అవునా .. నిజమేనా ..

ఆ మొఘల్ రణ ధీరులు తంతియా తోపె ఝాన్సీల స్వాతంత్ర్య సమర దీప్తి
త్యాగ మూర్తులు తిలక్ దాదా సీయార్దాసు మాలవ్య మన గాంధి మహిత శక్తి
జాతీయ సంస్థయై శాంత్యహింసల తోడ కాంగ్రెస్సు నడిపిన కదన ఫణితి
తమిళ ఆంధ్ర కేరళ ధారుణీ ప్రజలెల్ల ధారవోసిన మహా త్యాగఫలము
మాత్రు దేశముగా వక్షాస్త్రమయుండై బోసు పడరాని యిడుముల బడిన శ్రమయూ
పండిత నెహ్రుజీ పటేల్ పట్టాభియు రాజాజీ నెరపిన రాజ్య పటిమ
భారతీయుల పుణ్యంబు పండెననగ వచ్చెనిదివో సుస్వాతంత్ర్య వత్సరంబు
పొత్తుగూడు సుశుభముల పొందుడయ్య తొల్లి భారత విభవమ్ము వెల్లివిరియ

కూడలిలో తొంగి చూడంగానే రెండు మూడు టపాలు కనిపించాయి - దీప్తి గారు కన్నుల పండువు గానూ, వీనుల విందుగానూ గుర్తు చేశారు .. అలాగే మరి కొందరూ ..

నేడే స్వాతంత్ర్య దినం
వీరుల త్యాగ ఫలం

అవును, అంతవరకూ నిజమే .. ఇవ్వాళే పంద్రాగస్టు.

కానీ మనసు ఆశతో ఆనందంతో ఉరకలు వెయ్యట్లేదు.

మధ్యాహ్నమే యాహూలో ఈ వార్త చూశాను.

మనసు వికలమైంది. పని మీదకి దృష్టి పెట్టటం కూడా కష్టమై పోయింది.

సాయంత్రం ఇంటికొస్తూ రేడియోలో ఈ కథనం విన్నాను.

ఐదేళ్ళ చిరంజీవి హస్సన్ మహ్మూద్ గొంతులో .. ఏడాది క్రితం ఇజ్రాయెలీ హెజ్బొల్లా కుమ్ములాటలో తన చెల్లి మరణించిందని చెబుతూ .. వినేప్పటికి కళ్ళమ్మట నీళ్ళొచ్చాయి.

ఆశాదీపం జ్వలిస్తున్న ఘంటసాల స్వాతంత్ర్య గానం కూడా ఈ నీడల్ని పారద్రోల లేకపోతోంది!

Comments

Anonymous said…
మనసు అర్ధ్ర్రమైతే
మాటలు కరువవుతాయి.
మీ స్పందనకి మా జోహార్లు.
spandana said…
అవును. ఈ వార్త నేనివ్వాళ వుదయాన్నే కారెక్కగానే రేడియోలో వస్తోంది. ఒక్కసారి స్వాతంత్ర్య వేడుకలు భగ్నం చేసే ప్రయత్నంలో ఇన్ని ప్రాణాలు తీశారా కొంపదీసి అని ఒక్కసారిగా వళ్ళు జలదరించింది. అయితే ఆ వెంటనే అది ఇరాక్‌లో అని తెలిసాక ఒకింత వుపశమనం కానీ అంతలోనే వారు మాత్రం మనతోటి మనుషులు కాదా ఈ మనసుకెందుకలా అనిపించింది అని ప్రశ్న. ప్రతిరోజూ ఎక్కడో ఓచోట భూమి రక్తంతో కాకుంటే కన్నీళులతో తడుస్తున్నంత కాలం మనకు ఉషస్సులు లేవు... ఉగాదులు లేవు.

--ప్రసాద్
http://blog.charasala.com
Naga said…
ఎందుకో లింకు నొక్కి వెంటనే చదవకుండా మూసేసాను...
Sriram said…
manchi padyam. meeru raasindenaa...

pch! manishi enta saankEtikangaa develop ainaa, maanavatvam maatram digajaarutOndi.

mee maramanushulE nayamEmO... :)
శ్రీరామా, అంత సీను లేదు. కన్యాశుల్కంలో మారువేషంలో ఉన్న కరటకశాస్తుల్లు మధురవాణిని గురించి "ఇలాంటి పిల్ల నాకుంటే లక్షణంగా నాలుగు వేలకమ్ముకుని ఋణబాధ తీర్చుకోనా!" అంటాడు రావప్పంతులుతో. అలాగే .. :-)

ఈ పద్యాలు రాసిందెవరో తెలీదు కానీ ఘంటసాల గొంతుతో అమరత్వం పొందాయి.
ఈ పేజీలో చివర్లో చూడు.
http://www.ghantasala.info/padyaalu/index.html
Sriram said…
ఔనా! నిజమేనా...? :)
నేను మీరు రాసిందే అనుకున్నా సుమండీ.
అడిగినందుకు మంచి లంకె దొరికింది. పద్యాలు భలే ఉన్నాయి. థాంక్సో! (అర్ధం కాకపోతే రానారెని అడగండి :))
rākeśvara said…
ఇది హృదయభాను టపా,
నేను తప్పు టపాకి లంకె వేసాను. అర్థరాత్రి వ్రాసిన టపా కాబట్టి పొరపాటు జరిగింది. :)