషయం బహు అరుదుగా విన్నాను. కొందరు అయ్యేయస్ వంటి పరిపాలనా రంగాల్లోకి వెళ్తుంటారు .. వారైనా ఇతర అయ్యేయస్ లకంటే మిన్నగా నిలిచిన సూచనలూ నాకు కనబళ్ళేదు.

ఐఐటీ గురించి ఇంత హైరాన పడే మనమూ మన సమాజమూ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అత్యుత్తమ స్థాయిని ప్రోత్సహించక పోగా, ఆ భావనకి పరమ విరుద్ధమైన మీడియాక్రిటీ (mediocrity)ని ప్రోత్సహిస్తున్నామని నాకనిపిస్తోంది.
ఎంత వృధా?
ఒక నాగరికతగా ఇది మన సమాజాన్ని గురించి ఏం చెబుతోంది?

Comments

Unknown said…
may be you are right.i am also an iitian for about 4 to 5 months. i discontinued my post graduation there due to a motor cycle accident in the campus in 1971 .
of course the motor cycle is mine and i was driving it then.it is madras iit.
http://www.topnews.in/iitians-instrumental-creation-over-20-million-new-jobs-study-292713

ఈ లింకులో గత ఐ.ఐ.టియన్లు చేస్తున్న దాన్ని గురించిన కొన్ని వివరాలు ఉన్నాయి.

నా అనుభవంలో అయితే, ఇతర కళాశాలలతో పోలిస్తే IIT లలో కొంచం మంచి అద్యాపకులు, మంచి సదుపాయాలు (labs, libraries etc) ఉండటం వల్ల నాణ్యమైన విద్యను అభ్యసించే అవకాశం వస్తుంది. పైగా ఐ.ఐ.టీ లలోకి రాగలిగిన వాళ్లు మిగతా వాళ్లకంటే గొప్పవాళ్లు అన్న నమ్మకం(ఇది నిజం అని నేను అనడం లేదు)వల్ల వాళ్లకు ఏదైనా సాదించగమన్న నమ్మకం కలుగుతుంది. దీనితో ఏవిషయాన్నయినా సాధించడానికి అంతకు ముందు కంటే ఎక్కువగా శ్రమిస్తారు.

మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నదేమంటే, IIT లు మిగతా కళాశాలలకంటే గొప్పవా అంటే, నిస్సందేహంగా గొప్పవే అని చెప్పొచ్చు. కాని, అక్కడ చదివేవారు మిగతా వాళ్లకంటే గొప్పవాళ్లని మాత్రం చెప్పలేం.
Unknown said…
మీరన్నది నిజం. సరియైన విషయం పై రాశారు.

ఐఐటిలలో, అందులో చదువుకొన్న వాళ్ళలో అందరికన్న మిన్నయైన వికాసమేదీ కనిపించడంలేదు. అయితే దానిలో ప్రవేశానికి ఎన్నుకొన్న పరీక్షావిధానం, మార్కుల పద్దతీ, ఇవ్వన్నీ చాలా పరిమితులున్నవి.

జీవితానికి కావలసింది ఇనీషియేటివ్, క్రియేటివ్ దృక్పధం. వీటిని మన మార్కుల పరీక్షలు కొలువలేవు. కాబట్టి ఐఐటిలల్లో పెద్దగా వికాసం కనిపించక పోవడంలో ఆశ్చర్యం లేదు. మన పరీక్షల్లో కొలిచేది మెమొరీ, విశ్లేషణా సామర్ధ్యాలని మాత్రమే. వీటి పాత్ర కూడా జీవితంలో ఉన్నప్పటికీ కొత్తగా ఆలోచించడానికి, సమస్యలని పరిష్కరించడానికి ఇవిమాత్రమే సరిపోవు.

నాకు తెలిసిన ఐఐటి పట్టభద్రులలో విశేషంగా ప్రపంచం పట్ల, జీవిత విలువలపట్ల మక్కువ ఉండి కృషి చేసిన వ్యక్తి - అనిల్ అగర్వాల్. సెంటర్ ఫర్ సైన్స్ ఎండ్ ఎన్విరాన్ మెంట్ వ్యవస్థాపకుడు.
@రమణ .. ఆ వ్యాసంలో చెప్పిన గణాంకాలు చదవడాంకి ఆసక్తికరంగా ఉన్నాయి. ఐ.ఐ.టియన్లు సాధించినది ఆమాత్రం ఉందని కూడా నేను అనుకోలేదు. తెలియచేసినందుకు ధన్యవాదాలు. ఐతే, ఆ నివేదికలో ఒక ముఖ్యమైన తులనాత్మక విశ్లేషణ లోపించింది. ఒక స్థాయిలో ఉన్న ఐ.ఐ.టియన్లుని పరిశోధించినప్పుడు, అదే స్థాయిలో ఉన్న మిగతా ఉద్యోగులు, అధికారులు ఎటువంటి విద్యాసంస్థలైంచ్ వచ్చారు, వారి నిష్పత్తి ఏమిటి అనేవి కూడా చూడాల్సి ఉంటుంది.
ఆలోచింపజేసే టపా!!

నేను ఏడెనిమిది తరగతుల్లో ఉన్నప్పుడు మా బంధువులబ్బాయి ఒకతనికి IIT Delhi లో సీట్ వచ్చిందని మా ఇంట్లో అతన్ని తెగ పొగిడేవాళ్ళు.. అతను ఇంకా కాలేజ్ లో చేరకముందు ఒకసారి మా ఇంటికి వస్తే నేను "అదేంటన్నయ్యా, మన ఊళ్ళోనే కె.ఎల్.సి.యి (కోనేరు లక్ష్మయ్య) లోనో సిద్ధార్ధ లోనే చేరక ఇంటికి దూరంగా ఎక్కడో ఢిల్లీ లో ఎందుకు చేరుతున్నావ్!?" అని అడిగా.. పైన మీరన్నట్లే ఎర్రగడ్డ కాండిడేట్ ని చూసినట్లు చూసి "ఆ కాలేజీల్లో చదివేదీ ఇంజనీరింగేనా!" అని నిరసనగా అనేశాడు!! నా చొప్పదంటు సందేహం విన్న మా వాళ్ళకి కంగారు పుట్టి, కొన్నాళ్ళు వదలకుండా 'IIT చదువు, దాని మహిమ ' గురించి స్పెషల్ క్లాస్ లు తీసుకున్నారు, అది వేరే సంగతి!

IITలు, వాటిక్కాస్త కింద స్థాయి అయిన RECలలో విద్యాబోధన చాలా ఉన్నత ప్రమాణాలలో ఉంటుందని కాస్త తెలివి గలవాడు/గలది అని పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ వాటిల్లో చేరడానికి ప్రయత్నించేవారు.. వాటిల్లో సీట్ వస్తే చాలు జీవితకాలం మొత్తం రెడ్ కార్పెటే (చదువుతుండగానే ఉగ్యోగాలు, అదీ జీతం పెద్ద పెద్ద అంకెల్లో ఉన్నవి) అన్న ఆశాభావం పేరెంట్స్ ది.. పైగా the best in the crowd అనిపించుకోవడం ఎవరికిష్టం ఉండదు!?

ఎవరైనా మ్యాథ్స్ స్టూడెంట్ ని నీ గోల్ ఏంటి? అని ప్రశ్నిస్తే ఎక్కువశాతం IIT లో సీటు సంపాదించడం అనే చెప్తారు.. కానీ ఆ తర్వాత కూడా అంతే ఉన్నతమైన గోల్స్ నిర్ణయించుకోవడంలో విఫలమవుతున్నారేమో అనిపిస్తింది..

అయినా ఎల్.కె.జి చదువులే వ్యాపారం అయిపోయిన రోజులు.. IIT చదువుల గురించేం మాట్లాడగలం!
రవి said…
మీరు ఐ.ఐ.టీ ప్రముఖులంటే నాకు గుర్తొచ్చింది, నారాయణ మూర్తి (ఇన్ ఫోసిస్), నందన్ నీలేకని, ఫణి అన్న పేరుతో ఒకాయన, ఇంకా చేతన్ భగత్, ఒకానొక బ్లాగ్రాజు గారు, కైనెటిక్ సంస్థ అధినేత....ఇంకా అనేక మంది మనకు తెలీకుండా మన చుట్టుపక్కలే ఉన్నారుగా.
Anil Dasari said…
ఎక్కడో చదివాను .. ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వాళ్లలో అత్యధికులు హైస్కూల్ డ్రాపవుట్స్. పెద్ద చదువులు చదివినోళ్లలో అధికులు మహా ఐతే ఇటువంటి డ్రాపవుట్స్ పెట్టిన సంస్థల్లో సిఇఓలుగా పనిచేస్తూ బ్రతికేస్తున్నారట. So, ఐఐటీలే కాదు, అన్ని రకాల చదువులోళ్ల పనీ ఇంతే.
GKK said…
అన్నా! మీరు మంచివిషయం వ్రాశారు. వయసు పైబడే కొద్దీ కుర్రతనంలో గొప్పగా అనిపించినవన్నీ అవివేకంగా అనిపిస్తున్నాయి నాకు. (IIT లో సీటు, అమెరికా చదువు / ఉద్యోగం, మంచి జీవన ప్రమాణాలు etc)ఇవన్నీ గొప్పవే కానీ. short of that ఏదైన ok. ఇవన్నీ ఇచ్చే తృప్తి కంటే చిన్నతనంలో నేర్చుకో(లే)ని చందస్సు, సంస్కృతం, సంగీతం విషయాలు తెలుసుకుంటుంటే కలిగే ఆనందం గొప్పదిగా తోస్తోంది. IIT తప్పకుండా గొప్పదే అయిఉంటుంది. కానీ reasonably comfortable middle class life ఇచ్చే ఏ చదువైనా చాలు అనిపిస్తుంది. మన పిల్లలను IIT అని హింస పెట్టకుండా ఉంటే చాలు అనిపిస్తుంది.
Indian Minerva said…
నాక్కనిపించినవి ఇవీ...

1) కానీ ఆ ఆత్మ విశ్వాసం మిగతావారిలో(అత్యధికుల్లో) కనబడదు. బహుశా best అని brand
చేయబడడం వల్ల వచ్చినది గావచ్చు. సమస్య సాధనలో వీళ్ళ ధ్రుక్కోణం కూడా కొంచెం భిన్నంగా వుంటుంది.

2) కంపెనీల్లొ వీళ్ళ ఎదుగుదల చాలా వేగవంతంగా ఉంటుంది. కానీ వీళ్ళ course కీ ఇక్కడి jon కీ సంబంధం ఉండదు అది వేరేవిషయం. నా frend ఒకడు ఐఐటి లో aeronautical engineering చేసి ఒక software company లో financial domain లొ job చేస్తుంటే నాకు వాడికంటే నేనే better అనిపించింది.

3) దేశానికో సమాజానికో ఉపయోగపడడమంటారా "ఐఐటిలు మంచి cheap and effective slaves ని తయారుచేయడం తప్ప innovatives కాదు" అని చెప్పిన చేతన్ భగత్ ని సమర్ధిస్తాను.
సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్సు వారి నినాదం "Hire for Attitude, Train for Skill"

ఎక్కడ చదివినా (నిజానికి చదువుకున్నా, చదువుకోకపోయినా) సరైన దృక్పధం అనేది మనిషి జయాపజయాలని నిర్దేశిస్తుంది అని నమ్ముతాను నేను. నారాయణమూర్తి, నీలేకణి వీళ్ళ వ్యక్తిగత విజయాలకి వీరి IIT చదువు "మాత్రమే" కారణమా? లేక వీరికి వీరు నిర్దేశించుకున్న విలువలు, వ్యాపార కిటుకులు కారణమా? రెండొదే నిజం అనుకుంటున్నాను నేను. వారికి ఆ విలువల్ని ఏ IIT లోను నేర్పరు. వారికి వారు తెలుసుకోవాల్సిందే.

IIT చదువు అనేది కొద్దిపాటి గుర్తింపు నివ్వొచ్చు, అపారమైన అవకాశాలను ముంగిట నిలపొచ్చు, But అంతకుమించి ముందుకెళ్ళాలంటే ఎక్కడ చదివాము అనేదానికంటే, వారి వారి attitude మీదే ఆధారపడిఉంటుంది,
కొత్తపాళీ గారు,

అదే స్థాయిలో ఉన్న ఇతర ఉద్యోగు ఎక్కడినుండి వచ్చారో తెలుసుకోవడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదని నా అభిప్రాయం. IIT లలో సీట్లు బాగా పెరిగిన ఈరోజుల్లో కూడా కేవలం 1-2% మంది విద్యార్ధులు మాత్రమే IIT లలో చదవగలుగుతున్నారు. ఇక పాతరోజుల్లో ఉన్న సీట్లను లెక్కలోకి తీసుకొంటే ఈ శాతం ఇంకా తక్కువ ఉంటుంది. మొత్తం ఉన్న ఐ.ఐ.టియన్లే అంత తక్కువ ఉన్నప్పుడు ఒకే స్థాయిలో ఎక్కువ మంది ఐ.ఐ.టియన్లు ఉండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది.

--
ఐ.ఐ.టియన్ల కంట్రిబ్యూషన్ గూర్చి మరో లింకు..
http://news.bbc.co.uk/2/hi/south_asia/3231561.stm
ఇది వర్తమానానికీ,ఇంకా భవిష్యభారతదేశ ఉన్నతవిద్య,తత్సంబంధిత వ్యయం,ఉత్పాదకత,అంచనాలు,ఇలా అసంఖ్యాకమైన ప్రశ్నలను లేవనెత్తే అంశం ఇది.ఐఐటీలు అన్న వాటిమీద భారతీయభాషల్లో చర్చ దాదాపు శూన్యం.మీరు బ్లాగుల్లో నన్నా ప్రస్తావించటం ముదావహం.
దేశం లోని మామూలువిశ్వవిద్యాలయాలకన్నా,కేంద్రీయవిశ్వవిద్యాలయాలు,ప్రభుత్వ నిర్వహణలోని ఇంజనీరింగ్ కళాశాలల కన్నా ఆర్ ఈసీలకు,వీటన్నిటికన్నా ఐఐ టీలకు నిధులు,ప్రాజక్టులు,ఇతరత్రా ప్రభుత్వ,ప్రభుత్వేతర మద్దతు అధికం.మరి మీరడిగనట్లుగా ఇన్నివందలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నందుకు గాను దేశాభ్యుదయానికి ఈ విద్యాసంస్థల వంతు వాటా ఎంత అంటే నిక్కచ్చిగా చెప్పగలిగే గణాంకాల సంగతి అటుంచి,ప్రాధమిక సమాచారం అందే సదుపాయం కూడా అంతంతమాత్రమని చెప్పకతప్పదు.
అర్ధశతాబ్దం క్రితమే శాస్త్రసాంకేతిక రంగాలలో అనూహ్యమైన పరిశోధనలు,ఆవిష్కరణలతో ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రపంచప్రఖ్యాతి గాంచింది.అంతకు కాస్త ముందు నుంచే ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ,ఆంగ్ల విభాగాలలో విఖ్యాతమైంది.తర్వాత వచ్చిన కొన్ని విద్యాసంస్థల ముందు ఇవ్వాళ ఈ రెండూ ఎలా ఉన్నాయో చూసారుగా.
ఐఐటీయన్లు వ్యక్తిగతంగా,వృత్తిపరంగా అసాధారణ విజయాలు సాధించి ఉండొచ్చుకానీ,అదే నిష్పత్తిలోనో లేదా అంతకన్నా అధికశాతములోనో ప్రాధమిక,ఉన్నతపాఠశాల చదువులున్నవారూ ఉన్నారన్న నిజం మర్చిపోకూడదు.
ఒక మోస్తరు పట్టణాలలో ఉండే కొన్ని డిగ్రీకళాశాలల కన్నా కనాకష్టంగా,నికృష్టంగా కుల.మత,భాషా,ప్రాంతీయ విభేదాలు,రాజకీయాలకు కొన్నిఐఐటీలు,ఐఐయమ్ లూ మినహాయింపులు కాకపోవటం అతిదారుణం.
ఐఐటీలు,ఐఐయం ల నుంచి దేశానికి ఇప్పటివరకూ కనీసం,పాక్షికంగా నైనా లబ్ది కలగలేదని నాఅభిప్రాయం.
మంచి వ్యాఖ్యలొస్తున్నాయి. తమతమ ఆలోచనల్ని పంచుకుంటున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.
మీ వ్యాఖ్యలు చదివినాక నా ఆలోచనల్లోనే ఇంకొంచెం స్పష్టత వస్తోంది. తత్ఫలితంగా ఈ కొత్త ఆలోచనని మీ ముందుంచుతున్నాను.
ఐఐటిల సమర్ధతని రెండు రకాలుగా కొలవ్వచ్చు. ఒకటి .. ఐఐటిల స్నాతకుల వల్ల దేశానికి ఏం మేలు జరిగింది అని. అంటే దేశాన్ని ఒక వ్యాపారం అనుకుంటే, ఆ వ్యాపారం ఐఐటిలమీద పెట్టిన పెట్టుబడికి తగిన లాభం దానికి చేకూరిందా అని. పైన రెండో వ్యాఖ్యలో వెంకటరమణ ఇంచ్చిన లంకె తగిన లాభం చేకూరిందనే చెబుతోంది.
రెండు .. ఐఐటిల స్నాతకులు తాము ఎంచుకున్న పథాల్లో వ్యక్తిగతంగా నాయకులుగా, సృజనాత్మక వ్యక్తులుగా, క్రాంత దర్శులుగా, మార్గదర్శకులుగా ఎదిగారా, ఎదుగుతున్నారా అని. (ఇక్కడ సమాజానికీ దేశానికీ మేలు జరగడం రెండో అంశం, మౌలికం కాదు) నాకెక్కువ నిరాశ కలిగిస్తున్న అంశం ఇది.
ఇంకా మౌలికమైన ప్రశ్న, ఒక నాగరిక సమాజంగా మనం (ప్రభుత్వం ఒకటే కాదు, మనందరం) అత్యుత్తమస్థాయికి పెద్దపీట వెయ్యకపోగా, దానికి బద్ధ వ్యతిరేకమైన గంగిరెద్దు మనస్తత్వాన్ని ఆరాధిస్తున్నామా అని.
@రాజేంద్ర గారితో నేను ఏకీభవిస్తున్నా. ఇదో ప్రిష్టేజీ ఇస్స్యూ అందరికీ. చదువయ్యాక ఎగిరిపోవడమే IIT జనాలు అమెరికాకి. ఇక వీళ్లు ఎంతవరకు ఉపయోగపడుతున్నారు దేశానికి? వీళ్లే కాదు, మనలో ఎంతమంది ఉప్యోగపడుతున్నారు? ఇవ్వాల్టి ఎకానమీ స్లోడౌన్ ఓ 5 సమచ్చరాలు నడిస్తే మన పరీస్తితి ఏంటి? ఇక్కడ మా ఆఫీస్కి ముందు ఓ పెద్ద కళాశల ఉంది దానిపేరు RPI. అమెరికాలోనే పేరుగడించిన కళాశాల. ఇక్కడి జనాలెవ్వరూ అబ్బో ఆహా ఓహో అనుకోవటం నేను విన్ల. ఏ కళాశలలో చదివావు? నిజంగా అది matters. కాని, మిగతవాటికీ విలువ ఇవ్వాలి, వాటిని వృద్ధి చెయ్యాలి. IITians కి మిగతవాళ్లు అంటే చులకనాభావం పోవాలి.
కొత్తపాళీ గారన్నట్టు అమెరికాలో పనిజెయ్యటానికి అనకాపల్లిలో చదివినా ఒక్కటే, గోవిందపురంలో చదివినా ఒక్కటే. అస్సలు నా Certificate ని ఇంతవరకూ ఎవ్వడూ అడగలేదు. కాబట్టి ఇక్కడ ఎవ్వడైనా ఒక్కటే.
Vamsi Krishna said…
I would have appreciated, though I would not buy ur ideas, if you did a little bit of research to extract facts.... when u cant see...does not mean it doesnt exist....

just this wikipage would be more than enough to see the impact and diversity...
http://en.wikipedia.org/wiki/List_of_Indian_Institutes_of_Technology_alumni
Vamsi Krishna said…
btw, though i hate the things you wrote...it gave me a reason to investigate in terms of numbers....

check this link.....
http://www.pluggd.in/technology/iit-alumni-impact-study-2008-3320/
Naga Pochiraju said…
మా పెదనాన్న గారు btech ఒక iitలో , mtech ఇంకో లో iit చదివారు
మరి సాధించింది అంటే నాకేమీ గొప్పగా కనిపించదు
మా ఇంట్లో 'అదృష్టం' అని తోసేస్తారు
కానీ నేను మాత్రం iit లొ చదివినంత మాత్రానే దేశానికి ఏదో చేస్తారని అనుకోను
అందరూ అన్నట్టు మిగితా కళాశాలలో పోలిస్తే మెరుగైన విద్య ఉంటుందేమో కానీ, అది లభించిన వారంతా ఏదో చేస్తారని కాదు
@వంశీ కృష్ణ గారు: If we prepare a list of non-IITians achievements, wiki is not enough to host it.

I do respest IITs and IITians, but, మన దేశానికి గర్వ కారణం అనే ఒక్క product చూపించండి, otherthan IT. No, including IT too.

Lets compare IIT produce vs. MIT produce.
How MIT helped US to build its infrastructure and How IITs helped India in building infrastructure?

I agree that, IITians have proved their capabilities, but, we need more, and much more.

Thanks
Bhaskar
మేధ said…
ఐఐటి లు గొప్పవి అంటూ ఈ మధ్య చేసే ప్రాపకాండ కి, అసలు అక్కడ ఉండే విషయానికి ఏ మాత్రం సంబంధం లేదేమో అని నా అభిప్రాయం.. ఈ మధ్య కాలం లో(ముఖ్యంగా మన రాష్ట్రంలో) ఐఐటి అంటే బంగారు గుడ్లు పెట్టే బాపతు.. అక్కడ చదివి, అమెరికా కి వెళ్ళి డాలర్ల పంట పండించడం తప్ప మనవాళ్ళు ఇంకేమీ ఆలోచించడం లేదు.. అందుకే పిల్లలకి కూడా అదే నూరిపోస్తున్నారు.. దాని ఫలితమే ఇప్పుడు ఒకటో క్లాసు నుండి కూడా ఐఐటి కోచింగ్...

ఇక విజ్ఞాన పరంగా చూస్తే, ఇతర కాలేజీల తో పోలిస్తే అక్కడ ఉండే ప్రమాణాలు కొంచె పై స్థాయి లో ఉంటాయి.. మామూలు కాలేజీలలో ప్రాక్టికల్స్ చేయడానికి కూడా ఉండవు, అదే అక్కడ కావలసినవన్నీ అందుబాటులో ఉంటాయి.. దాని వల్ల నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇంకొంచెం ప్రేరణ, ప్రోత్సాహం లభిస్తాయి.. అదీ కాక, అక్కడ ఉండే అధ్యాపకులు, రియల్-టైం ఎక్స్పీరియన్స్ కలిగి ఉండడంతో, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి లాంటివన్నీ ఇంకొంచెం బాగా తెలియడానికి ఉపయోగపడుతుంది..

అయితే, సాధించాలి అనుకునేవాళ్ళు ఎక్కడ చదివినా కూడా వాళ్ళు అనుకున్న గోల్ చేరుకుంటారు.. అయితే ఆ ప్రయత్నంలో, ఐఐటి లాంటివి తక్కువ శ్రమతో ఎక్కువ తోడ్పాటు ఇస్తాయి..

ఐఐటి, మామూలు కాలేజీలు వదిలెయ్యండి.. ఆ మాటకి వస్తే, ఒక చిన్న కాలేజీ కి, యూనివర్సిటీ కి ఎప్పుడూ తేడా ఉంటుంది.. యూనివర్సిటీలో ఉన్నంత స్కోప్(చదువు పరంగా, జీవితం పరంగా) కాలేజీలో ఉండదు.. ఐఐటి లు కూడా యూనివర్సిటీలో ఇంకొంచెం ఎక్కువ స్థాయి..
కొత్తపాళీ గారూ..
మంచి విషయం మీద చక్కటి వ్యాసం రాసి.. అంతే చక్కటి అభిప్రాయాలకి ఆస్కారం కలిపించారు.
మీకు అభినందనలు.

IIT ల్లో సీట్లు వచ్చినంత మాత్రాన వారొక్కరే మేధావులు అని కాదు కదా.. ఆ టైం లో ఆ పరీక్షలకి.. ఆయా కాలేజీల్లో రుబ్బుడుని బట్టి.. ఆ అవకాశం ఉంది. భవిష్యత్తులో ఎవరెవరు ఏమవుతారనేది.. ఇంటర్ అయ్యాక డిగ్రీ, ఇంజనీరింగ్.. రోజుల్లో వారి ఆలోచనలు, విజ్ఞానం, ప్లానింగు.. ఇలా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ, IIT ల్లాంటి సంస్థల్లో మౌలిక సదుపాయాలు, ఎక్కువ విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది మిగతా వారి కంటే..

కానీ.. IIT ల్లో చదివి కూడా.. సరైన స్థాయిలో లేని వాళ్ళు చాలామందే ఉంటారు. దానికి కారణాలు ఎన్నో ఉండచ్చు. అలాగే.. చిన్న చిన్న పల్లెటూరుల్లో, పట్టణాల్లో చదివి గొప్ప స్థాయికి వచ్చినవారు కూడా ఉంటారు. కాబట్టి.. అది చాలావరకు వ్యక్తి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

కానీ.. నిజంగా ఉపయోగించుకోగలిగిన వాళ్లకి IIT ల్లాంటివి మిగతా సంస్థల కంటే.. ఖచ్చితంగా మెరుగైన శిక్షణనీ, విజ్ఞానాన్ని అందిస్తాయి.

కానీ.. బాధపెట్టే విషయం ఏంటంటే.. ఇంటర్ అయిపోగానే.. IIT ల్లో ఇంజనీరింగు చదివితేనే.. చదివినట్టనో.. లేకపోతే.. అక్కడ చదివితే.. వెంటనే.. ఏ అమెరికానో వెళ్ళవచ్చనో , లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే అనో.. మిగతా వాళ్లందరూ వేస్ట్ అనో.. అభిప్రాయం ఇప్పటి పిల్లలకు వచ్చేస్తుంది. దీనికి కారణం.. కార్పోరేట్ విద్యా సంస్థలు, తల్లిదండ్రులు, సమాజం IITలకు మరీ అతిగా పబ్లిసిటీని ఇవ్వడమే..

దేన్నైనా అతిగా చేయకూడదు కదా.. మనం మాత్రం ఆ పనే ఎక్కువగా చేస్తుంటాం.. లేకపోతే.. నాలుగో తరగతి నుంచి IIT కోచింగ్ ఏంటో.. మరీ విడ్డూరం కాకపోతే..!!
durgeswara said…
ఇక్కడ అప్రస్తుతమ్ కావచ్చు

కానీ మీ ఇమెయిల్ లేక వ్రాస్తున్నాను ఇక్కడ


కొత్తపాళి గారూ [ఈరోజు ఆంధ్ర జ్యోతి లో మీ బ్లాగ్ ను గురించి చదివి] మీ బహుముఖ ప్రజ్ఞకు అభినందనలు ,స్వీకరించండి.
వంశీకృష్ణ గారు సూచించిన మీదట ఐఐటీల గూళ్ళలో వారి వారి మిషన్‌ స్టేట్మెంటులు చదివాను. వాటి దృష్ట్యా చూస్తే, తమకి తాము విధించుకున్న ముఖ్య కార్యక్రమం, ఉత్తమస్థాయి సాంకేతిక విద్య నేర్పించడం అనే. ఆ పరిధిలోనే చూస్తే, అవి సమర్ధవంతంగా పని చేస్తున్నట్టే. అంతకంటే ఎక్కువ ఆశించడంలో మనమే పొరబడుతున్నాము కావచ్చు. కానీ ఎక్కడో ఏదో లోటుగా అనిపిస్తోంది.
అన్నట్టు ఐఐటీ ఆచార్యులైన మా అన్నగారు కూడా ఈ టపా చదివానని చెప్పారు. ఆయనకూడ తన అభిప్రాయం చెబుతారేమో చూద్దాం.
దుర్గేశ్వర గారూ, ధన్యవాదాలు.
KumarN said…
Pali gaaru,

Hearty congratulations on the occassion of Andhra Jyothy coverage.

This should have happened long time ago, in my view. Why don't you send some stories to AJ Sunday edition?

Thanks
Kumar
Sri Vallabha said…
I have followed the blog and all the comments. Here are a few things I wanted to say.

1. As some one rightly pointed out,the main purpose of IITs is to provide good technical education and they have succeeded fairly well in doing that.

If some one did aeronautical engineering @IIT and went ahead to work on financial analytics at a software company, it is his personal choice. There are scores of IITians who do technical research and lead the world in advancing the frontiers of science and technology. You can find scores of IITians when you search technical publications. Of course, not all of them work in India, but still, science ki haddulunnayaa? Vasudhaika Kutumbam analedaa peddalu?

2. Not all IITians fly to the US. Infact, only a minority of around 10% to 20% of the students who graduate each year move to the US. Thinking that way, are no people from Andhra University or Osmania University going to the US? Aren't their colleges funded by government money?

3. About IITians giving back to the society. Some one said "IIT lo chadivinantha maatrana desaaniki edo chestarani nenu anukonu". Desaniki yedo okati cheyyadaaniki IIT lo ne chadavaala? Adi yevaraina cheyyochhcu. Laksha mandi janaabhaalo maha aithe oka padi mandi IITians untaaru. Ee padi mandi emi cheyyadam ledu ani baadhapadekanna migathaa 99,990 mandi yedo okati cheyyochu kada? Vaarilo entha mandi chestunnaru? {That does not mean IITians dont work for the society, Golden Quadrilateral project lo avineethi ni bayatapetti champabadda Satyendranath Dubey yevaru? And that is just one example.}

4. If you feel that IITs are getting hyped too much, blame the media. IITs never go about advertising for themselves, its the sensationalist media that attaches unwanted importance to even small things at IITs. Stop watching such channels and dont trouble your kids with IIT coaching right from LKG.

5. IITs being ridden with caste and religious issues! Ye IIT lo alaa undo Devarakonda Rajendra Prasad gaaru teliyajeste baagundedi.[Panilopanigaa mana Andhra lo, specific gaa cheppalante Krishna Guntur jillala engineering colleges lo paristhiti oka saari choodagalaru.] As far as I know (and I was there at IIT Madras for four years) the only differentiation between people at IITs is their desire and willingness to prove themselves or to give up and take life as it comes.

6. IITians don't look down upon other people. If some one really feels so, he/she must have seen a skewed sample of IITians.


One final thing I wanted to say. IITs, apart from the good techincal education, provide a good environment where the best brains meet. It is an intellectually stimulating environment, which also provides opportunities to build up confidence in oneself.It may be partially due to the branding but I owe it more to the kind of environment one lives in.
రాఘవ said…
ఐఐటీలు మన దేశ ఆర్థిక సామాజిక పురోభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడం కోసం స్థాపించబడ్డాయి. ఎలా అందించాలి? చదువుకునేవారికి చక్కటి సాంకేతిక విద్యని అందించడం ద్వారా, అక్కడి ప్రొఫెసర్లతో పరిశ్రమలకి సంబంధాలు నెలకొల్పడం ద్వారా. ఈ రెండు విషయాలలోనూ ఐఐటీలు వాటి పని అవి సక్రమంగా చక్కగా నిర్వర్తిస్తున్నాయి. అంటే అక్కడి ప్రొఫెసర్లు వాళ్ల పని వాళ్లు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు అని.

ఇక ఐఐటీలలో చదువుకునేవారి గురించి. చక్కగా చదువుకోవడానికి తగినన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ఐఐటీలలో చదువుకోవాలి అన్న ఆకాంక్షని విద్యార్థుల్లో ఐఐటీలే కలిగిస్తున్నాయి. చక్కగా చదువుకుంటే మంచి ఉద్యోగంలో స్థిరపడచ్చు అనే ఎవరైనా ఆలోచించేది. సరే, ఇంతకీ చదివినవాళ్లు ఏం చేస్తున్నారు? ఇక్కడ చదివే కోర్సును బట్టి వ్యత్యాసం ఉంటుంది.

బ్యాచిలర్సు కోర్సులు చదివేవారు—
(1) కొందరు పైచదువులకని విదేశాలకి వెళ్తారు. వీరిలో కొందరు చదువు తరువాత విదేశాలలో స్థిరపడతారు. కొందరు తిరిగి భారతదేశానికి తిరిగివస్తారు. ఈ విదేశాలలో స్థిరపడడం మూడు రకాలు: అక్కడి పరిశ్రమలలో ఉద్యోగం చెయ్యడం, అక్కడి విశ్వవిద్యాలయాలలో బోధించడం, అక్కడ పరిశ్రమలని స్థాపించడం. వీళ్లలో బోధనలో ఉన్నవాళ్లవలన, పరిశ్రమలు స్థాపించినవారివలన మన దేశానికే పేరు. వీళ్లలో పరిశ్రమలు స్థాపించినవారి వల్ల భారతదేశంలో చాలామందికి ఉద్యోగావకాశాలు కూడ కలుగుతున్నాయి. ఇక ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నవారిలో కూడ చాలా మంది కొంత కాలం తర్వాత స్వంత పరిశ్రమలు స్థాపించడమో లేదా తిరిగి భారతదేశానికి రావడమో చేస్తున్నారు.
(2) కొందరు ఇతర భారతీయవిద్యాసంస్థలలో ఉన్నత విద్యలని అభ్యసిస్తారు. అంటే ఏ ఐఐఎస్సీ ఐఐయెం లలోనో చదివి తరువాత ఉద్యోగాలలో స్థిరపడతారు.
(3) కొందరు ఉద్యోగాలలో స్థిరపడతారు.
(4) కొందరు సంఘసేవ చేసే గుంపులలో చేరుతారు.
ఇక్కడ ఉద్యోగాలగురించి గమనించవలసిన ఒక ముఖ్య విషయం. ఉదాహరణకి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ లేదా బయోటెక్నాలజీ ఇంజినీరింగ్ చదివినవాళ్లకి మన దేశంలో ప్రస్తుతం తగిన ఉద్యోగాలు లేక, ప్లేస్మెంట్లకి వాళ్లు చదివిన చదువుకి సరిపడే ఉద్యోగాలిచ్చేవారు ఎవరూ రాక, వాళ్లు సాఫ్ట్వేరో మరోటో... ఉద్యోగంలో చేరిపోతారు. దానికి చదువుకున్నవాళ్ల బాధ్యత ఎంత ఉంది?

మాస్టర్సు కోర్సులు చదివేవారు—
(1) కొందరు రీసెర్చికోసం విదేశాలకో లేదా ఇతర భారతీయ విద్యాసంస్థలకో వెళ్తారు
(2) కొందరు ఉద్యోగాలలో స్థిరపడతారు
(3) కొందరు సంఘసేవక గుంపులలో చేరుతారు.

రీసెర్చి చేసేవారు—
(1) కొందరు ఉద్యోగాలలో స్థిరపడతారు. అది తిరిగి ఐఐటీలలో బోధించడం కూడ కావచ్చు.
(2) కొందరు సంఘసేవక గుంపులలో చేరుతారు.

ఇక దేశానికి ఐఐటీలలో చదివినవారివల్ల కలిగే లాభం పైన చెప్పినట్టు వారు చేసే పనులమీద ఆధారపడి ఉంటుంది. ఆయా పరిశ్రమలకి దోహదం చేయడం ద్వారా చాలామంది దేశానికి ఉపయోగపడుతూనే ఉన్నారు. సంఘసేవకులూ ఉన్నారు. వ్యాపారాత్మకంగా ఆలోచించినా కూడ ప్రత్యక్షంగా కనబడకపోయినా ఐఐటీలవల్ల వాటిలో చదివినవారివల్ల దేశానికి మంచే జరిగింది.

ఐఐటీలో చదివినవాళ్లకి అలా చదవడం వల్ల ఒరిగిన లాభమేమిటి? ఐఐటీలలో చదవనివారి దృక్కోణం నుంచి చూస్తే ఏమీ కనబడకపోవచ్చును కానీ, అక్కడ విద్యాభ్యాసం చేసినవారికి మాత్రం వారు చాలా విషయాలు (చదువు మాత్రమే కాదు) నేర్చుకున్నారన్న భావన కలుగుతుంది. కారణం అక్కడి వాతావరణం, అక్కడ జరిగే వివిధ కార్యక్రమాలూ, చర్చలూను. హాస్టళ్లలో విద్యార్థులమధ్య జరిగే చర్చలూ, క్లాసులలో విద్యార్థులమధ్య జరిగే చర్చలూ, ప్రొఫెసర్లకీ విద్యార్థులకీ మధ్య జరిగే విద్యాపరం కాని లేదా దేశానికి సంబంధించిన చర్చలూ, సాంకేతికవిద్యా ప్రసంగాలూ, సాంకేతికవిద్యేతర ప్రసంగాలూ, ఇలా అనేకం దోహదం చేస్తాయి. ఇక వ్యక్తిగతంగా నాయకులుగా ఎదిగారా అంటే రాజకీయనాయకులు లేకపోవచ్చుగానీ వారివారి పరిధులలో మార్గదర్శకులూ నాయకులూ ఐనవారు చాలామందే ఉన్నారు. వాటికి సంబంధించి ముందు వ్యాఖ్యానించినవారు ఇప్పటికే చాల లంకెలు ఇచ్చారు కూడా. ఇక సృజనాత్మకత అన్నది పరిస్థితులనిబట్టీ అవసరాన్నిబట్టీ బయటపడుతుంది.

మనం ఎందుకు అంత గౌరవిస్తున్నాము/ఎందుకు ఈ మూస ధోరణి? బాగా చదువుకున్నారన్న గౌరవం మొదటి కారణం. రెండు బాగా చదువుకుని చక్కగా ఉద్యోగం చేసుకుంటూ మంచి జీతం సంపాదిస్తుండడం రెండవ కారణం. మూడు చదువుకోవడం వల్ల వారికి వచ్చిన నమ్మకం. ఒకసారి గౌరవించడం ప్రారంభమయ్యాక ఇక గొర్రెల్లా వెనకబడడం దీనికి ఇంకో కోణం.

ఇక మన ప్రభుత్వం అంటారూ అది ఐఐటీలని ఎంత సమర్ధిస్తోందో అంతే విమర్శిస్తుంది కూడా. ఉదాహరణకి మురళీమనోహర్ జోషీ కాలంలో రీసెర్చి అనుకున్నదానికన్నా తక్కువగా జరుగుతోందేమని ఐఐటీలపై అక్షతలు పడ్డాయి. తత్ఫలితంగా గ్రాంటులూ అనుకున్నంత అందలేదు.

మరో విషయం. ఐఐటీలలో చదివి తరువాత ఐఏఎస్ లేదా ఎంబీయే చేసేవాళ్లగురించి. వాళ్లు తమ ఐఐటీ చదువుని చక్కగా వాడుకుంటూనే ఉంటారు వాళ్ల వాళ్ల విధులు నిర్వర్తించడానికి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలా ఎంబీయే లేదా ఐఏఎస్ చదివి దేశాన్ని ఉద్ధరించాలన్న ఆలోచనలు ముందు చెప్పినట్టుగా జరిగే చర్చలవల్ల పుట్టిన ఆలోచనల ఫలితాలు. ఈ చర్చల మూలాననే కొందరు ఉద్యోగాలన్నీ వదిలేసి చక్కగా సంఘసేవలో దిగిపోతారు కూడ.

ఎంత గొప్పజాతి విత్తనమైనా సరైన పరిస్థితులు కొరవడితే పంట తక్కువే వస్తుంది.
@కొత్తపాళీగారూ: ఆంధ్రజ్యోతి కలం లో కొత్తపాళీ. అభినందనలు.

@ఇ.ఇ.టి ల గురించి:
పైనఎవరో చెప్పినట్టు, ఇ.ఇ.టి. లో ఉండే వాతావరణమే (for undergrads) గొప్పది. Some of the best brains meet(దీని ఉద్దేశ్యం మిగతావాళ్ళు చేతకాని వాళ్ళు అని కాదు). For post-grad education, they are just mediocre. US లో పేరులేని విశ్వవిద్యాలయమైనా ఇ.ఇ.టి. ల కన్నా బానే ఉండొచ్చు.
సమతలం said…
మన విద్య వ్యవస్థ అసౌష్టవంగా తయారైనది.
ఇంజనీరింగ్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా వాటికి ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
పిల్లల కారీరు పెద్దలు నిర్దేశిస్తున్నారు.వారిని వారి ఇష్టాలకు వదలడం లేదు.
ఐ.ఐ.టి. లోకి వెళ్ళేవారు అందరు ఇంజనీరింగ్/సైన్స్ అంటె చాలా ఇష్టం ఉండి చేరినవారు కారు.అందులోకి నెట్టబడిన వారే.


best minds వాళ్ళ ఇష్టాల వద్దా మత్రమె best గా పని చేస్తాయి. ఎవరు ఎక్కడకు పోవాలొ అక్కడకు పోనిస్తెనె మంచి ఫలితాలు ఉంటాయి.
ఇక మన ఐ.ఐ.టి. లు మన గ్రామీణ భారతం పరిగణ లోకి తీసుకున్నట్లు లేవు. పాశ్చ్యాత్య కాపినె. మన ముద్ర లేదు.
@Vinay Chakravarthi Gogineni .. తెంగ్లీషులో ఉన్న కారణంగా మీ వ్యాఖ్యని ప్రచురించడంలేదు. దయచేసి తెలుగులో రాయండి.
Anonymous said…
ఐ ఐ టి ల పై చర్చని ఈ రోజే చూశాను. నిజంగా అక్కడ చదివినవాళ్ళు కొమ్ములున్న వాళ్ళేనా అంటే అది బ్లాక్ అండ్ వైట్లో చెప్పడం కష్టం.ఐ ఐ టి లో చదివినంతమాత్రాన ఆటోమటిగ్గా గొప్పవాళ్ళనుకోడం కూడా ఎలాగా భ్రమే! శాస్త్రం చెప్పినట్టు గుర్రన్ని నీళ్ళదగ్గరకి తీసుకెళ్ళినంతమాత్రాన తాగించినట్టుకాదు. ఒక విషయం మాత్రం ఒప్పుకోక యెవరికైనా తప్పదు. ఎంట్రన్స్ పరీక్ష గట్టెక్కడం నించి, సెమెస్టరూ మిగిలిన పరీక్షలూ వైవాలూ ప్రాజెక్టులూ ఇత్యాదులలో భయంకరమైన పోటీ తత్వం జీవితంలో ఒక భాగమవుతుంది. అందులో నెగ్గాక వదిలిపోయిందనులునేవాళ్ళూ ఉంటారు, మరోపోఅరాటానికి రెడీ అయ్యే వాళ్ళూ వుంటారు. జీవితంలో మిగతావాటిలాగానే.
చాలా బాగుందండీ చర్చ... ఈ లంకె నాకు పరిచయం చేసినందుకు కృతజ్ఞురాలిని. మా కజిన్లలో కనీసం అరడజను మంది ఐఐటీల్లో సీట్లు సంపాదించి మా అందరికీ.. దాంట్లో సీటు దొరకకపోయిన వాళ్ళ బ్రతుకు శుద్ధ దండగ అన్న అభిప్రాయాన్ని నూరి పోసారు అప్పట్లో.. మేము సెకండరీ శ్రేణికి చెందిన వాళ్ళమన్నట్టు అయిపోయింది ఆరోజుల్లో.

సాఫ్ట్ వేర్ పుణ్యమా అని ఆ గాప్ ని తగ్గాక ఇప్పుడు అంతగా ఎవరూ కేర్ చేయట్లేదు కానీ.. చాలా కాలం.. మా బంధువర్గం లో వాళ్ళు ఏ పెళ్ళికి వచ్చినా ఆ షానే వేరు.

ధన్యవాదాలతో,
కృష్ణప్రియ
Nice Post & Good Discussion.
Still, I feel that more discussion is needed.
DG said…
(continued)...

I tend to think that these guys lose their track of life as they enter IIT. Once they accomplished IIT, they now look for next challenge. MBA. Then what? Ph.D to the USA why because the next challenge is USA. Once that is done, the next challenge is Green card. Easily can be obtained via EB1 Category if you go into teaching. So on the way they never think back about where they started and what they are aiming for. Huh? If after MBA he went to work for a firm like Amex or Citibank he would have earned millions and made a contribution but in teaching after MBA what he is accomplishing? I am not saying teaching is bad but B.Tech/MBA/PhD and then teach. What happened to the engineering studies? Who cares !

Some1 comes to USA after BE from Kadapa College or MIT (Madras inst. of tech ) going into software can be understood because he is a bare bone survivor trying to get ahead in life. But an IITian? Are not these cream of the country? It just hurts me a LOT to see such a talent going waste. By going into software he wasted his degree, let another aspiring guy lose an opportunity to do engineering studies and many more things such.

Look at any IIT B.Tech who went to IIT at 17 and going to USA at 21. Why? cuz everyone in his class is doing it. And after coming to the usa what? Software engineer! To become software engineer all you need is a Math B.Sc and an year of computer programming course. I know dozens of these guys who made it to the USA. Never even had to attend B.E/B.Tech anywhere, let alone IIT.

Some of the IITians now even go to IAS. As Kothapali said in the IAS cadre even they do not stand out. How many PVRK Prasads have gone to IIT? And frankly why does anyone need B.Tech to get into IAS? IAS needs just a degree. Even a BA will do. OK accepted that B.Tech can work in an engineering related IAS career. Good but after IAS are they really doing it?

Coming to the last point of social behavior. It is my personal experience seen at IIT and outside the campus that these guys are absolutely horrible. Their behavior, particularly when a few ladies are around, is abominable. I have never seen anyone behave that bad. People need to respect other people simply because others are human beings like their own selves. But when it comes to IITians they are more equal than others.

Finally all these are my personal views and I have formed them after seeing them in action, not because of my failures or their achievements. I have a great respect for IITins like Shivkumar Kalyanraman (Google "ShivRPI") but as I said in other blog they are very few on the other end of spectrum. Sadly 95% or more fall in the opposite end of the spectrum and that is what makes me sad. Thanks for reading and sorry it is too long.
DG said…
Continued from Krishna Priya dairy. Draw your own conclusions.
...
First, IMO, IITs are branded by a couple of societies as great. These societies include higher end guys like Bill Gates and MSFT and so on. They hire a few IITians and these guys do/did well. And lo we have a statement from Richest Guy. So the fever catches on.

Second, the institutions are scarce and tough to get in. Naturally because there are many who want to go in and few who can get in actually at the BE level. At one time I too was admitted to IIT Madras but that is irrelevant here. I worked with a few IIT guys as well in my career too in India. I even taught to a daughter of the IIT CS Dept head. :-) If it matters, She was just an average student (kind of panDita putra).

My basic question remains the same. Why on earth the ENGINERRING graduates (sans Comp Science) go to IIT to study Engineering, migrate to the USA and work in a field that is completely alien to them. Example. IIT M.Tech in structural engineering. Ph.D in Structures in California and work as software engineer in some firm somewhere in the USA. His education of 4/5 years of BE, 2 years of ME and 5 full years of Ph.D comes to what? Zilch. If a guy is like Ramarao Kanneganti who is a CS guy from BE to final Ph.D then I understand. But civil engg guy working in software? One more.. MS in IIT industrial engineering, 2 yrs in L&T as manager trainee. Now, java programmer in USA. I can give a dozen more examples.

How many of the pure engineering graduates of IIT stay in the same field? The IIT Ph.D above would have gone to teaching and spread his knowledge but he told me "you have to kiss the dept head and lick his hands to get tenure." I could not beleive he could make such a statement. Tenure depends on funding money/Teaching ability etc., and not kissing hands or other body parts. Brilliant mind wasted into nothing I thought. One last case. IIT B.Tech, IIM Ahmedabad MBA then Texas Ph.D in management and now a teaching in Washington. What kind of joke is this? If he ever wanted to do management professor job you do not need IIT B.Tech. All you need is a BA.

(continued... in part 2 because the comment more than 4096 char is not being allowed)
@ Krishna Priya .. thanks for following the link.

@ DG .. wow, this discussion has certainly aroused strong passion in you :) Thank you for sharing. Re. decent versus indecent behavior, I believe it's individual and not universal, and also partly due to the age. I have seen similar behavior in similar numbers in non-IIT colleges too.
DG said…
Re. decent versus indecent behavior, I believe it's individual and not universal, and also partly due to the age.
----
నేనూ కొంతకాలం అలాగే అనుకున్నాను. కానీ చాలా మందిని (ఐ. ఐ.టి) కలిసాక, విన్నాక అది తప్పు అని తేలింది. వీళ్ళందరూ ఒకటే. 17-21 సంవత్సరాల వయసులో పూర్తిగా హాస్టల్స్ లో ఉండడం వల్ల కావచ్చు. వాళ్ళ నాలెడ్జ్ కి వాళ్ళ సోషల్ బిహావియర్ కి ఉన్న డిఫరెన్స్ చూస్తే బుర్ర తిరిగిపోతుంది. వేదం చదివేవాడు బూతులు మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక సారి ఊహించుకోండి. ఇది నేను ఐ.ఐ.టి గ్రాడ్యుయేట్ తో పనిచేసాక వచ్చిన అనుభవం. అసలు మనుషులు ఇలాగ కూడా ఉంటారా అని సందేహం వచ్చింది నాకు. తర్వాత ఆయన ఉద్యోగం వదిలి అమెరికా వచ్చేసాడు. నేను కూడా వచ్చాను కానీ అతను కనిపిస్తే మాట్లాడం కూడా చెయ్యనని ఒట్టు పెట్టుకున్నాను. పెర్సనల్ గా మా మధ్య ఏమీ తేడాలు లేవు కానీ ఐ జస్ట్ కాంట్ స్టాండ్ సచ్ పీపుల్. ఏళ్ళూ గడిచినా ఇప్పటికీ వాడి భాష తల్చుకుంటే ఒళ్ళు కంపరం ఎత్తుతోంది. అన్నింటికన్నా వింత ఏమిటంటే 'నీకు అలాంటి భాష మాట్లాడ్డానికి సిగ్గు లేదా?' అని అడిగితే 'నాట్ ఎటాల్' అని చెప్పుకున్నాడు, అందరి ముందు. సిగ్గుతో తల వంచుకోవడం మా వంతు ఐంది. (Note: when he was with us he already graduated and was working with us).