తెలుగు భీభత్సం

ఇప్పుడే రానారె బ్లాగులో గీర్వాణి వాక్కులు చదివి బయటికొచ్చాను.

ఇంతలోనే అలాంటి దెబ్బ నాకూ తగుల్తుందని అనుకోలేదు.

ఇంత కంగాళీ అవకతవక తెలుగు వచనం నా జన్మలో చదవలేదు!

తెలుగులో మహాకవి, కవిరాజ బిరుదాంకితుడు, ఉద్దండ పండితుడు, ఆధునిక ఆలోచనాపరుడు, వెరసి ఒక గొప్ప తెలుగు వ్యక్తిని స్మరించుకుంటూ ఇటువంటి దారుణమైన భాష చదవాల్సి రావటం మరీ బాధాకరం.

కొన్ని మచ్చుతునకలు:

అకుంటిత దీక్షాపరులైన
గ్రామ మునిసిఫ్
సంస్కృతాంధ్రలో కొంత ప్రవేశమున్నది
ద్రాక్షాపకము
బ్రహ్మణలే
ఆంధ్రలోకము హర్ష పులికాంకితమైనది

పోనీ ఇవి అప్పుతచ్చులనుకుందాం .. ఐతే మరి ..
వీని భావమేమి తిరుమలేశ?

అంధ్ర (రామ రామ!) దేశములో గజారోహణ మహత్యము అనగా నోబుల్ బహుమతి నొందునన్నమాట
ఇనుముకు చెదలు పట్టినట్లు
ఆయన జీవితము నారికేళ పాకముగా తోచెడిది.
తెలుగుతల్లి ఒడిలో విరబూసిన కుసుమము

వార్తా "కదనాలు"
బహుమతి "ప్రధానాలు"
వాళ్ళ పిండాకూళ్ళు
మన ఖర్మలు!

Comments

గురువు గారూ,
ఓ సారి నేటి తెలుగు ఛానల్స్ చూడాలి మీరు. అద్భుతంగా పరికిణీ లంగా కట్టి, ఆహా ఏమి తెలుగుదనం అనుకొనేలోపు ఖూనీ మొదలు. అసలు మీరెత్తిచూపినవే తప్పులని ఎదురుదాడికి దిగినా ఆశ్చర్యం లేదు. :-) మనం ఇబ్బంది అనుకునే ఈ పదాలు, ఆక్స్ఫోర్డ్ వాడు గనక ప్రాచుర్యాన్ని బట్టి పనికిమాలిన పదాల్ని కూడా డిక్షనరీ లోకి ఎక్కిచ్చినట్లు, తెలుగు నిఘంటువుల్లోకొచ్చే రోజెంతో దూరం లేదనిపిస్తోంది. నాకు తెలిసి, ఇవ్వాల్టి మన తెలుగు సినిమా హీరోల్లో, సరయిన తెలుగు మాట్లాడే వాడు ఒకరో ఇద్దరో. ("ళ" ని "ల" "ణ" ని "న" పలికే వీరులే ఎక్కువ). ఓ రకంగా జూ.ఎంటీయార్ నాకందుకే నచ్చుతాడు. సినిమా ఫ్లాపయినా ఓ నాలుగు తెలుగు మాటలు విని రావొచ్చు.
teresa said…
పంటికింద రాయి.
Giri said…
నవ్వాలో ఏడుపు తెచ్చుకోవాలో తెలియని పరిస్ధితి కదా?
The only way -I can thnk of- to channelize the frustration engendered, is by taking up the job of being a vigilante on any future posts I read in Telugu blogosphere - when I find any mistakes (వాళ్ళుకి బదులు వాల్లు లాంటివైనా),I will point that out in comments. I used to ignore them before, not any more. Any takers?
Giri said…
కొత్త పాళీ గారు, ఆ సాలెగూటిలో వ్యాఖ్యలు అనుమతించకపోవడం వల్ల వచ్చిన కోపంతో అలా రాసాను. మీకు నా వ్యాఖ్య అసమంజసంగా అనిపిస్తే ప్రచురించకండి..నెనరులు
@వికటకవి - తెలుగు టివీయే కాదు అమెరికన్ టీవీకూడా చూడను. తెలుగు సినిమాలంటారా .. బుర్రని అలమారులో తాళం వేశాకే డిస్కు ఇంటికి తెస్తాను. భాష విషయంలో జూ యంటీయార్ మెచ్చదగిన పరిణతి సాధించాడు.

@teresa - పంటి కింద ఒక రాయి కాదు .. రాళ్ళు!

@ giri - సులేఖ అనే గూట్లో ఫ్లింఫ్లాం అనే ముసుగు వ్యక్తి ఒకాయనున్నాడు .. ఇట్లాగే ఎవరన్నా టపా రాయడం ఆలస్యం, వాళ్ళ ఇంగ్లీషుని చీల్చి చెండాడి ఎండేస్తుంటాడు. Let me just say .. he did not make many friends :))
గిరిగారూ, I am with you. నేను చాలాకాలం ఈపని చేశాను. ఈమధ్య దాదాపు మానుకున్నాను. మళ్లీ మొదలెడతా. కొన్ని చేదు అనుభవాలు అప్పుడప్పుడూ ఎదురయ్యాయి. ఐనా సరే, ఇలాంటి చెత్త తెలుగు మాట్లాడటం, రాయడం మాన్పించకపోతే అదే మెజారిటీ అయికూర్చుంటుంది.
teresa said…
@ranare- సుస్వాగతం as I know is wrong usage,స్వాగతం already says what you mean! After reading gyour comment I could not help but point this out. You sound like a good sport :)
Giri said…
కొత్త పాళీ గారు, రానారె గారు,
ప్రస్తుతానికి నా frustrationని ఇక్కడ వెళ్ళగక్కాను..
Anonymous said…
అంధ్ర (రామ రామ!) దేశములో గజారోహణ మహత్యము అనగా నోబుల్ బహుమతి నొందునన్నమాట
ఇనుముకు చెదలు పట్టినట్లు
ఆయన జీవితము నారికేళ పాకముగా తోచెడిది.
తెలుగుతల్లి ఒడిలో విరబూసిన కుసుమము


are real highlights
ఏదో పాత తెలుగు పుస్తకములోనో పత్రికలోనో త్రిపురనేనిగారిపై వెలువడిన వ్యాసాన్ని ఒక టైపిస్టుచే ఉదరాబదరా టైపు చేయించి ఫ్రూఫురీడు కూడా చెయ్యకుండా మనమీద వదిలినట్టున్నారుగా. :-(
కొత్తపాళీ గారూ!

మీ భావాన్ని బాఘా నొక్కి వక్కాణించదలచారనుకుంటా.. ఈ టపా పేరులో మీరు ఒకదాని బదులు ఇంకొకటి రాశారు.
రాఘవ said…
చెప్పటం మీవంతైతే విని విస్తుపోవటం నావంతైంది.
ఇంటరులో మా కెమిస్ట్రీ మేస్టారికి ఆంగ్లం మీద కూడా మంచి పట్టుండేది. నోట్సు చెబుతూ మధ్యమధ్య క్లిష్టమైన పదాల స్పెల్లింగు కూడా చెబుతుండేవారు. ఒక సారి ఈక్విలిబ్రియం కి స్పెల్లింగు రెండు ఎల్లులతో చెప్పారు. ఒక్క ఎల్లేనండీ అన్నా నేను. తన ఇంగ్లీషు మీద ఆయనకీ అంత నమ్మకం .. నే చెప్పింది నమ్మలేక పోయారు. అప్పటికప్పుడు డిక్షనరీ తెప్పించి చూశారు! మహానుభావులు కాబట్టి పెద్దమనసుతో నా దుడుకుతనాన్ని క్షమించి తప్పు ఒప్పుకున్నారు. కొన్ని కొన్ని అపోహలతోనే జీవితం గడిచిపోతుంటుంది!
@ సుగాత్రి - మీరు చెప్పకపోయుంటే నేను భీభత్సంగానే ముందుకుపోతుండేవాణ్ణి. ధన్యవాదాలు! ఐతే .. మీరన్నట్టు ఇక్కడ అదికూడా ఒక వ్యంగ్యంలా ఉంది కాబట్టి మార్చబోవట్లేదు.
Just by chance I found this blog .. doing exactly the kind of thing Giri and Ranara want to do for Telugu.
http://quotation-marks.blogspot.com/

Be sure to check out more blogs this kind in the Other Snarks section.

Actually, I think it will be quite fun to photograph and post Telugu ad board errors :-) Most frequent misuse is శాఖాహారము
Sriram said…
అసలు తెలుగువాల్లెవరూ లేరు ఇప్పుడు. ఉన్నదల్లా అంధ్ర వాల్లూ, తెలంగాన వాల్లూ ఇంకా సీమవాల్లూ...వీల్లుకాకుండా పరాయి ప్రాంతాల్లో ఉండేవాల్లు కొంతమంది.

ఇంక తెలుగుభాసని దేవుడే కపాడాలి!
కావలసిన కనీస తెలుగును కూడా నేర్పించలేని కాన్వెంటు తల్లిదండ్రుల మీద నా నిరసన తెలియజేసుకుంటున్నాను..
తెరెసగారు - అలాగాండీ!? ఇది కొంచెం పరిశీలించాల్సిన విషయమే. నెనర్లు.
స్వాగతం అని ఉన్నాకూడా, రాను రాను దాన్ని అందరూ ఖూనీ చేసారు, చెప్పులతో స్వాగతం వగైరా ప్రయోగాలతో. దాంతో మంచి స్వాగతాన్ని చెప్పటానికి సుస్వాగతం అని వాడటంలో తప్పులేదనుకుంటా.

పనిలోపనిగా, జనాలు, పత్రికలు చెడు స్వాగతాలని "చెప్పులతో దుస్వాగతం" అనో మరింకో దుస్వాగతం అంటే బాగుంటుంది కదా!
teresa said…
మంచి ఆగతమే సు+ఆగతం అనుకుంట. సుసు-ఆగతం,దుసు-ఆగతం ఉండవేమో! ఈ విషయమేదొ గట్టిగా తెలుసుకోవాలని నాకూ curiousగా ఉంది.
pi said…
అయ్యా,

ఈ తెలుగు తెగులు ఎప్పుడు తీరేనో. ఈ మధ్య మాట్లాడే జనాలు కూడ అలానే మాట్లడుతున్నారు. ఉదాహరణ కి మన తెలుగు చలనచిత్రాలు చూడండి, నాగార్జున అన్నమయ్య చిత్రం లొ భక్తిని బక్తి అని చాలా బదపెట్టాడు.

ఇప్పుడు రాత తెలుగు కూడ అలానే ఏడిసింది.

ఇట్లు
పై
netizen నెటిజన్ said…
ఇంతకి ఆ ఈనాడాంధ్ర వాడికి, వాడి తప్పుని ఎవరన్నా తెలియజేసారా, లేదా?
Anonymous said…
మీరు సొంతంగా టపా రాసేంత విషయం మీ బుర్రలో లేక ఇలా ఎవడో రాసిన టపాల్లోవి ఎత్తిచూపి కామెంట్లు రాయించుకోవడం. ఒకవేళ మీకు ఏదైనా తప్పుగా అన్పిస్తే ఆ టపా రాసినవాడి బ్లాగులోనే వ్యాఖ్య రాస్తే పోయే.
మీ టపాలకి వ్యాఖ్య రాసే వాళ్ళు అమాయకులు. ఎందుకంటే వాడికి భాషా దారిద్ర్యం ఉందేమో నాకు తెలీదుగానీ, మీకు మాత్రం ఖచ్చితంగా భావదారిద్ర్యం వుంది. లేకుంటే వాడు రాసిన రాతల మీద మీరు టపా రాసి దానికి వ్యాఖ్యలు తెప్పించుకోవడం. వాళ్ళకీ పనిలేనట్టుంది.అయినా సరైన తెలుగు రాస్తే మీకే అర్ధంగాదు. మీరేదో మేధావున్నట్టు ఫోజు.మీరు ఒకరికోకరు సపోర్టు. ఆ రానారే కీ ఇదే భావ దారిద్ర్యం మీ సపోర్టరా మీరే అతడి సపోర్టరా? సొంతంగా టపా రాయడం నేర్చుకుంటే మంచిది.
యనానిమహుషులకి .. ఐమీన్ .. మహాశయులకు వందనములు. శ్రమ తీసుకుని నా బ్లాగు ముంగిట తమరు విడిచిన గోమయమును మహిష ప్రసా.. మియ కల్పా .. మహా ..ప్రసాదముగా స్వీకరించగలవాడను. తమ అమోఘవాక్కే మాబోంట్ల యెడల శ్రీరామ రక్ష.
pi said…
To anonymous,

I guess you are getting confused between stories and blogs. :). Your comments may apply to stories but not to blogs.
oremuna said…
AT least in blogs writing posts after another inspiring post is common.
మరీ మీరు తెలుగు బ్లాగులపై ఇలా కత్తి కట్టడమేమిటండీ? ఏదన్నా పనికొచ్చే పని చెయ్యొచ్చు కదా :)
పేడ - అసలు వ్యాసం
దాని మీద రాయి - మీ టపా
మనమీద వచ్చి పడే పేడ - అనామిషుల వ్యాఖ్యలు

మీ హృదయభాను మండి మీరు టపా వ్రాసారనుకోండి, కానీ అలాంటి చెత్త వ్యాసాన్ని బ్లాగుల్లో ఈనాడు పత్రిక లాంటి మీ బ్లాగులో ప్రస్థావించి ఇంకా అనవసర ప్రచారం కల్పించారు. ఎంత విన్నా కన్నా బ్లాగైనా, కొన్ని సార్లు గుడ్డి చెవిటి వారంగా నటిస్తే మంచిదనుకుంట :D

దాని బదులు త్రిపురనేని వారి గురించి నాలుగు మాటలు చెప్పితే బాగుండేది. అన్నట్టు వ్యాసంలో అచ్చుతప్పులు దిద్దినా, అందులో వున్న సమాచారం చేత అదింకా చెత్త వ్యాసం లానే వుండేది.
(వ్యాస రచయితకి - మీరు కష్టపడి వ్రాసిన వ్యాసాన్ని ఇలా దూషిస్తున్నందుకు వీలైతే మన్నించగలరు)
Anonymous said…
కొత్తపాళీ గారికి గానీ ఇంకొకాయనకి గానీ నేను చెప్పదల్చిందేవిటంటే ఒక వ్యక్తి ఒక టపా రాస్తే,ఆ వ్యక్తిని అతడి బ్లాగులో వ్యాఖ్య ద్వారా సరిదిద్దాలి గానీ మీ బ్లాగులో ఏదో పెద్ద అపరాధం చేసినట్టు చిత్రంచడం ఆటవికంగా వుంటుంది. ఒక మనిషిని చెట్టుకు కట్టేసి, బట్టలూడదీసి మనం గంతులేస్తున్నట్టు. నిజానికి మీరు విమర్శించిన వ్యక్తి రాసిన టపాలో సారాంశం ఎంత మంచిదో చూడండి. దాన్ని విస్మరించి చిన్న చిన్న తప్పులు పట్టి మన బ్లాగులో రాయడం సరైన పద్దతి కాదు. మొత్తం మీద నేను చెప్పేదేమిటేంటే మనం రాసే టపా విన్నవీ కన్నవీ రాసినా నవ్వుకొనేవి గానో, నీతి చెప్పినట్టుగానో, మరేదో సరదాగానో వుండాలి గానీ ఇంకొకర్ని వేలెత్తి చూపి అతడు బాధ మన సరదా కాకూడదు.

ఇప్పడు pi గారికి......

కథ రాసే వాడికి కథ గొప్పైతే బ్లాగు రాసే వాడికి బ్లాగు గొప్ప.ఏది రాసేవాడికి అదే గొప్ప. కనుక అన్నీ ఒకటే. మన టపాలో వాడి విమర్శ వుండకూడదు. వాడి బ్లాగులో మన వ్యాఖ్య వుండాలి. అదీ సహేతుకంగా, చక్కగా సరేనా. బ్లాగులన్నీ ఒక్కటే. కాకుంటే ఒకడు మామూలు విషయాలు, ఇంకొకడు కవిత, ఇంకొకడు కథ అలా. కనుక ఎవర్నీ భాధకి గురిచేయొద్దు. మన బ్లాగ్మిత్రుల్మి, మన బ్లాగ్ కొలీగ్ లను, మన తోటి వారిని.
teresa said…
@rakesh-పిర్ర గిల్లి జోల పాడినట్లు మళ్ళీ మన్నింపులెందుకో? "విన్నవీ కన్నవీ" అన్న బ్లాగులో కొత్తపాళీ గారు ఈ వ్యాసం రాయడం అనవసరంఅనీ,గుడ్డిగా ఊరుకోవల్సిందని చెప్పిన మీ హృదయభాను దూషణ అంటూనే ఈ కామెంటు రాయడం అనవసరమని మీకు చెప్పలేదా? :)
కొత్తపాళీ గారు విమర్శించింది ఒక వ్యక్తిగత బ్లాగును కాదు, సార్వజనికమైన ఒక పత్రికను. అందునా విమర్శ భాషపైన. పత్రికన్నాక, విషయ ప్రాధాన్యత ఎంత ఉంటుందో, భాషకూ అంతే ప్రాధాన్యత ఉంటుంది. భాషను ఇష్టం వచ్చినట్టు చంపి పాతరేస్తుంటే చూసి విమర్శించడం తప్పెలా అవుతుంది? చిన్న చిన్న తప్పులనో, బుల్లి బుల్లి తప్పులనో అనుకుని ఊరుకున్న వాళ్ళది తప్పవుతుందేమోగానీ!?

ఇక "బట్టలూడదీసి చెట్టుక్కట్టేసి.." - ఏఁ, ఏంటిందులో తప్పు? అక్కడ భాషనలా నిలువునా చీల్చి చెండాడిన దానికంటే తప్పా? ఇక్కడ ముసుగేసుకునిలా అడ్డగోలుగా మాట్లాడినదానికంటే తప్పా?
pi said…
అయ్యా అనామకా

కధకి ఒక భావం, originality ఉండాలి. మనం blog లో ఏమైనా రాసుకొవచ్చు including rants. ఇది ఒక journal లాంటిది. దాంట్లో subject గురించి మీరు comment చెయ్యడం అంత appropriate కాదని నా అభిప్రాయం.

పై
చ.చు said…
టెరెసా గారూ... రాకేషుడి అంతరంగాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకొన్నట్టున్నారు!
ఇక ఈ టపాకు వచ్చిన వ్యాఖ్యలను విశ్లేషిస్తే...తెలిసేదేమంటే-
ఊరకున్నంత ఉత్తమం లేదు...
te.thulika said…
అమ్మ బాబోయ్, ఈ టపా, ఈ వ్యాఖ్యలూ చూసింతరవాత నాకేం అనిపిస్తోందంటే. తెలుగుభాషలో తప్పులు పట్టబోవడం గొంగళీలో వెంట్రుకలు ఏరడంలాటిదే అని. నాకు మరో జన్మ వుంటే, ఇది గుర్తుంటే, నేను మాత్రం మళ్లీ మంచి తెలుగు అన్నమాట వాడను. :)