నిజ జీవితంలో తెల్ల కాయితం

నేను తెల్ల కాయితం కథా వస్తువుని ప్రకటించినప్పుడు ఒకరిద్దరు మిత్రులు అన్నారు, ఇంకా ఈ కాలంలో ఒక్క తెల్ల కాయితం కూడా దొరకని వాళ్లుంటారా అని.
ఏం చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయాను.
ఐతే ఈ ఇతివృత్తాన్ని ఉపయోగించి మనవాళ్ళు చాలా మంది రాసిన కథల్లోని కొన్ని సంఘటనలు ఒక నిజజీవితంలో జరిగిన ఉదంతం ఇలా కళ్ళబడుతుందని అనుకోలేదు.

సుంకోజి దేవేంద్ర మంచి భవిష్యత్తున్న యువ కథా రచయిత. తన సొంత అనుభవాల్ని నెమరు వేసుకుంటూ అవే తనకి కథకుడిగా ఎదగడానికి ఎలా ప్రేరణ అయినాయో ఇక్కడ చదవండి తన సొంత గొంతులో.
కథ 2005 సంకలనంలో చోటు చేసుకున్న అతని కథ కొమ్మిపూలు గురించిన ప్రస్తావన ఈ సమీక్షలో చూడచ్చు.
అతని కథల సంపుటి అన్నం గుడ్డ అనే పేరుతో 2007 లో విడుదలైంది.

దేవేంద్ర గురించి, అన్నం గుడ్డ కథల సంపుటి గురించి మరి కొన్ని మాటలు.
http://kadalitaraga.wordpress.com/2007/02/23/aksharala_daarushilpi_devendra/
http://pustakam.wordpress.com/2007/07/09/annam/

దేవేంద్రని ఈ సరి కొత్త గౌరవం సాధించిన సందర్భంగా మనసారా అభినందిస్తూ ..

Comments

kottapaligaaru,those who struggle in childhood are most likely to become creative writers when they grow up.this has been proved many times in the past,and will be proved many more times in future too.sunkojis life also testifies to this fact.thanks a lot for introducing this excellent writer.
జీవితం బాక్ గ్రౌండ్ గా పుట్టకపోతే ఐ సాహిత్యమే కాదు. సపరివార పత్రికల్లో చదివి అవతల పారేసే ఆషా మషీ కథలే అవుతాయి. దేవేంద్రాచారి గారి కథలు నేను ఎక్కువగా ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో చదివాను! గొప్ప సాహిత్యాన్ని స్రుష్టించిన రచయితలందరూ చెహోవ్, మొపాసాలతో సహా జీవితంతో ఘర్షణ పడ్డవారే ! ఇప్పుడు సుంకోజి వాళ్ళ సరసన చేరారు. అతని వ్యధాభరిత జీవితం 'రాముడుండాడు..' నవలను జ్ఞప్తికి తెచ్చింది.
Ramani Rao said…
సుంకోజి గారి జీవనయాత్ర , వారి అనుభవం నిజంగా కంటనీరు తెప్పించింది. ముఖ్యంగా "క్షయ" తో బాధపడిన వైనం ఎవరితో మాట్లడకపోవడం వల్ల వచ్చిన అపార్ధాలు మనసుని హత్తుకొనే విధంగా ఉన్నాయి. భావి రచయితలకు/రచయిత్రులకు సుంకోజి గారు స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం ఎంతమాత్రం లేదు. సుంకోజి గారి కి అబినందనలతో..మంచి విషయాలను మనముందుంచిన కొత్తపాళీగారికి కృతజ్ఞతలు.
మాలతి said…
Good point for discussion. కథలమీద వ్యాఖ్యల్లో అలా ఎక్కడైనా జరుగుతుందా,అలా ఎవరైనా ఆంటారా అన్నప్పుడు నాక్కూడా అలా జరిగింది కనకే రాయడం అనాలనిపిస్తుంది.