కులగోత్రాలు సినిమాలో అనుకుంటా.
గుమ్మడి ఒక సంపన్న గృహస్తు. పుట్టిన రోజో, షష్ఠిపూర్తో జరుగుతోంది.
సంబరం జరిగిపోతుండగా చిన్నల్లుడు పద్మనాభం "ఇప్పుడు మామ గారి మీసం మీద సీసం" అని ప్రకటించాడు. పెద్ద కూతురు సూర్యకాంతం "అదేవిటి మరిది గారూ, నిక్షేపం లాంటి నాన్న మీసాల మీద సీసం పోస్తానంటారా?" అని కోప్పడింది. "సీసమంటే పద్యం వొదిన గారూ" అని ఆవిణ్ణి శాంత పరిచి పద్మనాభం మామ గారి మీసాల ప్రశస్తిని ఈ విధంగా కొనియాడినాడు.

సీ. కారు మబ్బుల బారు సేరునేలెడి తీరు కోర మీసము పొందు కోరుకొందు
మృగరాజు జూలునే తెగనోడ జాలు నీ ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు నీ మీసము తెరంగు నీలరంగు
మెలిపెట్టి నెలబెట్టు మీసాల రోసాలు గగన మండలముపై కాలు దువ్వు
తే. ఎవరు మోయుచున్నారు ఈ అవని భార-
మాదిశేషుడా, కూర్మమా? కాదు, కాదు
అష్టదిగ్గజ కూటమా ? అదియు కాదు
మామ మీసాలె భువికి శ్రీరామ రక్ష
ఇది రాసింది శ్రీశ్రీ అని సీసపద్యాలు సర్వే చేసిన మా కురువృద్ధులు సెలవిచ్చారు.
మృగరాజు జూలునే తెగనోడ జాలు నీ ఘన మీసము పసందు కనుల విందు
గండు చీమల దండు కదలాడినటులుండు నీ మీసము తెరంగు నీలరంగు
మెలిపెట్టి నెలబెట్టు మీసాల రోసాలు గగన మండలముపై కాలు దువ్వు
తే. ఎవరు మోయుచున్నారు ఈ అవని భార-
మాదిశేషుడా, కూర్మమా? కాదు, కాదు
అష్టదిగ్గజ కూటమా ? అదియు కాదు
మామ మీసాలె భువికి శ్రీరామ రక్ష
Comments
చెవుల్లో సీసం - విన్నాం.
మీసంపై సీసం - ??
మృగరాజు జూలునే తెగ'నా'డ జాలు ...
మెలిపెట్టి 'ని'లబెట్టు మీసాల రోసాలు ...
తేటగీటితో భలే కొసమెరుపు ఇచ్చారు. ఈ ఘట్టాన్ని ఒకసారి చూశాను. గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.