మా యింటి పండు

ఇవ్వాళ్ళ వంట అదుర్సే అదుర్స్!
ఒక్క stir fry కూర చేసిందండీ .. దాని రుచి మామూలు మాటల్లో చెప్పనలవి గాదు ..
ఆశువుగా ఆట వెలదిలో తప్ప. ఆరగించండి .. ఐ మీన్ ఆలకించండి.

ఆ. కూరగాయ ముక్క కూరిమి పర్ఫెక్టు (perfect)
రోస్టు తోఫు (roast tofu) కలియ టేస్టు ఫెస్టు (taste fest)
కోడిగుడ్డు వేయ గూర్మె టచ్చాయెనే (gourmet touch!)
బుజ్జి పండు వంట భువిని ఫస్టు!

పెళ్ళి కావలసిన, కొత్తగా పెళ్ళి అయిన కుర్రవాళ్ళకి (పెళ్ళయి చాన్నాళ్ళయినా ఈ పాఠం నేర్చుకోని కుర్రవాళ్ళకి కూడా) ఇదొక చిన్న పాఠం - జీవితంలో సుఖపడాలంటే ఇల్లాలి వంటని మెచ్చుకోండి.

Comments

rākeśvara said…
ఇంతకూ ఇది నిజంగా మెచ్చుకుంటూ రాసారా లేదా, కేవలం PR (పెండ్లాం Relations) కోసము వ్రాసారో తెలియట్లేదు. మనసారా రాస్తే, మంచి భోజనం మీ అందు బాట్లో ఉండడం మీ అదృష్టం. PR కోసం వ్రాస్తే, మీ పరిస్థితి నాకు ఎరుకనే...
Anonymous said…
నాదీ ఊరు కాదు!!!
Sriram said…
bhale...bhale...:)
మునగ చెట్టు బాగానే ఎక్కిస్తారన్న మాట.

పిల్లలకి పద్యాలుతో పాటు ఇవి కూడా నేర్పించేస్తే ఎలా అండి.
ఈ తెలివి తేటలు లేకనే నా నెత్తిన ఇన్ని బొడిపెలు!

- అక్కిరాజు
spandana said…
tgeపద్యాలే కట్టక్కరలేదు. మీరు వంట చేసినా అది తినలేక ఆమే పడుతుంది వంటల తంటా!

--ప్రసాద్
http://blog.charasala.com
రాధిక said…
పద్యాలు చెప్పి పెళ్ళం చేత రుచికరం గా వంట చేయించుకోవాలనుకుంటున్నారా?ఆడవాళ్ళు ఇలాంటి వాటికి త్వరగానే బుట్తలో పడిపోతారు.పప్పు నాగ రాజు గారికి మీకు కిటుకులు బాగానే తెలిసిపోతున్నాయి.
అమంగళము ప్రతిహతమగుగాక! ఏమీ, ఏమిదీ! సభ్యులు మా చిత్తశుద్ధినే శంకించుచున్నారే!! (ఈ డవిలాగుని అన్నగారి దుర్యోధన ఏకపాత్రాభినయం స్టైల్లో ఊహించుకోవాలి).

మీరింకా నాగరాజుగారి ఉపనిషత్తు పాఠాల్ని వంటపట్టించుకో లేదన్నమాట. ఏదీ, అందరూ ఒకసారి వల్లించండి - బుట్టలో పడుట వారికి ఇష్టమూ మరియూ లాభదాయకమూ ఐనప్పుడు మాత్రమే భార్యామణులు సదరు బుట్టలో పడెదరు.

@ సిసిము - అవునండీ మరి మాలాంటి అనుభవజ్నులు చెప్పకపోతే ఎలా?

@ అక్కి - బొడిపెల సంగతేమో గానీ తెల్లవెంట్రుకల సంఖ్య గణనీయంగా పెరిగింది.

@ ప్రసాద్ - నా చిత్తశుద్ధిని శంకించడం కంటే దారుణమైనది మీ అభియోగం.

@ రాధిక - అనుభవం తల్లీ అనుభవం.
మహాప్రసాదము! :)
నేనైతే అక్కిరాజుగారితో బొడిపెల పోటీ పెట్టుకోవచ్చన్న మాట.
ఏంటి అందరు నాగరాజుగారి కిటుకులు పాటిస్తున్నట్టున్నారే. ఐనా ఆడాళ్ళు అంత తేలిగ్గా బుట్టలో పడతారని ఎలా అనుకునారండి. చంధస్సు మొత్తం తిరగరాయగలరు. ఈ తే.గీ , కందము లన్ని రోజు వంటింట్లో తరుగుతూనే ఉంటారు. ...కొత్తపాళిగారు ఈ గీతిని మీయావిడకు వినిపించారా. ధైర్యం లేక ఇలా బ్లాగులో పెట్టి కుర్రకారుని మెరుగుపెడదామనుకున్నారా?