పొద్దు గడికి స్లిప్పులందించే సుగాత్రిగారు ఎక్కడో స్లిప్పై పోయారు.
ఎక్కడవున్నా వచ్చి అటెండెన్సు వేయించుకోవలసిందిగా కోరుతున్నాం.
పొద్దెరుగని గడి పిచ్చిగాళ్ళకి ఈ స్లిప్పులభారం తలకెత్తుకోక తప్పేదేముంది?
మొదటి వాయ ఇదిగో..
అడ్డాలు:
1. సాయం కావాలా? టైమైపోయిందే?
32. అవ్వలు, బువ్వలు, గవ్వలు, రవ్వలు .. టైమింగు కాదు, రైమింగండీ బాబూ!
నిలువులు:
1. రాజమండ్రి హిష్టరీ ఇది. చిత్రంగా ఉందే!
4. దీన్నీ కొద్దిగా సాగదీశామనుకోండి, పిచ్చెక్కిందనుకుంటారు.
ఇక విజృంభించండి.
ఎక్కడవున్నా వచ్చి అటెండెన్సు వేయించుకోవలసిందిగా కోరుతున్నాం.
పొద్దెరుగని గడి పిచ్చిగాళ్ళకి ఈ స్లిప్పులభారం తలకెత్తుకోక తప్పేదేముంది?
మొదటి వాయ ఇదిగో..
అడ్డాలు:
1. సాయం కావాలా? టైమైపోయిందే?
32. అవ్వలు, బువ్వలు, గవ్వలు, రవ్వలు .. టైమింగు కాదు, రైమింగండీ బాబూ!
నిలువులు:
1. రాజమండ్రి హిష్టరీ ఇది. చిత్రంగా ఉందే!
4. దీన్నీ కొద్దిగా సాగదీశామనుకోండి, పిచ్చెక్కిందనుకుంటారు.
ఇక విజృంభించండి.
Comments
1 అడ్డం లో "సాయంకాలం " అని ఏమైనా వస్తుందా?
మొదలుపెట్టేశారన్నమాట! నెనర్లు. అసలు ఈ స్లిప్పుల సర్వీసుకు ఆద్యులు మీరే కద? :)
అదినూ, మూడు పొడి అక్షరాల క్లూలు.
ఏకాక్షరాలలో ఆలంఖిణితో హనుమంతుడు చేసినది ఉన్నట్టుంది
శతపత్ర సుందరి దగ్గర సిగ్గు నాకు కానబడలేదే
-ఊదం
28 అడ్డం వచ్చి "గ" తో ఏమైనా మొదలవుతుందాండి? నాకు తట్టటం లేదు.
నాకైతే చాలా ఉన్నాయి
5 అడ్డం,32 అడ్డం ,27 నిలువు వీటికి ఏమైనా క్లూలు ఇస్తారా కొంచెం
5 అడ్డం .. కొత్తగా ఆంధ్రాలో పుట్టిన పొలిటికల్ పార్టీ
32 అడ్డం లో మొదటి మాట అవలు, బువ్వలు, గవ్వలు లాగా ఉంటుంది. అదొస్తే రెండోదొచ్చినట్టే.
27 నిలువు. ముందు రాజులు చేసేవి ఏంటీ అని ఆలోచించండి.
32 అడ్డం: సప్తగిరి అంటె ఒక టీవి చానల్ కూడా ఉందనుకుంటా, దాంట్లో ప్రభ వ్యాఖ్యానంతో ఒక కార్యక్రమం వస్తుందనుకుంటా!!
5 అడ్డం: అంజి kingdom అని క్లూలోనే ఉంది కదా! మరి ఆ అంజి అంజనీపుత్రుడే..
28 అడ్డానికి ఓక సూపర్ క్లూ సుగాత్రి గారి సాహిత్యం బ్లాగులో ఇచ్చారు. పైన పాళీగారు లంకె ఇచ్చారు చూడండి
48 కి ఊదం మంచి అల్లమంత ఘాటైన పోటు వేశారు.
ఈమాట నేను రానారె రాసిన మొట్టమొదటి ఛందోపద్యంలో విన్నాను.
ఎనీవే .. ఆ తీగ పట్టుకుని లాగితే కదిలిన డొంక ఇది.
45 .. ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఇది ఉండాలి కదండీ.
23 .. హబ్బ, ప్రయత్నం అంటే ఆయాస పడ్డం కాదు, అవస్థ కాదు, ఆస్త్మా అంతకంటే కాదు!
ఏంటో ఆ మాటవింటేనే నాకు గొంగళిపురుగు పాకినట్టుంటుంది.
-ఊదం
ఇంకా వెలగని వారికి .. 9 నిలువులో న్యాయం నిజంగా న్యాయం కాదు. అదొక స్థాలీపులాక న్యాయం .. ఒక ఘుణాక్షర న్యాయం. చేదించి సాధించడానికి అవసరమైన ఇతర అవలంబనలు ఇప్పటికే ఊదం నొక్కి వక్కాణించారు.
19 నిలువు తట్టటంలేదండి ఎవరా నాయిక?
26 నిలువు చివరి అక్షరం 'వ్వ ' వస్తోంది కదా యుద్ధానికి కారణం ఏమి అవుతుంది?
3 నిలువు మధ్యాక్షరం తెలియక ల, గ్ర ల మధ్య కొట్టుకుంటోంది
కొంచెం చెప్పారూ ప్లీజ్
33 నిలువు కేకీ (నెమలి ) నేనాండి? :-?
19 నిలువు..చందమామ సినిమా హీరోయిన్ ..
26 నిలువు క్లూలోనే సమాధానం ఉంది. కాస్త ముందువెనక చూసుకోండి.
@Srilu .. 19 నిలువులో నాయిక హిందీ చిత్ర నాయిక
26 నిలువు .. మీరు జాలంలో ఉన్న బ్రౌన్ నిఘంటువుని మధించడం నేర్చుకోవాలి :)నిజానికి ఇది సాధించడానికి అవసరమైన సరంజామా క్లూలోనే ఉంది. చి ల్లి గ వ్వ .. ఆది - అంతం
33 నిలువు కేకీ కాదు!
19 అడ్డం పేరుతో 'చందమామ' లాంటి తెలుగు నాయక కూడా ఉంది.
కొత్తపాళీ గారు, సరిగ్గ నాకు అక్కడే బ్రేకు పడింది. ఎది తప్పో అర్థం కావట్లా.. మూడు పొంతన లేకుండా ఉన్నాయి
మీరన్నారని ఏమిటో చూస్తే టక్కున వచ్చింది 11 అడ్డం. ఏనుగు దంతం సంగతి తరువాత, ముందు సూర్యచంద్రులు భయపడేది దేనికో ఆలోచించండి? జ్యోతిష్యమెందుకు, ఖగోళం తెలిస్తే చాలు. కాదంటారా?
శివుడద్రిని శయనించుట
రవి, చంద్రులు మింటనుంట, రాజీవాక్షుం
డవిరళముగ శేషునిపై
బవళించుట, నల్లి బాధ పడలేక సుమీ!!
:) దీని రహస్యము ఇదన్నమాట
దంతం లేని ఏనుగు గోలేంటో ఇంకా అర్ధం కాలేదు.
16 నిలువు కూడా అర్ధం కాలేదు.
కానీ గడి నిండినట్టె ఉంది. ఇక పంపేస్తున్నా
పాళీ గారు, 16 నిలువుకి- గజాలా అని ఒక హీరోయిన్ ఉందని తెలుసా మీకు ?
....
అగణిత వైజాగుదోమలశ్వద్ధామల్
తెగబలిసిన రెక్కేణ్గ్ల్
స్పూర్తి ఏమో, కాని శ్రీ శ్రీ చెప్పింది దోమల గురించి :(