మే గడి బాధితులకి ఓదార్పు

Comments

Anonymous said…
మొదట్లో ఏడిపించినా చేసిన కొద్దీ అర్ధమైందండీ.
ఇప్పుడు బాధితుల జాబిత నుండి బయటికొచ్చేశా.:)
spandana said…
మీరెంత ఎగదోసినా నెలనెలకీ నాది దిగదుడుపే అవుతోంది.
ఈ నెల రెండు మాత్రమే నింప గలిగా! 1 అడ్డం మరియు 43 అడ్డం.
43 నింపినా 39, 40 మరియు 41 కొరుకుడూ పడనే లేదు. :(

--ప్రసాద్
http://blog.charasala.com
నాకు కొరుకుడు వడనివి 27 అడ్డం పాక్షికంగా, 28 నిలువు పాక్షికంగా, 40 నిలువు పాక్షికంగా, 41 నిలువు పాక్షికంగా, 37 అడ్డం పాక్షికంగా, 38 నిలువు పాక్షికంగా. గమనించారా అన్నీ పాక్షికంగానే. సత్యసాయిగారికి మాత్రం అభినందనలు.
Anonymous said…
ప్రసాద్ గారు, 43 నింపారంటే మిగతావి అంత కష్టం కాదు.
నాకు అదే చాలా సేపు తోచలేదు.
Anonymous said…
సాయం చెయ్యండి ప్లీజ్!

1 నిలువులో అసలు ఆధారం "చివరి కట్టు" అనుకుంటే దాన్ని విప్పెయ్యమంటున్నారు. విప్పమంటున్నది కట్టునో, లేక ఆధారాన్నో అర్థం కాక ఛస్తున్నాను. విప్పమంటున్నది కట్టునైతే సమాధానంలో "కట్టు" ఉండకూడదు కదా? మధ్యలో "గొడవ" ఎందుకొచ్చింది? ఇదంత సులభంగా తేలేలా లేదు...లేక నేను మరీ ఎక్కువ ఆలోచిస్తున్నానాండీ?
@సుగాత్రి - 1 నిలువు ఆధారాన్ని ఆంగ్లంలో anagram అంటారు. అంటే రెండు పక్కపక్కన ఉన్న మాటల అక్షరాలని కలగలిపి పేర్చి మనకి కావలసిన మాటని తయారు చేసుకోవడం. ఆధారంలో ఒక భాగం మనకి కావలసిన మాటకి అర్థం. ఒక భాగం కలగలపాల్సిన అక్షరాలు. మిగతా భాగం "ఈ ఆధారం ఒక anagram" అని సూచిస్తుంది. ఈ ఆధారంలో "పెట్టకుండా విప్పండి" అనేది ఈ చివరి భాగం.
సుగాత్రి గారి అనుమానానికి కొత్తపాళి గారి వివరణతో నేను పూర్తి చేసిన గడి సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పుడు దీనికి రెండు జవాబులు గోచరిస్తున్నాయి. ఎలా???????????? అయితే చివర కట్టు మాత్రం విడటం లేదు. అయ్యో... అయ్యో.. అయ్యయ్యో ...
Unknown said…
చాలా థ్యాంక్సండీ కొత్తపాళీ గారూ!

ఈసారైనా పూర్తిచేసి పంపాలని ఆశపడ్డాను. కానీ ఈసారి ఇనుపగుగ్గిళ్ళు చాలానే ఉన్నట్లున్నాయి. :(