ఎక్సాన్ వాల్డెజ్ అమర్ రహే!!!

1989 లో జరిగిన ఈ దుర్ఘటన గురించి 1999 లో వ్యంగ్యంగా ఈ గల్పిక రాసుకున్నాను. ఆ నాడు ఏదో సరదాగా రాసింది ఏదో భవిష్యవాణి చెప్పినట్టు ఈ రోజు ఇలా నిజంగా జరుగుతోంది.

గమనిక 1: సుప్రీం న్యాయమూర్తుల్లో ఒకరైన శామ్యూల్ ఎలీటొ గారికి సదరు కంపెనీలో ఒక లక్ష నించీ రెండున్నర లక్షల డాలర్ల మధ్యలో భాగస్వామ్యం ఉన్నందు వల్ల వారు ఈ వాదంలో పాలుపంచుకోరట - మంచిదే!

గమనిక 2: శిక్షా రుసుము తగ్గించాలన్న కేసు సుప్రీం వినడానికి ఒప్పుకున్నందుకే షేరు ధర ఒకటిన్నర డాలరు పెరిగింది. కేసు విన్నాక రేపు సుప్రీం శిక్షా రుసుముని అసలుకే రద్దు చేస్తే ?? ఆకాశాన్నంటుతుందేమో!

సత్యం వధ!
ధర్మం చెర!!
ఎక్సాన్ వాల్డెజ్ అమర్ రహే!!!

Comments

Unknown said…
Punitive damages మీద నాకు అంతమంచి అభిప్రాయం లేదు. వీటివళ్ళ గిలాగిలా కొట్టుకునేది చిన్నచేపలే. చిన్నా చితకా వ్యాపారులకి ఇన్స్యూరెన్సు ఖరీదు పెంచడానికి, దేశంలో మితిమీరి పోయిన లాయర్లకు పని కల్పించడానికి, కొందరు సోమరిపోతులకు ఆదాయ విధానము కల్పించటము తప్ప నాకే ఉపయోగమూ కనిపించదు.
కోర్టు ఎటుతీర్పు ఇచ్చినా ఎక్సాన్ కు పెద్దగా పోయేదేమి లేదన్నది మీరన్నట్టు పెద్ద sarcasm.
గల్పిక చాలా బాగుంది. ఔరా ''reality is stranger than fiction'' అనిపించింది.
Robert Windsor Jr. ఆ 20వేల చెక్కు అంగీకరించాడా? లేదా? అని నాకు చిన్న కుతూహలం.
ఇంతకీ గురువుగారూ, గల్పిక అంటే ఏంటి? (ఎల్కేజీ ప్రశ్నకు క్షమించగలరు)
నిడివిలో కథ కంటే చిన్నగా ఉండి, వ్యంగ్యమో హాస్యమో ప్రధానంగా ఉండే కాల్పనిక రచనలని కొకు గల్పికలనే పేరిట రాశారు. ఆంగ్లంలో వీటిల్ని sketches అనచ్చనుకుంటా.

విండ్సర్ జూనియర్ తప్పకుండా చెక్కు తీసుకుంటాడని తెలీలేదా .. వాడూ ఆ తానులో ముక్కేగా! :)
pi said…
I agree with you. It is a pretty sad case. This country is ruled by corporates.
బావుంది మీ గల్పిక..concisely incisive