మంచు కురిసే వేళలో!మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో మంచు కురిసే వేళలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో జలకమాడి పులకరించే సంబరంలో జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
నిన్న పగలంతా మంచు పడుతూ ఉంది. ఇంతకు ముందు టపాలో రాసినట్టు మంచు తుపానులా కాకుండా ప్రశాంతంగా అందంగా పడుతూ ఉంది. ఆఫీసులో పెద్ద నడవా మీద నడుస్తూ అకస్మాత్తుగా ఆ దృశ్యంచూసి అక్కణ్ణించే సెల్ ఫోనులో తీశాను .. కానీ దీనిలో ఏమీ కనబట్టల్లేదు :(
రాకేశ్వరుడి కోసం మీరు తీసిన చలనచిత్రంలో రాకేశ్వరుడికి ఏఁవీ కనిపించట్లేదు. రాకేశ్వరుడికి సాంకేతికం ఇలాంటి విషయాలలో పూర్తిగా విఫలఁవవుతుందని అభిప్రాయం. గోదావరి కంటే గోదావరి సినిమాలో చూపించినవే ఎక్కవ నచ్చుతాయి కొందరికి, కానీ రాకేశ్వరుడు అలా కాదు. మీరు ఎంత హెచ్చుడీ కెమారాతోఁ తీసినా, రాకేశ్వరుడికి మాత్రం ఆ సమయాన అక్కడ వుండి, ఆ షడ్భుజాకార మంచు రేణువులు ఒక్కొక్క దాన్నీ, అలా పైనుండి క్రిందకీ, ప్రక్కనుండి ప్రక్కకూ కదులుతూంటే చూడాలనిపిస్తుంది. భూమి తన వైపు లాక్కుంటున్న వాటిని, ఆకాశం విడవలేక విడిస్తే, అవి కూడా సంశయంతోఁ మెల్లగా క్రిందకు జారే వయనం, ఆపై అతని చేతిలో పడి కఱిగిపోయే వైనం, రాకేశ్వరుడికి ఎంతో ఇష్టం.
కానీ మంచుకుఱుస్తున్న సమయానికి అతని గుఱించి ఆలోచించి, చిత్రం చోద్యంగా బంధించి, చూపించ ప్రయత్నం చేసినందుకు, రాకేశ్వరుడు ధన్యుడు!
Comments
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మదునితో జన్మవైరం సాగినపుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో
సందర్భం,కథా కమామిషు కూడా చెప్పmడి మరి.
రాకేశ్వరుడికి సాంకేతికం ఇలాంటి విషయాలలో పూర్తిగా విఫలఁవవుతుందని అభిప్రాయం. గోదావరి కంటే గోదావరి సినిమాలో చూపించినవే ఎక్కవ నచ్చుతాయి కొందరికి, కానీ రాకేశ్వరుడు అలా కాదు.
మీరు ఎంత హెచ్చుడీ కెమారాతోఁ తీసినా, రాకేశ్వరుడికి మాత్రం ఆ సమయాన అక్కడ వుండి, ఆ షడ్భుజాకార మంచు రేణువులు ఒక్కొక్క దాన్నీ, అలా పైనుండి క్రిందకీ, ప్రక్కనుండి ప్రక్కకూ కదులుతూంటే చూడాలనిపిస్తుంది.
భూమి తన వైపు లాక్కుంటున్న వాటిని, ఆకాశం విడవలేక విడిస్తే, అవి కూడా సంశయంతోఁ మెల్లగా క్రిందకు జారే వయనం, ఆపై అతని చేతిలో పడి కఱిగిపోయే వైనం, రాకేశ్వరుడికి ఎంతో ఇష్టం.
కానీ మంచుకుఱుస్తున్న సమయానికి అతని గుఱించి ఆలోచించి, చిత్రం చోద్యంగా బంధించి, చూపించ ప్రయత్నం చేసినందుకు, రాకేశ్వరుడు ధన్యుడు!
రాకేశ్వరా..ఇలియీస్టుల్లోకెక్కే ప్రయత్నమా ఇది :-)