ఇది మాఘమాస మనుకున్నాను, ఏదో పత్రిక చదువుతుంటే గుండె మాసమట!
మొత్తమ్మీద ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా గుండెని రక్షించుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని మించిన ఉపకరణం మరొకటి లేదు. మన దైనందిన అలవాట్లలో చిన్న మార్పులద్వారా గుండె అనారోగ్యం పాలయ్యే అవకాశాన్ని బాగా తగ్గించవచ్చని వైద్యులు ఘోషిస్తున్నారు.
హృదయారోగ్యానికి నేను పాటిస్తున్న పంచశీల సూత్రాలు:
గుండె పదిలం మరి!
మొత్తమ్మీద ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా గుండెని రక్షించుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని మించిన ఉపకరణం మరొకటి లేదు. మన దైనందిన అలవాట్లలో చిన్న మార్పులద్వారా గుండె అనారోగ్యం పాలయ్యే అవకాశాన్ని బాగా తగ్గించవచ్చని వైద్యులు ఘోషిస్తున్నారు.
హృదయారోగ్యానికి నేను పాటిస్తున్న పంచశీల సూత్రాలు:
- అర్జంటుగా పొగతాగడం మానెయ్యాలి, ఒకేళ అలవాటుంటే. మీ గుండెతోపాటు మీ జీవిత భాగస్వామి కూడా మిమ్మల్ని మెచ్చుతారు.
రోజంతా సాధ్యమైనంత చలాకీగా గడపాలి. చలాకీ అంటే నవ్వుతూ తుళ్ళుతూ అని కాదు - అదికూడా ఓకే గాని, శరీరం కదులుతూ ఉండాలన్నది ఇక్కడ గమనించాల్సిన పాయింటు. పై అంతస్తుకి వెళ్ళాల్సి వచ్చినప్పుడూ లిఫ్టుకి బదులు మెట్లెక్కి వెళ్ళడం, వీధి చివర షాపుకి వెళ్ళాలంటే బండి తియ్యకుండా నడీచి వెళ్ళడం. ప్రతిరోజూ అరగంట నించీ గంట వరకూ చెమటపట్టే వ్యాయామం కూడ చెయ్యగలిగితే మరీ మంచిది.
నోరు కోరే తిండి గుండెకి చేటు. ఏమి తింటున్నామో గమనించుకోవడం అత్యంత అవసరం. అలాగని కడుపు కట్టేసుకోమని కాదు, జిహ్వ చంపుకోమని కాదు. కొన్ని రకాల కొవ్వులు - Saturated fat and Trans fat గుండె జబ్బుల అవకాశాన్ని పెంచుతాయి. మన కళ్ళెదుట తయారు కాని పదార్ధాలు - packaged foods, restaurant meals - తగ్గించడం మంచిది. packaged foods విషయంలో వాళ్ళు కవర్ల మీద రాసేవన్నీ నమ్మలేం. అంతే కాక, ఒక వారం రోజులు డయట్ అనీ, మళ్ళీ తరువాతి వారం యధావిధి, ఇంకో వారం డయట్ - ఇలాంటి ఊగిసలాట కాకుండా, ఎక్కువగా తాజా కూరలు పళ్ళతో నిండి ఉన్న భోజన పద్ధతులని అలవాటు చేసుకుని జీవితమంతా పాటించేలా చూసుకోవాలి. మద్యానికి దూరంగా ఉంటే మంచిది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చెయ్యాల్సిన వారు, లేదా వ్యాపార సమావేశాల వల్ల చాలా సార్లు బయట తినవలసిన వారు - కొద్దిగా శ్రద్ధ పెడితే గుండెకి నచ్చే భోజన పద్ధతుల్ని వెతుక్కోవడం అంత కష్టం కాదు.
బరువు కంట్రోల్లో ఉండాలి. అతిబరువు ఉన్నవారు పదిశాతం బరువుతగ్గినా అది గుండె ఆరోగ్యం మీద గొప్ప ప్రభావం చూపిస్తుంది.
క్రమం తప్పకుండా గుండె ఆరోగ్యాన్ని గమనించుకుంటూ ఉండాలి. వయసు పెరిగే కొద్దీ ఇది తప్పనిసరి.
గుండె పదిలం మరి!
Comments
మాష్టారు గుండె కన్నా కాలేయం ఇంకా డేంజరు అనుకుంటాను. గుండెకి ఏమైనా ఐతే ఆపరేషన్ చేయ్యోచ్చంట, కాని కాలేయం కి కష్టమంట.. మీరేమంటారు ?
గిరీష్,
గుండె = కండరాలతో పనిచేసే పంపు.
కాలేయం = సంక్లిష్టమైన రసాయన శాల.
కాలేయానికి చాలా వరకు తనంతట తానో, లేక ఇతర గ్రంధుల సహాయంతోనో, నయం చేసుకునే శక్తి ఉంది. అఫ్కోర్సు మరీ దేవదాసులాగా తాగేస్తే తప్ప. దీన్ని గురించి మరోమారు వివరంగా ముచ్చటిద్దాం.
పగ(తూచ్!) అదే అదే పొగ మానేసాను
జిమ్మురాజు అని అందరూ గుర్తించేలా జిమ్ముకెళ్ళి చువ్వలు ఇరగనూకుతున్నాను.
అన్నట్లు, మా ఆఫీసు ముందరే కార్డియో కిక్ బాక్సింగ్ సెంటర్ ఉంటే, దాంట్లో చేరా. ఇప్పటికి రెండు క్లాసులు అయ్యాయి.
గుండెకాయని అలా అలా పాం౨పర్ చేస్తున్నాకానీ, కార్డియో కిక్ బాక్సింగ్ మాత్రం, తస్సదియ్య గుండెని కుదిపేస్తున్నది.
నీళ్ళు ఎక్కువ తాగుట మరువవద్దు అని కూడా చెప్పండి అన్నగారు
జై హింద్
మీ headline చూసి ముళ్ళపూడి గురించి అనుకున్నాను. Wine has health benefits, so says the wine industry ;) and I would like to believe.
భాస్కర్, good for you (and your heart!)
pi, :)