బహుమతి ఎవరికంటే ..

... నివేదన రమ్యగారికి.

కథకి బలాన్నిచ్చిన విషయాలు


ఇచ్చిన విషయానికి తగినట్టు కథా వాతావరణాన్ని కల్పించుకోవడం, కల్పించుకున్న వాతావరణానికి తగినట్టే కథలోని సంఘర్షణ, క్లైమాక్సు .. అన్నీ పరస్పరం దోహదం చేసుకుంటూ ఒక సంపూర్ణమైన కథ చదివాము అన్న తృప్తి కలిగించాయి.
కథని పదేళ్ళ శివ గొంతులో చెప్పటం. తెలిసీ తెలీని వయసు. ఆ వయసులో తలిదండ్రులో టీచర్లో ఏవన్నా చెబితే నమ్మేసే వయసు. అలాగని పూర్తి అమాయకత్వమూ కాదు, అప్పటికే ఎన్నో జీవిత పాఠాలు అనుభవంలోకి వచ్చున్నాయి. ఈ గొంతుని పట్టుకోవడం అంత సులభం కాదు. ఈ ప్రయత్నంలో రచయిత్రి చాలా వరకూ సఫలమయ్యారు.
కథ గమనం, వడి. ఎక్కడా తాత్సారం లేదు, అలాగని కప్పగంతులూ లేవు. సాఫీగా నడుస్తుంది.
కథలో అడుగడుగునా కనబడే వాస్తవికత (realism). వాస్తవికత అంటే కేవలం పాత్రలూ సంఘటనలూ నమ్మదగినట్టు ఉన్నాయా లేదా అని కాదు. రచనలో అదొక తాత్విక దృక్పథం. కొంత వివరణకి ఈ వికీ పేజి చూడండి.
క్లైమాక్సు కి ఎంచుకున్న నమూనా, నమ్మ దగినట్టుగా, పాత్రల స్థాయికి తగినట్టుగా, సందర్భోచితంగా ఉంది.
నాకు గొప్పగా నచ్చిన విషయం .. ఎక్కడా పేదరికాన్ని గానీ, పిల్లాడి ఆశల్ని గానీ, స్థాయికి మించి రొమాంటిసైజ్ (romanticise) చెయ్యలేదు. ఈ విషయం మీద వచ్చిన ఇతర కథలు కొన్నిట్లో ఈ రొమాంటిసైజేషన్‌ బలంగా కనిపిస్తుంది.

ఇంకొంచెం శ్రద్ధ పెట్టవలసిన విషయాలు.
భాషలో సమతుల్యత. గణితం మేస్టారు లాంటి ప్రయోగాలు పలుకుల్లా ఉన్నై.
పిల్లాడి గొంతులో కథ చెప్పినప్పుడు వాడికి అందవు అనుకున్న విషయాలు (విపణి ఆర్ధిక సూత్రాలు, కుట్రలు, నిజాలు) ఎలా చెప్పించాలా అనేది ఇంకొంచెం ఆలోచిస్తే బావుంటుంది .. దీనికి కొన్ని చిత్రమైన ఊహలు చెయ్యొచ్చు.
ఉత్తమ పురుషలో కథ చెప్పేప్పుడు కొంచెం జాగర్తగా ఉండాలి. ఉదాహరణకి శివ తనకి తెల్లకాగితం దొరికిన రోజున ఇలా అంటాడు - "శీను గాడి నోటు పుస్తకం సంగతి పూర్తి గా మర్చి పోయాను." వాడు గనక నిజంగా మర్చిపోతే .. పని గట్టుకుని ఆ విషయం చెప్పలేడు. ఇది పేరడాక్స్.
సరే పంక్చువేషన్‌ మార్కుల గురించి విజయకుమార్ గారు ఆల్రెడీ సెలవిచ్చారు.

రచయిత్రికి అభినందనలు.
రమ్య గారూ ఈ కింది పుస్తకాల్లో మీకు నచ్చినది ఎంచుకుని మెయిల్లో నాకు తెలియ జేస్తే మీకది అందే ఏర్పాట్లు చేస్తాను.
సతీష్ చందర్ చంద్రహాసం
కథ 2006
పి. సత్యవతి మంత్ర నగరి
నల్లూరి రుక్మిణి జీవన స్పర్శ

కొత్త కథా విషయం


హైదరబాదులో కొన్ని దూరప్రాంతాల రూట్లలో 8 మంది కూర్చునే షేర్ ఆటోలు నడుస్తుంటాయి. రాజేంద్ర నగర్ ఏజీ విశ్వ విద్యాలయం నించీ మెహ్దీపట్నం చౌరస్తాకి సుమారు ముప్పావు గంట ప్రయాణం. ఒక మిట్ట మధ్యాన్నం ప్రయాణంలో డ్రైవరు కాక ఐదుగురు ఉన్నారు. 20-22 ఏళ్ళ గ్రేడ్యువేటు యువకుడు, బహుశా విశ్వవిద్యాలయంలో కొత్త విద్యార్ధి, హైదరాబాదుకి కొత్త. 40-45 ఏళ్ళ ఆఫీసరు లాంటి ఒకాయన. సఫారీ సూటు, బ్రీఫ్ కేసు. సొంత కారు పాడైతే విధిలేక ఇలా వెళ్ళాల్సి వచ్చినట్టుంది. 30-35 ఏళ్ళ పల్లె స్త్రీ. కాయకష్టం చేసుకునే మనిషిలా కనిపిస్తోంది. కానీ ఏదో ప్రత్యేక పరిస్థితి కోసం ముస్తాబైనట్టు ఉంది. ఆమెతో పాటు 13-15 ఏళ్ళ కూతురు. కొత్తగా యవ్వనం ప్రవేశిస్తున్న శరీరం, ఆమె కూడా తల్లిలాగే ముస్తాబైంది. తరచూ సిటీలోకి వెళ్ళే అవకాశం రాదు గనక కొంత ఉత్సాహంగా ఉంది. వీళ్ళందరూ కాక ఒక 30-35 ఏళ్ళ మగవాడు. బట్టలూ వాలకం చూస్తే రైతో, రైతు కూలీనో అన్నట్టున్నాడు. చేతిలో ఎరువుల గోతం గుడ్డని చించి కుట్టిన సంచీ బాగా బరువుగా ఉన్నట్టుంది. సంచీ లో పైన కొడవలి పిడి బయటికి తొంగి చూస్తోంది.

ఆ ప్రయాణంలో ఏం జరిగింది ఈ పాత్రల మధ్య?

గమనికలు
ప్రయాణం హైదరాబాదులోనే జరగనక్కర్లేదు. మీకు బాగా పరిచయమైన ఏ సిటీలోనైనా జరగచ్చు.
సబర్బన్‌ బస్సు రైలు లాంటీ వాహనాల్లోనైనా జరగ వచ్చు కానీ షేర్ ఆటోలో జరగడంలో ఒక నిశ్చితమైన ప్రయోజనం ఉంది.
ఇతర పాత్రలని కావాలంటే ఉపయోగించుకోవచ్చు.
కథ విద్యార్ధి యువకుడి దృష్టి నించి చెబితే బలంగా ఉంటుందని నా అభిప్రాయం. అలాగే చెప్పాలని ఏం లేదు.

గడువు ఏప్రిల్ 20



ఒక విన్నపం. తమ కథని ఈ మాట పత్రికకి ప్రచురణార్ధం పంపాలి అనుకునే వారు కథని బ్లాగుల్లో ప్రచురించకుండా నేరుగా నాకు పంపవలసింది.

Comments

Anonymous said…
Congratulations Ramya!
Anonymous said…
idi anyAyaM. ramya gArU mIku bahumati vaddu ani ceppEsi nA sTOrI elAgA cettabuTTalO paDEsAru kanaka dAnni bayaTaki tIsi nAku bahumati immani rekamaMD cEyaMDi. cAlA thEMks muMdugAnE :-) Just LOL
Sarma Danturthi
తొలి విజేత రమ్యగారికి అభినందనలు. :)

ఈ మారు యిచ్చిన వస్తువు చాలా ఆసక్తికరంగా వుంది. ఇంతకు ముందులాగా పరిమితుల్లేమీ లేవు. సృజనాత్మకతకు మంచి పరీక్ష. వైవిధ్యభరిత కథనాలు వెలువడతాయని ఆసక్తిగా చూస్తున్నాను.
S said…
రమ్య గారికి అభినందనలు.
ఈవస్తువు కూడా బాగుంది. ఈసారికూడా సమయం చిక్కితే రాసేందుకు ప్రయత్నిస్తాను.
oremuna said…
విజేతకు అభినందనలు! కొత్తపాళీ గారూ మీరు మొదలుపెట్టిన ఈ విషయం చాలా విజయం చెందింది మీక్కూడా అభినందనలు.

అయితే ఈ విజయానికి మొదట్ ఇకారణం మన బ్లాగులోల్ల ఉత్సాహం,

రెండవ కారణం మీరిచ్చే అంశాలు అవి సింపుల్ గా ఉంటున్నాయి, కాంప్లెక్స్ గా ఉంటున్నాయి, ఆసక్తి కరంగా ఉంటున్నాయి, ప్రేరణగా ఉంటున్నాయి, ప్రోత్సహిస్తున్నాఇ, చాలెంజ్ చేస్తున్నాయి, ..............
Aruna said…
Wav.. Ofice lo gantulu veyyaTam kudardu kabaTTi, chirunavvulato aagipoyAnu. kaThalu raayaDam ikanunDi modalupeTTachu nEnu kUDa. :)
రమ్య అభినందనలు..

వచ్చే కథలో విజయ్ కుమార్ గారు చెప్పిన సూచనలు పాటిస్తే సరి..

శర్మగారు, మీ కథ చెత్తబుట్టలో ఎందుకుంటుంది. ఈరోజే మీ బ్లాగు మొదలెట్టి , అందులో ప్రచురించండి. మేమందరం చదవొద్దా.
Anonymous said…
"ఎక్కడా పేదరికాన్ని గానీ, పిల్లాడి ఆశల్ని గానీ, స్థాయికి మించి రొమాంటిసైజ్ (romanticise) చెయ్యలేదు."
ఇది నాక్కూడా బాగా నచ్చిన విషయం. ఈ కధలో పేదరికాన్ని రచయిత చూపిస్తే చాలు, పాత్రలు ప్రత్యేకం గా ఆ పేదరికం తాలూకూ సెల్ఫ్-పిటీ ని తమ సమ్భాషణ ద్వారా, అలోచన ల ద్వారా వ్యక్తపరచలేదు. ఆ విధమైన స్థితి ని ఆ అబ్బాయి సాధారణం గా భావించి కధని సహజం గా నడిపించారు.
congrats Ramya!
Ramani Rao said…
ramya congratulations
Anonymous said…
jyothy garu
nA katha eemataki pampimchanu. blogulo peDitE vALLu vEsukOru. If they say no, then it will appear on blog. eemaata has some crush on me for saying yes. they will neither say no. so the silence is killing me. :-(
Sarma Danturthi
ramya said…
This comment has been removed by the author.
ramya said…
అభినందనలు తెలియజేసిన వారందరికీ నా ధన్యవాదాలు.
ramya said…
This comment has been removed by the author.
రాధిక said…
రమ్యగారికి అభినందనలు.
రమ్య గారూ తరువాతి కధకి కూడా మీకే రావాలి అని ఆశిస్తున్నాను.మన తెలుగు బ్లాగులనుండి కొత్త రచయిత వెలుగుచూడడం ఆనందంగా వుంది.
అభినందనలు రమ్య గారూ :-)

కొత్తపాళీ గారూ, మంచి ఆసక్తికరమైన కధా వస్తువులను ఇస్తున్నారు మీరు!
రమ్యగారికి అభినందనలు చెప్ప దల్చుకునే వారు ఆమె బ్లాగులో కథ కింద వ్యాఖ్యల్లో రాస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.
ఇక్కడ రాయొద్దని కాదు, మాడెరేషన్ వల్ల నేను చూసి, విడుదల చేస్తే గానీ ఆమెకి కబడవు కదా.

రాధిక గారి కోరిక మరీ అన్యాయంగా ఉంది. :) మీరు రమ్య పంకా ఐతే అవ్వచ్చు గానీ ఇక్కడ మొనాపలీ చెల్లదు. అంతే గాక, రమ్య ఈ కథకి ముందే కథా రచయితగా వెలుగు చూశారు.
Anonymous said…
అవునా, మరి రచయిత్రి రమ్యగారి రచనల వివరాలు?
విజేతకి అభినందనలు. నేను PROMISE చేసినట్లుగా బహుమతి పంపిస్తాను. ఎలా, ఎ ADDRESS కి పంపాలో చెప్పండి.
@ lalitha - నాకు తెలిసి ఒక కథ ఇక్కడ . ఆమె బ్లాగు మొదలెట్టిన తొలి రోజుల్లోనే కొన్ని కథలకి స్కెచ్ ల లాగా రాసినట్టు గుర్తు.
@ krish - వ్యక్తుల ఇంటి చిరునామాలు ఇలా బహిరంగ వేదికల్లో ఇచ్చుకోవటం అంత మంచిది కాదు. క్రిష్ గారూ, రమ్య గారి బ్లాగులోనే మీ ఈమెయిలు చిరునామా ఆమెకి ఇచ్చి అలా కాంటాక్ట్ చెయ్యమనండి.
రమ్య గారు, అభినందనలు
సోమ శంకర్
ramya said…
This comment has been removed by the author.
ramya gaaroooo.. please send your address to my imail id:

jallipallik@gmail.com

then i will courier.
best regards
krishna rao jallipalli
guntur
cell: 9949517103
Anonymous said…
అందరితో పెట్టుకుంటే నాకొచ్చే చాన్సు లేదు గానీ. నాకు ఏదన్నా కన్‌సొలేషన్‌ బహుమతి మామూలు బహుమతి కన్నా ఓ పది రెట్లు విలువైంది ఇస్తానంటే నేను కూడా రాస్తా. ఏమంటారు.

ఇవ్వకపోతే పిసినారోడని ఓ టపా రాస్తా :-) ఇస్తే మా సాక్షి పత్రికలో ఓ ప్రకటన ఇస్తా.

-- విహారి
మేధ said…
కొత్తపాళీ గారు: నేను కూడా తెల్లకాగితం కధ వ్రాశాను, నా బ్లాగులో పెట్టాను.. చూడగలరు..
Naga said…
మాస్టారూ: ఈ ప్రయత్నం చాలా ఆసక్తికరంగా ఉంది.
రమ్య గారికి అభినందనలు.
Anonymous said…
రమ్యగారు అభినందనలు. అశేష బ్లాగర్లని విశేషంగా ఆకట్టుకున్న ఈ కధాకళి రాబోయే రోజుల్లో ఇంకెన్ని చిత్రాలు చూపిస్తుందో చూద్దాం.:)
Anonymous said…
కొత్తపాళీ గారు,
ఇంకెవరైనా కూడా కొత్త అంశం మీద రాస్తున్నారా (అంటే బ్లాగులో ప్రచురించక పోయినా)?
ఏంటో కొంచెం చల్లబడిందా ఉత్సాహం అన్న అనుమానం వచ్చి అడుగుతున్నాను.
కొత్తపాళీ గారూ,
ఏప్రిల్ 20వ తేదీ పోటీకి నా కథను మీకు వేగులో జతచేసి పంపాను. ఇంతటి మంచి పోటీని నిర్వహిస్తున్నందుకు మీకు నా నెనర్లు.
Dr.Pen said…
ఆలస్యంగా అయినా మొత్తానికి కథ రాసాను. మీతో ఒకసారి అన్నట్టు 'చెట్టు' నా మొదటి కథా వస్తువు.కానీ ఆ కథను కాగితం పై పెట్టలేకపోయాను. ఏదేమైనా కథలు రాయడంలో ఓనమాలు తెలియని నాతో సైతం కథ రాయించారు. ఇందులోని తప్పొప్పుల పట్టికతో ఓ లేఖ వ్రాయమని మనవి...
http://krishnadevarayalu.blogspot.com/2008/04/blog-post_14.html