రెండో కథకి గడువు పొడిగింత

పలువురు బ్లాగ్జనుల కోరిక పై రెండో కథాంశానికి కథలు సమర్పించే గడువు పొడిగించడమైనది. ఔత్సాహిక కథకులకి ఏప్రిల్ 25 వరకూ సమయం ఉంది. త్వరపడండి :-)

అసలు ఏంటీ, కథాంశం, గడువు అనుకుంటున్నారా?
ఐతే ఇక్కడ చూడండి. కాస్త ఓపిగ్గా ఆ టపా చివరిదాకా చదివితే అసలు కథ మీకే తెలుస్తుంది.

ఇప్పటిదాకా వెలువరించిన వారు: లలిత, రమ, తాడిమేటి రాజారావు, మయూఖ, దైవానిక, రమ్య.
ఎవర్నైనా నేను గమనించక పోతే దయచేసి నాకో వేగు పంపండి.

Comments

గురూగారూ, నేను పంపిన కథ గురించి మరిచిపోయారా..? ప్రస్తావించనేలేదు..?
-రాజారావు తాడిమేటి.
అయ్యో సారీ అండీ. పొద్దున ఆ టపా హడావుడిగా వేస్తూ ..
సవరిస్తాను.
SD said…
మీరు బహుమతి గురించి చెప్పలేదు. కష్టానికి ఫలం లేదే అని నేను పంపించలేదు. ;-)
బహుమతి గతనెల పోటీ లాగానే. గెలిచిన వారికి నాలుగైదు పుస్తకాల్లో మీకు నచ్చిన పుస్తకం ఎంచుకోవచ్చు.
కొత్త పాళీ గారు,పోటీ కథాంశము ఇప్పుడే చూసాను.అయితే,నేను పోటీలో పాల్గొనను.మీ పోటీ ఫలితాలు వచ్చిన తరువాత నేను ఒక కథ రాస్తాను,ఈ అంశాల ఆధారంగానే!అభ్యంతరం లేదు కదా?ఎందుకంటే,మీరిచ్చిన అంశం చాలా ఉత్తేజాన్ని,ఉత్సాహాన్ని కలిగిస్తోంది.ఈ నేపధ్యంలో అనేక విభిన్న కథలను సృజించవచ్చు.
మురళీ కృష్ణగారూ,
తప్పక రాయొచ్చండీ. పోటీ ప్రైజు అనేవి కొత్త వారికి కాస్త చురుకు పుట్టించడం కోసం - అంతే. మీరు రాశాక బ్లాగులో పెట్టినా మరెక్కడైనా ప్రచురుంచినా నాకో మెయిలు కొట్టడం మరిచిపోకండి.
Anonymous said…
కొత్తపాళీ గారూ, మీ కొత్త కథ థీం బావుంది. నేను కథ మొదలెట్టాను. (నాకు కథలు రాయడం రాదు, కబుర్లు చెప్పడం తప్ప).నా కథ చదివిన తర్వాత భళ్ళున వాంతి చేసుకున్నాను. ప్రయత్నం మానేసి, కథల కోసం ఆసక్తి తో ఎదురు చూస్తున్నాను.
గురూగారూ, మా కథల సంగతి ఏమయ్యింది..? గడువు ముగిసి వారం రోజులు కావస్తున్నా వాటి ఊసేలేదు..?
నాకున్న వెసులుబాటు మీద అనుకోకుండా విపరీతమైన వత్తిడి వచ్చింది. ఈ వారాంతములో ఫైనలు చేస్తాను.