కర్నాటక సంగీతాన్నిఆస్వాదించడం ఎలా - 1

ఉపోద్ఘాతం
తెలుగువారమై పుట్టినందుకు మనకి మన పెద్దలు ఇచ్చిపోయినవి రెండు గొప్ప ఆస్తులున్నై. ఒకటి పద్య కావ్య సాహిత్యం. రెండోది కర్నాటక సంగీతం. సంగీతానికి భాషల హద్దులేవిటని కొందరు మొహం చిట్లించవచ్చు. ఈ సంగీతానికి ప్రాచుర్యంలో ఉన్న పేరిట కర్నాటక అని విశేషణం ఉన్నా, ఈ సంగీతం బాగా వృద్ధిపొందింది తమిళనాట అయినా, ఇది తెలుగువారి సొత్తు. ఎందరో గొప్ప తెలుగు వాగ్గేయకారులు ఈ సంగీతాన్ని సుసంపన్నం చేశారు. ఇందులో పాడబడే సాహిత్యంలో తొంభైశాతం తెలుగులో ఉంది. అంతే కాక ఎందరో గొప్పతెలుగు గాయకులు, వాద్యకారులు దీని పరిధిని అనేక విధాల విస్తరింపచేసి శోభిల్ల చేశారు. ఎవరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా కర్నాటకసంగీతం తెలుగువారి ఆస్తి.

అంతేకాక, ఈ మానవ జీవితంలో మనిషి దైవాన్ని నమ్మినా నమ్మకపోయినా, దైవత్వ అనుభూతిని అతి సులభంగా కలగ్జేసే దివ్యమైన వరం సంగీతం. నా మిత్రులు పరమనాస్తికులైన వారు కూడా కర్నాటక సంగీతం వింటూ అలౌకికానందం అనుభవించడం నాకెరుకే.

ఈ రెండు కారణాలూ ఇలా ఉండగా, తెలుగు మిత్రులతో సంగీత ప్రస్తావన చేసినప్పుడల్లా చాలా మందికి ఇది బొత్తిగా పరిచయం లేని విషయం అని తెలిసి నాకు బాధ కలుగుతూ వచ్చింది. ఆలోచింపచేసింది. సంగీతం అంటే అస్సలు ఇష్టం లేని వారెవరూ ఉండరు. కానీ శాస్త్రీయ సంగీతం, కర్నాటక సంగీతం అనేటప్పటికి మాత్రం ఏదో జంకు, భయం. ఎందుకు? ఇదేదో పండితులకి సంబంధించినది, మనకోసం కాదు, ఇదేదో పాతకాలపు వ్యవహారం, ఆధునికం కాదు, అబ్బ చాలా స్లో, ఫాస్ట్ బీట్ ఏదీ .. ఎన్నో అపోహలు, మరిన్ని సంకోచాలు.

అమెరికాలో విశ్వవిద్యాలయాల్లోనూ, ఇతరత్రా కూడా వారి పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాన్ని ఆస్వాదించడం పైన కోర్సులు నడుపుతూ ఉన్నారు. అలాగే మన కర్నాటక సంగీతాన్ని ఆస్వాదించడం నేర్పలేమా అనిపించింది. ఒకటి మాత్రం నిజం. ఇంట్లో మొదణ్ణించీ సంగీతం ఏదో ఒక రూపంలో ఉంటూ ఉండడం వల్ల సంగీతం అలవాటైన వారిని మినహాయిస్తే నాకు పరిచయమున్న సంగీత రసజ్ఞులందరూ కాస్తో కూస్తో కృషి చేసినమీదటే సంగీత రసాస్వాదనని అలవాటు చేసుకున్నారు. దీనిని నేర్చుకోవచ్చు. దీనికి ముందస్తు క్వాలిఫికేషన్లేవీ అక్కర్లేదు. బాలమురళీకృష్ణ మీకు బాల్యమిత్రుడవ్వక్కర్లేదు. కావలసిందల్లా కొంచెం శ్రద్ధ, మరికాస్త పట్టుదల. ఈ మాత్రం చిన్న పెట్టుబడి పెడితే అనంతమైన కర్నాటక సంగీత రత్నాకరం మీదవుతుంది. జీవితాంతం అలౌకికమైన ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది.

నేర్పడానికి నేనెవర్ని?
మంచి ప్రశ్నే. నేను సంగీత విద్వాంసుణ్ణి కాదు. కనీసపు స్థాయి గాయకుణ్ణి కూడా కాదు. నేనొక శ్రోతని. సుమారు పన్నెండేళ్ళ వయసులో మొదలెట్టి, మా అమ్మ నా తోటి శ్రోతగా పని గట్టుకుని సంగీతం వినడం నేర్చుకున్నాను. ఇదొక్కటే నాకున్న క్వాలిఫికేషను. నేను పడుతూ లేస్తూ నేర్చుకున్న విషయాల్ని ఇక్కడ కొంత ప్రణాళిక ప్రకారం మీకు అందించే ప్రయత్నం చేస్తాను.

షరా:
ఈ వరుసటపాలు సంగీత విద్వాంసులకోసమూ, ఇప్పటికే సంగీతం బాగా వినే అలవాటున్న వారికోసమూ కాదు.
కొత్తగా వినేవారి కోసం. వినాలని కుతూహల పడే వారికోసం.
ఇక్కడ పెద్దగా శాస్త్ర చర్చ జరగదు. నేను సంగీత శాస్త్ర పాఠాలు చెప్పను. విని ఆనందించడానికి అవసరమైన విషయాలు, అనుసరించాల్సిన పద్ధతులూ చెబుతాను. మధ్యమధ్యలో సందర్భోచితంగా చిట్టికతలూ, పిట్టకతలూ, కూసింత చరిత్రా, మరికాసింత గాసిప్పూ కూడా చెబితే చెప్పొచ్చు.
ప్రతి టపాలోనూ ఒకటో పదో ప్రశ్నలుంటాయి. ప్రశ్నలకి సమాధానాలు రాసే వ్యాఖ్యలని వెంటనే ప్రచురించను, మిగతా పాఠకులకి కూడా సమాధానమిచ్చే ఛాన్స్ ఉండాలి కదా.
సందేహాలుంటే అడగవచ్చు. నాకు చేతనైన సమాధానమిస్తాను.

Even though this is a learning experience, the main point is to have fun. I hope you do.

ఈ వారం అసైన్మెంటు


ఈ గాయని ఎవరు?
ఇదే పాటని మార్నింగ్ రాగా అనే తెంగ్లీష్ సినిమాలో యథాతథంగా ఉపయోగించారు.
ఈ పాట లాగా అనిపించే పాట ఇంకోటేదైనా మీరు విన్నారా? వినే ఉంటారు. కర్నాటకసంగీతం ప్రధాన పాత్ర పోషించిన ఒక ప్రఖ్యాత తెలుగు సినిమాలో ఒక పాట ఉన్నది. చెప్పండి చూద్దాం.

Comments

Surya Mahavrata said…
ఏమ్మెస్ సుబ్బులక్ష్మి
బ్రోచేవారెవరురా (శంకరాభరణం)
Anonymous said…
యమ్మెస్ సుబ్బలక్ష్మి!
Anonymous said…
ఇంకెవరండీ ...ది గ్రేట్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గారు :-)
Anonymous said…
ఎన్నాళ్లో వేచిన ఉదయం అనిపించింది ఈ పోస్టు చూడగానే :)
Anonymous said…


మీకెలా ధన్యవాదాలు తెలపాలో తెలియటంలేదు.

నేను మీలాంటి శ్రోతనే. కాని ఈ రాగాలు, తాళాలు, స్వరాలు వగైరా వగైరా ఎలా అర్థం కావు. మీరు వాటి గురించి తెలియచేస్తారని అనుకుంటున్నా. నేనింకా మొత్తం బ్లాగు చదవలేదు. మీ హెడింగ్ చూస్తేనే చాలా ఆనందం అనిపించింది.
కొత్తపాళీ గారు సంగీతం గురించి తెలుసుకోవాలని ఎప్పటినుండో కోరిక. మీ టపా చూసి బోలెడు సంబరపడిపోయాను. కొనసాగించండి, మిమ్మల్ని ఫాలో అవుతాను. ధన్యవాదాలు.
Kottapali said…
వ్యాఖ్యాతలందరికీ నెనర్లు.
ప్రశ్నలకి సమాధానాలు రాసే వ్యాఖ్యలని వెంటనే ప్రచురించడం లేదు. కొత్త టపా వచ్చినప్పుడు ప్రచురిస్తాను.
ఇక్కడ వినిపించిన పాటని పోలిన ఇంకొక పాటని ఒక్కరు మాత్రమే (సూర్య గారు) చెప్పారు. మిగతా వారు కూడా ప్రయత్నించండి. మళ్ళీ మళ్ళీ వింటే మీకే తడుతుంది.
Sravya V said…
చాలా సంతోషం గా ఉందండి ఈ సిరీస్ మీ నుంచి రావటం !
చాలా మంచి ప్రయత్నం మొదలు పెట్టారు నారాయణస్వామిగారూ. మీనుంచి వచ్చే తరువాతి టపా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను....
Madhav Kandalie said…
ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారు ఆ గాయని. ఎలాంటి పాట మరెక్కడ విన్నానో తెలియటం లేదు. మంచి ప్రయత్నం. మీ తదుపరి టపాల కోసం ఎదురుచూస్తుంటాను.
నమస్కారంమండి!
ఈ కీర్తన ఖమాస్ రాగం లో వుంది.
శంకరాభరణం చిత్రం లో ఈ రాగం లో వున్న బ్రోచేవారెవరురా కీర్తనను బాలు గారు పాడారు.

మీరు వినిపించిన గాయని మణి బోంబే జయశ్రీ గారు అనుకుంటున్నాను
చక్కటి ప్రయత్నం . మీనుంచి వచ్చే మరిన్ని పోస్ట్లు గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను....
Anonymous said…
పాడినది ఎం.ఎస్. పాట ఏ సినిమాలోదో చెప్పలేను. ఇటువంటి మరొక పాట బ్రోచేవారెవరురా?
Vasu said…
Thanks for a post like this.

కర్ణాటక సంగీతం సంబంధించి నేను గమనించిన మూడు నాలుగు విషయాలు .

1) అందులో మునిగితే కానీ ఆస్వాదించలేని గుణం ఉందేమో కర్ణాటక సంగీతానికి .(మీ టపా వల్ల ఆ మునగడం నేర్చుకోవచ్చు అనుకుంటున్నా) ఇన్స్టంట్ అపీల్ ఉండదేమో అనిపిస్తుంది.
2) మన వాళ్ళకి అన్నీ ఇన్స్టంట్ గా జరిగిపోవాలి.. ఈ రోజు మొదలెడితే రేపు కచేరి ఇచ్చేయాలి ..పిల్లలకి నేర్పించాలి అనే ఇష్టం కంటే ఎదో ప్రూవ్ చేయాలి మిగతావాళ్ళకి అంటే తపన ఉన్న తల్లి తండ్రులు ఎక్కువ కనపడ్డారు నాకు .
దాంతో కొత్తగా వినాలని వచేవాళ్ళకి మొత్తానికే ఆసక్తి పోతుందేమో అనిపిస్తుంది నాకు.
3) సినిమా సంగీతం - దీని వల్ల కర్ణాటక సంగీతానికి చాలా హాని జరిగిందేమో అనిపిస్తుంది .
4) అన్నిటి కంటే ముఖ్యమైనది - ఆంధ్రులకి పొరిగింటి పుల్లకూర రుచి. మనకి స్వంతమైన వాటి మీద మనకి ఇష్టం ఉండదు, గర్వం ఉండదు - భాష , సాహిత్యం , సంగీతం , వాగ్గేయకారులు .. :(
త్యాగరాజు అంటే పాత సినిమాలలో విలనా అన్నా ఆశ్చర్యపడక్కర్లేదు . రామదాసు ,అన్నమయ్య అంటే నాగార్జున :(


ఎం ఎస్ అమ్మ
My wild guess - సీతాపతే నా పై నీకభిమానము లేదా ..బ్రోచేవారెవరురా
Anonymous said…
ఎం ఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు. శంకరాభరణం సినిమా లో "బ్రోచేవారెవరురా" అనే పాట వినడానికి ఇలాగే ఉంటుంది.

సుధీర్
నా ఊహ ప్రకారం పాడిందేమో సుబ్బలక్ష్మి . పాటేమో బ్రోచేవారెవరురా
Anonymous said…
Happy to see this post.
Eagerly waiting to learn more.

Surabhi
పాడినది MS అనుకుంటాను.
ఇదే రాగం లో ఉన్న పాటలు "బ్రోచేవారెవరురా" (శంకరాభరణం), "నను విడనాడకురా" (విప్రనారాయణ).
srinivasaraov said…
mss lakshmi , oka pari oka pari
శ్రీనివాస కందాళ said…
చాలా బాగుంది. సుబ్బలక్ష్మిగారనుకుంటాను. మిగతా ప్రశ్నలు చెప్పలేను.

Krishna said…
పాట వినకుండానే (iphone లో పాట రాలేదు), మార్నింగ్ రాగ లోని పాట అనగానే ఊహించేసాను. దాని "లాగా" అనిపించే ఇంకో పాట కుడా తెలిసిపోయింది. నిజానికి రెండు పాటలూ మా గురువుగారినుంచి నేర్చుకున్నాను.
Kala said…
చాలా సంతోషం గా ఉంది. మీ పోస్ట్ లు చదివి సంగీతాన్ని బాగా ఆస్వాదించాలని ఎదురు చూస్తున్నాను.
ప్రశ్న కి నా సమధానం-- బ్రో చేవారెవరురా
నిన్న రాసిన పోస్ట్ లో ఒక్క మైసూరు వాసుదేవచారి గారి కీర్తన మాత్రమే చెప్పను,ఇంకొక స్వరజతి కూడా వుంది,అది 'సాంబసదా యనవే'అది కూడా ఖమాస్ రాగం లో చెయ్యబడినది.
నేను క్లాసులో జాయిన్ అయిపోయాను... Eagerly waiting for your next class
Unknown said…
గాయని ... యం.ఎస్. సుబ్బులక్ష్మి గారు ...
మార్నింగ్ రాగాలో పాడింది ... సుధా రంగనాథ్ గారు ...

ramesh said…
ధన్యవాదాలు, కొత్త పాళీ గారు.
M.S. సుబ్బలక్ష్మి గారు
వాతాపి గణపతిం భజే
Krishna said…
అయ్యో ఇన్ని రోజులూ మా అమ్మాయి ఓ రెండు నెలల క్రితం రాసిన ఆర్టికల్ గుర్తు రాలేదు... here it is..

http://inconvenienttruths.tumblr.com/post/29979789084/a-fear-of-demons-crucifixes-and-khamas-ragam
bantichotu said…
sudha ragunathan in ragam
same song
tagirisa said…
sudha raghunathan - Kamas.
Ravi said…
could you please re-post the link?