బత్తీబంద్ చర్చా నివేదిక - 2

నివేదిక మొదటి భాగం

తరువాత వ్యక్తిగతంగా చేయగలిగిన, చేయాల్సిన పనుల గురించి చర్చ జరిగింది.
Ravi Shanker (Bharath):
Avoid using plastic
Using fossil fuels as little as possible. (now we are bound to reduce .. due to increase in petrol prices )
There is no confusion here. Change should come both ways. If more awareness grows among public, about environment, government initiatives will be taken.
Moreover, if the awareness increases, market will be established for them, for e.g. CFL bulbs.

సూర్యుడు (Bharath):
We are screening this documentary film "An Inconvenient Truth" in our company every day for one week to create the awareness. Karnataka govt encourages using CFL bulbs by giving some discount on the electric bill every month of the house is completely CFL :). I don't understand why there is not enough push on the solar power side. I will make sure all the monitors were switched off, at least in our project, before leaving for the day and most of our team members do it voluntarily. Karnataka government also gives discounts (10%) in electricity bill if you install a solar geyser (water heater). In Bangalore many traffic lights are solar powered.


స్నేహ (అమెరికా):
1. We don't use ac.
2. We buy locally grown food.
3. We stopped wasting food.
4. We separate recycle materials from trash.
5. We don't overload refrigirator. Cooked foods are consumed on the same day - no more keeping in the fridge.

ఇంట్లో విద్యుత్ వాడకం, ముఖ్యంగా ఫ్రిజ్జు, ఏసీ .. ఇలాంటీవి తగ్గిచడంతో డైరెక్టుగా డబ్బుల్లో అది ప్రతిఫలిస్తుంది. అటు మన భూమి కి మన పర్సుకీ రెండిటికి మంచిదని కొత్తపాళి చెప్పారు.

ప్రసాద్ చరసాల (అమెరికా):
వీలయినంత energy ఆదా చేయండి. అది విధ్యుత్తు కావచ్చు. పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు. పునరుత్పత్తి కాని, కాలేని వనరుల వినియోగాన్ని కనీస స్థాయికి తగ్గించండి. పునరుత్పత్తికి వీలయ్యే ప్రతి వస్తువునీ చెత్తలో పడెయ్యకుండా చూడండి.
నేను పాటిస్తున్నవి ఇవీ.
మా యింటికి సౌరశక్తిని పెట్టించే ఆలోచనలో వున్నా. కానీ ఖర్చు చాలా అయ్యేట్లుంది.
మా ఆఫీసులో ప్రతి ప్రిటుకీ ప్రింటు చేసిన వాడి ఐడీతో ఒక హెడర్ పేజీ ప్రింటవుతుంది. నేను వాటిని పడేయకుండా దాస్తున్నా. మా అమ్మాయికి బొమ్మలేసుకోవడానికి ఇవ్వచ్చని. AC ని 75 డిగ్రీలో సెట్ చేశా. వేడి నీళ్ళను కూడా Medium heatకు సెట్ చేశా.
ఇక మా ఆవిడ చాలా energy సేవర్. ఆమె ముందు నేను బలాదూర్. ఆమెది బిల్లు సేవింగు. నాది ఎనెర్జీ సేవింగు. వున్న రూములో తప్ప అన్ని చోట్లా లైట్లు బంద్. నేను ఇంట్లో లేకుంటే AC మొత్తానికే ఆపేస్తుంది. వ్యానుకు బదులు కారే వాడుతుంది. లానుకు నీళ్ళు పట్టే సమయం వచ్చినా వర్షం కోసం ఎదురు చూస్తుంది. ఇంకా చాలా చెప్పొచ్చు .

కొత్తపా ళీ (అమెరికా):
మేము ఇంట్లో బల్బులన్నీ CFL కి మార్చాము పోయినేడాది.
The second thing I did - plugged all the exterior leaks in the house, so that heat does not leak in winter.
కారులో ఎక్కడికన్నా బయల్దేరే ముందు ఆ ట్రిప్పు నిజంగా అవసరమా అని ప్రశ్నించుకుంటున్నా.
ఆ వెళ్ళే వేపు ఇంకేవన్నా రెండు మూడు పనులు చక్కబెట్టుకు రావచ్చా అని చూస్తున్నా.
నేను మరీ అఫీషియల్ పేపర్లు కానిదేదైనా, పేజికి రెండు వేపులా ప్రింట్ చేస్తాను. ఒకేళ ఒక వేపే ప్రింట్ చేస్తే, ఆ కాయితాల్ని దాస్తాను, దాని వెనకాల రాసుకోడానికి. నేను రాసిన కథలన్నీ అలా ఒకేపు రాసినవే.

చక్రవర్తి (భారత్):

బత్తీ బందు విషయం గురించి నేను అతిగా పాటించే ముఖ్య విషయం ఏమిటంటే .. అవసరం లేని చోట అస్సలు విద్యుత్ ఉపయోగించ కూడదు. అది ఇల్లైనా .. కార్యాలయమైనా. ఇంట్లోనైతే నేను బిల్లు కడతా. కార్యాలయమైతే నేను కట్టను కదా అన్న భావన కాదు ముఖ్యం. ఎంత తక్కువ ఉపయోగించుకున్నాం అనేదే. రెండవది, వీలైనంత వరకూ ఇంట్లోకి బయట గాలి వచ్చేటట్టు చూసుకుంటా. దీని ద్వారా ఫాన్ పూర్తిగా కట్.
ఇక లైట్ల విషయానికొస్తే .. ఒక్క బెడ్ లాంప్ తప్ప .. మిగిలిన అన్ని చోట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడే వేసుకోవడం.
ఇలాంటి పనులు చేసేటప్పుడు మీకు కలిగే మొదటి ఆటంకం మన ఇంటి వాళ్ళే. వాళ్ళని కనుక కూడగట్టుకున్నామంటే .. ఏదీ అసాధ్యం కాదు. నా ఆఖరి మాట .. ప్లాస్టిక్ సంచులు మానేయ్యండి. కావాలంటే గుడ్డ సంచీ నేను మీకు ఉచితంగా ఇస్తా.

జ్యోతి (భారత్):
నేను అవసరమున్నంతే వండుతాను. ఎక్కడ అవసరముంటే అక్కడే లైట్లు వేస్తాను. ఎక్కువగా , కిటికీలు, తలుపులు తీసి పెడతా గాలి కోసం (మెయిన్ డోర్ కాదు). ఇక నో లిఫ్ట్, ఎక్కువగా బస్ ప్రయాణం. ఎండాకాలంలో ఐతే పది గంటలకే అన్ని తలుపులు మూసి, కిటికీలకు పరదాలు కడతాను చల్లగా ఉండడానికి. కూలర్ వేసే పనిలేకుండా. ఇక నో ఏసి (కొనే ప్రసక్తి లేదు కూడా). రాత్రిళ్ళు మాత్రమే వాడే కూలర్లలో వట్టివేళ్ళ ఫిల్టర్స్ పెడతాం. కూలర్స్ కి అవే పెడతాము .

కొండవీటి సత్యవతి (భారత్):
మా ఇంట్లో గ్యాస్ 2 నెలలు వస్తుంది. ఎర్ర బల్బులని పీకేసి తెల్ల బల్బులు పెట్టాం. మాది గవర్నమెంటు బంగలా కాబట్టి సెక్యూరిటీ లైట్స్ ఉంటాయి. వాటిని తీసెయ్యమని పోరుతున్నాను. సెక్యూరిటీ భంగం అని జడిపిస్తారు. రాత్రి అంతా ఉంచకుండా పదింటికి ఆర్పించేస్తాను. ప్రయాణాలకి ఎక్కువగా మెట్రో (MMTS) ఉపయోగిస్తాను. మెట్రో రెయిల్లో ప్రయాణం హాయిగా ఉంటుంది.

వాడవల్లి నాగమురళి (ఇంగ్లండు):
ఇక్కడ అవగాహన కొంచం ఎక్కువే.ప్రభుత్వం వాళ్ళు కూడా కొంచం దృఢంగానే వ్యవహరిస్తున్నారు. పెద్ద కార్లు, ఎక్కువ కాలుష్యం చేసే వాహనాలకి టాక్సు ఎక్కువ ఉంటుంది. అలాగే వస్తువులు రీసైకిల్ చెయ్యడానికి కూడా వేర్వేరు బిన్సు ఉపయోగించాలి అని కౌన్సిలు వాళ్ళు గట్టిగా రూల్సు పాస్ చెయ్యబోతున్నారు.
Many of the banks are making the recycle bins compulsory. They are not letting people to print unnecessarily or dispose items everywhere.
I hear from friends that environmental awareness is more in Europe than in US. That surprised me a bit.

Personally, I have done a few changes in life style in recent past.
1. We are religiously putting all plastic bottles etc in recycle bins.
2. Regarding Electricity usage also, we are religiously putting lights off and switching computers etc. off if not necessary.
3. I have been making sure that I switch off my computer every day in the office, and also switch off the monitors of my colleagues when I leave work.
4. When we do weekend shopping, we have started using a shopping trolley to minimize plastic bags use.
5. We always use public transport.
6. I have informed my family in India about batti bandh.

నివేదిక మూడవ (చివరి) భాగం

Comments

Ramani Rao said…
నేను ఈ సభ కి రాలేకపోయాను కాబట్టి వ్యాఖ్య ద్వార నేను చేసేవి+ నా అనుభవాలు మీతో పంచుకొంటున్నాను.

నాకు మొదటినుండి కరెంట్ విషయంలో చాల పిసినారి అన్న గొప్ప బిరుదు ఉంది.ఇప్పుడు ప్రత్యేకంగా ఆ లైట్ ఆర్పండి వృధా వద్దు అనే ప్రసక్తి లేదు ఇంట్లో ముందునుండి అలవాటవడం వల్ల. కరెంట్ బిల్ల్ ఒక నెల ఎక్కువ వచ్చిందా ఇక ఇంట్లో యుద్ధ వాతారవరణం నెలకొంటుంది. కుటుంబ సబ్యులు ఎక్కడుంటే ఆ గదిలోనే లైట్ వెలుగుతుంది మా యింట్లో. ఎవరి గదుల్లో వారు అన్న నియమం మా యింట్లో లేకపొవడం అనేది ఇక్కడ నాకు ప్లస్ పాయింట్. ఇంట్లో అందరమూ ఉండేది తక్కువ సమయం కాబట్టి అందరమూ ఒకేచోట (ఒకే గదిలో) ఉండాలి అన్నది నా అభిప్రాయం. పొద్దున ఆఫిసు టైం హడావిడి కాబట్టి బస్ ప్రయాణమైనా, తిరిగి ఇంటికి మటుకు ఎం. ఎం. టిఎస్ లో వస్తాను. పొద్దున్న ఒక గంటలో వంట అయిపోతుంది,ఆ తరువాత ఇక వంట ఇంటి జోలికి వెళ్ళే అవసరం రాదు, సాయంత్రం అన్నం ఒక్కటే కాబట్టి అలా కరెంట్ save అయిపోతుంది. అసలు మా యింట్లో టి.వి పెట్టడం అనేది, ఎవరన్నా వచ్చి మీ ఇంట్లో టి.వి ఉంది అని గుర్తు చేస్తేనే ఆలోచన వస్తుంది. కంప్యూటర్ నేను ఇంట్లో ఉన్నప్పుడే వాడేది. కూలర్లు అవి వేసవి కాలం కాకపోతె pack చేసి అటకెక్కించెస్తాము. వెలయినంతవరకు ఫాన్ కూడా పని చెప్పకుండా స్వచ్ఛమైన గాలి వచ్చే ప్రయత్నాలు చేస్తాము.

ఇక నేను ఇరుగు పొరుగు వారికి నా వంతు కృషిగా చెప్పాను జూన్ 15 మన ఉద్యమమం గురించి, నేను సాధారణం గా డెసెంబర్ 31 నాడు మొత్తం లైట్స్ అవి పెట్టి చుట్టుపక్కల పిల్లలతో తెల్లవారుజాము 3 గంటల దాక గాన భజాన, ఆటలు మొ! నిర్వహిస్తాను. ఆ అనుభవం ఇప్పుడు నాకెంతో తోడ్పడింది. కాబట్టి పిల్లలూ!! జూన్ 15 మా అపార్ట్మెంట్ లో, మరియూ చుట్టుపక్కల అపార్ట్మెంట్లో లైట్లన్నీ ఆర్పేసి మా ఇంటి పైన రాత్రి 7 గంటలనుండి మన ఇష్టం వచ్చినట్లు చిన్ని చిన్ని కొవ్వొత్తులు పెట్టుకొని మనందరం కలిసి అల్లరి అల్లరిగా సందడి చేసేద్దము. మీరందరూ కూడా రావచ్చు(ఇప్పుడే గా స్కూల్స్ మొదలయ్యింది, చదవక్కర్లెదు కదా.. రమణి ఆంటి బోల్డు ఆటలు నేర్పించేస్తుంది అందరికి వచ్చేయండొచ్చేయండి).
Sujata M said…
నేనూ, రాలేక పోయాను మీ మీటింగ్ కు.

పెళ్లి ముందు వరకూ నేనూ ఎన్విరాన్మెంట్ స్నేహితురాలినే. ఇప్పుడు కాస్త చిక్కుల్లో పడ్డాను. వద్దన్నా, ఫ్రిజ్ తీసుకోవాల్సి వచ్చింది. నాకు నడుము నొప్పి కాబట్టి - లిఫ్ట్ వాడాలి. ఉమ్మడి కుటుంబం - టీవీ కనీసం రోజుకు పదిహేను గంటలు మోగుతూనే ఉంటుంది (ఇంట్లో సీరియల్లో భక్తీ చానల్లో వార్తలో - చూస్తూనే ఉంటారు). నా మటుకూ నేను నా గది లోనే ఉంటాను. రేడియో వింటాను. ఇంటర్నెట్ వాడతాను. ఆఫీసు లో పట్టపగలు లైట్లు, ఎ.సి కంపల్సరి - ఎందుకంటే, నా గది చీకటి మయం. చెత్త తప్పకుండా ప్లాస్టిక్ బేగ్ లోనే సేకరించి పారేస్తాము. అదృష్టవశాత్తూ ఇంట్లో ఎ.సి. కొనకుండా అడ్డుకున్నాను. నేను మీ అందరిలాగా.. మంచి పనులు చేయట్లేదు కాబట్టి - మీ మీటింగ్ నివేదిక చదివి సిగ్గేసింది. రెండు పూల మొక్కలు, కిచెన్ లో ఒక మనీప్లాన్ట్ తీగె తప్ప ఏమీ పెంచట్లేదు. ఆఫీసుకి బస్సు సౌకర్యం లేదు. (రోడ్ మీద నుంచీ.. ఒక ముప్పావుగంట నడవాలి) అందుకే ఖచ్చితంగా సొంత టూ వీలర్ మీద వెళ్తాను. (ఆరోగ్య సమస్యల వల్ల ఎక్కువ దూరం నడవలేను) వంట / గాస్ వాడకం కూడా ఎక్కువే. అయితె, చేసే ఆదా అల్లా.. సి.ఎఫ్.ఎల్ కు మారడం. కారు చాలా తక్కువ వాడటం. ఇంకా నేను ఏమి చెయ్యగలనో తెలియదు.
సుజాత గారూ, ఈ ప్రయత్నం అంతా ఇంకోర్ని ఎత్తిచూపాలనో, వారు సిగ్గుపడాలనో కాదు. అందరూ దీన్ని గురించి కొంతైణా ఆలోచించాలని. మీ బ్లాగు రచనలు చదివితే మీరు విచిత్రమైన ఆలోచనలు చెయ్యడంలో అనుభవం ఉన్నవారే ననిపిస్తుంది. మిగతా వాళ్ళు చేసినవే మీరూ చెయ్యాలని లేదు. మీ రోజువారి జీవితాన్ని పరిశీలించుకుంటే మీరు చెయ్యగలిగిన పనులు మీకు తట్టకపోవు. చర్చించుకోడానికీ, ప్రోత్సహించడానికి మేమంతా ఉన్నాము.

@రమణి .. అవును .. ఈ నాటి సమాజానికి ఇలాంటి కరంటు పిసినారి చక్రవర్తులు, వనరుల పొదుపు మహారాణులు చాలా అవసరం. చిన్నప్పుడు మా తాతయ్యని చూసి, అబ్బ ఏంటీయన ఇంత పిసినారి అనుకునేవాణ్ణి .. కానీ ఇప్పుడు అర్ధం అవుతోంది. ఒకసారి ఆయన పనుల గురించి బ్లాగుతా.