పుస్తక సంగీత సినీ ప్రపంచం

సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం
ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం

ఈ శ్లోకం ఎక్కడిదో గానీ నా విషయంలో చాలా నిజం.
అంటే నేనేదో "చంటి" వాణ్ణని మీలో కొంటె పిల్లలు అనుమానించనక్కర్లేదు.
నేనంటున్నది ఏంటంటే .. నా జీవతంలో నేను పోగేసుకున్న ఆస్తులు ఈ రెండే - ఒకటి నా పుస్తకాల లైబ్రరీ, రెండోది నా కేసెట్, సీడీ ల లైబ్రరీ.

ఈ రెండూ కాక నాకింకో అభిరుచి కూడా వుంది, పోలిక పై శ్లోకంలో ఇమడక పోయినా.
అది సినిమా.

ఈ మూడింటిలోనూ .. ఈ మధ్య చదివిన/విన్న/చూసిన వాటి గురించీ, నాకు నచ్చిన/నచ్చని విషయాల గురించీ .. నాకు తోచినట్టు ఇక్కడ రాసుకుందామని ఈ ప్రయత్నం.
ఇది నలుగురూ చదివి ఆనందిస్తే ..పదిమందికి ఏవన్నా ఉపయోగ పడితే .. మంచిదే.

Comments

Varttik said…
మీరింకా చంటివారో కాదో తెలియదు గాని, మీరన్ని విషయాలని కుశాగ్రబుద్ధి*తో ఆలోచిస్తారని మాత్రం నాకు తెలుసు! :-)

రిగార్డులతో,
సురేశ్ కొలిచాల.
*శకార, చకారాలు రెండూ తాలవ్యాక్షరాలు కాబట్టి ఈ అక్షరాల మధ్య యతిమైత్రి, ఉచ్చారణా మైత్రి కుదురుతుంది కదూ?
మంచి శ్లోకంతో ప్రారంభించారు. నాకు మొదటి పాదమే తెలుసు. మీ టపాల్లో దాదాపు ప్రతిదీ ఆలోచనామృతమే. ధన్యవాదాలు.
పాటల క్యాసట్లు, పుస్తకాల ర్యాక్కులు
అందరికీ వుంటాయండి.
వాటిని అదూర్ గోపాలకృష్ణనన్ సినిమాలా మీరాశ్వాదిస్తారు, చిరంజీవి సినిమా చూసినట్టు మేమేదో పైపై మెరుపులు చూసి సంతోషపడతాం..
అనిల్ said…
మొదలుపెట్టండి. ఇక ఆలస్యం ఎమ్‌దుకు!
మహా జనులారా, మీరొక క్షణం ఆగి గమనిస్తే ఈ టపా ఫిబ్రవరిలో రాసినదని చూడగలరు. అప్పణ్ణించీ ఈ బ్లాగు ముప్ఫై కి పైగా రివ్యూలని ప్రచురించింది. చదువరి, రాంనాథుల పుణ్యమాని ఎందుకో అకస్మాత్తుగా ఈ మొదటి టపా బయటికొచ్చింది.