కర్నాటక సంగీతాన్నిఆస్వాదించడం ఎలా - 4

వినడానికి మరికొన్ని సూచనలు

వినడం మొదలు పెట్టిన తొలిదశలో వాద్య సంగీతం కంటే గాత్రం వినడం శ్రోతకి బాగా ఉపయోగపడుతుందని నా అనుభవం. అందులోనూ వాసికెక్కిన మహానుభావుల గాత్రం వినడం మరీ మంచిది. సంగీత త్రిమూర్తుల (త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రులు, ముత్తుస్వామి దీక్షితులు) తరువాత కృతి (లేక కీర్తన) అనే పాట రూపం కర్నాటక సంగీతానికి మూలస్తంభంగా ఏర్పడింది. కృతిలో సాహిత్యం ఉంటుంది గనక, పాట వినేప్పుడు గాత్ర రూపంలో ఉంటే, ముందు ఆ సాహిత్యం మనసుకి పట్టి తద్వారా సంగీత రసాస్వాదనలో పైకి వెళ్ళేందుకు మార్గం సుగమం అవుతుంది. అదే వాద్య సంగీతం వింటున్నట్లయితే, అక్కడకూడా వారు ఆ కృతినే వాయిస్తున్నా ఆ సాహిత్యం మన చెవిని పడకపోవడంతో నేరుగా సంగీతాన్ని అవగాహన చేసుకోవడం కొంత కష్టం అవుతుందని నా అనుభవం.  ముందుగా గాత్రం వింటూ కొన్ని రాగాలనూ కొన్ని కృతులనూ మనసులో నిలుపుకోవడం అలవాటయితే అప్పుడు వాద్య సంగీతంలోని లోతులు కూడా సులభంగా తరచి చూడవచ్చు. కానీ కొందరు శ్రోతలకి వాద్య సంగీతం వినడమే హాయిగా ఉండవచ్చు. అయినా ఇదే వినాలి, ఇది వినకూడదు అని రూలేం లేదు, ఇదొక సూచన మాత్రమే.

మన తెలుగువారి దురదృష్టం, తెలుగు విద్వాంసుల రికార్డింగులు చాలా తక్కువే, ఒక్క బాలమురళీని మినహాయించి. నాకు గుర్తున్న గొప్ప గాయకుల పేర్లు కొన్ని కింద ఇస్తున్నాను. ఈ జాబితాలో ఎక్కువ తమిళ పేర్లే ఉంటాయి. అంతేకాక భారతీయ పేర్లను ఆంగ్ల లిపిలో రాయడంలో వచ్చే వేర్వేరు రూపాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి జాలంలో వెతికేప్పుడు. పాతతరం, మధ్యతరాలకి చెందిన గాయకుల రికార్డింగులలో ఆడియో క్వాలిటీ అంత బాగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా యూట్యూబులో ఉండేవి చాలా మట్టుకి ఎవరెవరో ప్రైవేటుగా రికార్డు చేసుకున్న కచేరీలు. అలాగే తమిళ గాయకుల తెలుగు ఉచ్చారణ కొంత ఇబ్బంది పెడుతుంది. ఏదైనా ఒక రికార్డింగు, ఒక అంశం నచ్చకపోతే, మరేం పరవాలేదు. మరొకదాన్ని వినండి. మంచి క్వాలిటీ ఉన్న రికార్డింగులు కూడా చాలానే ఉన్నాయి.

పాతతరం మహామహులు
అరియక్కూడి రామానుజ అయ్యంగార్ Ariyakudi Ramanuja Iyengar పాలించు కామాక్షి, శ్యామశాస్త్రులకృతి, మధ్యమావతి రాగం, ఆదితాళం
టైగర్ వరదాచారి Tiger Varadachari సభాపతిక్కు, గోపాలకృష్ణభారతి కృతి, ఆభోగిరాగం, రూపకతాళం
మహారాజపురం విశ్వనాథయ్యర్ Maharajapuram Visvanatha Iyer భక్తి భిక్షమియ్యవే, త్యాగరాజకృతి, శంకరాభరణ రాగం (audio quality quite bad)
జి. ఎన్. బాలసుబ్రమణ్యం G.N. Balasubramaniam (GNB) బ్రోచేవారెవరురా, మైసూరు వాసుదేవాచార్యుల కృతి, ఖమాస్ రాగం, ఆదితాళం
చెంబై వైద్యనాథ భాగవతార్ Chembai Vaidyanatha Bhagavathar An actual video, probably from a film, షణ్ముఖప్రియ రాగం
ముసిరి సుబ్రమణ్య అయ్యర్ Musiri Subramanya Iyer నీరజాక్షి కామాక్షి, దీక్షితుల కృతి, హిందోళ రాగం, రూపకతాళం
ఆలత్తూర్ సోదరులు Alathur Borthers (Sambasiva Iyer, Srinivasa Iyer) Actual video of Srinivasa Iyer only (Sambasiva Iyer passed away) with Lalgudi Jayaraman and Palghat Mani Iyer, కద్దనువారికి, త్యాగరాజకృతి, తోడి రాగం, ఆదితాళం

మధ్యతరం మహానుభావులు
మదురై మణి అయ్యర్ Madurai Mani Iyer సరససామదాన, త్యాగరాజకృతి, కాపినారాయణి రాగం, ఆదితాళం
శెమ్మంగూడి శ్రీనివాసయ్యర్ Semmangudi Srinivasa Iyer ద్వైతము సుఖమా, త్యాగరాజకృతి, రీతిగౌళ రాగం, ఆదితాళం
ఎం. డి. రామనాథన్ M.D. Ramanathan ఓ జగదంబా, శ్యామశాస్త్రుల కృతి, ఆనందభైరవి రాగం, ఆదితాళం
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి M.S. Subbulakshmi రంగపురవిహార, దీక్షితుల కృతి, బృందావనసారంగ రాగం
ఎమ్మెల్ వసంతకుమారి M.L. Vasantakumari జయజయ, పురందరదాసుల కృతి, నాట రాగం
డి.కె. పట్టమ్మాళ్ D.K. Pattammal, డి. కె. జయరామన్ D.K. Jayaraman జానకీ రమణ, త్యాగరాజకృతి, శుద్ధసీమంతిని రాగం
మంగళంపల్లి బాలమురళీకృష్ణ M. Balamuralikrishna (MBK or BMK) నగుమోము, త్యాగరాజ్కృతి, ఆభేరి రాగం
నూకల చినసత్యనారాయణ Nookala Chinna Satyanarayana బృహదీశ్వర, బాలమురళికృతి కానడ రాగం
నేదునూరి కృష్ణమూర్తి Nedunuri Krishnamurty ఆరగింపవే, త్యాగరాజకృతి, తోడి రాగం
వోలేటి వెంకటేశ్వర్లు Voleti Venkatesvarlu పట్టి విడువరాదు, త్యాగరాజకృతి, మంజరి రాగం
శ్రీరంగం గోపాలరత్నం Srirangam Gopalarathnam అలమేలుమంగ నీ, అన్నమయ్య పదం, భైరవి రాగం
కె. వి. నారాయణస్వామి K.V. Narayanaswamy ఇంత సౌఖ్యమని, త్యాగరాజకృతి, కాపిరాగం
మణి కృష్ణస్వామి Mani Krishnaswamy కంటజూడుమీ, త్యాగరాజకృతి, వాచస్పతిరాగం
ఆర్. వేదవల్లి R. Vedavalli ముచ్చట బ్రహ్మాదులకు, త్యాగరాజకృతి, మధ్యమావతి రాగం
మహారాజపురం సంతానం Maharajapuram Santhanam శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి, రాగమాలిక

ఈనాటి తారలు
కె. జె. యేసుదాస్ K.J. Yesudas క్షీరసాగరశయన, త్యాగరాజకృతి, దేవగాంధారి రాగం
టి.వి. శంకరనారాయణన్ T.V. Sankaranarayanan వల్లభ నాయకస్య, దీక్షితుల కృతి, బేగడరాగం
టి. ఎన్. శేషగోపాలన్ T.N. Seshagopalan బంటురీతి, త్యాగరాజకృతి, హంసనాదం రాగం
హైదరాబాద్ సోదరులు Hyderabad Brothers (D. Raghavachari, D. Seshachari) రఘునాయక, పట్నం సుబ్రమణ్య అయ్యరు కృతి, హంసధ్వని రాగం
మల్లాది సోదరులు Malladi Brothers బాల కనకమయచేల, త్యాగరాజకృతి, అఠాణారాగం
ఉన్నికృష్ణన్ P. Unnikrishnan వెంకటాచల, పురందరదాసుల కృతి, సింధుభైరవి రాగం
టి. ఎం. కృష్ణ T. M. Krishna జగదోద్ధారణ, పురందరదాసుల కృతి, కాపిరాగం
సుధ రఘునాథన్ Sudha Raghunathan రమారమణ, త్యాగరాజకృతి, వసంతభైరవి రాగం
బాంబే జయశ్రీ Bombay Jayashree సుధామయీ, ముత్తయ్యభాగవతుల కృతి, అమృతవర్షిణి రాగం విడియోలో కీరవాణి అని తప్పురాశారు.
ఎస్. సౌమ్య S. Sowmya కనకశైల విహారిణీ, శ్యామశాస్త్రుల కృతి, పున్నాగవరాళిరాగం
నిత్యశ్రీ మహాదేవన్ Nityasree Mahadevan పరాత్పర, పాపనాశం శివన్ కృతి, వాచస్పతి రాగం
సంజయ్ సుబ్రమణ్యం Sanjay Subramanyam పెట్రతాయ్, వల్లలార్ తిరుమురై, రాగమాలిక
ప్రియ సోదరీమణులు Priya Sisters సరసిజనాభ సోదరి, దీక్షితుల కృతి, నాగగాంధారి రాగం
పంతుల రమ Pantula Rama శేషాచలనాయకం, దీక్షితుల కృతి, వరాళి రాగం
మండా సుధారాణి Manda Sudharani ఎంతభాగ్యము, త్యాగరాజకృతి, సారంగరాగం

Comments

మీ సూచనలు మార్గ దర్శకం. బాగున్నాయి. నూతక్కి రాఘవేంద్ర రావు.(కనకాబరం.)
Srinivas said…
"ఇంత సౌఖ్యమని జెప్పజాల"లో "ఎంతో ఏమో ఎవరికి తెలుసు" అని KVN పాడుతుంటే ఒళ్ళు ఝల్లుమనిపించింది. అదే రాగంలోని "జగదోద్ధారణా" కన్నా ఈ పాట లలితంగా అనిపించింది. "స్వర రాగ లయా సుధారసమందు కండ చక్కెరను మిశ్రము చేసి" భుజించితే మొహం మొత్తుతుందేమో గానీ ఈ పాట వింటుంటే ఇది ఆగకూడదు అనిపించింది. ఎంతో మధురమైన సుఖానుభవాన్ని ఇచ్చింది. "స్వర రాగ లయా సుధారసమందు" నెరపిన నెరవల్(?)లో, స్వర సంచారంలో కొన్ని చోట్లలో వయోలినే ఇంకా బావున్నట్లనిపించింది. సాహిత్యాన్ని సంగీతం డామినేట్ చేసి నన్ను ఆకట్టుకున్న పాటల్లో ఇదొకటి. ఇంతకు మునుపు ఈ పాట విన్నాను రమణి వేణువు మీదా, జయష్రీ గాత్రంలో). KVN's rendition was the best, so far. Perhaps, one of the best pieces of music that I heard in the recent past. అప్పుడప్పుడు కానడ విన్నట్లనిపించింది - స్వర సంచార సమయంలో. ఇది రాసేప్పటికి తనియావర్తనలో ఉన్నాను. మీరిచ్చిన అన్ని లింకుల్లోకి ఇదే తెగ నచ్చేట్టుంది నాకు. మరోసారి కృతజ్ఞతలు మీకు.
Kottapali said…
శ్రీనివాస్ గారు, మీ వ్యాఖ్య చాలా హృద్యంగా ఉన్నది. అవును, ఆ తరం గాయకులలో మంచి మార్దవమైన గాత్రానికి కేవీఎన్ పెట్టింది పేరు. వారి సమకాలికులు చాలా మంది, సెమ్మంగూడి, ఇత్యాదులు ఉరుముల మెరుపుల శైలి కలవారు - ఈయన చాలా మృదువైన శైలి అలవరుచుకున్నారు. మీకు కుదిరితే ఆయన పాడిన అలివేణి ఎందు సెయ్వు పదం వినండి. జగదోద్ధారణా, కృష్ణనీ బేగనే కూడా చాలా లాలిత్యంతో పాడినవి విన్నా నేను.
శ్రీ నారాయణస్వామి గారికి
నమస్సులతో,

ఎప్పుడో మొదలుపెట్టి, ఈ రోజుకు మీ బ్లాగులోని రచన లన్నిటిని చదవటం పూర్తిచేశాను.

ఈ విధంగా నిండైన మీ ఆత్మీయతను చూఱగొనే అవకాశం కలిగింది.

ధన్యవాదమని చెప్పటం చాలా చిన్న మాట!

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు
FourthEstate said…
meeku dhanyavaadaalu cheppagalagaalante, sahasraphani navvali.. !!

anta anandamrutam lo sangeeta sagaram lo tarimpachestondi mee krushi nannu!

namassulu..
vinamramgaa
sridevi
Kottapali said…
ఏల్చూరివారు, మీ అభినందనలను శుభాశీస్సులుగా నెత్తిన పెట్టుకుంటున్నాను!

Fourth Estate, Thank you for following the series. More details will be coming.
Srinivas said…
nAsy gAru,

Sorry, I am unable to type in Telugu now. After learning that KVN had sung this in 2001, I shopped around in Flipkart and found that this particular rendition was part of 2001 December season concert (Charsur). The album includes a very brief alapana in Kapi (though it was incorrectly sequenced in the list). I am writing this just as an FYI.

Regards,
Srinivas
Anonymous said…
నాకు సంగీతాన్ని ఆస్వాదించడం... అప్పుడప్పుడు కూనిరాగాలు తీయడం తప్ప.. దాని గురించి చర్చించేంత జ్ణ్యానమూ, వయసూ, అర్హత లేవని నా దృడ విశ్వాసం... జేసుదాసుగారి క్షీరసాగర శయన విని కళ్లుమూసుకొని, నన్ను నేను మరచిపోయాను... ఇంత మంచి వివరాలు తెల్పినందులకు మీకు కృతజ్ణ్యతలు...

ఇక్కడ ఈ ప్రశ్న అడగొచ్చో కూడా నాకు తెలియదు... కానీ... కర్ణాటక సంగీతం ఒంట బట్టడానికి ఇంత అని నిర్ణీత కాలమేమయినా చెప్పగలరా? ... నేర్చేసుకుందామని కాదు... నేర్చుకోగలనేమోనని ఒక చిన్న ఆశ... మరియొక సంశయం...

గానం చేయడం పూర్వ జన్న సుకృతమేనా? ఎందుకడుగుతున్నానంటె... కొంచెం గంభీరంగా (Bass) ఉండే నా గొంతులో రాగాలు పలిగించగలనంటారా? - ప్రవీణ్...
Kottapali said…
ప్రవీణ్ గారు, నాబ్లాగుకి స్వాగతం. ఇక్కడ ఆస్వాదించడం అంటే, ఊరికే వినడమే కాక, ఏమి వింటున్నామో తెలుసుకుని ఆనందించడం అని నా భావం. ఈ వరుసలో ఇంకా టపాలు రాయాల్సి ఉంది, రాస్తాను.
ఏమీ సందేహం లేకుండా సంగీతం నేర్చుకోవచ్చు. కొంచెం పెద్దయ్యాక నేర్చుకోవాలంటే కొంచెం ఓపికగా పాఠం చెప్పే గురువుగారు ఉండాలి. మంచి గురువు, క్రమబద్ధమైన సాధన, మీ పట్టుదల - ఇవి తప్ప ఇంకేమీ అక్కర్లేదు. మన సంగీతంలో ఇదొక గొప్ప వరం. గొంతు క్వాలిటీకి అస్సలు సంబంధం లేదు. కర్నాటకసంగీతంలో పెద్దస్టార్లుగా పేరుమోసిన చాలామంది గొంతు "మృదువుగా" ఉండదు.
Naga Pochiraju said…
you forgot trichur brothers
Naga Pochiraju said…
u forgot trichur brothers
Kottapali said…
Lalitha Sravanthi, I don't know about them. By the way, the above list is by no means meant to be exhaustive. Just an entry point.
Srinivas said…
పద్ధతి సిరీస్‌లో దొరికింది KVN గారి అలివేణి. తియ్యగా ఉంది పాటంతా, అర్థం అవకపోతేనేం, :). కాస్సేపయ్యాక అర్థాలు వెదుకుతాను.

ఇదేదో నాట్యం కోసం రాసిన పదమా? భక్తిగీతంలా అనిపించలేదు, అందుకని అడిగాను. నాట్యం కోసం రాసిందే అయితే - పాదాలు కదపడం తక్కువగా ఉండి ముఖ కవళికలకూ, హస్తాభినయానికీ ప్రాముఖ్యం ఉండి ఉంటుందేమో అనుకున్నాను - పాటంతా మందగతిలో ప్రవహించినందున.

మొదట్లో పాడిన శ్లోకాలూ, ఆ తరువాత పాటా ఒకే రాగంలో ఉన్నాయా అండీ?

ఆ పాట విన్న చాలా సేపటికి పల్లవి మనసులో మెదలుతూ ఉంటే... ఆ వెనకే ఎమ్మెస్ ఫాడిన "క్షీరాబ్ది కన్యకకు" స్ఫురిస్తూ ఉంటే - గూగుల్ చేసి చూసాను. రెండూ కురింజి రాగంలో స్వర పరచబడ్డాయని తెలుసుకొని "హమ్మయ్య" అనుకున్నాను.

ఆ CDలో నాకు "పాహి పర్వతనందినీ", "పనిమతిముఖి బాలే" కూడా నచ్చాయి.
Kottapali said…
శ్రీనివాస్ గారు, సంతోషం. నా వద్ద KVN పద్ధతి సెట్టు లేదు, అంచేత ఏమి శ్లోకాలు పాడారో చెప్పలేను. అలివేణి పదం గురించి ఈ బ్లాగులో ఇంతకు మునుపు రాశాను. వెదికితే మీకు కనిపిస్తుంది. అక్కడ చాలా ఆడియోలు కూడా పెట్టాను. బహుశా మోహినీ ఆట్టం (mihini attam) అనే కేరళ నాట్యానికి బాగా సరిపోతుంది అనుకుంటా. అవును, కురింజి పెద్ద రాగం కాకపోయినా, ఆ పోకడలు చాలా స్పష్టంగా ఉండి బలమైన ముద్ర వేస్తాయి.
TM Krishna gaari dance baagundi, paata kante koodaa