ఏనార్బర్‌లో ఇండోనీషియన్ నృత్య ప్రదర్శన

ఇండోనీషియా సాంప్రదాయక నృత్యరీతులను లోతుగా అధ్యయనం చేసిన నాట్యకారులు, నృత్యనాటక రూపకర్త, శ్రీ విదర్యాంతో గారి ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన నృత్య ప్రదర్శన జరగనున్నది ఏనార్బరు నగరంలో మిషిగన్ వివి ప్రాంగణంలో.

మన కూచిపూడీ, ఒడిస్సీలలాగానే ఇండోనీషియాలో వివిధభాగాలైన బాలి, జావా, సుమాత్రా ద్వీపాలలో సాంప్రదాయక నృత్యసంగీతాలు విలసిల్లుతూ వస్తున్నాయి. సాంప్రదాయకంగా రామాయణ భారతాలు ఈ కళారూపాలకి అవసరమైన ముడిసరుకుని అందిస్తూ వచ్చాయి. ఈ ప్రాంతాలకి ఇస్లాము రాకతో, పాలకులైన సుల్తానులు కూడా ఇస్లాం ను స్వీకరించడంతో సాంప్రదాయ కళల్లో కూడా ఇస్లాంకి సంబంధించిన కథల్ని ఉపయోగించడం మొదలైంది. తన రాజపోషకుడైన సుల్తాన్ శాసనంతో శ్రీ విదర్యాంతో ఇస్లాంకి సంబంధించిన అనేక కథలను సాంప్రదాయ నృత్య రీతుల్లో రూపొందించారు. తన పద్ధతుల్లో సాంప్రదాయక మూలాల్ని నిలుపుకుంటూనే ఒక కొత్త నాట్య పరిభాషని, దేశప్రజలకి దగ్గరచేసే రీతిలో రూపొందించే ప్రయత్నం చేస్తున్నానని శ్రీ విదర్యాంతో చెప్పారు.(బొమ్మ మీద నొక్కితే పూర్తి పరిమాణంలో చూడవచ్చు)

శ్రీ విదర్యాంతో రెండు సెమిస్టర్లు మిషిగన్ విశ్వవిద్యాలయంలో గౌరవ ఆచార్యులుగా వచ్చిఉన్నారు. ఈ వివిలో గత ముప్ఫై యేళ్ళుగా సంగీతాచార్యులు సూజన్ గారి పుణ్యమాని జావాద్వీపపు సంగీత సమ్మేళనం గామెలాన్ జరుగుతూ ఉన్నది. అనేక అమెరికన్ విద్యార్ధులు ఈ సంగీత పద్ధతిలో శిక్షణ పొందుతూ ఉన్నారు. ఈ సంవత్సరం శ్రీ విదర్యాంతో గారి వ్యక్తిగత పర్యవేక్షణలో సుమారు ఇరవై మంది విద్యార్హినీ విద్యార్హులకు నాట్య శిక్షణ లభించింది. ఈ వాద్య సంగీత నాట్య సమ్మేళనం ఒక అద్భుతమైన ప్రదర్శనగా రూపుదిద్దుకుంటున్నది.

తేదీ: మార్చి 27 ఆదివారం
సమయం: సాయంత్రం 4.00
చోటు: హిల్ ప్రదర్శన స్థలం, ఏనార్బర్
ప్రవేశం ఉచితం

తప్పక చూడండి.

Comments

Vasu said…
అమ్మయ్యో

విదర్యాంతో - ఇది మొత్తం పేరని తెలుసుకోడానికి చాలా సేపు పట్టింది.

విదర్యాం ఇక్కడి వరకూ పేరనుకుని, ఏంటి వాక్యం ఏదో తేడా గా ఉందనుకున్నాను.

మీరు భారత దేశపు నాట్య రీతులే గాక, ప్రపంచ నాట్య రీతుల్ని కూడా ఆస్వాదించడం ముదావహం నా బోటి వారికి ఆశ్చర్యకరం.
pi said…
Another perk in bay area. I've seen Indonesian dances both at Ethnic dance festival and Stern Grove. It was very interesting. Our take on puranas is very different from theirs. Have fun! Ethnic Music & Dance RULES!!