ముళ్ళపూడి రచనల్లో దేనిలోనో ఇద్దరు స్నేహితులు ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. ఒకడు రెండోవాణ్ణి అడుగుతాడు, ఎలా వుంది నా సెటైరు? రెండోవాడి జవాబు - చెత్త సెటైరు, చిరిగిపోయిన టైరులాగుంది.
మన తెలుగు రచనల్లో సెటైరులే కాదు, అన్నీ చిరిగిపోయిన టైరుల్లాగానే ఉంటున్నాయి. నాకు కథలతో కాస్త ఎక్కువ పరిచయం కాబట్టి కథలని గురించి మాట్లాడుకుందాం. కథలో మూల సూత్రం దగ్గిర్నించీ, భాష, పాత్రల చిత్రణలు, ముఖ్యాంశాలు, వెలిబుచ్చే భావాలు, అభిప్రాయాలు - అన్నీ క్లిషేలే.
సాధారణంగా క్లిషే అనే తిట్టు పోలికలకీ వాడుకలకీ .. అంటే భాషకి సంబంధించిన విషయాలకి ఉపయోగిస్తుంటారు. పలాని వాడి మొహం చీకేసిన తాటి టెంకలా ఉంది. ఇంకోడి మొహం ఆనందంతో వెయ్యి వోల్టుల బల్బులా వెలిగి పోయింది - ఇలాంటి వర్ణనలు లక్షల్లో చదివి ఉంటాం. అసలుకి అది వెయ్యి వాట్టుల అని ఉండాలి. మనది సైన్సు పాఠం కాదు కాబట్టి సరే, వదిలేద్దాం. అలాగే, నాగుపాము లాంటి జడ, గుప్పిట్లో ఇమిడే నడుము, మన్మథుడి విల్లులాంటి కనుబొమలు .. కోకొల్లలు.
ఇలా బయటికి కనబడే క్లిషేలే కాకుండా కొంచెం లోతుగా, కప్పబడి ఉండే క్లిషేలు కొన్ని ఉంటాయి. ఇవి భావాలకి సంబంధించినవి. కొన్నేమో నేరుగా పాత్రల చిత్రణలోనో, సంఘటనల చిత్రణలోనో పాఠకులకి తేట తెల్లమవుతూ ఉంటాయి. సాధించే అత్తగార్లు, శాడిస్టు షావుకార్లు, ధన-కామ దాహానికి అంతులేని జమీందార్లు, సరసాలు తెలిసిన మొగుణ్ణి అర్ధం చెసుకోలేని చాదస్తపు పల్లెటూరి పెళ్ళాలు - ఇలాంటి పాత్రలు ఇరవయ్యేళ్ళ కిందటే బాగా పాతబడిపోయిన క్లిషేలు. గత ఇరవయ్యేళ్ళల్లో కొన్ని కొత్త క్లిషేలు పుట్టుకొచ్చాయి. ఉదాహరణకి కొన్ని పాత్రలు, దృశ్యాలు - ఇవి నిజంగా నేను చదివిన కథల్లో ఉన్నవే! అంతే కాదు, కథారచయితలుగానూ అభ్యుదయ భావాలు కలవారుగానూ పేరొందిన వారి రచనల్లోనివే.
చిన్నవయసులో భర్తని కోల్పోయిన స్త్రీ అంట్లు తోమి కొడుకుని చదివించి ప్రయోజకుణ్ణి చేస్తుంది. ఇందులో ఒకటి కాదు సవాలక్ష క్లిషేలు ఉన్నై. భర్త చచ్చిపోవడం తప్ప స్త్రీకి చిన్నవయసులో కొడుకుని తనే ఒంటరిగా పెంచాల్సిన అవసరం ఇంకోటి కనబడదు. సరే, భర్త పోయి వంటరిదయింది. చదువు రాదు, ఇంకే పని చేతకాదు కాబట్టి అంట్లు తోమింది. చదువు రాక, ఇంకే వృత్తి చేతకాని స్త్రీకి అంట్లు తోమడం తప్ప వేరే జీవనభృతి లేదా? ఆ బుడ్డాడికి కథ మొదలయ్యే సమయానికి పదేళ్ళనుకుందాం. చదువు పూర్తై ప్రయోజకుడు కావాలనుకుంటే ఇంకో పది పన్నెండేళ్ళు అనుకుందాం. ఆ పది పన్నెండేళ్ళు అంట్లు తోముతూనే జీవితాన్ని ఈడ్చిందా? ఆమెకి ఇంకేం ఆశలు లేవా? స్వంత జీవితం పట్ల శ్రద్ధ బొత్తిగా లేదా? వోకే, ఆవిడ శ్రద్ధ అంతా కొడుకుమీదనే అనుకుందాం. మరి కొంత సంపాయిస్తే కొడుక్కి మరి కాస్త మెరుగైన జీవితాన్ని ఇవ్వచ్చునే - ఊహూ, కుదర్దు. ఆవిడ పన్నెండేళ్ళ పాటూ అంట్లు తోమి వాణ్ణి చదివిస్తే తప్ప అక్కడ వాడి అభివృద్ధికి తగినంత శ్రమ చేసినట్టు కనబడదు. దీనిమీద ఇంకో వేరియేషను ఆవిడ ట్యూషన్లు చెప్పడమో, లేక టీచరుద్యోగం చెయ్యడమో. దీనికీ అంట్లు తోమడానికీ ఆట్టే తేడాలేదని గమనించగలరు. అసలు సంగతేవిటంటే - ఆ స్థితిలో ఉన్న స్త్రీ ఏ విధంగానైనా సమాజంలో పైకెక్కి వచ్చిందని చూపిస్తే కొంపలటుకు పోతాయి.
సరే, అదయిందా. ఆవిణ్ణి కాసేపు ఊపిరి పీల్చుకోనిద్దాం. ఆమె కొడుకు బడుద్ధాయి సంగతేవిటి? ఆవిడ అలా కష్ట పడడమేవిటి, వీడిలా టింగురంగా మంటూ బడికీ కాలేజికీ వెళ్ళడమేవిటి? నిజమే, చదువు, అందునా కాలేజీ చదువు ఒక మెరుగైన బతుకు తెరువుకి దారి తీస్తుంది. కానీ దానికి తగిన స్తోమత లేనప్పుడు పైకి రావడానికి వేరే మార్గాలు లేవా? ఒక ధీరుభాయ్ అంబానీ వీడికెందుకు ప్రేరణ కాడు? చిన్నప్పటినించీ శ్రమ విలువ తెలుసుకోవడం, కష్టపడ్డం, సంపాదనలోని ఆనందం తెలియడం, స్వంత వృత్తి లేదా వ్యాపారంలోని స్వేఛ్ఛ తెలియడం - ఊహూ. ఇవేమీ అక్కర్లేదు. మిగతా అందర్లాగా పొలోమని మనవాడు కూడా బడికే వెళ్ళాలి, కాలేజికే వెళ్ళాలి, సాఫ్టువేరు ఉద్యోగమే చెయ్యాలి.
ఇంకా ఉంది వడ్డన. కొనసాగుతుంది నా వీలెంబడి.

Comments
మంచి విషయం ఎత్తుకున్నారు..బాగుంది.
పోదురు మీ బడాయి! అసలు ఉద్యోగం దొరకటమే కష్టం. ఏదో అంట్లు తోముకునే ఉద్యోగం దొరికితే అదే గొప్ప ఆ కాలం లో !
ఇప్పటి కైతే బీ పీ వో లో ఉద్యోగం చేసి ఉండును
(సాఫ్ట్ వేర్ అంటే మళ్ళీ మీరన్న ఆ మరో పాయింటు క్లాష్ అగును !)
(జీవితాంతం అన్నది గారంటీ లేదు !)
చీర్స్
జిలేబి.
"సవాలక్ష"కూడా క్లిషే నేమో :D
మీరు వ్యక్తీకరించిన తీరుబాగుంది. అవును ఆవిడ ఇంకేదో ఉద్యోగంచేసి అలా వచ్చినడబ్బుతో పుటుక్కున చదివించేస్తే చివర్లో "నీకోసం నేనెంత కష్టపడ్డానో తెలుసా" అనే 1000 న్యూటన్ల (టన్నులు కరెక్ట్‌కాదనిపించింది) డైలాగు మిస్సయిపోమూ :D
మీ విసుర్లు బాగున్నవి.
శ్రీ లలిత గారన్నట్టు భర్త పోగానే కుట్టు మషీనే గతి అన్నట్టు.. ఇంక ఆ స్థాయి నుంచి ఎదిగినట్టు రాయరు.. (మార్గదర్శి, మిథునం లో ధనలక్ష్మి ల్లాగా)
అలాగే మీరన్నట్టు సదరు పుత్రులు అసలు తమకి ఏమాత్రం సంబంధం లేనట్టు, వాళ్ల జీవితం వాళ్లది..