వీటిల్లో మీరేవైనా చదివారా?

ఆంధ్రజ్యోతి దినపత్రిక సోమవారం సంచికలో వచ్చే "వివిధ" తెలుగు సాహిత్యమంటే ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది.
ఇవ్వాళ్టి సంచికలో 2006 సంవత్సరంలో వెలువడిన తెలుగు కథల గురించి పలువురు ప్రముఖ కథా రచయితలు విమర్శకుల నుండి సేకరించిన అభిప్రాయాలతో ఖదీర్ వ్యాసం చదవండి.

వీటిల్లో మీరేవైనా చదివారా?

Comments

చేతన said…
లేదు, ఒక్కటి కూడా చదవలేదు. కాని రచయితల పేర్లు విని ఉన్నాను. వారిలో కొంతమందివి వేరే రచనలు చదివాను. ఖాదిర్ గారి దర్గమిట్ట కతలు తో పటు ఇంకో 2-3 కథలు చదివాను. ఆయనంటే నాకు చాలా అభిమానం. కారణం, ఆయన వ్రాసిన "కింద నేల ఉంది". I can't just say in one line why and how I liked it. నేను చదివిన కొన్ని కథలలో నచ్చినవి, చాలా బాగునయనిపించినవి ఎన్ని ఉన్నా, క్రింద నేల ఉంది మాత్రం ఎప్పటికీ గుర్తుండే కథ.
నా బ్లాగు చూసి వ్యాఖ్య రాసినందుకు, మీ ఆలోచన పంచుకున్నందుకు థాంకులు చేతన గారూ.
ఈ కథల్లో నేను ఆదివారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన "నేను అతను లోయ చివరి రహస్యం", "గేటెడ్ కమ్యూనిటీ" - ఈ రెండే చదివాను.
ఖదీర్ కథ 'కింద నేల వుంది" కథలో అతను ఇదివరకు అలవాటు పడిన గ్లోబలైజేషన్ థీం ని వదిలి కొత్త ఆలోచనలు చెయ్యటం ముదావహమే. ఈనాటి జీవన విధానంలోని కొన్ని కఠినసత్యాల్ని ఆ కథలో చాలా ఎఫెక్టివ్ గా చెప్పాడు. కానీ మరీ ఎక్కువ విషయాలు ఒకే కథలో పొదగడానికి ట్రై చెయ్యడంతోనూ, అవసరానికి మించి కథచెప్పే ప్రయత్నంలోనూ కొంచెం కుంటుపడింది.
తెలుగులో కథాసాహిత్యం గురించి ఇంకా ఇంత సీరియస్‌గా చర్చ జరుగుతోందని నాకు ఇప్పటిదాకా తెలీదు. ఆకాలం పోయిందనుకున్నాను. కారణం - పదోతరగతి తరువాత పాఠ్యపుస్తకాలు తప్ప ఇటీవలివరకూ నేనేమీ చదవకపోవడమే. ఖదీర్‌గారి వ్యాసంతో కొన్ని ఉపయోగపడే విషయాలు తెలిశాయి. "రచయితలలో స్టడీ తగ్గింది" అన్నమాట చేదునిజం. ఆస్తులు కూడబెట్టడంలోనూ ఉద్యోగాలలో పోటీతట్టుకోవడంలోనూ పడి కుటుంబంలోని వ్యక్తులమధ్య మానసిక అగాధాలేర్పడుతున్న మన వ్యవస్థలో "స్టడీ" చేసే తీరిక ఎవరికుంది, చేసేవాడు ఎక్కడున్నాడు? ఆగి ఆలోచిస్తే, వెనక్కితిరిగి చూసుకొంటే వెనకబడిపోతామేమోననే ఆందోళన.
రానారె, ఏలోకంలో ఉన్నావు? తెలుగు కథ గురించి వాడీ వేడి చర్చలు ఎప్పుడూ జరుగుతూనే ఉన్నయ్యి. రాసేవాళ్ళు మంచి కథలు రాస్తూనే ఉన్నారు. పైన చేతన గారు ఉదహరించిన ఖదీర్ కథ "కింద నేల వుంది" - సరిగ్గా నువ్వు చెప్పిన " ఆస్తులు కూడబెట్టడంలోనూ ఉద్యోగాలలో పోటీతట్టుకోవడంలోనూ పడి కుటుంబంలోని వ్యక్తులమధ్య మానసిక అగాధాలేర్పడుతున్న మన వ్యవస్థ " అనే ఇతివృత్తం గురించే. ఈ కథ 2005 లో తెలుగునాడి పత్రికలో వచ్చింది - సంచిక గుర్తు లేదు. కథ 2005 సంకలనంలో కూడా చోటు చేసుకుంది. అన్నట్టు నువ్వు రోహిణీ ప్రసాదుగారి సంగీతపు బ్లాగు చూశావా?
చేతన said…
mm.. may be, I dont know. కాని నేను అంత analyze చేస్తూ చదవలేదు.. తర్వాత కూడా కథ structureని analyze చేయలే్దు. ప్రతీ వాక్యం, ప్రతీ పదం కూడా ఆయన కథను చెప్పాలనుకున్న విధానమ్లో భాగమే అనిపించింది.

అవును నేను కూడా కథాసాహిత్యం పైన బాగానే చర్చలు చూసాను. కానీ ఈమధ్య గత 6-7 నెలల్లో కథలు (పుస్తకాలు) గాని, చర్చలు గాని చదవటం/follow అవటం తగ్గింది. కనీసం వాటి జోలికి కూడా పోలేదేమో.BTW, I recently watched "bowling for Columbine" (Micheal Moore's docu movie on guns' usage in US), and I kept thinking of "తుపాకి" in తెలుగునాడి while watching it. అప్పట్లో కొంత idea ఉందని నేను అనుకున్నా.. దాని తీవ్రత సినిమా చూసేవరకు తెలియలేదు.