మోహన రాగ మహా!

ఇరవై నాలుగ్గంటల వ్యవధిలో నాలుగు సార్లు మోహన రాగం!

అఫ్ కోర్సు (దీనికి తెలుగు సమానార్థక పదమేదన్నా ఉందా? లేకపోతే ఒకటి సృష్టించరూ!!), వంకాయ కూర లాగే మోహన రాగమున్నూ - రెండూ ఎప్పటికీ మొహం మొత్తవు - వండి వడ్డించే వాళ్ళు వాటిని మరీ ఖూనీ చేస్తే తప్ప.

Rare Krithis of Tyagaraja అనే సీడీ. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి గారు గానం చేసినది. ఈ సీడీ సుమారు ఏడాది క్రితం కొన్నాను, ఆ మధ్యనే రిలీజయింది. ఇన్నాళ్ళూ ఎప్పుడూ శ్రద్ధ పెట్టి విన్న పాపాన పోలేదు అని చెప్పి నిన్న ఏదో గంట దూరం డ్రైవు చెయ్యాల్సి వొచ్చి కార్లో పెట్టుకుని వింటున్నా. ఇంతకు మునుపు ఎక్కడా వినని (చూడని) కృతులు వెలికి తీసి, వాటికి స్వరరూపం కల్పించి వెలువరించారు శ్రీ నేదునూరి. వయసు బాగా పైబడింది, గొంతులో ఇదివరకటి ఖంగు తగ్గింది, ఐనా వంత పాటకి మల్లాది సోదరుల్లాంటి సమర్ధులైన శిష్యులుండగా ఏమి కొదవ?

అఠాణా, కళ్యాణి, యదుకుల కాంభోజి, పంతు వరాళి .. ఇలా ఎన్నో రాగాల్లో .. నేదునూరి గాత్ర మాధుర్యానికి తోడుగా వారి మనోధర్మం, పాటని స్వరపరచటంలో ఆ రాగ రూపాన్ని తాను ప్రత్యక్షం చేసుకుని శ్రోతకి ఆవిష్కరించే సృజన శక్తి .. ఇలా ఆశ్చర్యపోతూ వింటూ ఉండగా, ఎనిమిది కృతులయ్యాక సంస్కృతంలో ఒక శ్లోకం ఎత్తుకున్నారు - వ్యాసో నైగమ చర్చయా - అంటూ. వేదసారాన్ని చర్చించటంలో వ్యాసుడు, మృదుకవిత్వంలో వాల్మీకి, వైరాగ్యంలో శుక మహర్షి, భక్తిలో ప్రహ్లాదుడు, సాహిత్య సంగీతాల్లో బ్రహ్మా నారదులు, రామ నామామృత పానంలో శివుడు అయినటువంటి శ్రీ త్యాగరాజస్వామిని భజిస్తాను అని శ్లోకార్థం.

ఇలా శ్లోకాన్నో పద్యాన్నో ఒక్కొక్క పాదం ఒక్కొక్క రాగంలో రాగమాలికగా పాడడాన్ని "విరుత్తం" అంటారు - బహుశా వృత్తం అనే ఛందో పదానికి అపభ్రంశ రూప మనుకుంటాను. ఈ విరుత్తం పాడ్డంలో షణ్ముఖప్రియతో మొదలు పెట్టి నెమ్మదిగా కానడలోకి జారి మూడో పాదంలో చటుక్కున తారస్థాయిలో మోహనం ఎత్తుకున్నారు నేదునూరి.

ఆహాహా - ఆ మాధుర్యం ఏమని చెప్పను .. అప్పటికి నేను చేరాల్సిన చోటికి చేరినా విరుత్తం మొత్తం వినిగానీ దిగలేదు. ఇక ఆ పూటంతా ఆ మోహన రాగ పాదం మనసులో మెదుల్తూనే ఉంది.

రెండవ మోహన దర్శనం తరువాయి టపాలో.

ఈ లోపల సీడీ వివరాలివిగో:
Rare Krithis of Tyagaraja
Presented by Sangita Kalanidhi Nedunuri Krishna Murthy

Produced and Marketed by
Sri Nedunuri Krishna Murthy
2-16-27/1, Sector 6
M.V.P. Colony, Visakhapatnam - 17
Sri Nedunuri's Website

Includes 8 rare krithis plus one ragamalika viruttam and a mangalam on Sri Tyagarajasvami
The sleeve insert has all the lyrics in RTS English script!

Comments

Sriram said…
aahaa....nEnu ettukundaam anukunTumDagaa meerE modaleTTaaru.

aa slOkam oka adbhutam...i have a recording of this sung by him in an AIR broadcast...unforgettable.
komanduri krishnamaachaaryulu garu on violin and jnaanaanandam gaaru mridangam.
Sriram said…
btw, vaddiMcEvaaraa...vaMDE vaaraa :)
You mean Nallan Chakravartula Krishnamacharyulu?

vaMDE vs. vaDDiMcE - good point!:-)
In most cases, the person is one and the same.
Sriram said…
kaadandI komandUri krishnmaachaaryulu gaaru veru...

ofcourse, kaanI naaku vaddana angaanE samtarpnaNalE gurtostayi....
క్రితంవారం హైదరాబాదులో శారదా భక్త మండలి వారు ఏర్పాటుచేసిన మల్లాది సోదరుల కచేరీకి వెళ్లినప్పుడు ఈ సీడి కొన్నాను. కీర్తనలలో ఎక్కువ రాగాలాపన లేకపోవటంతో నా స్థాయికి చేరువగా అనిపించాయి అన్నీ. ఇప్పటిదాకా పెద్దగా శ్రద్ధగా వినలేదు. ఇకపై శ్రద్ధగా విని ఇంకా ఆస్వాదించాలి.శ్లోకం అర్థం కూడా తెలిసాకా ఇంకా బాగా ఆస్వాదించవచ్చు
నేదునూరి గారు 'ఆరగింపవే' పాడుతున్న వీడియో youtube లో కనిపించింది.
Sasidhar said…
"For classicism, turn to Nedunuri" is the prevailing slogan and it is well-said.

Dear SRIRAM ,

Iam a fan of Nedunuri (means traditional classical music).Can I askyour contact e-mail so that we can share Nedunuri's wonderful music that we have .

reply to my personal email sasidhar.mannava@gmail.com with sub:Nedunuri

regards,
Sasidhar