ఇప్పటిదాకా వచ్చిన కథలు

జూలైలో నేనిచ్చిన మూడవ కథా విషయానికి ఇప్పటిదాకా వచ్చిన కథలు ఇవి.

మనం ఈదుతున్నాము ఓ చెంచాడు భవసాగరం.. July 15

కాసనోవా 2020 July 26

కథ కథ కందిత్తు August 26

సృష్టి 25.0 అను జానపద పౌరాణిక సైన్స్ ఫిక్షను కధ September 7

శాపమైన వరం (ఓ కాకరకాయ) September 7

జ్యోతిగారు వ్యక్తిగత వేగులో అందించారు.

వీరు కాకుండా ఇంకెవరైనా ఈ విషయం మీద కథ రాసి ఉంటే, లింకుతో సహా, దయచేసి నాకు తెలియ పరచ వలసింది.
ఒక ముఖ్య గమనిక. పోటీ గడువుని ఈ నెలాఖరు (సెప్టెంబరు 30) దాకా పొడిగిస్తున్నాను. అంచేత ఔత్సాహికులెవరైనా కొత్త ప్రయత్నాలు చెయ్యవచ్చు. చేస్తే రాస్తే నాకు చెప్పడం మర్చిపోరుగా!

Comments

Anonymous said…
వికటకవి గారి కథ సూపర్..మిగతా కథలు చదవాలి. నేనూ కష్ట పడి (మీరు చెప్పిన theme లో నాకు నచ్చిన మార్పులు కొన్ని చేసుకుని :-))ఓ కథ రాసి పెట్టుకుని, తీరా, save చేసుకోబోయే ముందు మా ఇంట్లో system crash అయ్యింది. చాలా బాధ పడ్డాను. తర్వాత అదే కథని తిరిగి మళ్ళీ రాయడానికి మనసు రావట్లేదు!
Ramani Rao said…
కథ గడువు ఇంకా పొడిగించడమా? ఈ లెక్కన ఈ అంశం గురించి రెండు రోజులకో కథ చొప్పున రాయచ్చోమో! మనలో మన మాట కొత్తపాళీ గారు! రాసిన వాళ్ళు మళ్ళీ రాయొచ్చా? :)

:)- వ్యాఖ్య చదివేవారు అప్పుడే తల పట్టేసుకొన్నట్లుగా నాకిక్కడికి కనిపిస్తోంది..మరేం పర్వాలేదు, తలనొప్పి తగ్గే వాణిజ్య ప్రకటనలు నా జ్ఞాపకాల అరలలో బోల్డు ఉన్నాయి. మచ్చుకి ఒకటి జండు బాం, జండూ బాం నొప్పి ..హరించే బాం.
అవునవును, నేను రమణి గారితో ఏకీభవిస్తున్నా. సమయం పెంపని తెలిస్తే, హడావిడిగా కాక మరి కాస్త పదును పెట్టేవాణ్ణి. నా కాకరకాయకి, నా బ్లాగులో వచ్చిన వ్యాఖ్యలు కొన్ని చదివి నాకు చాలా సంతోషం వేసింది, అవి మెచ్చుకోళ్ళు కాకపోయినా. వాటికి సమాధానం మీ నిర్ణయం తరువాత చెబితేనే బాగుంటుందని ఆగుతున్నాను. (గెలుస్తానని కాదండోయ్ :-) ). ఏది ఏమైనా, నాకు నచ్చి, రాయాలనిపించిన విషయాన్ని ఇచ్చారు. కథంటే కల్పనే అని నా నమ్మకం. చాలా సంతోషం.
@రవి .. మళ్ళి ప్రయత్నించండి.
రెణ్ణిమిషాలకోసారి సేవ్ చెయ్యడం మరువొద్దు.

@రమణి .. రెండ్రోలకోటి కాకపోతే రోజుకోటి రాయండి, ఎవరొద్దన్నారు? :)
వాణిజ్య ప్రకటనలకి తలనొప్పి తగ్గదు, పెరుగుతుంది :)

@వికటకవి - రాసినదాన్ని ఉద్దరించడమో, ఇంకో కొత్తది రాయడమో చేస్తే నాకభ్యంతరం లేదు.
Anonymous said…
అమ్మో, ఆలస్యంగా మొదలుపెట్టటమే నా తప్పు. ఒకసారి రాసాక, మళ్ళీ అదే ఇతివృత్తం మీద మళ్ళీ రాయటం కత్తి మీద సామే. అందులోనూ, నాకు తెలిసి ఈ ఇతివృత్తంపైన కల్పనలకి మిగిలిన అవకాశాలు తక్కువే. "షోలే" సినిమాని "RGV కీ ఆగ్" తీసినట్లవుతుందేమో అని:-)

@ రవి, ధన్యవాదాలు.
Ramani Rao said…
రాసినవాళ్ళు, న్యాయమూర్తులు కథల విషయంలో ఈ మౌనవ్రతమేమిటో, ఎందుకో తెలుసుకోవచ్చా?