శ్రీ వేంకటేశ్వర మహత్యం

ఈ చిత్రాన్ని గురించి బోలెడు రాయాలనుంది గానీ సమయం లేదు - అందుకని ఈ బుల్లి టపా. నా చిన్నప్పుడు పౌరాణికాలు, జానపదాలు వొదిలి పెట్టకుండా చూసేవాణ్ణి కానీ మొత్తానికి ఈ సినిమాని ఎలాగో మిస్సయ్యాను. మొన్నీ మధ్యనే డిస్కు అద్దెకి తెచ్చి చూశాను.
గట్టిగా చెప్పాల్సిన ఒకే ఒక్క మాట - అద్భుతమైన సంగీతం!
సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వర రావు తన జన్మ ధన్యం చేసుకుని ప్రేక్షక శ్రోతల జన్మలు పావనం చేశాడు.
ప్రతి పాటా, ప్రతి పద్యము చక్కటి సంగీతంతో తొణికిసలాడుతూ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
పద్మావతీ శ్రీనివాసుల కళ్యాణం పదిహేను నిమిషాలకి పైన సాగే రమణీయ ఘట్టం - పసుపు కొమ్ములు దంచడం దగ్గర్నించీ, అప్పగింతలు పూర్తై కొత్త కోడలికి అత్తారింట్లో దిష్టి తియ్యడం వరకూ ఒక నదిలా సాగే రాగాల మాలిక.
మరి కొన్ని విశేషాలు.
శ్రీ మహాలక్ష్మి గా ఎస్. వరలక్ష్మి తన పాటలు తనే పాడుకున్నారు.
వాకుళా దేవిగా నటించిన శాంతకుమారి కి గాత్రం అందించింది ఎవరో. లేక ఆమెకూడా తన పాటలు తనే పాడుకున్నారా? "ఎన్నినాళ్ళని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా" - పాటలో ధ్వనించే భక్తిభావం అద్భుతం.
చివరలో అమరగాయకుడు ఘంటసాల శ్రీవారి సన్నిధిలో కూర్చుని రీతిగౌళ రాగంలో పాడిన "శేష శైలావాస శ్రీవేంకటేశా" - షడ్రసోపేతమైన భోజనం తరవాత మిఠాయి కిళ్ళీ వేసుకున్నట్టు - తల్చుకుంటేనే నా వొళ్ళు గగుర్పొడుస్తోంది. శ్రీనివాసునిగా అన్నగారు ఛ్ఛాలా బావున్నారు.
తా.క.: ఒక ప్రశ్న. డీవీడి లో నించి చిన్న చిన్న విడియో క్లిప్పులు కాపీ చెయ్యటం ఎలాగో ఎవరికైనా తెలుసా??

Comments

మీకు unix వాడడం అలవాటు ఉంటే mencoder దీనికి వాడొచ్చు. (ఇది విండోసుకు కూడా ఉంది, అయితే command prompt నుండి మాత్రమే వాడవచ్చు). ఎలా వాడాలో వాడి డాక్యుమెంటేషన్లో ఇస్తాడు.

http://www.mplayerhq.hu/design7/news.html
leo said…
http://www.digital-digest.com/dvd/downloads/showsoftware_mpeg2cut_294.html

Open .vob file on the dvd in MPEG2Cut. Click on [ to indicate the start point and click on ] to indicate the end point of the click. Then File -> Save (or Save Project).

To hear the audio you need to install ac3filter available here http://ac3filter.net/project/1/releases
leo said…
If the DVD is encrypted use DVDDecrypter to copy the vob files to hard drive.
Thanks Ramana and Leo for the pointers. I'll check them over the weekend.

Leo - do you have a blog? Don't remember seeing it.
leo said…
నా రాతలు, సేకరణలు

ఆంగ్లంలో
http://www.floatsam.info

తెలుగులో
http://iddaru.wordpress.com
శాంతకుమారి పాట ( ఎన్నాళ్ళని ) ఆమే పాడుకుంది .