మొన్న శనివారం మేడే. నే పుట్టి పెరిగిన విజయవాడలో అన్ని కూడళ్ళలో ఎర్రజెండాల సంరంభం జరుగుతుండేది. నేను కొంచెం పెద్దవాణ్ణయ్యాక, బయటిలోకం కాస్త కాస్త తెలిసొచ్చాక భారద్దేశంలో అతి పెద్ద, అన్నిటికంటే శక్తివంతమయిన కార్మికసంఘం కాంగ్రెస్ పార్టీదని తెలిసి విస్తుపోయాను. అదలా ఉండగా, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కార్మికఉద్యమం అసలు ఏ స్థితిలో ఉంది? అనేక సామాజిక చిహ్నాల రూపురేఖలు మారిపోతున్నట్టే శ్రమ, ఉత్పత్తికి సంబంధించిన సూత్రాలుకూడ మారిపోతున్నాయి. అనతి వత్సరాల క్రితం వరకూ లేబరెవరు, మేనేజిమెంటెవరు స్పష్టంగా తెలిసి ఉండేది. మూణ్ణెల్ల ఆర్నెల్ల ఎసైన్మెంట్లకోశం ప్రపంచం నలుమూలలకీ పొట్టచేతబట్టుకుని వలసపోతున్న సాఫ్టువేరోళ్లు కార్మికులు కాదా? వాళ్ళకేం హక్కులున్నై? కానీ ఏసీ ఆఫీసుల్లో బట్ట మడతనలక్కుండా రోజుగడిపే వాళ్ళని కార్మికు లనుకోవాలంటే మనసుకి అదోలా ఉంది. ఒకపక్క ఇలా వర్గీకరణకి లొంగిరాని కొత్తకొత్త కార్మిక వర్గాలు తయారవుతుంటే, మరోపక్క సంఘటితమై ఉన్న కార్మికఉద్యమ సంక్షేమసంఘాలు అన్నిరంగాలలోనూ నిర్వీర్యమై ఊరుకుంటున్నాయి. అమెరికను కార్లకంపెనీలు కుప్పకూలబోతున్నాయి అని ప్రభుత్వం జోక్యం చేసుకోవడంలో సందట్లో సడేమియా అని ఆయా కంపెనీల యాజమాన్యం (యాజమాన్యం అంటే యెవరు? పరోక్షంగా ప్రభుత్వమే!!) లేబరుయూనియన్లని మరికాస్త పిండింది. ఇన్నేళ్ళుగా డెమోక్రాటిక్ పార్టీకి పెట్టనికోటగా నిలిచిఉన్న లేబర్ యూనియన్లు తాము ఏరికోరి ఎన్నుకున్న ప్రభుత్వమే ఇలా వెన్నుపోటు పొడిస్తే సహిస్తారా? ఏమో మరి వచ్చే నవంబర్లో తెలుస్తుంది.
మేడే సందర్భంగా ఈ ఆంగ్లబ్లాగు కూడా చూడండి (నా దృష్టికి తెచ్చిన గద్దెస్వరూప్ గారికి నెనర్లు.)
మే 1 న డిట్రాయిట్ తెలుగు సమితి వారి ఉగాది వేడుకలు చూసొచ్చాను కాసేపు. కార్యక్రమాలు జరుగుతున్న హాల్లోకంటే ఎక్కువసేపు బయట కారిడార్లోనే పరిచయస్తులు, స్నేహితులతో ముచ్చట్లాడుతూ గడిపాను. ప్రస్థానం సినిమా నిర్మాత (ఈయన పేరు రవి అనుకుంటా, సరిగ్గా గుర్తు లేదు) కనిపించారు. ఆయన బిజీగా ఉండడంతో హలో అనడం కంటే ఎక్కువ సంభాషణ జరగలేదు. మిత్రులు ప్రసాద్ సామంతపూడి, శ్రీనివాస్ కాళ్ళకూరి గార్లతో కాసేపు జరిపిన తెలుగు భాష, పరిస్థితి, సాహిత్యచర్చ చాలా హాయిగా అనిపించింది. తెలుగు టీవీలో ఉపయోగిస్తున్న భాష మరీ దరిద్రంగా ఉన్నదనీ, భాష కాస్త బాగుపడాలంటే ముందుగా టీవీలో ఉపయోగించే భాషని మెరుగు పరచాలనీ శ్రీనివాస్ గారు అభిప్రాయపడ్డారు. నేను గత టపాలో చర్చకి పెట్టిన మూడు ప్రభంజనాల్ని ప్రస్తావిస్తూ ప్రసాద్ గారు మన తెలుగు పాఠకులు గొప్ప సాహిత్యాన్ని పరిచయం చేసుకోవడం కోసం తెలుగు పరిధిని దాటి ప్రపంచ వ్యాప్తంగా ఉద్భవించిన మహారచయితల రచనల్ని రుచిచూడాలని అభిప్రాయపడ్డారు. అన్నట్టు కార్యక్రమం చివర్లో మన కాలాస్త్రిగారి యువబృందం "హై ధరా బాదు" అనే చిన్న కామెడీ నాటిక ప్రదర్శించారు - ట. కానీ అప్పటికే చాలా జాప్యాలస్యం జరిగి నేను ఇంటిముఖం పట్టాను.
అమెరికను సెనేట్‌లో వాలువీధి చాకిరేవు - చిరిగి పీలికలవుతున్న సాక్సు! ఎలావుంది హెడ్‌లైను? :)
విపణివీధిలో వాళ్ళ స్టాకు మాత్రం ఆకాశాన్నంటుతోంది - ఇదేమి వైష్ణవమాయో!
గ్రీకుల పురానగాథల్లో హెర్క్యులిస్ అని మహాశక్తిమంతుడు ఉండేవాడు - మన భీముడి టైపు. ఆయనకి ఒకసారి ఎవరో రాజో దేవతో ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు మహాద్భుత కృత్యాలు చెయ్యాలతను - సామాన్య మానవమాత్రులకి అసాధ్యమైనవి. అందుకే ఇప్పటికీ మనిషి శక్తికి మించిన పని అని చెప్పడానికి "అదొక హెర్క్యూలియన్ టాస్క్" అని ఆంగ్ల నుడికారం. ఇంతకీ అతగాడు సాధించిన అద్భుతకృత్యాల్లో ఒకటి ఆగియస్ అనే మహారాజుగారి పశుశాలల్ని ఒక్కరాత్రిలో శుభ్రం చెయ్యడం. ఈ ఆగియస్ మహారాజు మన విరాటరాజులాగానే తన పశుసంపదకి పేర్గాంచినవాడు. మరి ఆయన పశుశాలల్ని ఒక్క రాత్రిలో శుభ్రం చెయ్యడమంటే మాటలుకాదు. ఈ పనికోసం హెర్క్యులిస్ ఏకంగా ఒక నదిని దారిమళ్ళించి పని కానిచ్చాడు, అదంతా ఓ కథ. ఇంతకీ చెప్పొచ్చిన కవిహృదయం ఏంటంటే మన సెనేటర్లు, వాలువీధి అనే ఆధునిక ఆగియన్ పశుశాలని శుభ్రం చెయ్యడానికి నడుములు బిగిస్తున్నారు. అది మాత్రం కచ్చితంగా హెర్క్యూలియన్ టాస్కే!
కస్తూరి మురళీకృష్ణ గారి అసిధార నవల పూర్తి చేశాను. త్వరలో సమగ్రమైన సమీక్ష ప్రచురిస్తాను. చాలా ఆసక్తికరమైన పుస్తకం - సంపాదించి చదవండి. అర్ధవంతమైన చర్చకి ఆస్కారం ఉంటుంది. పుస్తకం లభించే వివరాలు ఆయన బ్లాగులో ఉండొచ్చు.
ప్రస్తుతం పెరూదేశ స్పానిష్ భాషా రచయిత మారియో వర్గాస్ లోసా (Mario Vargas Llosa) రాసిన War of the End of the World నవల ఆంగ్లానువాదంలో చదువుతున్నా. అద్భుతంగా ఉంది.
రెడ్‌ఫర్డ్ (Robert Redford) తీసిన River runs through it సినిమా చూశాను.
గత వారపు జాలవిహరణలో తగిల ఆసక్తికరమైన తీగ - లంబాడీల వివాహ విధానాల గురించి.
బెంగుళూరి నించి కృష్ణగారు కొత్తగా బ్లాగ్గూడు తెరిచి చాలా చక్కగా రాస్తున్నారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

Comments
ఉగాది వేడుకల్లో అనుకోకుండా మిమ్మల్ని కలవడం చాలా హేపీగా అనిపించింది. మీతో మాట్లాడటం భలే మజాగా ఉంటుంది.
టివీలో ఉపయోగించే బాషగురించి నాదో మాట.. టీవీల్లో వారికి తెలుగు బానే వచ్చండి. కాని కావాలనే అలా తెలుగును తెగులు చేస్తారు. నాకు స్వయంగా అనుభవమైనది చెప్తాను. ఒకసారి ఆంధ్రజ్యోతి చానెల్ వారికోసం వంటల ప్రోగ్రామ్ చేస్తుంటే నూనెని ఆయిల్ అనమంటారు. ఇది తెలుగు చానెల్ కదా, చూసేది తెలుగువాళ్లే. మరి నూనె అనే సులువైన పదాన్ని ఖూనీ చేయడమెందుకు? నేనిలా అంటే మావాళ్లు ఊరుకోరు. తెలుగు బ్లాగర్ వి ఇలా అనవచ్చా అని నన్ను తిడతారు అన్నా వినలేదు. ఆయిల్ అని అనమన్నారు. అది అనడానికి నాకు నాలుగు సార్లు చెప్పాల్సి వచ్చింది. మరి అక్కడ ఉన్నావాళ్లంతా తెలుగువాళ్లే మరి.ఎవ్వరినేమనాలి??ఎలా మార్చాలి. ఈ చానెళ్లవాళ్లకి తమ తెలుగు మీద తమకే వెగటు, విరక్తి కలిగినప్పుడే తప్పులు లేని తెలుగు మాట్లాడతారేమో? వేచి చూడాలి..