అమ్మ 2: ప్రత్యక్షమైన రోజు

హరికిన్ బట్టపు దేవి పున్నెముల ప్రో వర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ తోనాడు పూబోణి తా
మరలం దుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములు వాపు తల్లి సిరి యిచ్చున్ నిత్య కళ్యాణముల్ - పోతన


భాగ్యద లక్ష్మీ బారమ్మా .. పురందరదాస కీర్తన .. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి
ఈ పాట వినగానే మీకు ఒక ప్రసిద్ధ పాత తెలుగు పౌరాణిక సినిమాలో ఒక ప్రసిద్ధమైన పెళ్ళి పాట గుర్తొస్తే మీ తప్పేం లేదు.

అదే పాట హిందుస్తానీ బాణీలో పండిత భీంసేన్ జోషి గళం, ఒక కన్నడ సినిమాలో

లలిత రాగంలో ముత్తుస్వామి దీక్షితుల కృతి హిరణ్మయీం లక్ష్మీం సిక్కిల్ గురుచరణ్

శ్రీ రాగంలో బాలమురళీ మధుర గాత్రంలో ముత్తుస్వామి దీక్షితుల కృతి శ్రీ వరలక్ష్మీ నమస్తుభ్యం

క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం - అన్నమయ్య

Comments

Anonymous said…
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం
అద్భుతమండి! కీర్తన గొప్పదనమో లేక ఈ గాయకుల స్వర మాధుర్యమో అదీ కాకపోతే ఇవాళ్టి ప్రత్యేకతో తెలీదు కానీ వినడం పూర్తయ్యేసరికి మనసంతా అవ్యక్తానుభూతి!! ఇంత మంచి కీర్తనని వేరు వేరు రాగాలలో మాకందించినందుకు కృతజ్ఞ్తలు!!

ఎమ్మెస్ లింక్ పనిచేయడం లేదు.. ఒకసారి సరి చూడండి..
Anonymous said…
""చరణ కిసలయమ్ములకు..." తెలియని ఓ కొత్త చోటులో నడుస్తూ వెళుతున్నప్పుడు, అనుకోకుండా ఓ సరస్సు, అందులో ఓ పెద్ద తామరపువ్వు కనబడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది.

(ఇది నేను చదువుతున్నప్పుడు పొద్దున 7:30 సమయం, భరతావనిలో). పొద్దునే అన్నమయ్యను గుర్తు చేసారు. నెనర్లు.
సినిమాలో ఒక ప్రసిద్ధమైన పెళ్ళి పాట గుర్తొస్తే....
సీతారాములకళ్యాణం చూతము రారండి అవుతుంది :)
నిషిగంధ .. లంకె సవరించాను.
రవి .. పోలిక బాగుంది :) ఆవిడ ఎలాగైనా తామరలందుండెడి ముద్దరాలు కదా!
రాజేంద్ర .. మీకు ఫుల్ పాయింట్స్!
Anonymous said…
నరేంద్ర భాస్కర్ S.P.
నమస్తే!

చాలా మంచి అన్నమయ్య కీర్తన గుర్తు చేసారు, శుక్రవారం అంతా ఈపె పాటలే
పరమాత్ముడైన హరి పట్టాపు రాణీవి నీవు - ధరమము విచారింప తగునీకు అమ్మా!
కమలజు గన్న తల్లి, కాముని కన్న తల్లి - అమరుల కన్న తల్లి ఆదిమ లక్ష్మీ!

ప్రత్యేకించి శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారి గొంతులో మీర్రాసిన పాట గొప్పగా ఉంటుంది
kRsNa said…
chaala adbhutanga undi mee post.. pOtana padyamto start chESi జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం ani annamayya keertanatO muginchina mee post sailiki andulo vishaya soochana inka chaala bagundi.. thnq so much
రాఘవ said…
నాకు మొట్ఠమొదట భాగ్యద లక్ష్మీ బారమ్మ అని చదవగానే "హిందూస్థానీ-వృకోదర" పండిట్ భీమ్‌సేన్‌జోషీ గారే గుర్తొచ్చారు. మీరూ అదే ఉదహరించారు :)

మీరు ఒకపరి కొకపరి ఒయ్యారమై కూడ చెప్తారనుకున్నాను :(