రచయితలకి శలవు ఇవ్వబడదు

రాయగలిగినవాళ్ళు రాయాలి. రాస్తూనే ఉండాలి.
అందరూ రాయలేరు.
అందుకని రాయగలిగిన వాళ్ళు రాయడం మానకూడదు, రాస్తూనే ఉండాలి.

రాయగలిగిన వాళ్ళల్లోనయినా లోతుల్ని తడిమి చూసే నిశితమైన చూపు అందరికీ ఉండదు. ఆ లోతుల్లోంచి తవ్వి తీసిన విషయాన్ని చెమర్చిన మనసుతో తడిపి ఆరవేసే శక్తి ఇంకా కొద్ది మందికే ఉంటుంది.

రాసింది ఎక్కడ ప్రచురించాలి? రాసింది ఎవరన్నా చదువుతారా, చదివి మెచ్చుతారా? ఇవన్నీ తరవాత.
ముందు రాయండి.
రాస్తూనే ఉండండి.
రాయడం ఆపొద్దు, ప్లీజ్!

Comments

Kalpana Rentala said…
చెప్పినది బావుంది. నిజమే. మరి మీరు కథలు రాసి ఎంత కాలమైంది? మీరు రాస్తే మేము చదవటానికి సిద్ధం. ఏమంటారు?:-))
కల్పన, నిజమే. ఆ మేలుకొలుపు నాకోసం కూడా :)
అందరిని రాయమంటున్నారు బానే ఉంది మరి మీరు బ్లాగు టపా కట్టి ఎంత కాలమైంది. కధలు రాసి ఎన్నేళ్లైంది. ఈ పద్ధతేమన్నా బావుందా అని అడుగుతున్నామధ్యక్షా??
ramya said…
రాయాలనే ఆలోచన ఉన్నవారంతా ప్రింటౌట్ తీసుకుని అద్దంపై అతికించుకోవలసిన మాటలు :-)
మాలతి said…
పై వ్యాఖ్యానాలనన్నిటినీ బలపరుస్తున్నా :))
మాలతిగారు, రాయడం మళ్ళీ మొదలు పెట్టానండి.
chavera said…
మహా బాగా సెలవిచ్చారండి.
ఈ సాహితీ లోకం లో ఒక ధ్రువ తార గా చిరస్థాయిగ ఒక మార్గాన్ని సుగమం చేసుకోవాలంటే
ఓ రచయితా ..మేలుకో
నీ రాతలతో నీకై నీవు నీ తలరాత కు మెరుగులు దిద్దుకో ..
Anonymous said…
బాధ పడకండి కొత్త పాళీగారు! నా పెన్‌లో ఇంక్ అయిపోయే వరకు, సారీ సారీ, ఇంటర్‌నెట్ కనెక్షన్ ఉన్న ల్యాప్‌టాప్ నా దగ్గర ఉన్నంత వరకు రాస్తూనే ఉంటా!
@tetageeti - very heartening :)
@చైతన్య దీపిక - బాగా చెప్పారు
మేధ said…
వ్రాయాలి వ్రాయాలి అనుకుంటూ రోజులు దొర్లిపోతున్నాయి :)
Kottapali said…
@Medha, welcome back.