బత్తీ బంద్ దండోరా - 1

గత రెండు వారాలుగా నా బ్లాగుల్లో బొత్తాల బొత్తిలో
దీపాలు ఆర్పండి
అని ఒక నల్ల బొత్తాన్ని చూసే ఉంటారు. దాని మీద క్లిక్కారో లేదో .. అది మిమ్మల్ని
చీకటిలో .. చీకటితో
అనే బత్తీబంద్ బ్లాగుస్థానుకి చేరుస్థుంది.

వచ్చే నెల 15 వ తేదీ హైదరాబాదు బత్తీ బంద్!



మీ కేలండర్లో నమోదు చేసుకోండి.
మీ ఇరుగు పొరుగు వారికీ, కాలనీ లేదా అపార్ట్మెంట్ వాసులకీ తెలియ చెయ్యండి.
మీ బంధు మిత్రులందరికీ చెప్పండి. వేరే రాష్ట్రాల్లో ఉన్న వారికి కూడా!
మీరు వ్యక్తిగతంగానో, కుటుంబంతో కలిసో ఆ గంట సేపూ ఏం చెయ్యబోతున్నారో ముందుగానే ప్రణాళిక వేసుకోండి.
మీకు కనక బ్లాగుంటే (ఏ భాషలో అయినా సరే) దీన్ని గురించి ఒక పోస్టు రాయండి.

నా విన్నపాన్ని మన్నించి (అదే లేండి, నా పోరు పడలేక) పలువురు బ్లాగ్ప్రముఖులు ఈ విషయమై టపాలు రాశారు. కొన్ని వినోద భరితమైనవి. కొన్ని విశ్లేషణాత్మకమైనవి. మరి కొన్ని ఆలోచన రగిలిస్తే ఇంకొన్ని కర్తవ్యం గుర్తు చేసి కార్యోన్ముఖుల్ని చేస్తున్నాయి.
ఓ లుక్కెయ్యండి. ఆ పైన కొంచెం దీన్ని గురించి ఆలోచించండి. కనీసం ఇంకొక్కరితో దీన్ని గురించి మాట్లాడండి.

ఇప్పటివరకూ ప్రచురితమైనవి.

జ్యోతి గారి సరూపక్క ముచ్చట్లు
మనలోమాట రమణి గారి చీకటిలో వెన్నెల వెలుగులు
పర్ణశాల మహేశ్ గారు ఉవాచ
తెలుగు తూలిక మాలతి గారి ఎన్నెం కత
నాగమురళి గారి శంఖారావం
సాహితీయానం బొల్లోజు బాబా గారి చిక్కని కవిత
వాగ్విలాసం రాఘవ గారి మండిపాటు
తప్పటడుగుల గిరి గారి విశ్లేషణ
జోరుగా హుషారుగా శ్రీకాంత్ గారి ఆత్మ పరిశీలన
వికటకవి శ్రీనివాస్ గారి ప్రశ్నలు
రానారె గారి సణుగుడు
సంగతులూ సందర్భాల శ్రీరాం గారు
మానసవీణ నిషిగంధ గారి నేను సైతం

త్వరలో .. తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం గారు, సరూపక్క చెల్లెలు యెన్నెల, కొల్లూరి సోమ శంకర్ గారు, ఇంకా ...

Comments

Ramani Rao said…
ఇందుమూలంగా మేము (బ్లాగర్స్) చెప్పోచ్చేదేమంటే, హైదరాబాదు నగరవాసులున్నూ, మిగతా ప్రదేశాలవారున్నూ, జూను 15 తారీఖును మరవకుండా రాత్రి ఓ గంట లేదా గంట తరువాత మీకు వీలయినంత కాలము, విద్యుత్తు పరికరాలని నిలిపివేయాలని, బ్లాగుల ద్వారా చేసిన ఈ ప్రచారాన్ని సఫలీకృతం చేయవలసిందిగా విన్నవించడమయింది.