చూడవలసిన చిత్ర ప్రదర్శన


యువ చిత్రకారుడు గిరిధర్ గౌడ్ అనతి కాలంలోనే తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకుని ఇంటా బయటా పేరుపొందుతున్నారు. ఈయన గీసిన వర్ణ చిత్రాలు తెలుగు నాడి (జూన్ 2007 సంచిక), కథ 2006 వంటి పుస్తకాల ముఖపత్రాలని అలంకరించాయి.

ఎమ్మెఫ్ఏ చదివిన ఈ రైతు బిడ్డ తన మూలాలకి చేరువగా ఉండాలని గుంటూరు దగ్గర తన స్వస్థలమైన ఒక కుగ్రామంలో నివాసం ఏర్పర్చుకున్నారు. గిరిధర్ చిత్రాలకి వస్తువులు పల్లెల్లో కనబడే నిత్య దృశ్యాలే అని వేరే చెప్పక్కర్లేదనుకుంటా. నెత్తిన గడ్డిమోపుతోనో, పిడకల తట్టతోనో మనకి దర్శనమిచ్చే పాటక స్త్రీల చిత్రీకరణ "శ్రమైక జీవన సౌందర్యానికి" కొత్త అర్ధం నిర్వచిస్తున్నట్టుంది.
ప్రస్తుతం వీరి "ఒన్ మేన్ షో" హైదరాబాదులో జరుగుతోంది. ఈ ప్రదర్శనకి రచించిన చిత్రాల్లో తెలుగు రైతులకి పౌరుష చిహ్నమైన ఒంగోలు ఎడ్ల మీద తన కళాత్మక దృష్టి నిలిపారు శ్రీ గిరిధర్.

చిత్రకళా విషయం: వృషభ 1
చిత్రకారుడు: గిరిధర్ గౌడ్
కళావేదిక:కళాహిత ఆర్ట్ ఫౌండేషన్, 8-2-248/1/7/16,17B,లక్ష్మీ టవర్స్, నాగార్జున హిల్స్, పంజగుట్ట, హైదరాబాద్ 500 082
ప్రదర్శన వేళలు: డిశంబరు 28 నుండీ జనవరి 18 వరకూ
మరింత సమాచారం కోసం: 040 23350543

హైదరాబాదు వాసులకీ, ఈ సమయంలో మాతృదేశాన్ని సందర్శిస్తున్న ప్రవాసులకీ ఒక ప్రతిభావంతుడైన వర్ధమాన చిత్రకారుడి కళని దగ్గర్నించి చూసే మహదవకాశం. ఈ ప్రదర్శన రోజుల్లో ఆయన గేలరీ దగ్గరే ఉంటానని చెప్పారు .. అంచేత చిత్రకారుడితో కాసేపు ముచ్చటించొచ్చు, వీలైతే అతనితో కలిసి ఒక ఫొటో దిగొచ్చు. రేపితను వైకుంఠం, ఏలే లక్ష్మణ్‌లను మించిన ఖ్యాతి సంపాయించిన రోజున, అరెరే, ఆ రోజు భలే ఛాన్సు మిస్సయ్యామే అని నాలిక కరుచుకుంటే ఏవ్హీ లాభముండదు!

Comments

గిరిధర్‌గారిది గుంటూరా ? అయితే మావాడే ! happies !
మంచి చిత్రకారుని పరిచయము చేసినందుకు కృతజ్ఞతలు. చివరి చిత్రం చాలా బాగుంది. ముఖం కనపడకపోయినా భావాలు పలికిస్తున్నట్లున్నాయి.Thanks
cbrao said…
43 ఏళ్ల గిరిధర్ గౌడ్ పుట్టింది గరువుపాలెం,వడ్లమూడి P.O., తెనాలి తాలుకా, గుంటూర్ జిల్లా. మైసూరు, బరోడాల లో విద్యాబ్యాసం , అహమదాబాదు లో ఉద్యోగం తరువాత, స్థిరపడింది పుట్టిన ఊరిలోనే. ఇది సంజీవదేవ్ స్వస్థలమైన తుమ్మపూడి కి దగ్గరగానే వుంది.
చాలా బావున్నాయి చిత్రాలు, చివరిది ఇది వరకే ఎక్కడో చూసినట్టు గుర్తు, ఎక్కడో గుర్తు రావట్లేదు..
Naga said…
బొమ్మలు బాగున్నాయి.
రాధిక said…
నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె వేస్తున్నాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.
తప్పకుండ వేసుకోండి రాధికా
@ గిరి - ఆ బొమ్మ కథ 2006 సంకలనం ముఖచిత్రంగా వచ్చింది. బహుశా పొద్దులో నేరాసిన సంఈక్ష దగ్గిర చూసి ఉంటారు.
చిత్రకారుని ముఖ్యవిషయాలు చెప్పినందుకు రావుగారికి థాంకులు.
Usha said…
నమస్తే "కొత్తపాళీ " గారు
శుభోదయం కుడా
"గిరిధర్ గౌడ్ " గారి ఆర్టు గురించిన సమాచారం ఇచ్చినందుకు
నేను తప్పకా సందర్శించుకుంటాను ఆయన దర్శన భాగ్యం కలిగితే మీరన్నట్టు ఫోటో కూడా తీసుకుంటాను
చాలా సంతోషమంగా ఉంది ఈరోజు
ధన్యవాదాలు.
ఉష