హైస్కూల్లో నాతోటి విద్యార్థి (పోటీ కూడా) ఉండేవాడు. మేస్టారు ఏదైనా క్లిష్టమైన ప్రశ్న వేసినప్పుడు నోరు మూసుక్కూర్చోని, సమాధానం మేస్టారే చెప్పేశాక "అబ్బ, సరిగ్గా అదే అనుకున్నా!" అనేవాడు. మాకందరికీ బలే వొళ్ళు మండేది.
రేపో మాపో పొద్దు మొదటి గళ్ళనుడికట్టు గడువు ముగుస్తుంది. త్వరలో సమాధానం కూడా ప్రచురిస్తారు. నాకేమో అన్నీ రాలేదు గానీ అధిక శాతమే వచ్చాయి, ఆ వచ్చినవి కూడా కరక్టే అని అనుకుంటున్నా. తీరా వాళ్ళు ప్రచురించేశాక అప్పుడు "అబ్బ సరిగ్గా అలాగే అనుకున్నా" అని మొత్తుకుంటే ప్రయోజనమేముంది? అందుకే ఇలా పబ్లిగ్గా ఇవ్వాళ్ళ (గడువుకి ముందే) ప్రకటిస్తున్నా.
అసలు పొద్దులో గళ్ళనుడికట్టు నిర్వహించాలనే బ్రిలియంటైడియా వచ్చినందుకూ, ఆ వచ్చిన ఐడియాని బహు చక్కని నుడికట్టుగా తీర్చినందుకూ, ఆ నుడికట్టులో అనేక సాంకేతిక విచిత్రాల్ని కూడా చొప్పించినందుకూ పొద్దు నిర్వాహకుల్ని మనసారా అభినందిస్తున్నాను. కొన్ని కొన్ని ఆధారాలు చిక్కటి చమత్కారంతో బహుసొంపుగా ఉన్నై. ధన్యోస్మి.
హెచ్చరిక - మీరు గానీ ఇప్పటి దాకా పొద్దు గళ్ళ నుడికట్టు చూశి ఉండక పోతే ఇక్కడతో ఆపేసి ముందు పొద్దు దిక్కు తిరగండి.
నుడికట్టుతో కుస్తీ పట్టి మీ సమాధానాలు ఇంకెవరితోనన్నా పోల్చుకోవాలని కుతూహలంగా ఉంటేనే ఈ టపా మిగిలిన భాగం చదవండి.
నా సమాధానాలు.
అడ్డం
1 . రసికరాజ తగువారము కామా (5+5+2); 6 . ణీరంతూ (తూణీరం, 3); 7 . గుడుగుడుగుంజం (6);
10 . యష్టి (2); 11 . ??; 12 . సురభి (3); 15 . పాగ (2); 17 . తిరుమల తిరుపతి దేవస్థానం (4+4+4);
20 . కినిమా (3); 22 . కోలాహలం (4); 26 . లాలన (3); 28 . ఏలే (2); 32 . జంఘాలశాస్త్రి (5);
33 . వికీపీడియా (5)
నిలువు
1 . రమణీప్రియదూతిక (8); 2 . కనితూ (తూనిక, 3); 3 . జరుగుబాటు (5); 4 . గుసగుసలు (5);
5 . కావి (2); 8 . గుండు (2); 9 . భాషాభిమానం (5); 13 . మామ (2); 14 . గరువు (3);
15 . తిలాపాపం (?, 4); 16 . గద (2); 18 . లకుమా (3); 19 . వదలం (3); 21 . నిద్ర (2);
22 . కోన (2); 23 . హలం (2); 24 . మలేసియా (4); 25 . సామజం (3); 27 . లత (2);
29 . కశా (2); 30 . ఏవి (2); 31 . కపీ (పీక, 2)

Comments
ఒక పది చేసిన తరవాత నా వల్ల కాదని వదిలేసా. ఏం చేస్తాం అంతే ఓపిక తగలడింది మరి.
--ప్రసాద్
http://blog.charasala.com
15 నిలువు: పాతిపంలా
@ ప్రసాద్ - కూర్చిన పొద్దు వారు నిజంగా అసాధ్యులే! Pun intended.
@ వీవెన్ - 15 నిలువు "చెల్లాచెదరు"ని పోస్టు చేసే హడావుడిలో మిస్సయ్యాను. 11 అడ్డం కూడా చెప్పినందుకు ధన్యవాదాలు.
@జ్యోతి - మరి మీ సొల్యూషన్ మాకు చూపించరూ?
@రానారె - పెళ్ళికాని కుర్రాడివి, నీకు రమణీ ప్రియదూతిక తట్టలేదంటే ఆశ్చర్యంగా ఉంది!
@చదువరి - నిజమే. "నేనిది కొత్తపాళీ టపా చూడకముందే నింపానొహోచ్!" అని ఒక డిక్లరేషన్ పడేయించండి. :-)
ఉత్తినే :-)
అసలు పొద్దులో ఒక్క నిలువు కనుక్కునేసరికి నేను అడ్డం పడ్డా. ఇంకెన్ని సార్లు అడ్డం పడాల్సి వస్తుందో అని దాన్ని కాశీ లో వదిలేశా:-)