పునః పరిచయం

మంచి మిత్రుడొకతను చాన్నాళ్ళకి కనిపించాడు.
పాపం మొహం చిన్నబోయి ఉంది.
ఏమైందయ్యా అన్నా.
బ్లాగు పోయింది అన్నాడు.
అయ్యో అన్నా.
వాళ్ళ దుంప తెగ, ఆ హోస్టు సర్వరు వాళ్ళకి అదేమి తెగులో. (మనలో మాట, మీ మీ రచనలూ, నచ్చిన వ్యాఖ్యలూ కూడా బేకప్ చేసుకుంటూ ఉండండి).
ఐతే, మరి, రాయడం మానేస్తారా అన్నా.

అబ్బే, కొత్త దుకాణం తెరిచాగా అన్నాడు.
మరి ఆ మాట చెప్పవేం? అని వెంఠనే వెళ్ళి తొంగి చూసొచ్చా.
కొత్త బ్లాగు సరికొత్త హంగులతో కళకళ్ళాడుతోంది.

ఈయన తెలుగు బ్లాగులకి పాతకాపే. ఆయనకి నా పరిచయం అవసరం ఏమీ కాదనుకోండి, ఏదో నా చేతులూరుకోక చేస్తున్నా.
మరీ తరచుగా పుంఖాను పుంఖాలుగా రాసెయ్యడు కానీ రాసిన ప్రతిదీ నాలుగు సార్లు చదువుకునేలా ఉంటుంది.
తెలుగు సినీగీత సాహిత్యం అనే ఇసుము నించి తివిరి మంచి గంధపు తైలం తియ్య గల దిట్ట.

Ladies and gentlemen!
I am very happy to re-introduce Sri Chivukula Krishnamohan.

మీరూ ఒక లుక్కెయ్యండి.

Comments

ఇలాంటి హారర్ ఉదంతాలు టపా చేస్తున్నారేంటి ? ఎవరి సొంత సీమల (డొమైన్స్)లోంచి వారు బ్లాగుకుంటే మంచిదేమో ఇకముందు, ఈ ఆతిథేయ గూళ్ళకు స్వస్తి చెప్పి. కాకపోతే కొంచెం కరుసవుద్ది !

"పయనించే ఓ చిలుకా ! ఎగిరిపో, పాడైపోయెను గూడు..." అని పాడుకుంటూ.
భలే చెప్పారు. సొంతసీమలకీ దిక్కు లేదు, సీమదారుల పిలక సర్వరు వాడీ గుప్పిట్లో ఉన్నది మరి!