ఇంగ్లీషులో Being Broke అని ఒక వాడుక ఉంది. తాత్కాలిక దారిద్ర్యాన్ని సూచించడానికి. ఈ తాత్కాలికత కొన్ని గంటలో ఒక రోజో కావచ్చు, లేక కొన్ని ఏళ్ల తరబడి ఉండొచ్చు. తెలుగులో నాకు దీనికి సమానార్థకంగా చప్పున క్లుప్తమైన వాడుక ఏదీ స్ఫూరించడం లేదు. పేదరికం, బీదరికం లాంటివి ఇక్కడ పనికిరావు.
ఈ ఆలోచన అంతా ఎందుకు అంటే, నాకిష్టమైన Sun Magazine లో Being Broke అనే శీర్షికతో కొన్ని రచనలు ప్రచురించారు. వాటిల్లో నాకు బాగా నచ్చిన వాటిని ఇక్కడ తెలుగులో రాద్దామని ప్రయత్నం.
ఒక గమనిక. ఈ కథనాలన్నీ అమెరికాలో అమెరికన్ల అనుభవాలు. ఇక్కడ సమాజంలో పేదరికం అనుభవాలకీ భారత్ సమాజంలో పేదరికం అనుభవాలకీ చాల తేడా ఉంది, ఉంటుంది.
మొదటి కథనం
నేనూ నా భార్యా ఒక నిర్జీవమైన మిడ్ వెస్టర్న్ఉక్కు పరిశ్రమ ఊరిలో ఉండేవాళ్ళం. రోజులో చాలా గంటలే పని చేసే వాళ్ళం కానీ ఖర్చులకి తగినంత డబ్బు ఎప్పుడూ చేతిలో ఉండేది కాదు. ఎప్పుడూ తడుముకోవడమే. కొన్ని నెలల్లో క్రెడిట్ కార్డు మీద ఆహారం కొంటే తప్ప నోట్లోకి నాలుగు వేళ్ళు పోని పరిస్థితి. మా అబ్బాయికి అప్పుడే రెండు నిండి మూడు వచ్చాయి. వాణ్ని బాగా గారాబం చేసే వాళ్ళం. దానికి డబ్బు ఖర్చులేని ఏ పద్ధతైనా మాకు ఆమోదమే. ఇంటివెనక జాగాలో మట్టి తవ్వి వానపాముల్ని వెదకడమో, కాలనీలో చక్కర్లు కొట్టడమో, ఏదీ లేకపోతే ఇంట్లోనే నాట్యం చేస్తూ గెంతడామో.
ఆ సంవత్సరం చలికాలం మరీ దారుణంగా ఉంది. మా పాత ఫర్నేస్ ని దీపారాధనని చూసుకున్నంత అపురూపంగా పవిత్రంగా చూసుకునే వాళ్ళం. దానికి బరువుకాకుండా ఇల్లు సగం ఖాళీ చేసేసి మిగతా సగంలోనే సర్దుకునేవాళ్ళం. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా, ఉభయతారకంగా ఉంటుందని, ఫర్నేస్ కట్టేసి పిల్లాణ్ణి తీసుకుని మా యింటి దగ్గరున్న మాల్ కి వెళ్ళేవాణ్ణి, మంచుతో గడ్డ కట్టేసిన రోడ్లమీద నా పాత టొయోటా ట్రక్కులో జర్రూ బుర్రూ జారుకుంటూ. అక్కడే కొన్ని గంటలు గడిపేసే వాళ్ళం.
వెచ్చగా వేడి చేసిన ఆ మాల్ నడవాలలో నడుస్తుండే వాళ్ళం, అంగళ్ళ అద్దాల కిటికీల్లోనించి అమ్మకానికి ఉన్న వస్తు ప్రదర్శనని తిలకిస్తూ. కెమెరా షాపు దగ్గర నిలబడి అక్కడ నిగనిగా మెరిసే టెలిస్కోపుల్ని చూస్తూ, అంతరిక్షంలో అవి ఎలాంటి వింతల్ని చూపిస్తాయో కదా అని ఆశ్చర్య పడ్డం. అలాగే ఆటవస్తువుల అంగడి ప్రదర్శనలో విచిత్రమైన పనులు చెయ్యగలిగిన బుల్లి బుల్లి మరమనుషుల్ని చూసి ఆహా ఓహో అనుకోడం. మన దగ్గర డబ్బనేది ఉంటే, ఆ డబ్బు పెట్టి ఆయా వస్తువుల్ని కొనుక్కుని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని నా కొడుక్కి అర్ధమయిందో లేదో ఆ వయసుకి. కొనమని మారాం మట్టుకు చేసేవాడు కాదు.
ఆ మాల్ నడిబొడ్డున విశాలమైన జాగాలో ఒక రంగులరాట్నం ఉంది. దానికి కొన్ని చోట్ల పైకీ కిందకీ ఆడే గుర్రపు బొమ్మలు ఉన్నాయి మిరుమిట్లు గొలిపే రంగుల్లో. ఈ గుర్రాలతో బాటుగా చిన్న చెక్క ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఆ రంగుల రాట్నం తిరిగేటప్పుడు దాంతోబాటు కేలియోప్ సంగీతం వచ్చేది. రంగులరాట్నం ఎక్కడానికి టిక్కెట్టు ఒక్క డాలరే. కానీ అప్పట్లో మా చిన్న బడ్జెటుకి డాలరంటే ఒక పూట గ్రాసం! మాల్ లో తిరిగే సమయంలో కనీసం కొంత సేపు ఆ రంగుల రాట్నం దగ్గర నిలబడి చూస్తుండేవాళ్ళం. ఎక్కాలని వాడెప్పుడూ గొడవ చెయ్యలేదు. ఎప్పుడన్నా దాంతో వాయించే కేలియోప్ సంగీతానికి బుల్లి బుల్లి అడుగులతో నాట్యం చేసేవాడు.
ఒక రోజున ఇంట్ళో ఉన్న చిల్లరంతా పోగు చేసి రెండు డాలర్లుగా జేబులో పోసుకుని మా వాడిని రంగులరాట్నం ఎక్కించాలని మాల్ కి తీసుకెళ్ళాను. టిక్కెట్లు కొనబోతే రాట్నం అతను ఒక మంచి వార్త చెప్పాడు - పిల్లాడికి టిక్కెట్టు కొంటే, వాడిని చూసుకునే పెద్దగా నాకు టిక్కెట్టు అక్కర్లేదుట. ఒక డాలర్ మిగులు. టిక్కెట్టు కొనుక్కుని మావాణ్ణి ఒక నీలం రంగు గుర్రం మీద కూర్చో బెట్టాను. రాట్నం తిరగడం మొదలవగానే, నేను పట్టుకునే ఉన్నా గానీ, వాడికి భయం వేసేసింది. రాట్నం గుండ్రంగా తిరగడానికి తోడు గుర్రం పైకీ కిందకీ ఊగుతుండడం వాడికి నచ్చలేదు. సరేనని వాణ్ణి గుర్రం మీది నించి దించి, ఇద్దరమూ కలిసి ఒక ఉయ్యాల బెంచీ ఎక్కి కూర్చున్నాం. రాట్నం తిరగడం మొదలెట్టింది దాని సంగీతంతో బాటు. రాట్నం తో తిరుగుతున్నాం మాకేసి చూస్తున్న వాళ్ళకి టాటా చెబుతూ.
నా దారిద్ర్యంలో నించి ఒక్క డాలర్ పిండుకో గలిగినప్పుడల్లా వాణ్ణి మాల్ కి తీసుకెళ్ళి, వాడితో కలిసి రంగుల రాట్నం ఎక్కేవాణ్ణి. ఎప్పుడూ ఇద్దరమూ కలిసి ఉయ్యాల బెంచీనే ఎక్కేవాళ్ళం. రాట్నం తిరగడం మొదలవగానే వాడు కొద్దిగా నా వొళ్ళోకి వొదిగి పోయి, గిర్రున తిరుగుతున్న ఆ రంగుల ప్రపంచాన్ని తనలో నింపుకునే వాడు మెరుస్తున్న నీలి రంగు కళ్ళతో. ఆ టిక్కెట్టు కొనేశాక నా చేతిలో చిల్లిగవ్వ లేని నా దారిద్ర్యం వాడికి తెలీదు. సంపూర్ణమైన వాడి ఆనందాన్ని చూసి నాకు భోరున ఏడవాలనిపించేది.

Comments
ఒకసారి మా బ్లాగ్ కూడా దర్శించి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి