అక్టోబరు 31ఏదో ఉంది ముందు మలుపులో
ఏదో దాగుంది మసక వెలుగులో

ఏదో ఉంది ముందు మలుపులో
ఏదో దాగుంది మసక వెలుగులోi)
చీకటి మూసిన ఉదయంలో
తిరిగి రాని ప్రయాణంలో
నీ కేకలెవరికీ వినిపించవు
అడుగు జాడ లెవరికీ కనిపించవు

ఏదో ఉంది ముందు మలుపులో – నీకనిపిస్తోందా?
ఏదో దాగుంది మసక వెలుగులో – కళ్ళకి కనిపిస్తోందా?

ii)
లేవాలనుందా? నిద్ర లేవాలనుందా?
లేవాలనుందా? లేచి రావాలనుందా?
తెరలు విడని నిశీధిలోంచి
ఆరడుగుల సమాధిలోంచి
తెరలు విడని నిశీధిలోంచి
మూతబడ్డ సమాధిలోంచి

లేవాలనుందా? లేచి రావాలనుందా?

iii)
తీతువు కూతల జోలపాటలో
మృత్యువు వొడిలో ఊయలాటలో
నీ కేకలెవరికీ వినిపించవు
నీ ఊపిరాగటం కనిపించదు

ఏదో ఉంది ముందు మలుపులో
ఏదో దాగుంది మసక వెలుగులో ...d f j k d f j k

0-: Was that scary enough? :-0

మీకూ మీ చిరుతలకూ
ఎ హేపీ అండ్ సేఫ్ హేలొవీన్!
అండ్ లాట్సాఫ్ చాకొలెట్ కేండీ!!

Comments

Anonymous said…
గోలీ మార్! నిజంగానే భయపెట్టారుగా! మీక్కూడా స్కేరీ హ్యాలోయీన్!!!
చిరు బొమ్మ మటుకు హైలైటు
Anonymous said…
బొందలగడ్డ దిక్కు ఉర్కుండ్రి.బేతాలుని అర్రల పన్నండ్రి
ramya said…
మీకు కూడా
same to you
చిరు భలే భయపెడుతున్నాడుగా! :)) Happy Halloween to you too!
పాట బాగుంది. దానిగురించి చెప్పండి గురూజీ.
Ranare - you made my day :-))

There's a Rock/Heavy Metal song called "Holy Fool" by a band Boondock Saints .. that has sinister sounding music .. starts with the line "There is something happening here". A friend introduced it to me some time ago. I was fascinated and wrote this Telugu version to fit that tune.

More details about the background of the original here:
http://en.wikipedia.org/wiki/The_Boondock_Saints
నమస్కారములు.
1. ఏదో ఉంది ముందు మలుపులొ
ఏదో దాగుంది మసక వెలుగులొ
2." మృత్యువు కూతల జోల పాట
మృత్యు వు వొడిలొ ఊయలలాట
నీ కేకలెవరికీ వినిపించవు
నీ ఊపిరాగటం కనిపించదు.
ఇలా చదువుతుంటే మీ కవితల ఊయలలొ ఊపిరి ఉందో లేదో తెలియ లేదు .చాలా బాగుంది మీ కొత్త పాళీ