బత్తీబంద్ చర్చా నివేదిక - 1

జూన్ 15 వ తేదీన హైదరాబాద్ నగరంలో బత్తీ బంద్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిన విషయం మీకు తెలిసినదే. ఈ సందర్భాన్ని పురస్కరించ్కుని కూడలిలో పది మందిమీ చేరి చర్చించుకుంటే బావుంటుందని మిత్రులు సూచిస్తే మంచి అవిడియా అనిపించింది. ఈ సమావేశం శనివారం జూన్ 7వ తారీకున భారత్ సమయం సాయంత్రం 7 నించీ 10 దాకా జరిగింది. వివిధ దేశాలనించి పలువురు బ్లాగర్లు, బ్లాగు పాఠకులు, ప్రోత్సాహకులు ఇందులో పాల్గొన్నారు.

ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు చెప్పిన మిత్రులు పరుచూరి శ్రీనివాస్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బ్లాగుల్లో బత్తీబంద్ వొరవడి సృష్టించి, సహజ బద్ధకస్తుడినైన నాకు కూడా మొమెంటం పుట్టించిన ప్రశాంతికీ ధన్యవాదాలు. ఇటువంటి సమావేశాలు జరగడానికి వెసులుబాటు కల్పిస్తూ చాట్ సృష్టించి నిర్వహిస్తున్న కూడలి అధినేత వీవెన్ కి మరోమారు జేజేలు. నివేదిక తయారీలో అడగంగానే సహాయం అందించిన కొత్త మిత్రులు శ్రీమతి స్నేహ కి కూడా జేజేలు.

కొన్ని గమనికలు
మాట్లాడదామని వచ్చి, అవకాశం రాకనో, ఇంటర్నెట్ సమస్య వల్లనో, లేక తమ దేశంలో కాలాతీతం అవడం వల్లనో మాట్లాడకుండా వెళ్ళిపోయిన సభ్యుల నించి క్షమాపణ వేడుతున్నాను. మీకు బ్లాగులుంటే అందులో మీరు చెప్ప దల్చుకున్న విషయాలు రాయమని కోరుతున్నాను. బ్లాగు లేకపోతే, నాకో మెయిలు పంపితే, మీ ఆలోచనల్ని బత్తీబంద్ బ్లాగులో ప్రచురిస్తాను.
సభ్యులు చెప్పిన ముఖ్య విషయాలు, సాధ్యమైనంత వరకూ సంపూర్ణంగా, అర్ధవంతంగా ఈ నివేదికలో ప్రచురించడానికి ప్రయత్నించాను. ఎక్కడైనా పొరబాటున మీ మాటలు తారుమారు ఐటే ముందుగానే క్షమాపణ కోరుతున్నాను.
చివరిగా పాఠకులకి ఒక విజ్ఞప్తి. సుమారు మూడు గంట్ల సేపు పలువురు చెప్పిన విషయాల సారం కావడం వలన ఈ నివేదిక బాగా పొడుగ్గానే ఉంది. ఐనా కాస్త ఓపికా, తీరికా చేసుకుని ఆసాంతం చదవండి. ఇందులో విషయాలు ఏమాత్రమైనా మీ ఆస్కతిని రేపెట్టితే, వాటిని గురించి ఆలోచించండి, మిత్రులతో మాట్లాడండి, ఆచరణలో పెట్టండి.
అన్నిటికంటే ముఖ్యం .. జూన్ 15 రాత్రి 7.30 నించీ 8.30 దాకా .. బత్తీబంద్ .. మరిచిపోకండి!

చర్చలో పాల్గొన్నవారు: మేధ, సూర్యుడు, పవన్, జ్యోతి, వెంకట్, కొత్తపాళి, మహేష్, రవిశంకర్, రాజేంద్ర , ప్రసాద్, రాజశేఖరుడు, నల్లమోతు శ్రీధర్, CHS ప్రసాద్, స్నేహ, శ్రీకాంత్, చక్రవర్తి , కొండవీటి సత్యవతి, ప్రశాంతి, మంజుల, మాలతి, పరచూరి శ్రీనివాస్, రాణి, నాగ మురళి, క్రిష్ణ మోహన్, అతీఖ్, కస్తూరి మురళిక్రిష్ణ , కందర్ప కృష్ణమోహన్

సమస్యని పరిచయం చేస్తూ కొత్తపాళి global warming గురించి చెప్పారు.
భూతాపం అంటే మనం వుంటున్న వూరిలో వేసవి వేడి ఎక్కువ కావడం అని చాలా మంది అనుకుంటూన్నట్టు ఉన్నారు. మన ఊళ్ళో ఉష్ణోగ్రత పెరగడం అనేది, చాలా localized phenomenon. చుట్టు పక్కల చెట్లు అంతరించడం, ఫేక్టరీలు ఎక్కువ కావడం, ఇత్యాది. ఈ పరిణామాల్ని స్థానిక చర్యలతో కొంత వరకూ అరికట్ట వచ్చు. గ్లోబల్ వార్మింగ్ అనే సమస్య స్వరూపం వేరే. విపరీతమైన ఇంధన వాడకం వల వాతావరణంలో CO2 వంటి వాయువుల నిష్పత్తి బాగా పెరుగుతుంది. ఇది మొదటి అడుగు. భూమి మీద పడిన సౌర శక్తి అనేక రకాలుగా మార్పు చెందుతుంది. ఈ గ్రీన్ హౌస్ వాయువుల నిష్పత్తి పెరిగే కొద్దీ, సౌరశక్తి ఇదివరకటికంటే ఎక్కువగా వాతావరణంలో నిలవ ఉండటాం మొదలు పెడుతుంది. అందుకని భూమి మొత్తమీద వాతావరణ ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంటుండి.ఇది రెండో అడుగు. మూడో అడుగులో, ఈ పెరిగిన ఉష్ణోగ్రత వల్ల ముఖ్యంగా రెండు పరిణామాలు జరుగుతాయి ..
1. ధ్రువాల దగ్గర మంచు టోపీ కరగటం, తద్వారా సముద్రపు తలం పైకి లేవటం
2. సముద్ర జలాలలోనూ, వాతావరణం (గాలి) లోనూ ఉష్ణోగ్రత పెరిగి, ప్రపంచ వ్యాప్తంగా weather patternsలొ అనూహ్యమైన మార్పులు రావడం. అదీ స్థూలంగా భూతాపం పెరగడం యొక్క స్వరూపం.
If this trend continues the underlying platform that has been supporting human life style of 20th century will collapse.
Just one example, fish industry: A lot of commercial fishing depends on seasonal migration of various fish the migration gets disrupted and the fish food chain gets disrupted. Fish are in short supply. Immediate effect is seafood prices begin to sky rocket. Next effect is the millions of people who depend on fish industry for their livelihood will lose their livelihoods. They need to look for new jobs, new skills - increasing the pressure on the local economy .. so on and so forth.

భూతాపం వల్ల వచే సమస్యల గురించి ప్రసాద్ చెప్పారు. ఈ భూతాపం వల్ల వచ్చే సమస్యలు చాలా రకాలుగా వున్నాయి. వాతావరణ మార్పుల వల్ల ఋతువుల్లో తేడాల వల్ల దక్షణ అమెరికాకు వలస వచ్చే కొన్ని పక్షి జాతులకు వాటి వలస సమయంలో తిండి దొరకట్లేదట. దీనితో వాటి సంతానం తగ్గిపోయి క్రమేపీ అంతరించే ప్రమాదముందంటున్నారు.

"An Inconvenient Truth" అనే డాక్యుమెంటరీ సినిమాలో భూతాపం ఎలా పెరుగుతోందో చక్కగా వివరించారు అని ప్రసాద్ గారు చెప్పారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత, ఆల్ గోర్ నిర్మించిన డాక్యుమెంటరీ ఇది. సుర్యుడు గారి office లో ఈ video రోజు screening చేస్తున్న విషయం చెప్పారు. ఇది చాల మంచి పని అని అందరు చెప్పారు. DVD వివరాలకు ఇక్కడ చూడండి.

నివేదిక రెండవ భాగం
నివేదిక మూడవ (చివరి) భాగం

Comments

మోహన said…
కొత్త పాళీ గారు, నమస్కారం. నా పేరు విశాల. నేను బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాను. యాదృచ్చికంగా నేను ఈ పేజీ చదవటం జరిగింది. ఈ సమావేశం గురించి నాకు సరైన సమయానికి తెలియలేదు. కానీ మీ నివేదిక నుంచి అన్ని వివరాలను సేకరించగలిగాను. ధన్యవాదాలు. ఇక్కడ నా అనుభవాలను కూడా జతపరచాలనుకుంటున్నాను.

కార్పొరేట్ సంస్ధల్లో టిష్యూ పేపర్లు చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఈ టిష్యూ పేపర్ల ఉత్పత్తికి ప్రపంచం మొత్తం మీద రోజుకు కొన్ని వేల చెట్లు నరికివేయబడుతున్నాయి. కాబట్టి, నా వంతు నేను వీటిని వాడటం మానివేసాను. రోజూ రుమాలు తెచ్చుకోవటం మొదలు పెట్టాను. అప్పటి వరకూ నాకు ఎప్పుడూ అలవాటు లేకపోవటం వల్ల, కొన్ని సార్లు మర్చిపోయేదాన్ని. నా మరుపుకు ఒక excuse లేకుండా ఆ రోజు నా ఓణీనే రుమాలుగా లేకపోతే గాలికే చేతులు ఆరబెట్టుకోవటం. ఇలా కొన్ని రోజులకు నాకు రుమాలు అలవాటు చేసుకోవటం కష్టం కాలేదు. కొంత మంది నవ్వినా, కొంత మంది విపరీతం అని పెదవి విరిచినా, నా ఈ విక్రమార్క ప్రయత్నం తో కొద్ది మందిలో మార్పు తీసుకురాగలిగాను.

ఇక రెండో విషయం, రోజుకు ఎంతో మంది public transportaion వాడుతుంటారు. వారిలో కొంత మందికి నెలసరి పాస్ లు ఉన్నా, టికెట్ తో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువే! టికెట్ పరిమాణమ్ చాలా చిన్నది కావటం వల్ల, అవి రీసైకిలింగ్ కి వీలవకుండా, ఎక్కువగా మట్టిలో కలిసిపొతున్నాయి. దీనివల్ల నష్టం లేకపోయినా, ఒక్క రోజులో నరికిన ఆ చెట్లను తిరిగి ఆ స్దాయికి తేవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదీ.. ఏ పుణ్యాత్ముడైనా నాటితే..! ఇలా చిన్నగా కనిపించినా పెద్ద మొత్తంలో మార్పు తీసుకురాగల అంశాలు ఎన్నో ఉన్నాయి. కానీ పరిష్కారం అంతుబట్టటంలేదు.

ఈ అంసాలపై మీ అభిప్రాయం తెలుపగలరు. అలాగే మిగతావారికి తెలిపే సులువైన మార్గం ఉంటే చూపగలరని ఆశిస్తున్నాను.
CONGRATULATIONS

for motivating the many telugu bloggers to write abt global warming and organising the online meeting successfully. Hats off to u for bringing many bloggers from diff parts of the world at one place and discuss on this topic.
విశాల గారూ, తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం. ఓపికగా మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. రుమాలు వాడ్డం చాలా మంచి పని. నేనూ చాలా ఏళ్ళుగా చేతి రుమాలు వాడుతున్నాను.
మీరు ఈ విషయమై ఇంకా ఏమైనా విపులంగా రాయదలిస్తే నాకు మెయిల్ చెయ్యండి. బత్తీబంద్ బ్లాగులో ప్రచురిస్తాను.
kottapali at yahoo dot com