మిస్సమ్మ

కడుపున పుట్టక పోవడమే లోపమైతే నువ్వు వారమ్మాయివేనమ్మా ..

అనడానికి ఎంత త్యాగ బుద్ధి కావాలి?

ఋజువు లడగలేదు, డాక్యుమెంట్లడగలేదు, ఇంకే సాక్ష్యాలడగలేదు ..

ఎవరో తిరనాళ్ళలో దొరికిన నాలుగేళ్ళ పిల్లని, ఎంత పిల్లలు లేని దంపతులైతే నేమి, తమ సొంత బిడ్డలా పెంచు కోవడమేవిటి, పైగా ఆ పిల్ల చదువు కోసవని అప్పు చేసి మరీ చదివించడవేవిటి .. సినిమా మొత్తం చూడండీ .. టాప్ టు బాటం .. పచ్చి కరుడు గట్టిన స్వార్ధం .. వార్నీ, ఏం తెలివిరా ఈ డెవిరెక్టరుదీ .. మన లోతు లోతుల్లోని స్వార్ధాలన్నీ మనుషుల్లోకి దట్టించి చూపించేశాడే అనుకుంటూ ఉంటాం .. లేకపోతే .. అసలా దొంగ దంపతులే చూడండి .. అ పిల్ల సావిత్రంత సౌందర్యవతీ, గుణవతీ, అన్నిటికన్నా గొప్ప ఆత్మాభిమానం కలదీ కాక పోతే పంతులు మనసు చలించేదా? ఎట్లాగైనా అని చెప్పి ఈమెనే పట్టుకు వేళ్ళాడుతూ ఉండేవాడా?

అలాగే .. పంతులు రామారావంత అందగాడూ, మర్యాదస్తుడూ, స్త్రీ మనసు తెలుసుకుని అనుగుణంగా మెలిగే నెమ్మదస్తుడూ కాకపోతే .. పంతులమ్మ .. మిస్ మేరీ మనసు కరిగేదా .. ఆయనే నా భర్త .. అని తాళి కట్టకుండా పబ్లిగ్గా ఒక మొగాణ్ణీ ఒప్పుకునేదా?

అందరూ .. అంధరూ .. దొంగలే .. టాప్ టూ బాటం .. అంధరూ స్వార్ధ పరులే .. సినిమా ముదణ్ణించీ చివరి దాకా చూసి .. ఆహా, యేమి ఎల్వీ ప్రసాదు మహాశయా, మనిషి స్వభావాన్ని కళ్ళకి కట్టేశావు గాదయ్యా .. ఒక పక్కన హాశ్యమాడుతూనే .. మరో పక్కన ప్రతీ పాత్రలోనూ మా నీడల్నే మాకు చూబెట్టావు గాదటయ్యా .. నా సావిరంగా .. ఇదీ రియలిజం అంటే .. అనుకుంటూ లేచి కూచున్నానండి, సో్ఫాలో .. సినిమా ఐపోవస్తా ఉందండి .. ఇంతకు ముందెన్ని సార్లు చూళ్ళేదండీ .. ఓ ఐదొందల సార్లన్నా చూసుంటానండి ..

సరిగ్గా అప్పుడొచ్చేశారండీ మేరీ తలిదండ్ర్లులు .. ఎస్వీయార్ అడిగాడండీ .. అమ్మాయి మీ సొంత బిడ్డా పెంపుడు బిడ్డా అని .. అప్పుడు సావిత్రి పెంపుడు తండ్రి ఫాదరీ గా దొరస్వామి డయలాగండీ పైన చెప్పింది .. నా సావిరంగ .. నా థియరీ మొత్తం ఒక్ఖదెబ్బతో కూలదోశాడండీ ..అసలు ఏవి డయలాగండీ ..

కడుపున పుట్టక పోవడమే లోపమైతే నువ్వు వారమ్మాయివేనమ్మా ..

పదహారేళ్ళు పెంచి పెద్ద జేసినాక అలాగనడానికి ఎంత త్యాగ బుద్ధి కావాలండీ?

Comments

రమణి said…
నాకు చాలా నచ్చిన సినిమా "మిస్సమ్మ" , రావోయి చందమామ మా వింతగాద వినుమా".. పాట సినిమా అద్యంతం చాల ఆసక్తికరగా సాగుతుంది. సావిత్రి, ఎన్.టి.ఆర్ అప్పటి సినిమాలే సినిమాలండి.. ఇప్పుడెక్కడున్నాయి అలాంటి ఆణిముత్యాలు. ఎక్కడో ఒకటో రెండో అలా అనిపించినా వీటికి మటుకు సాటి రావు.
Anonymous said…
guru, you are totally mentally upset... Cinema is entertainment and you should take it in the same way.
nagamurali said…
మీ పోస్టు చూసి చాలా ఆనందం కలిగింది. మిస్సమ్మా, మాయాబజారు అనేక సార్లు శుక్రవారమో, శనివారమో సాయంత్రాలు పెట్టుకు చూస్తుంటాము. ఎన్నిసార్లు చూసినా అదే అనుభూతి. కొన్ని సన్నివేశాలు ఎన్నిసార్లు చూసినా నేను మరీ మరీ ఆనందించడం, చేసిన విశ్లేషణే మళ్ళీ మళ్ళీ చేయడం చూసి మా ఆవిడ నవ్వుకుంటూ ఉంటుంది. మిస్సమ్మలో నాకు చాలా నచ్చే సన్నివేశం ఏమిటంటే, ఎన్టీఆర్ సావిత్రికి చెప్తాడు, మీరు మద్రాసు వెళ్ళిపోండి. నేనిక్కడ ఏదో విధంగా మానేజ్ చేస్తాను అని. ఏం చేస్తారని సావిత్రి అడుగుతుంది. ఏముందీ, మీకు జబ్బు చేసి పోయారని చెప్తాను. భోరు భోరున ఏడ్చి తరవాత మెల్లిగా ఇక్కడ సెటిలైపోతాను అంటాడు. దానికి సావిత్రికి పిచ్చి కోపం వస్తుంది. ఆ సన్నివేశం ఎన్నిసార్లు చూసినా నాకు చాలా ఆనందం కలుగుతుంది.

అలాగే మాయాబజార్ లో యాదవులమీద దండయాత్ర చేస్తానని ఘటోత్కచుడు వీరవిహారం చేస్తుంటే, వాళ్ళమ్మ వచ్చి వారిస్తుంది. సుపుత్రా, ఒక పని చెయ్యి, నేను మెచ్చుకుంటాను అంటుంది. ఏమిటంటే శశిరేఖని మాయాబలంతో ఎత్తుకొచ్చెయ్యి అంటుంది. అక్కడున్న వీరాధివీరులూ, మహామహులూ ఎవ్వరికీ రాని ఆలోచన ఆవిడకే ఎందుకు వచ్చింది? ఎందుకంటే హిడింబ రాక్షసి కనుక. తనూ మహా గడుసుగానే పెళ్ళి చేసుకుంది కనుక. అటువంటి ఆలోచన ఆవిడకే సహజం. ఇదీ ఈ సన్నివేశం చూసిన ప్రతిసారీ నేను చేసే విశ్లేషణ.
రమణి - అన్ని సినిమాలూ కాదు, చాలా కొన్నే. పాత సినిమాల్లోనూ బోలెడు చెత్త ఉంది.

యనానిమౌసు - యేంఈ ఫేజివ్వకుండానే నన్ను గురు అని పిలిచినందుకూ, ఏమీ ఫీజడగకుండానే నా మెంటల్ కండిషన్ని కనిపెట్టినందుకూ మిగుల ధన్యవాదములు. పనిలో పని మీరు సెలవిచ్చిన ప్రవచనములకు కూడా ధన్యవాదములు. ఈ సారి స్నిమా చూసేటప్పుడు గుర్తు పెట్టుకోటానికి ప్రయత్నిస్తాను.

నాగమురళి - మిస్సమ్మలో ఒక్కో సీను ఒక్కో ఆణిముత్యం. మీరు చెప్పిన సీనులో రామారావు సెటిలవుతా అని తను అనడు, సావిత్రే అలా ప్రొజెక్ట్ చేసుకుంటుంది.
తారల నటనా ప్రభావాన్ని తప్పించుకొని, మిస్సమ్మ పాత్రలను ఈ కోణంలోంచి చూడటం ఇదే మొదలు - అని చెప్పలేనుగానీ, స్వార్థాన్ని లౌక్యం అనుకుంటూ ఆనందంగా సినిమా మొత్తం చూడ్డమే ప్రతిసారీ జరిగేది. మంచి విశ్లేషణ. 'డిటెక్టివ్ రాజు' పాత్రలాగా ఈ విశ్లేషణలో మీరూ అండర్ ప్లే చేశారు కనుక కొందరికి మీరొక 'గొప్ప డిఫెక్టివ్'గా కనబడటం ఆశ్చర్యమేం కాదు.
ఊ. దం said…
సీతారాం జై సీతారం - లాంటి సైటర్ ఇప్పుడు దొరుకుతుందా చెప్పండి?
ధర్మం చెయ్ బాబు అని ఎంతా దర్జా గా అడుక్కుంటాడు..
pi said…
Ee review style familiar gaa undi. Konta kaalam kritham chadivina Oka kadha gynaapakam vacchindi. :P.
Anonymous said…
ఎప్పుదో చాలా ఏళ్ళ క్రిందట 'ఆగే కదం' అని ఒక హిందీ సినిమా వచ్చింది. మిస్సమ్మ కధ అచ్చంగా ఆ ఆగేకదం కథే. ఏమాత్రం తేదా లేదు.
ఆందులోహీరో హీరోయిన్లు మోతీలాల్, అంజలీ దేవి. అంజలీదేవి అనే పేరు అంతకు ముందెప్పుదూ వినలేదు. తెలుగు సినిమా తార అంజలీదెవి పేరు ఆ హిందీ అంజలికి ఇమిటేషన్ అయి వుంటుందని నా అభిప్రాయం.
మిస్సమ్మ మిస్ మేరీ కధలు ఒరిజినల్ కావు అనే సంగతి ఈతరం వాళ్ళకు తెలియదు. నాలాటి ముసలాళ్ళకు మాత్రమే తెలుసు.
M.V. Subbarao
Anonymous said…
MV Subbarao గారూ,
మీలాంటి ముసలాళ్ళకు మాత్రమే తెలిసినవి మీరు చెప్పారు. మాలాంటి కుర్రాళ్ళకు తెలిసనది ఇదిగోండి "మిస్సమ్మ సినిమాకి మాతృక బెంగాలీలో బహు ప్రాచుర్యం పొందిన జ్యోతీశ్ బెనర్జీ (కామెడీ) రచన: Manmoyee Girls School (1935 లో బెంగాలీలో సినిమాగా కూడా వచ్చింది)."