ఎనాలిసిస్ బ్లాగులో భలే చెప్పారు అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటాన్నించి పుట్టుకొచ్చిన రాజకీయుల సర్కస్ తమాషాని.
అన్నలారా అక్కలారా తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా .. గమనించండి. గుర్తు పెట్టుకోండి. మనం పూర్తిగా కళ్ళు తెరవకపోతే, విషయాల్ని ఉన్నవి ఉన్నట్టుగా అర్ధం చేసుకుని వ్యవహరించకపోతే - ఇప్పుడైనా ఎప్పుడైనా మనకి మిగిలేది రాజకీయ సర్కస్ తమాషాయే!
మీకు గుర్తుందా? 2004లో బాబు ఎనిమిదేళ్ళ పాలనమీద ఎంత వ్యతిరేకత? అలనాటి బీజేపీ "భారత్ వెలిగిపోతోంది" అన్న ఏడ్ కేంపేన్ ఏమయింది - మంటగాలి పోయి ఇంత గుప్పెడు బూడిద మిగిలింది. ఎంత ఆశతో, ఎన్ని గొప్ప ఆశయాలతో కాంగ్రెస్‌ని ఎన్నుకున్నారు ప్రజలు, రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ?
ఏమయిందా తరవాత? 2004 లో ప్రభుత్వాలు మారినప్పుడు నేనక్కడే ఉన్నా. మళ్ళీ 2009లో ఒకసారి భారత్ కి వచ్చా. ఎందరో వివిధ వృత్తుల్లో ఉన్న వ్యక్తులతో మాట్లాడా. అందరూ చెప్పింది ఒక్కటే .. ఆ పెద్దగా ఏం తేడాలేదు .. కత్తి పోయి సుత్తి వచ్చే ఢాం ఢాం ఢాం.
ఇప్పుడు ప్రశ్న అవినీతిలో వారెక్కువా వీరెక్కువా అని కాదు. నాకు వ్యక్తిగతంగా ఇరుపక్షాలమీద మోజూ లేదు, అలాగని ద్వేషమూ లేదు. మార్క్ ఏంటొనీ లాగా నేనిక్కడ సీజర్‌ని సమాధి చెయ్యడానికి వచ్చాను - బ్రూటస్‌ని తెగిడేందుకు కాదు.
అయ్యా - ఏదో ఒక గొప్ప దశగ్రహ కూటామి సంభవించి భారత్‌లో కనీవినీ ఎరుగని విధంగా ప్రజా చైతన్యం నిప్పు రాజుకుంది - అన్నా హజారే అనే డెబ్భైరెండేళ్ళ కొవ్వొత్తి వల్ల ఐతే అవుగాక. ఈ నిప్పు రాజుకున్నది. ఐతే దీని పర్యవసానం ఏమిటి? ఇది దావానలంలాగా చేతికందినంత మేరా కబళించడమా? లేక నూట ఇరవైకోట్ల భారతీయుల కరదీపికలుగా ప్రజ్వరిల్లి ఉజ్జ్వల భవిష్యత్తుకు దారి చూపటమా? అది మన చేతుల్లోనే ఉంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట పడాలని సామెత. లోకపాల్ బిల్లు వచ్చినంత మాత్రాన అవినీతి ఆగుతుందా?
మన పంచాయితీ లేక మ్యునిసిపల్ వార్డు దగ్గర్నించీ, స్థానికి ప్రభుత్వ కార్యాలయాల మీదుగా ప్రధాని కార్యాలయం వరకూ ఇదొక అవినీతి రాచబాట. ఇందులో - ప్రభుత్వాధికారుల దొకదారి. రాజకీయులది ఇంకోదారి. మొదటిది గుళ్ళో లింగాన్ని మింగే రకమయితే, రెండోది గుడినే మింగేది. దేన్ని ఎట్ల నియంత్రిస్తాం? నిలువరిస్తాం?
We need Objective Verifiable Indicators!!

Comments
భారతీయులు 121 కోట్లనుకుంటా.!
బాబు, భారతీయుల సంఖ్యని సవరించాను. పొరబాట్న పడింది. అవును, ఈ చైతన్యం సడలకముందే ఏదైనా కార్యాచరణ రూపం దాల్చాలి.
http://pakkintabbayi.blogspot.com/2011/04/blog-post_09.html