మన ఆలోచనలని, మనోభావాలని ప్రతిఫలించే మిత్రులని కలవడం ఎంతో ఉత్తేజం కలిగిస్తుంది. ఒట్టినే ప్రతిఫలించడమే కాక, పాత ఆలోచనల్ని ప్రశ్నించ గలవారూ, కొత్త ఆలోచనల్ని రగిలించగలవారూ కూడా అయితే .. మనసూ మెదడూ రెండూ ఆనందంతో తడిసి ముద్దవుతాయి, తృప్తిగా నిట్టూరుస్తాయి.
నిన్న అలాంటి భాగ్యం దొరికింది.
నెల్లుట్ల వేణుగోపాల్ నాకిదివరకు పరిచయమే. కాకపోతే అప్పుడు అది ముఖ పరిచయం మాత్రమే. సీనియర్ పాత్రికేయుడు, ఆంధ్ర ప్రదేష్ చారిత్రక, రాజకీయ, ఆర్ధిక విశేషాల పై సాధికారిక జ్నానం ఉన్నవాడు, సమకాలీన తెలుగు సృజనాత్మక సాహిత్యాన్ని సైద్ధాంతికంగా సానబెట్టి చూసే విమర్శకుడు, అనేక ప్రపంచ భాషలనించి కథల్నీ నవలల్నీ తెలుగులోకి తర్జుమా చేస్తున్న అనువాదకుడు, కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ఆర్ధిక మాస పత్రిక వీక్షణం కి ప్రధాన సంపాదకుడు.
తెలుగు బ్లాగ్లోకంలో కడలితరగ బ్లాగరిగా సుపరిచితుడు.
ఈయన బహు ముఖ ప్రజ్న నాకు గత మూడు నాలుగేళ్ళలోనే పరిచయమైంది. నిన్న మా డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి సమావేశానికి ఆయన ప్రత్యేక అతిథిగా విచ్చేసినప్పుడు, అనేక సాహిత్య సామాజిక అంశాలను గురించి ఆయనతో ముఖా ముఖీ చర్చించే అవకాశం కలిగింది. వేణు జీవిత భాగస్వామిని, డాక్యుమెంటరీ ఫిలిం మేకర్, వనజ కూడా చర్చలో పాల్గొన్నారు.
సరే, వేణు ఐతే సమావేశానికి వస్తున్నారని ముందే తెలుసు. ఫలానా మనిషి వస్తాడని ముందు తెలియకుండా అకస్మాత్తుగా ఎదురైతే ఎంత గొప్పగా ఉంటుంది!
అలా కలిసిన మిత్రుడు, నేనెంతో అభిమానించే బ్లాగరుల్లో ఒకడు, జేప్స్ జయప్రకాష్. ఇక మీదట మా ఊరి పరిసర ప్రాంతాల్లోనే ఉంటున్నామని చెప్పారు. చాలా సంతోషం.జేపీకీ, అతని భాగస్వామిని చైతన్యకీ స్వాగతం.

Comments
:) Thank you very much for posting our meet, i was equally excited to see you at DTLC. I wanted to write almost the same words but was delayed till now.
Its really exciting when you know someone virtually for a longtime and suddenly meet them out of the blue !