కొందరు అమెరికన్లు

మైకెల్ ఛాంగ్ అతి పిన్న వయసులో టెన్నిస్ గ్రాండ్ స్లాం విజయం సాధించినప్పుడు అతని తాయివాన్ మూలాల గురించి మీరు అరిచి చెప్పారా?

ఇంద్రా నూయి పెప్సికొ అధినేతగా ఎంపికైనప్పుడు ఆమె భారతీయతని మీరు ఎలుగెత్తి చాటారా?

ఈ దేశం కోసం ఆయుధం పట్టి టేమీ డక్వర్త్ ఇరాక్ యుద్ధంలో తన రెండు కాళ్ళూ పోగొట్టుకున్న రోజున ఆమె థాయ్‌లాండ్లో పుట్టిపెరిగిందన్న విషయం మీకు గుర్తుచ్చిందా?

హైన్స్ వార్డ్ 2005 లో సూపర్ బౌల్ MVP అయినప్పుడూ, గ్రేస్ ఎనాటమీ టీవీ షోకి 2006లో సాండ్రా ఓ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్నప్పుడూ, లిండ సూ పార్క్ 2002 లో తను రాసిన "ది సింగిల్ షార్డ్" అనే పిల్లల పుస్తకానికి న్యూబెరీ అవార్డు పొందినప్పుడూ -- వారి కొరియన్ వారసత్వం మీకు కనబళ్ళేదా?

కనబళ్ళేదు .. కనబడదు - ఎందుకంటే .. వాళ్ళు అమెరికన్లు .

అతని ఒంటరి తనాన్ని దుర్భరం చేసింది, అతని పైత్యానికి దోహదం చేసింది, అతని మనోవికారాల్ని వెర్రి తలలు వేయించింది, ఆఖరికి అతని చేతిలో అతి సులువుగా మారణాయుధాలుంచిందీ - అమెరికను సమాజమే. అవును.
సెయంగ్ హ్యూయి చో కూడా అమెరికనే.
ఎటొచ్చీ అది ఒప్పుకోవటానికి నిలువెత్తు నిజాయితీ, గుప్పెడు గుండె ధైర్యమూ కావాలి.

Comments

ఎప్పుడు సంపద గల్గిన అప్పుడు బంధువులు
Sriram said…
విజయానికి అందరూ బంధువులే...అపజయమే అనాధ.
Unknown said…
అక్కడనేంటండీ... మన ఇండియా లో నూ అంతే.
విష్వనాథన్ ఆనంద్, లక్ష్మీ మిట్టల్, లాంటి వారిని మనవారని చెప్పుకోవట్లా ?
rākeśvara said…
ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం నిజమే.. చో విషయంలో అతని జాతీయత, అతని ఉన్మాదం తో పోల్చుకుంటే చాలా చిన్ని విషయం.

విశ్వనాథన్ ఆనంద్ అచ్చమైన దేశీ కద. ఆయన భారత్ తరఫున ఆడతారు. అందులో సందేహం ఏముందో నాకు తెలియదు.

మిట్టల్ ఐతే భారత పాస్పోర్ట్ ధారి, కాబట్టి అది కూడా ఫర్వలేదు.

ఇంకా నోరా జోన్స్ విషయానికి వస్తే,
ఆమె భారతీయురాలని అనుకోనని ఆమె అన్నది.
ఐనా ఆమె గొంతులో భారతీయతను కాదనలేము.

we are what we are, in spite of what is said of us.
పాస్‌పోర్టు వచ్చిన రోజునే సడన్ గా ఎలా అమెరికన్లయిపోతారబ్బా?
Unknown said…
రాకేశ్వర రావు గారు:
నేను తప్పు ఉదాహరణలు తీసుకున్నానేమో. నా ఉద్దేశ్యం అంత వరకూ ఎప్పుడూ లేని ప్రేమ సడన్ గా వారు విన్ అవుతుంటే వచ్చేస్తుంటుంది మన ఇండియా వారికి, మొన్న అమెరికన్ ఐడియల్ లో కూడా అంతే. మన భారతీయ సంతతి అంటూ ఎక్కడ చూసినా గోలే. వారు అక్కడ సెటిల్ అయిపోయిన తరవాత కూడా వారు విజయాలు సాధించగానే మా వాళ్ళు అనుకుంటూ డప్పు వాయించుకుంటుంటారు.
leo said…
Isn't that a natural way to react? Had it happened in India would we react differently? And how correct is is it to blame the american way of life? If that is to blame then there ought to be more Chos, no?
@ లియో - అమెరికన్ సంస్కృతిని కించపరఛడమో ఎత్తిచూపడమో ఈ టపా ఉద్దేశం కాదు - విజయంలో కనపడని పరజాతీయత వికృతచేష్టల్లో జనాలకి కనబడుతుంది .. అని సూచించటమే.
చో మొదటి వాడు కాదు - ఇది చూడండి.
http://www.infoplease.com/ipa/A0777958.html