బ్లాగ్పేరడీలు


రెండు ప్రసిద్ధమైన పోతన పద్యాలకి బ్లాగ్పేరడీలు
ఆనందించండి.

క. బ్లాగెడిది బ్లాగవతమట
బ్లాగించెడివాడు రామబ్లాగుండట నే
బ్లాగిన తోడనె ఇండీ
బ్లాగులలో బెస్టు కాక బ్లాగగ నేలా?

క. బ్లాగర్షులు బ్లాగేశులు
బ్లాగస్థులు గిలుకు సకల బ్లాగులలో పెం
బ్లాగుగ నెవ్వడు గిలుకునొ
బ్లాగనుశాసనుడు వాడె, బ్లాగుగ గొలుతున్.

పందిని పొడిచినవాడే బంటు, కందం రాసినవాడే కవి అని సామెత.
అంటే నేనూ కవినేనోచ్!

Comments

రాధిక said…
ఆహా ఏమి చెప్పారండి.అయితె మిమ్మలిని బ్లాగ్పోతన అని పిలుచుకుంటాము.
Murali Nandula said…
భలేగా రాశారు.
Sriram said…
ఆహా...రాముడిని కూడా బ్లాగరిని చేసేసారె. URL ఇద్దురూ కొంచెం :)
కొత్తపాళీ వారు కవి ఐన సందర్భంలో బ్లాగుకవిసామ్రాట్ బిరుదు నిచ్చి సన్మానించాలని ఉంది :)
@రాధిక - బ్లాగ్పోతు అనకుండ వుంటే చాలు :-)
@ శ్రీరామా - అబ్బే అంత కష్టపడక్కర్లేదు. శోధన వారికి లాగా నాక్కూడా ఒక ఇండీ పడేయించండి చాలు, సరిపెట్టుకుంటాను :-)) ఇదిగో యూఆరెల్లు.
Sriram said…
చిన్న కోరికే...మరి ఇంకొక ఏడాది ఆగాలేమో... :)
కవియను నామంబు నీరుకాకికి లేదే....అన్నాడు రామకృష్ణుడు. పేరు పెట్టుకున్నవాళ్ళందరూ రాముళ్ళే? ఇది ఒప్పుకోం :)

annaTTu, i have mailed u an excellent Oleti concert upload. check it out...
బ్లాగుబోతుతనం మెండుగా ఉన్నవారిని బ్లాగ్పోతన అనడం సబబేగదా!? మీరు కవియైన సందర్భంలో మీకిదే మా బిరుదుసత్కారం. కందం కందంలానే రాశారు అందంగా, జిగటగా. బాగుంది. నేనూ ప్రయత్నిస్తా.
క. కందాలకేమి భాగ్యము
వందైనా రాయ వచ్చు వడిగా, కానీ
ఛందస్సున వ్రాయుచునే
యందముగా వ్రాయవలెను యర్రపు రామా!
:-))
మీరంత సులభంగా కంద పద్యాలు ఎలా రాయగలుగుతున్నారు? గొప్ప విషయమే
లియో బెర్న్‌స్టీన్ అని పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో ఒక మహా విద్వాంసుడు. ఒకనాడు న్యూయార్కు వీధుల్లో నడుస్తుంటే ఒక కుర్రవాడు భుజాన వయొలిన్ పెట్టె వేసుకుని హడావుడిగా పోతూ ఈయన్ని ఆపి, "కార్నెజీ హాలుకెలా చేరుతాను?" అని అడిగాడు. లియో గారు ఆ పిల్లవాణ్ణి దయతో చూసి "సాధన, సాధన, మరింత సాధన" అని చెప్పారుట. :-)
మీ ప్రశ్నకి నా సమాధానం కూడా అదే.
Anonymous said…
చాలా బాగా వ్రాశారండి. ఇప్పటివరకూ చూడలేదు నేను. మీకు మంచి ధారాశుద్ధి ఉంది సుమా!