మార్చి గడికి స్లిప్పు

పొద్దు మార్చి గడి ఇక్కడ.
ఈ సారి సత్యసాయి మేస్టారి సాహిత్య పటిమా, సంగీత గరిమా, పౌరాణిక మహిమా .. అన్నీ కలిపి ఒక పక్క ఆనందభైరవిలో సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఇంకో పక్క కండలు పెంచిన గండడై ధబధబలాడించేశారు.
సుగాత్రి గారు మహా గడుసుగా కర్రా విరక్కుండా పామూ చావకుండా రెండు ఆధారాలకి మాత్రం పురెక్కించి వొదిలి పెట్టారు.
మేష్టారూ, చెమత్కారాలు యధావిధిగా మాంఛి ఘాటుగా ఉన్నయ్యి, గానీ ఈ సారి అక్షరాలకి తప్పటడుగులు ఎక్కువై దాంతో మాకు తికమక ఎక్కువఈంది. ఏదో బేక్గ్రౌండులో కంబైండ్ స్టడీలు చేసి కొంతవరకూ సాధించామనుకోండి.
మిగతా సోదర సోదరీమణులకి ఒక్క చిన్న స్లిప్పందిస్తే ఏమనుకోరుగా?

Comments

నిజ్జంగా సత్యసాయిగారు చాలా కష్టమైన గడిని ఇచ్చారు ఈ సారి.

పొద్దు సార్లు బయట టీ తాగుతున్నట్టున్నారు. నేనురెండు స్లిప్పులు ఇస్తానూ . తొరగా రాసుకోండి

హనుమంతుడు సౌగంధమాధన పర్వతమునుండి హైజంప్ చేసాడంట. చిట్ ఫండ్ ఓనర్ మురారి చిట్టీ డబ్బులతో పరారీ అయ్యాడంట.

ఇంకా ఎవరి దగ్గరైనా స్లిప్పులు ఉంటే కాస్త పాస్ ఆన్ చేయండి.
ఎంత కష్టపడినా (స్లిప్లు చదివినాక కూడా) సగం కూడా చెయ్యలేక పోయాను. చాలా కష్టంగా ఉన్నాయి.
ఒక స్లిప్పు,
40 అడ్డం. నల్ల అంటే తమిళంలో మంచి, హైదరాబాద్ తెలుగులో కుళాయి.
మొత్తానికి చాలా వరకు (90 శాతం ) పూర్తి చేసాను. ఒక ౩ గడులు మాత్రం ముప్ప తిప్పలు పెడుతున్నాయి. మీవి మొత్తం అయిపోయాయా??
దైవానిక గారు, అభినందనలు. గడి బగ రుచిమరిగారన్నమాట. నన్ను 29 నిలువు 33 నిలువు ముప్పుతిప్పలు పెదుతున్నై.
Nagaraju Pappu said…
33 నిలువు వైష్ణవుల వినాయకుడనుకొంటానండీ.
మేస్టారూ, ంఈరూ ఇంకా గెస్ వర్కులోనే ఉన్నారా? సరే. :-)
నిలువు బొట్ల వినాయకుడు 51 అడ్డం, 33 నిలువు కాదు. అక్షరాలు సరిపోవు.
అవునండోయ్, నిలువు బోట్ల వినాయకుడు 51 అడ్డంలో ఉన్నాడు. 33 నిలువు మీకు బ్రోన్యములో దొరుకుతుంది.

ముందు ఏదో ఉందంటున్నారు కదా, దాన్ని (చివర దీర్ఘం తీసేసి) వెతకండి. కనపడిన వెంటనే గుర్తుపడతారు.
సైలెన్సు ... సైలెన్సు ...స్పెషల్ స్క్వాడొస్తోంది..
టైమైపోతోంది.. తొందరగా కానీయండి.
మరీ ఇంత బహిరంగంగా మాసుకాపీయింగా! హమ్మో! హమ్మో!
నానా తంటాలూ పడి గట్టెక్కాలని చూసే నాలాంటి ఒంటిపిల్లి రాకాసుల గతేంకానూ:-)
కానీండి ఏంచేస్తాం, ఐకమత్యమే మహాబలం:-)
కామేశ్వర రావుగారు,

మీరు సడిలేకుండా మాలో చేరిపోండి. ఇంకా వారం పొడిగించారుగా. కాపీకొట్టుకోండి అని కూడా చెప్పారు మాస్టార్లు. ఇంకేంటీ మరి !!!
నాకు సగం మాత్రమే వచ్చాయి. కొత్తపాళిగారితో కంబైండ్ స్టడీస్ చేసిన అదృష్టవంతులు ఎవరో?? నా ముందు గోడ, ఇటు ప్రక్క హిందీ ఫస్ట్ లాంగ్వేజి, అటుపక్క చివరినుండి మొదటి ర్యాంకు వాడు. నేనెవరకి చెప్పుకోను???
Anonymous said…
మూడో, నాలుగో తక్కువగా పూర్తిచేసి ఇక చేతులెత్తేసి పంపించేశాను. ఏదేమైనా ఈ గడి జనాల్లో ఓ అలజడి కలిగించింది. కొత్తపాళీ గారికి ఒకటి ఋణపడి ఉన్నాను. బదులుగా మరోటి చెప్తానన్నా తీసుకోలేదు. నన్ను ఋణగస్తుడిగానే ఉంచదల్చుకున్నారు :-)