మహోన్నతమైన పర్వతశ్రేణి పాదతలమ్మీదనో అనంతమైన జలరాశి వొడ్డునో నించున్నప్పుడు ఒక గాఢమైన అనుభూతి కలుగుతుంది. దాని ఔన్నత్యం ముందు, లేక దాని అగాథమైన లోతులతో పోలిస్తే నేనెంత అల్పుణ్ణి అనే చిక్కటి వినయం గొంతుకడ్డం పడుతుంది. దానివెంటనే నేనుకూడా ఆ ఔన్నత్యానికి రూపునిచ్చిన సృష్టిలో భాగాన్నే అనే ఒక గర్వరేఖ కూడా వికసిస్తుంది మనసులో. అలా కంటిగుపించని ఒక సన్నజలతారు బంధంతో నన్ను ఆ ఔన్నత్యానికి ముడివేసుకుంటాను. కనీసం ఆ క్షణంలో నా అల్పత్వాన్ని అధిగమిస్తాను. త్వమేవాహం.
నా బావిలోకప్ప జీవితంలోనే గొప్ప కళాకారులు, రచయితలు, మహోన్నత వ్యక్తిత్వమూర్తిమంతులని కొందరిని కలుసుకోవడం అప్పుడప్పుడూ తటస్థించింది. కేవలం కలుసుకోవడం కాదు, కొన్ని గంటలు, కొన్ని రోజులు వారి సంతత సమక్షంలో గడిపే అదృష్టం నాదైంది. ఇటువంటి ప్రతి అనుభవంలోనూ మొదట చెప్పినట్టు నేను ఏ పర్వతశ్రేణి ముందో నించున్నట్టుగా అనిపించేది. వారిలోనుండి అదృశ్యంగా ప్రసరించే వెచ్చటి వెలుతురేదో నన్నుకూడా తాకిన భావన. వీరంతా వారి రంగాల్లో జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన వారు. నాకు ముందు పరిచయమున్నవారు కారు. కొందరితో పరిచయం యాదృఛ్ఛికంగా సంభవించగా, కొన్నిసార్లు నేను పనిగట్టుకుని వారిని వెతుక్కుంటూ వెళ్ళాను కలవాలని. గాలివాటుకి కొట్టుకొచ్చిన నా పట్ల ఆ మహనీయులు చూపించిన ఆదరణ, ఆప్యాయత ఎన్నటికీ మరువలేను. ఈ అనుభవాలని కొన్నిటినైనా అక్షరబద్ధం చెయ్యాలనే ప్రయత్నం ఈ "ఎందరో మహానుభావులు" శీర్షిక.
2002 డిసెంబరు - 2003 జనవరి మధ్యలో ఒక నెలరోజులపాటు చెన్నైలో మకాం వేసి, అక్కడ జరిగే మార్గళి కళా ఉత్సవంలో పొద్దునా సాయంత్రమూ వివిధ సభల్లో కచేరీలకి హాజరవుతూ సంగీత నాట్యాలని ఆస్వాదిస్తూ గడిపాను. కొన్ని సభలలో ప్రొఫెసర్ సి.వి. చంద్రశేఖర్ గారిని దూరం నించి చూశాను కానీ వెళ్ళి పలకరించే సాహసం చెయ్యలేదు. గొప్ప నాట్యాచార్యులుగానే గాక ఆయన మునుపు బరోడా వివిలో ప్రదర్శనకళల విభాగానికి డీన్‌గా పని చేశారని తెలుసు. సహజంగా అందుచేత ఒక గురుభావం, బహుశా అందుకనే కొంచెం సంకోచం కూడా. ఒకసారి స్నేహితుల ఆహ్వానం మీద ఒక నాట్య ప్రదర్శన రిహార్సలు జరుగుతున్న చోటికి వెళ్ళాను. నన్ను పిలిచినవాళ్ళింకా రాలేదు. వేచిచూస్తుండగా చంద్రశేఖర్ గారు వచ్చారు. లేచి నమస్కారం చేశాను. హుందాగా అందుకుని ఆయనకూడా నాతో కూర్చున్నారు. ఎందుచేతనో ఆ రోజు రిహార్సలు బాగా లేటయింది. అలాగ, అనుకోకుండా ఆయనతో పరిచయం అవడమే కాక, సుమారొక గంట సేపు ఇష్టాగోష్టిగా ముచ్చటించే అవకాశం చిక్కింది. అప్పుడే తెలిసింది - ఆయన బయటికి అలా గంభీరంగా కనిపిస్తారే గాని, పరిచయమయ్యి మాట్లాడితే ఎంతో ఆత్మీయంగా ఉంటారని అనుభవమయింది. అప్పటి కళా ఉత్సవంలో మేమిద్దరమూ చూసిన నాట్య ప్రదర్శనల గురించి మాట్లాడుకున్నాము. నువ్వెవరు, నీకెంత తెలుసు భరతనాట్యం గురించి - నన్ను చూడు, ఇంత గొప్ప నాట్యాచార్యుణ్ణి, ఫిఫ్టీ యియర్స్ ఇండస్ట్రీలో .. అన్నట్టు కాకుండా, నా అభిప్రాయాల్ని విని, గౌరవించి, నా సందేహాల్ని తీర్చారు. సాంప్రదాయక నాట్యంలో సృజనాత్మకత కొత్తదనమూ ఎలా వస్తాయి అని చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
కొన్నాళ్ళు పోయాక ఇంకో నాట్యప్రదర్శన దగ్గర తారసపడ్డాము. ఆ పూట నేను కచేరీకి పంచకట్టుకుని వెళ్ళాను. ఆయన నా వేషధారణ చూసి కళ్ళెగరేసి "ఏవిటోయ్, మేము స్టేజి మీద వేసే డ్రెస్సు నువ్వు వీధిలోకే వేశావ్?" అన్నారు. నేను బదులుగా, "మరి నేనూ డేన్స్ నేర్చుకున్నాను కదండీ" అన్నాను. ఆయన - "నిజమా, మొన్న చెప్పనే లేదే!" అని సంతోషం వెలిబుచ్చారు. ఆ సీజన్‌లోనే ఆయన సోలో ప్రదర్శన చూసే అవకాశం కూడా చిక్కింది. స్వఛ్ఛంగా, కళాక్షేత్ర నాట్య సాంప్రదాయానికి దర్పణంలా ఉన్నది. సీజన్ చివర్లో కలిసినప్పుడు, అక్కణ్ణించి హైదరాబాదు వెళుతున్నానని చెప్పాను. ఆయన తనుకూడా వస్తున్నాననీ, సెంట్రల్ వివిలో ఒక వారం పాటు నాట్యవిద్యార్ధులకి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాననీ చెప్పారు. వీలుంటే కలవమని చెప్పారు. అంతకంటేనా మహద్భాగ్యం అనుకున్నాను.
హైదరాబాదులో మళ్ళీ కలిశాను. ఆ రోజు వివిలో ప్రదర్శనకళల విభాగాన్ని వెతుక్కుని చేరేప్పటికి పదకొండున్నర అయింది. సుమారు పది పన్నెండు మంది విద్యార్ధులు ఉన్నారు. ముగ్గురు అధ్యాపకులు కూడా ఉన్నారు. నేను అక్కడికి చేరుకున్న కాసేపటికే తరగతి ముగిసింది. అందరూ బయటికి వచ్చారు. విద్యార్ధులందరూ బిలబిలమంటూ వాళ్ళ వాళ్ళ హాస్టళ్ళకీ ఇళ్ళకీ వెళ్ళిపోయారు. మాస్టారు నన్ను ఆప్యాయంగా పలకరించి అక్కడున్న ఇతర అధ్యాపకులకి పరిచయం చేశారు. కొంతసేపు ఇష్టాగోష్టి సాగింది. ఇంతలోనే వాళ్ళు కూడా శలవు తీసుకుని నిష్క్రమించారు, మధ్యాన్నం కలుస్తామంటూ. సరే నేను కూడా శలవు తీసుకుంటాను అని చెప్పాను. అదేంటి, నువ్వు నాతో ఉంటావనుకున్నానే - వేరే అర్జంటు పనేం లేకపోతే ఉండు. నాకు ఒంటరిగా భోంచెయ్యాలంటే ముద్ద దిగదు అన్నారు. ఒంటిగంటకి నేను కలవాల్సిన మన్సిహిని పిలిచి "కేన్సిల్" అని చెప్పేసి, అలా మాస్టారితో కలిసి గెస్ట్‌హౌస్ మెస్‌కి వెళ్ళి, ఇద్దరమూ లంచ్ చేశాము. భోజనమయ్యాక తన రూం కి ఆహ్వానించారు. పగటి పూట నిద్రపోయే అలవాటు లేదుగానీ, వయసైపోతోంది గదా, మధ్యాన్నప్పూట కాస్త విశ్రాంతి కావాలనిపిస్తుంది అంటూ మంచం మీద నడుం వాల్చారు మాస్టారు. నేను కుర్చీలో కూర్చున్నాను. కాసేపు ఏవో నాకబుర్లు చెప్పాను. ఆయన తన వృత్తిజీవిత విశేషాలు కొన్ని చెప్పారు.
అప్పట్లో నాకు తట్టలేదుగానీ ఆ సంఘటన సందర్భాన్ని తరవాత తల్చుకున్నప్పుడల్లా నాకు మాహా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఇప్పటికీ. అసలు ఆ విద్యార్ధులూ అధ్యాపకులూ ఆయన్ని అలా వదిలేసి ఎలా వెళ్ళిపోయారు అని? ఆయనా - భరతనాట్య ఆచార్యులలో మహామేరువు వంటి వారు. అందులో కొత్త చోట మొదటి రోజు. సరే అధ్యాపకులంటే వాళ్ళ ఇళ్ళూ సంసారాలూ ఉంటాయి, ఇంటి దగ్గర లంచి టైముకి వాళ్ళకోసం ఎదురు చూసేవాళ్ళుంటారు - కానీ కనీసపు కర్టెసీ ఉండదా? అవడానికి ఫిబ్రవరే అయినా అప్పటికే మధ్యాన్నపుటెండ మాడు పేలుస్తున్నది. ఆ యెండలో ఆయన ఆ కొద్ది దూరమైనా నడిచి వెళ్ళాల్సిందేనా? మళ్ళీ అక్కడ అందరికీ బైకులూ స్కూటర్లూ ఉన్నై. ఆయన్ని గెస్ట్ హౌస్ దగ్గర దింపాలనే ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు! పోనీ పిల్లకాయల కేమయింది? వీళ్ళంతా నాట్యం పట్ల మక్కువతో నాట్యంలో పీజీ చెయ్యడానికి చేరిన సీనియర్ విద్యార్ధులే! చంద్రశేఖర్ గారి వంటి ఆచార్యుల సమక్షంలో గడిపితే కేవలం ఆస్మాసిస్ ద్వారానే ఎంతో విద్య లోపలికి ఇంకుతుందే! మూడోతరగతి వీధిబళ్ళో లంచిబెల్లు కొట్టంగానే పంజరం వదిలిన పక్షుల్లా ఎగిరిపోయే బుడంకాయల్లాగా తుర్రుమన్నారే వీళ్ళు!
ఇది ఇప్పటికే చాలా పొడుగయింది. ఆచార్యులవారు చెప్పిన కొన్ని ముచ్చట్లతో ఇంకో టపా రాస్తాను.

Comments
ఫోటో చాలా చక్కగా ఉంది.
మాలతిగారు, చదవేస్తే ఉన్నమతిపోతుంది అని సావెజ్జెప్పినట్టు ఇట్లాంటి uncouth behavior విద్యాధికుల్లోనే కనిపిస్తున్నది - విచారించాల్సిన విషయం.
గిరీష్, కొత్తావకాయ - నెనర్లు. ఫొటో నేను తీసిందికాదు - గూగులమ్మ కర్టెసీ. ఆయన్ని అన్నిసార్లు కలిసినా, ఏంటో ఫొటో తీసుకోవాలని తోచలేదు.