పదహారణాల ఆంధ్రుల కథ
ఈ కథ గురించి నేను ఒట్టేసి చెప్పలేను కానీ నాకు తెలిసింది (విన్నదీ, చదివిందీ) ఇది. బ్రిటీషు కాలంలో ఆంధ్ర దేశం నిజాము రాజ్యంగానూ, సర్కారు రాజ్యంగానూ రెండుభాగాలుగా ఉండగా నిజాము రాజ్యంలో నిజాము రూపాయలు చలామణిలో ఉండేవి. మామూలు (బ్రిటీషు సర్కారు) రూపాయికి పదహారు అణాలు అని లెక్క. కానీ నిజాము రూపాయికి కొంత తక్కువ విలువ ఉండేది - పన్నెండు అణాలో, పధ్నాలుగు అణాలో. అందుకని ఎవరైనా రూపాయిల్లో చెల్లింపు చేసినప్పుడు అది పదహారణాల రూపాయేనా అని విచారించేవారు. మెల్లగా అది తెలుగుతనానికి సర్వనామంగా తయారైంది. అమెరికాలో As American as the apple pie అంటారు.
గతవారంలో చర్చకి వచ్చిన మరికొన్ని ఆసక్తికరమైన పదాలు.
ఆజానుబాహుడు. ఈ పదాన్ని గురించి అక్కడే మంచి చర్చ జరిగింది. జాను అంటే మోకాలు సంస్కృతంలో. ఆజానుబాహుడు అంటే మోకాలుదాకా ఉండే చేతులు గలవాడు. శ్రీరాముని విశేషణాల్లో ఒకటి. తీర్చిదిద్దిన బలమైన దేహం కల పురుషుడు అనే అర్ధంలో ఇప్పుడు విరివిగా వాడుతుంటాము.
పరదార. ఇదీ సంస్కృతమే. దార అంటే భార్య. పరదార అంటే మరొకని భార్య. నిజదార అంటే తనభార్య. నిజదార సుతోదర పోషణార్ధమై అన్నాడు పోతన భాగవత నాంది పద్యంలో. దార సుతులు ధన ధాన్యములుండిన, సారెకు జపతప సంపద గల్గిన, శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు త్యాగరాజస్వామి.
గతవారపు పదాలు
పరవళ్ళు. ఈ పదాన్ని సర్వసాధారణంగా పరవళ్ళు తొక్కడం అనే రూపంలోనే వాడుతారు. అంటే అలలాగా పైకి ఎగసి కిందికి దుమకడం. ఇది యుద్ధంలో పనిచేసే గుర్రాలకి ఇచ్చే శిక్షణలో ఒక భాగం. చిన్ని కోడెదూడలుకూడా సహజంగానే ఇటువంటి గంతు వెయ్యడం చూస్తుంటాం. ఇటువంటి పైకి-కిందికి దుమికే అలలతో ఉధృతంగా ప్రవాహం ఉన్నప్పుడు గోదావరి పరవళ్ళు తొక్కుతోంది అంటారు. యవ్వనపు పొంగుకి, అణుచుకోలేని మానసిక ఉద్వేగానికి కూడా ఈ వాడుక సముచితం.
పొదుగు. దీని అర్ధాలు చాలామందే పట్టుకున్నారు. నామవాచకంగా ఆవు గేదె వంటి పాలిచ్చే జంతువుల స్తనభాగం. క్రియావాచకంగా రెండర్ధాలు; పక్షులు గుడ్లని పొదగడం (గుడ్లమీద కూర్చుని వెచ్చగా ఉంచుతుంది పిల్లలు బయటికి వచ్చేవరకూ - ఆ సమయంలో ఆ పక్షి తిండి తినదు, గుడ్ల పట్ల చాలా బాధ్యతగా ఉంటుంది), నగలో మణులు పొదగడం.
అనువు (అనవు). దీనికి నిఘంటువు లెస్స, యోగ్యము, అనుకూలము అని అర్ధం చెబుతోంది. ఆంగ్లంలో Appropriate, suitable అనుకోవచ్చు. సామెతని విద్యార్ధులందరూ బానే గుర్తు చేసుకున్నారు.
వేకువ. తెల్లవారు జాము. అరుణోదయ కాలం. బహుశా వేగుచుక్క (తెల్లవారు జామున కనబడే నక్షత్రం - ఇది నిజానికి శుక్రగ్రహం) కి ఏమన్నా సంబంధం ఉన్నదేమో. అదలా ఉండగా అసలు తెల్లవారు జాము, అరుణోదయ కాలం అనే వాడుకల కథ కూడా చాలా ఆసక్తికరం. ఇవెలా వచ్చాయో తెలుసునా ఎవరికైనా?
మేలము. పరిహాసం. జోక్ చెయ్యడం. దీన్ని సర్వసాధారణంగా మేలమాడుట అనే రూపంలో వాడుతుంటాము. మేళము అంటే అనేక వాయిద్యాలు కలిసిన సంగీతకారుల గుంపు. మేళవింపు అంటే కలయిక. అట్లావచ్చింది ఈ వాయిద్యాల మేళవింపుతో ఏర్పడిన మేళం. సన్నాయి మేళం స్థానే పాశ్చాత్య వాయిద్యాల గుంపయిన "బేండు" చేరడంతో అది "బేండు మేళం" అయింది.
ఈ పదాలకి అర్ధాలు చెప్పండి, జాలంలో, నిఘంటువులో వెతక్కుండా ..
మన మిత్రులు అడిగినవాటినే కొన్నిటిని ఇక్కడ పెడుతున్నా, మిగతావారికి ఏమైనా తెలుస్తుందేమోనని.
ఆనవాలు
తెరువు
కలిమి
సమ్మర్దం
విహ్వలం

Comments
తెరువు -
బతుకు `తెరువు` - లౌక్యంగా బతకటం ?
కలిమి - సంపద
సమ్మర్దం -
జనసమ్మర్దం - జనంతో కిక్కిరిసి పోవటం
విహ్వలం - నిస్సహాయత?
నీ వస్తువు నువ్వే ఆనవాలు పట్ట లేవు నీ చేతిలో పడితే అని తిట్టేది మా అమ్మ నా కుదురు చూసి చిన్నప్పుడు.
తెరువు -- బతుకు తెరువు అనే పదం లో వాడతాము కదా. అంటే భత్యం లాంటిదేమో ఎప్పుడు విడిగా ఈ పదం ఆలోచించలా
కలిమి -- సంపద. కలిమి లేములు కష్టసుఖాలు కావడీ లో కుండలనే భయమేలోయి.. టీవ్ టీవ్ టీవ్ పాట గుర్తొచ్చిందా
సమ్మర్దం -- గుంపు సమూహం అనుకుంటున్నా జనసమ్మర్ధం లో అంటాము కదా వాడుక లో.
విహ్వలం --అబ్బ మీరు ఇలా పెద్ద పదాలు విడగొట్టి ఒక మాట అడగటం మేం ఒప్పుకోం గాక ఒప్పుకోము. భయ విహ్వల అయ్యి అని వాడటం తెలుసు అంటే భయం తో చలించినది లేదా భయం తో భీతిల్లినది అని అర్ధం అని అనుకుంటున్నా.
ఆనవాలు - గుర్తుపట్టడం
తెరువు - ??? (బ్రతుకు తెరువు అని తెలుసు కాని సరియైన అర్ధం తెలీదు. ఎక్కడా వెతకొద్దు అన్నారుగా మరి)
కలిమి - ధనం
సమ్మర్దం - గుంపు (జనసమ్మర్ధం) ( అలా ఎందుకన్నారో మీరే చెప్పాలి మేస్టారుగారు. :)బెత్తం పుచ్చుకున్నాక తప్పదు మరి..)
విహ్వలం - ఎక్కువ భయపడ్డం
కరక్టేనా??
తెరువు = దారి (బ్రతుకు తెరువు లో)
కలిమి = సంపద కలిగి ఉండటం (కలిమి, లేమి)
సమ్మర్దం = నిండి ఉండతం (జన సమ్మర్దం)
విహ్వలం = జ్వాల
నా ఆన్సర్ పేపర్ ఇస్తున్నా.. దిద్దెయ్యండి :)
ఆనవాలు - గుర్తు, (ఆనవాలు పట్టడం -పోల్చుకోడం) - అతని మొహం మీదున్న మచ్చని చూసి అతని ఆనవాలు పట్టగలిగాను.
తెరువు - క్రియ అయితే తెరవడం, కిటికీ తెరవడం లాగా అన్నమాట! బతుకు తెరువు అని బాగా వాడతారు అది తెలుసు. కానీ, exact meaning చెప్పలేను :(
కలిమి - కలిగి ఉండటం. కలిమిలేములు, కష్ట సుఖాలు మనిషి జీవితంలో మామూలే కదా!
సమ్మర్దం - exact గా చెప్పడం రావట్లేదు :( సొంత వాక్యం: హైదరాబాదు ఎక్కువ జనసమ్మర్దం కలిగిన నగరం.
విహ్వలం - ఎవరి నోటా వినలేదు కానీ ఈ పదం చదివాను కొన్నిచోట్ల. అయినా నాకు అర్ధం తెలీదు ;-)
తెల్లవారు జాము, అరుణోదయ కాలం... వాటి వెనుక కూడా కథలున్నాయంటారా అయితే!
తెరువు = మార్గము ( బ్రతుకు తెరువు అంటే బ్రతికే మార్గం ఓ ఉద్యోగమో సద్యోగమో లాంటిదన్నమాట )
కలిమి = సంపద ( కలిమి లేములు కావడి కుండలు అనేదో సామెత )
సమ్మర్దం = సమూహం ( జనసమ్మర్దం అంటే ప్రజల సమూహం అని అర్ధం )
విహ్వలం = బాగా భయపడిన ( విహ్వల నాగేంద్రము పాహి పాహి యని కుయ్యాలించి - గజేంద్రమోక్షం)
పరీక్షలో పాసు అయ్యేనా మాస్టారూ ?
వేకువ నుండే వేకు+చుక్క - వేగుచుక్క వచ్చింది.
వేటూరివారిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక పదం: పోతనగారి "కాటుక కంటినీరు" పద్యంలో "కైటభదైత్యమర్దనుని గాదిలి కోడల" అని వస్తుంది కదా. అక్కడ గాదిలి అంటే "ప్రియమైన" అని తెలుసు. దీని మూలం తమిళంలోని "కాదళ్" (అంటే ప్రేమ) పదమేనట! ఈ సంగతి వేటూరిగారు మొన్నామధ్య ఇంటర్వ్యూలో చెప్పే వరకూ నాకు తెలియలేదు (తట్టలేదు!). చెన్నైలో పదమూడేళ్ళుగా ఉంటున్నా! వెతికితే ఇలా చాలా తెలుగు పదాలకి మనకి తమాషా అయిన మూలాలు దొరుకుతాయి!
తెరువు : ఉపాధి లాంటిదేనా
కలిమి :
సమ్మర్దం : గుంపు లేద కదలిక అనుకుంటా
విహ్వలం :
ఈ సారి పాసు మార్కులు కూడా వచ్చేట్టు లేవు ప్చ్...
కలిమి - సంపదలు కలిగి ఉండటం
తెరువు - త్రోవ, దారి
విహ్వలం - నియంత్రణ/స్వాధీనం కోల్పోవడం
సమ్మర్దము - కోలాహలం
@ మధురవాణి .. తల్లవారు జాము కథ కామేశ్వర్రావుగారు చెప్పారు.
@ కామేశ్వర్రావు .. వేగుచుక్కే వేకువనించి వచ్చిందా? బాగుంది. పాత సాహిత్యంలో కొన్ని పదాలు చదివినప్పుడూ, ఇది అచ్చం తమిళంలా ఉందే అనుకున్న సందర్భాలు నాకూ ఎదురయ్యాయి.
@ వేణూశ్రీకాంత్ .. వెల్కం :)
తెరువు: దారి/ఒడ్డు. "బతుకు తెరువు చూసుకున్నాడు" (అంటే ఒక దారిలో పడ్డాడు అని కూడా)
కలిమి: సంపద (దేవదాసు పాట గుర్తొస్తోందా?)
సమ్మర్ధం: సందడి/సమూహం (ఈ జన సమ్మర్ధం లోంచి బయట పడటం ఎలా?)
విహ్వలం: భయ విహ్వలుడైనాడు. [Shattered by fear]
ఇక పోతే పాత పోస్టులో అడిగిన ప్రశ్నకి సమాధానం. :-(
@వూకదంపుడు
అమెరికా డిఫెన్స్ సర్వీసులో "అడక్కూడదు, చెప్పకూడదు" అనే రూలొకటి ఉంది. ఈ మధ్యన దాన్ని తీసేస్తున్నారనో/మార్చేస్తున్నారనో, ఇంకోటో వార్త వచ్చిందనుకోండి. అలాగే నా తెలుగు బ్లాగు గురించీను. [Do not ask, do not tell]
తెరువు --> దారి/విధానం/చోటు?
కలిమి --->సంపద
సమ్మర్దం--> జన సమ్మర్దం అని వాడుక, ఇసుక వేస్తే రాలని జనం లాగా , "సమ్మర్దం" వాడుక రూపం అని అనుమానం. మీరు నిఘంటువు చూడద్దన్నారు.
విహ్వలం ---> ఎలా చెప్పాలో తెలియటం లేదు - పాహి,పాహి.