నేనీ మధ్య అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ కి వెళ్ళొచ్చాను ఒక పెళ్ళి చూడ్డానికి.
ఈ ప్రయాణం ఆద్యంతమూ ఆసక్తి కరంగా సాగింది, కొన్ని గొప్ప అనుభవాలతో. అవి మీతో పంచుకోవాలని ఇలా.
శనివారం పొద్దున 11 గంటలకి ముహూర్తం. ముందు రోజు రాత్రే అక్కడీకి పోయి ఏమి చేస్తాములే అని శనివారం తెల్లారి ఫ్లైటుకి టిక్కెట్టు కొనుక్కున్నా. 7 గంటల ఫ్లైటుకి ఐదున్నరకల్లా విమానాశ్రయం చేరుకుని, అవసరమైన తతంగమంతా పూర్తి చేసి విమానం ఎక్కే గేటు దగ్గర కుర్చీలో కూర్చున్నా. ఇంకా గంటన్నర టైముంది. అంకోపరి తీసి యధావిధి ప్రాతఃకాల ఉచిత కార్యకలాపాలు చేసుకుంటున్నా నా దారిని నేను.
ఇంతలో నేను గమనించకుండానే నా చుట్టు పక్కల కుర్చీలన్నీ నిండి పోయాయి. జనసందోహం హెచ్చింది. గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు, నవ్వు కుంటున్నారు, ఒకర్నొకరు హెచ్చరించు కుంటున్నారు. ఏవిటబ్బా ఇంత సందడి అని అయిష్టంగానే అంకోపరినుండి తల పైకెత్తి అటూ ఇటూ చూశా. స్త్రీలూ పురుషులూ, అందరూ బాగా వృద్ధులు, అందరూ కనీసం 80 దాటినట్లున్నారు. కొంతమంది చక్రాల కుర్చీల్లో ఉన్నారు. మధ్యలో ఒక నలుగురు నడివయసు స్త్రీలనీ, ఇద్దరు యువకుల్నీ కూడా గమనించా. అందరూ లోపల ఏం బట్టలు వేసుకున్నా, పైన ఒకే లాంటి నారింజ రంగు టీషర్టులు వేసుకుని, నెత్తిన ఒకే లాంటి మిషిగన్ టోపీ పెట్టుకునున్నారు. అందరి మెడలలోనూ పల్చటి ప్లాస్టిక్ సంచీలు వేళ్ళాడుతున్నాయి, లోపల కొన్ని కాయితాలతో.
ఏదో కన్వెన్షనో, లేక ఏదన్నా వృద్ధాశ్రమం వారి ఫీల్డు ట్రిప్పో అనుకున్నా. నడివయసు స్త్రీలలో ఒకామె లీడర్ల్లే ఉంది, ఒక క్లిప్ బోర్డు మీద పేర్ల లిస్టు చదివి అందరూ వచ్చారా లేదా అని చూసుకుంటోంది. మధ్య మధ్య ఆ వృద్ధులతో హాస్యంగా ఏదో అంటోంది. యువకుల్లో ఒకడు చకచకా ఫొటోలు తీస్తున్నాడు. ఇంతలోకి విమానం తలుపు తెరిచారు. ముందే ఎక్కి కూర్చుని ఆ ఇరుకు సీటులో బందీగా ఎందుకులే అని నేను మెదలకుండా కూర్చున్నా. పైగా ఈ వృద్ధులంతా ఎక్కేటప్పటికి బాగా టైం పట్టేట్టు ఉంది అనుకుంటూ, వాళ్ల హడావుడి చూస్తూ కూర్చున్నా. ఆ నడివయసు స్త్రీలూ, ఇద్దరు యువకులూ అందర్నీ బాగా సమర్ధవంతంగా విమానం ఎక్కించేసి ఎవరి సీట్లలో వారిని కూర్చో బెట్టారు, చక్రాల కుర్చీల్లో ఉన్నవాళ్ళతో సహా. సరే, నేనూ ఎక్కి నా సీట్లో కూలబడ్డా. నా పక్క సీట్లో లీడర్ గా వ్యవహరిస్తున్న నడివయసావిడ. అప్పటికి నా బుర్రలో ఏదో వెలిగింది. ఆవిణ్ణడిగా .. ఏంటి, వీళ్ళంతా వెటరన్సా అని. అవునంది. డీసీలో ఏదన్నా కన్వెన్షను జరుగుతోందా అనడిగా. ఆవిడ కొంచెం ఎనిగ్మాటిగ్గా నవ్వి ఇంకాసేపట్లో మీకే తెలుస్తుంది అంది.
ఇంతలో ఎప్పుడూ జరిగే తతంగంతో విమానం బయల్దేరి గాల్లోకి లేచింది. విమానం బాగానే ఎగుర్తోంది అని నిర్ధారించుకుని మైకులో కేప్టెన్ గారు గొంతు సవరించుకున్నారు. మామూలుగా ఇలా విమానం బయల్దేరిన కాసేపటికి కేప్టెనుగారిలా వచ్చి, మనం ఏ వూరెళ్తున్నాం (ఎవడన్నా పొరబాట్న తప్పు విమానం ఎక్కేసుంటే గుండెలు బాదుకోడానికి), ఆ వెళ్ళే వూర్లో వాతావరణం ఎలావుందీ, దార్లో గాలులూ గట్రా ఎలా ఉన్నై .. ఇలాంటి సమయోచిత సమాచారం అంద జేస్తాడు. ఇవ్వాళ్ళ ఆ కబుర్లన్నీ చెప్పేశాక ఇంకా ఇలా చెప్పాడు (నా తెలుగులో).
"ఇవ్వాళ్ళ మనతో బాటు కొందరు అపురూపమైన విశిష్ఠమైన అతిథులు ప్రయాణిస్తున్నారు. వారికి ప్రత్యేక స్వాగతం. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సైన్యంలో పోరాడిన మాజీ సైనికులు (WWII Vetarans) నలభై ఇద్దరు ఇవ్వాళ్ళ మనతో డీసీ వస్తున్నారు. వీరు అక్కడ తమ సేవలకి గుర్తుగా కృతజ్నతతో ఈ దేశం నిర్మించుకున్న రెండో ప్రపంచ యుద్ధపు మెమోరియల్ను దర్శిస్తారు. ఈ వీరుల ధైర్య సాహసాలకీ, దేశ రక్షణ కోసం వారు చేసిన త్యాగాలకీ నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. ఈ వీరులు ఇవ్వాళ్ళ మా (కంపెనీ వారి) విమానంలో రావడం మాకెంతో గర్వంగా ఉంది."
విమానం అంతా చప్పట్లతో మారు మోగింది ఒక నిమిషం పాటు. నాకు ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఉంది ఇదంతా. ఏవిటీ వింత అన్నట్టు నా పక్కన ప్రయాణికురాలి వైపు చూశాను. ఆమె (పేరు కేథీ) అప్పుడు వివరాలు చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేసిన సైనికులు వృద్ధాప్యం వల్లనో, పేదరికం వల్లనో తమ గౌరవార్ధం నిర్మించిన మెమోరియల్ను ఒక్కసారి కూడా చూడలేకపోవడం, పైగా వయసు పైబడటం వల్ల చాలా మంది మరణిస్తూ ఉండం తెలుసుకుని, మిషిగన్ వెటరన్స్ తాము బతికుండగా కనీసం ఒక సారైనా డీసీ వెళ్ళి తమ మెమోరియల్ను చూసే ఏర్పాటు చెయ్యాలనే ఉద్దేశంతో ఈ స్వఛ్ఛంద సంస్థ ప్రారంభించారు. ఈ ట్రిప్పుకి మొత్తం ఖర్చు ఆ సంస్థే భరిస్తుంది - వెటరన్స్ కి పైసా ఖర్చు లేదు. వీళ్ళకి ఏ ప్రభుత్వం కానీ ఏమీ డబ్బులివ్వదు. వాళ్ళ వనరుల్ని వాళ్ళే సమకూర్చుకుంటారు, వ్యాపార సంస్థలు, వ్యక్తిగత దాతలు ఇచ్చే విరాళాల ద్వారా. అప్పుడప్పుడూ ఫండ్ రైజింగ్ కార్యక్రమాలు నడుపుతారు. సంస్థకి పనిచేసే వారందరూ స్వఛ్ఛందంగా పని చేస్తారు.
ఆ సంస్థ పేరు ఆనర్ ఫ్లైట్ మిషిగన్
అలా ఒక ట్రిప్లో వెళ్ళబోతున్న ఒక వెటరన్ కథ ఒక స్థానిక పేపర్లో
సుమారు ఒక గంటలో రీగన్ విమానాశ్రయంలో దిగాము. నేను ముందుగానే విమానం దిగి, గేటు దగ్గరే ఉన్న కాఫీ షాపులో ఒక కాఫీ కొనుక్కుని చప్పరిస్తూ అక్కడే నిల్చున్నాను. నాతో బాటు ఇతర సాధారణ ప్రాయాణికులు కూడా ఉండిపోయారు. గేటు దగ్గర అలాంటి నారింజ టీషర్టులు వేసుకున్న వాలంటీర్లు ఒక ఇరవై మంది దాకా ఉన్నారు. ఇంతలో ఒకరొకరే విమానం దిగిన వెటరన్లు బయటికి రావడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న వాలంటీర్లు బలంగా చప్పట్లు కొడుతూ అరుస్తూ జయజయ ధ్వానాలు చేస్తున్నారు. ఆ ముదుసలి ముఖాల్లో తళుక్కున మెరిసిన ఆనందం, గర్వం నేను మాటల్లో వర్ణించలేను. ఈ ధ్వనులు విని అక్కడా ఇక్కడా చెదురు మదురుగా ఉన్న ప్రయాణికులూ, అక్కడ పని చేస్తున్న ఉద్యోగులూ కూడా ఈ గేటు దగ్గరికి వచ్చి, జరుగుతున్న దేవిటో తెలుసుకుని, జయజయధ్వానాల్లో వాళ్ళూ చేరారు. అలా ఆ నలభై మంది వృద్ధులూ బయటికి వచ్చేదాకా ఆ జయజయధ్వానాలు సాగుతూనే ఉన్నాయి. నాతో పాటే ముగ్గురు పిల్లల్తో విమానం దిగిన ఒక తండ్రి తన చిన్న కూతురుకి బాగా కనబడేందుకు భుజం మీద ఎత్తుకుని, వాళ్ళెందుకు అలా చప్పట్లు కొడుతున్నారో వివరిస్తున్నాడు. నేను నా కాఫీ ముగించి, అక్కణ్ణించి కదిలాను. ఇద్దరు వృద్ధుల్ని దాటుకుని నడవాలోకి నడిచాను. వాళ్ళ పలచటి ముడుతలు పడిన చెంపల మీద నీటి చారికలు. మాటల్లో నిర్వచించలేని ఏదో ప్రకంపనం నా లోలోపల!

Comments
ఆ అద్బుత మానవీయ చిత్తరువును మీరు దర్శించి, అదే అనుభూతిని మాకందరకూ అంతే శక్తిమంతంగా బట్వాడా చేసారు.
థాంక్యూ
బొల్లోజు బాబా
ఇప్పుడు చూద్దును కదా.. దాని గురించే మీరు రాసారు. ఇది యాదృచ్చికమా?? ఎమో??
--ప్రసాద్
http://blog.charasala.com
ఏ దేశంలోనైనా సైనికులను స్వచ్ఛంద సంస్థలు చూసుకోవలసిందేనన్నమాట! వీరులు, త్యాగం, ధైర్యం, సాహసం వంటి మాటలకు మాత్రం కొదవుండదు.
రచయిత శ్రీరమణతో ఒకసారి నేను మాట్లాడినప్పుడు మాటల మధ్యలో ఆయనన్నాడు "నేనూ నా దేశం నా దేశ భద్రత - అంటూ సైనికుడుగా చేరేవాడు ఎవడోగానీ వుండడు. అది వాని ఉద్యోగం. ఆ తరువాత చావో-రేవో వాని ఖర్మం." అని. ప్రభుత్వాలు సైనికులను ఈ దృష్టితోనే చూస్తాయేమో.
@వైజాసత్య .. మీ తలనొప్పికి కారణమైనందుకు కడు సంబరంగా ఉంది.
నేను సైన్యానికి, సైనికానుభవానికి అతి దగ్గరగా వచ్చింది NCCలో వున్న రోజుల్లో. అంతే. స్వాభావికంగా శాంతికాముకుణ్ణి కావడం వల్లనేమో నాకు సైన్యమన్నా సైనికులన్నా పెద్ద గౌరవం ఎప్పుడూ లేదు, ఆ ప్రస్తావనలు వచ్చినప్పుడు నాలో దేశ భక్తి చైతన్యం గానీ వీర రక్తంగానీ ఎప్పుడూ ఉప్పొంగుకు రాలేదు. కానీ తమాషాగా, సాధారణ దైనందిన జీవితంలో భారతీయ సైనికులు ఎదురైన ఐదారు సందర్భాల్లో వారి మీద వ్యక్తిగతంగా నాకు చాలా గౌరవం కలిగింది.
ఇహ అమెరికను సైనికులూ, యుద్ధ విరమణ చేసిన సైనికుల జీవితం ప్రభుత్వం విషయాలకి వస్తే, రెండో ప్రపంచం యుద్ధంలో పోరాడి వెనక్కొచ్చిన అమెరికన్ సైనికులు జీవితంలో బాగానే సెటిలయ్యారని నాకు అనిపించింది. కొరియా వియెత్నాముల నించి తిరిగొచ్చిన సైనికుల పరిస్థితి కూడా పరవాలేదు, కానీ వాళ్ళకి అక్కడ యుద్ధభూమిలో అనుభవాలు మరీ బాధాకరమైనవి అయి చాలా మందికి మనశ్శాంతి మిగలకుండా చేశాయని కూడా తెలుస్తోంది. ఇక ఇటీవలి ఇరాక్ యుద్ధాల పూర్తి పరిణామాలు ఇంకా తెలియ వలసి ఉంది. కానీ ప్రస్తుతానికి తెలుస్తున్న వార్తల్ని బట్టి ఈ యుద్ధాల మాజీ సైనికుల పరిస్థితి దారుణంగా ఉందనీ, వారి బాగోగులు పట్టించుకోవలసిన ప్రభుత్వ సంస్థలు ఆ పని సమర్ధవంతంగా చెయ్యటం లేదనీ తెలుస్తోంది.