స్పందన ప్రసాదు కోసం

పొద్దు నిర్వాహకుల ఆశీర్వాదంతో ..
గడిని చూసి చేతులెత్తేస్తున్న బ్లాగు సోదర సోదరీమణులకి కొంచెం ఉత్సాహం పుట్టించడానికి ..
నాకు వీలైనప్పుడల్లా ఇలా ఒకటో రెండో ..
ప్రసాదు గారూ, మీ పేరిట పెట్టానని ఏవీ అనుకోకండి. ప్రతి ఉద్యమానికీ ప్రతీక ఒకరుండాలి కదా! ఇప్పుడు మీ వంతన్న మాట.

అన్నట్టు విప్పబడిన ఈ ఆధారంతో మీకు తట్టిన మీరు ఛేదించిన ఇతర సమస్యల్ని ఇక్కడ పంచుకోవటం మరవొద్దు సుమా!

11. మరాకు తానైతే మంచిముత్యం మరొకరు, అనుబంధం ఉన్నా రాగద్వేషాలు లేవు (4+2+4)

Comments

ప్రస్తుతానికివియే.

25 అడ్డం "మీనమేషాలు".
21 నిలువు "డోషా".
నా వద్ద మొత్తం నింపిన గడుంది. పెట్టేదా?
20 నిలువు : మానవా
9 అడ్డం: త్రిపుటతాళం
7 అడ్డం: గాడి
2 నిలువు: గంగాళం
30 అడ్డం: పానీ?
37 అడ్డం: టిబి
38 నిలువు: బిక్క
oremuna said…
వద్దులేండి సత్య సాయి గారు

మేమేదో కష్టపడుతుంటే మీరిలా లీకేజీలు చేయడం ఏమీ భాగోలేదు

బుర్ర బద్దలు కొట్టుకుంటే రాత్రి రెండు గంటల భృహత్ప్రయత్నం తరువాత ఓ పాతిక శతం పూర్తయినాయి
వద్దండి. కాస్త మా బుర్రలకు పని చెప్పనివ్వండీ. ఇంకా ఇరవై రోజులపైనే ఉందిగా?
హ హ హ అది బెదిరింపు. గడి నింపడంలోని మజా నాకు అనుభవైకవేద్యం. మీకదెలా పోగడ్తాను?
Anonymous said…
నేను మొత్తానికి చాలానే నింపగలిగాను. మిత్రుల సహాయం తో. ఇంతకు ముందున్న భయం పోయిందిలెండి.
ayyo! I didn't want to take that enjoyment of cracking away at the grid from anyone; I should say the grid is very good. Still trying...
Unknown said…
నేనూ ఓ చెయ్యేసేదా? నిలువు 33 వరూధిని (నాకిదొక్కటే తెలుసు మరి :))
అన్నట్లు "చివరికి మోసపోయింది" అన్నారేమిటండీ? పాపం...వరూధిని నిజంగానే మోసపోయిందా?
ఇప్పటి వరకు ఇంతే వచ్చాయి...

== అడ్డం పదాలు ==
1 . భజన
2 . గందరగోళం
5 . బంధం
7 . గాడి
9 . త్రిపుటతాళం
13 . గండాలు
18 . పతి
19 . కుమారుడో
25 . మీనమేషాలు
27 . తడి
30 . పానీ
35 . రుమ్మ
37 . టిబి
40 . బొక్కసం
44 . అనిరుద్ధుడు

== నిలువు పదాలు ==
1 . భజంత్రి
2 . గంగాళం
3 . దడి
4 . గోలు
11 . తామరాకుమీదినీటిబొట్టు

15 . చాపక్రిందనీరు

20 . మానవా
21 . డోషా
23 . వాడి
26 . లుక్కు
32 . మమ
34 . ఱంపం
36 . మ్మరగౌ
38 . బిక్క
41 . సంఖ్హ్య
@సుగాత్రి- అవును కదా పాపం వరూధిని మోసపోయిందిగా. ప్రవరుడు తిరస్కరించి వెళ్ళిపోతే ఆమెమీద మనసున్న ఒక గంధర్వుడు ప్రవరుడి రూపంతో ఆమెను చేరదీస్తాడు. వారిద్దరికీ పుట్టినవాడు స్వారోచిష మనువు.

@షడ్రుచుల జ్యోతి గారూ, మీరు అడ్డంగా 1, 5, 35 లనూ, నిలువుగా 1, 36, 41 లనూ పునః పరిశీలించాలి.
వ్రాసిన పదాలని బట్టి, జ్యోతిగారు బి+ గ్రూపనుకొంటా. అంతా పాజిటివ్గానే ఆలోచించారు!
spandana said…
కొత్తపాళీ గారూ,
నాకు సహాయం చేయాలనుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. కానీ నాది మాహా మొద్దు బుర్ర.
"మరాకు తానైతే మంచిముత్యం మరొకరు, అనుబంధం ఉన్నా రాగద్వేషాలు లేవు (4+2+4)" -- దీనికి ఎంత బుర్ర చించుకున్నా ఒక్క పదమూ తట్టలేదంటే నమ్మండి. ఇప్పుడు సమాధానం చూశాక అయ్యో ఇదా..అనిపిస్తోంది.

--ప్రసాద్
http://blog.charasala.com
@ప్రసాద్ - మరేం పరవాలేదు. అందుకనే ఉన్నవాటిల్లో అతి పొడుగ్గా ఉన్న జవాబు వేశాను. దీని ఆసరాతో దీనికి అడ్డం పడే ఆధారాల్ని (9, 15, 19, 25, 28, 30, 37, 40, 43) సాధించడానికి ప్రయత్నించండి.
Sriram said…
నేను నింపే వరకూ చూడకూడదని ఇంతవరకూ మీ బ్లాగువైపు రాలేదు :)
ఇప్పుడే పంపాను. 10 అడ్డంలో తప్పు దొల్లిందేమో అని నా అనుమానం. పొద్దులో ఒక కామెంట్ కూడా పెట్టాను. కొంచెం చూడండి.
శ్రీరాంగారి 10 అడ్డం మీద కామెంటుకి నేనొక అడ్డం వేసా- సరేమో చూడండి.