ఈమాట కొత్త సంచిక విడుదలైంది

ఈమాట జాల పత్రిక కొత్త సంచిక విడుదలైంది.

ఈ సంచికలో మన బ్లాగరులు ఇద్దరి రచనలు ఉండటం ఒక విశేషం. సోమశంకర్ అనువాద కథ వెచ్చని మనసులు, జ్యోతిషం లోపలి సంగతుల గురించి నాగమురళీ కృష్ణ గారి వ్యాసంలో మొదటి భాగం ఈ సంచికలో వచ్చాయి.

అంతకంటే విశేషం ఏవిటంటే వేలూరి వారి రాసిన సంపాదకీయం బ్లాగుల గురించి.

ఇంకా ఎన్నో కథలూ కవితలూ వ్యాసాలూ కలిసి అందాలు సంతరించుకుని మీ ముందుకొచ్చింది ఈమాట.
ఒక లుక్కెయ్యండి.

Comments

Anonymous said…
బ్లాగుల గురించి సంపాదకీయం. భలే! ఇప్పుడే చదివొస్తా ఆగండి.

బాగుంది!

కొందరు చెయ్యి తిరిగిన పాత రచయితలు కూడా తమ పాళీలకి సానబెట్టి బ్లాగుల్లో కొత్త సిరాతో సరికొత్త మూసల్లో రాస్తున్నారు.

మీరూ కవరయ్యారు!
thanks. ఎడిటోరియల్ బాగుంది. ఆస్నేహితుడు మీరేననుకుంటాను?
Anonymous said…
మీరు మంచి ఆలోచనే చేసారు. అభినందనలు. "వినినంతనె వేగపడక" రాసిన చిన్నమయ్య గారు కూడా బ్లాగు మొదలుపెట్టారు, ఫిబ్రవరిలో (మాటవరసకి)
Anonymous said…
ఈమాటని బ్లాగులవైపు మళ్ళించిన ఆ భగీరధుడెవ్వరో గాని, ఇది బ్లాగుల కళ్యాణానికి దారితీస్తుంది.
pruthviraj said…
బాగున్ది మీరు గమనించిన విషయం నా కవితలలొ. తప్పకుందా ఆ పదాలు వాడ కుండ రాస్తాను. చూస్తూ వుండండి. చాలా సంతొషం. నా బ్లాగు చాలా చిన్నది.కవిత రాయాలని కాదు మనసులొని విషయాలే చాలా. i will definitely not use those. i can do, i not noticed till u said about the usage. keep giving suggesstions like that. మీ అబిమానానికి కృతజ్ఘ్నుడను.

www.pruthviart.blogspot.com
Sasik said…
బ్లాగు బాగు0దడి. మీరు అన్నారు కదా , ఇది చూడ0డి!

http://padamatisandhya.blogspot.com/2008/03/blog-post_08.html